భారత్‌లో అసహనం, హింస పెరుగుతున్నట్లు వస్తున్న నివేదికలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.
వాషింగ్టన్ : భారత్‌లో అసహనం, హింస పెరుగుతున్నట్లు వస్తున్న నివేదికలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై భారత ప్రభుత్వం తన పూర్తి అధికారాలను ఉపయోగించి పౌరులకు రక్షణ కల్పించాలని, వీటికి కారణమవుతున్న దోషులను శిక్షించాలని కోరింది. భారత్‌లో బీఫ్ తినేవారిపై దాడులు జరుగుతున్నాయని, ఇటీవల మధ్యప్రదేశ్‌లో గేదె మాంసం తీసుకెళుతున్న ఇద్దరు ముస్లిం మహిళలపై వేధింపులు జరిగినట్లు వచ్చిన నివేదికపై విదే శాంగ ప్రతినిధి జాన్ కిర్బీ పైవిధంగా స్పందించారు.
భావప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ విషయంలో భారతీయులకు, ప్రభుత్వానికి తాము మద్దతుగా నిలుస్తామని, అలాగే అన్ని రకాల హింసలను ఎదుర్కొనేందుకు భారత్‌కు తాము అండగా ఉంటామని ఆయన అన్నారు. భారతీయుల్లో ఉన్న సహనాన్ని వారికి తెలియజేసేందుకు వారితో కలసి పనిచేస్తామని కిర్బీ స్పష్టంచేశారు.