వాషింగ్టన్: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంలా మారడంపై అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు భారత్, అఫ్ఘానిస్థాన్‌లోని టెర్రరిస్టు గ్రూపుల విషయంలో పాక్ అనుసరిస్తున్న వైఖరి ఏమాత్రం మారలేదని అమెరికన్ రక్షణ నిపుణులు చెబుతున్నారు. ఉగ్రవాద గ్రూపులకు పాక్‌లో ఉన్న స్వేచ్ఛ తమకెప్పుడూ ఆందోళన కలిగించే విషయమేనని, దీనిపై ఆ దేశంతో ఎప్పుడూ చర్చిస్తుంటామని పెంటగాన్ ఉన్నతాధికారి జాన్ కిర్బే శనివారం మీడియాతో పేర్కొన్నారు.
లష్కరే తోయిబా, హక్కానీ నెట్‌వర్క్ ఉగ్రవాద సంస్థలపై పాక్ తగిన చర్యలు తీసుకుంటున్నదని ధ్రువీకరించలేమని అమెరికా విదేశాంగ శాఖ ఇటీవలే పేర్కొన్న నేపథ్యంలో పెంటగాన్ స్పందనకు ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఉగ్రవాదుల విషయంలో పాక్ వైఖరితో సంతృప్తి చెందనప్పటికీ ఒబామా ప్రభుత్వం ఆ దేశానికి భారీగా నిధుల సాయం అందిస్తుండటం గమనార్హం. ఇప్పటికే దాదాపు మూడు వేల కోట్ల రూపాయల వరకు సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పాక్‌కు ఇంత భారీ మొత్తం సాయం అందించాల్సిన అవ సరమున్నదా అన్నది అమెరికా తేల్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉగ్రవాదుల స్వర్గధామంగా పాక్
Published Sun, Jan 11 2015 4:39 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM
Advertisement