ఢిల్లీ: దేశంలో ఇవాళ ఓ భారీ పరిణామం చోటు చేసుకుంది. భారీ మొత్తంలో డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) ధ్వంసం చేసింది. కేంద్ర హోం మంత్రి వర్చువల్‌గా బటన్ నొక్కి ఈ కార్యక్రమం ప్రారంభించి.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆ ధ్వంసాన్ని వీక్షించారు.
ఢిల్లీలో ఇవాళ కేంద్రం హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో డ్రగ్స్ ట్రాఫికింగ్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ప్రాంతీయ సదస్సు జరిగింది. ఈ భేటీ నుంచే ఆయన లక్షా 44 వేల కేజీల డ్రగ్స్‌ను నాశనం చేయడాన్ని ప్రారంభించి.. వీక్షించారు. ఈ డ్రగ్స్ మొత్తం విలువ సుమారు రూ. 2,416 కోట్లు ఉంటుందని తేలింది.
ఎన్సీబీ.. యాంటీ నార్కోటిక్స టాస్క్ ఫోర్స్ సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. అందులో ఎన్సీబీ హైదరాబాద్ యూనిట్ నుంచి 6,590 కేజీలు, ఇండోర్ యూనిట్ 822 కేజీలు, జమ్ము యూనిట్ 356 కేజీలు సీజ్ చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అలాగే.. అసోం నుంచి 1,468 కేజీలు, ఛండీగఢ్ నుంచి 229 కేజీలు, గోవా నుంచి 25 కేజీలు, గుజరాత్ నుంచి 4,277 కేజీలు, జమ్ము కశ్మీర్ నుంచి 4,069 కేజీలు, మధ్యప్రదేశ్ నుంచి 1,03,884 కేజీలు, మహారాష్ట్ర నుంచి 159 కేజీలు, త్రిపుర నుంచి 1,803 కేజీలు, ఉత్తర ప్రదేశ్ నుంచి 4,049 కేజీల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని నాశనం చేఏసినట్లు వెల్లడించింది.
#WATCH | #Delhi | Union Home Minister #AmitShah chairs Regional Conference on ‘Drugs Trafficking and National Security’ in New Delhi; over 1,44,000 kilograms of drugs being destroyed in various parts of the country by #NCB, in coordination with ANTFs of all states. (ANI) pic.twitter.com/hE8kblYX6E
— Argus News (@ArgusNews_in) July 17, 2023
డ్రగ్స్ రహిత దేశంగా భారత్‌ను మలిచే క్రమంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ఈ ఆపరేషన్ చేపట్టింది. జూన్ 1,2022 నుంచి జులై 15వ తేదీల మధ్య ఎన్సీపీ అన్ని యూనిట్లు, అన్ని రాష్ట్రాల యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌ల సమన్వయంతో రూ.9,580 కోట్ల విలువ చేసే 8,76,554 కేజీల డ్రగ్స్‌ను నాశనం చేశారు. ఇది నిర్దేశించుకున్న టార్గెట్ కంటే 11 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment