సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విధ్వంసానికి కేంద్రం రంగం సిద్ధం చేసింది. సోమవారం ఢిల్లీలో హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో నిర్వహించనున్న ‘డ్రగ్స్ స్మగ్లింగ్, జాతీయ భద్రత’ సదస్సులో ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ ఎన్‌సీబీ పరిధిలో పట్టుకున్న 6,590 కిలోలు సహా 1,44,000 కిలోల మాదకద్రవ్యాలను (రూ.2,416 కోట్లు) ధ్వంసం చేయనున్నారు.
దీంతో కలిపి జూన్ 1, 2022 నుంచి జులై 15, 2023 వరకూ రాష్ట్రాల్లోని ఎన్‌సీబీ, యాంటీ నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్‌ల ప్రాంతీయ యూనిట్లు సమష్టిగా సుమారు రూ.9,580 కోట్ల విలువైన 8.76 లక్షల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశాయి. సోమవారం నాటితో ఏడాదిలో ధ్వంసమయ్యే డ్రగ్స్ మొత్తం 10 లక్షల కిలోలు దాటనుంది. డ్రగ్స్ రహిత భారతదేశాన్ని సృష్టించడానికి ప్రభుత్వం మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జీరో టోలరెన్స్ విధానం అవలంభిస్తోందని హోంశాఖ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment