అదనపు సిబ్బందిని కేటాయిస్తాం
యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులను ఆదేశించిన డీజీపీ జితేందర్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా ముఠా లపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ డాక్టర్ జితేందర్ స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయంలో గురువారం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధి కారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇన్ చార్జి సందీప్ శాండిల్యతోపాటు పలువురు పోలీ సు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ....రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాల ను నియంత్రిస్తూ కేసులు పెడుతున్నప్పటికీ సరఫ రా విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశా లు జారీ చేశారు.
రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూ రో పకడ్బందీగా వ్యవహరించి డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నుంచి సిబ్బందిని అదనంగా బ్యూరోకి కేటాయిస్తామని తెలిపారు. విదేశీయులెవరైనా డ్రగ్ వ్యవహారాల్లో తల దూర్చితే వారిని తిరిగి వారి దేశాలకు పంపించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శాంతిభద్రతల అదనపు డీజీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ...నిందితులను పట్టుకోవడంతోపాటు వారికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలను కోర్టులకు సమర్పించాలని సూచించారు. అదనపు సిబ్బందిని కేటాయించడం పట్ల సందీప్ శాండిల్య సంతోషం వ్యక్తం చేశారు.
నూతన నేర చట్టాలను పకడ్బందీగాఅమలు చేసేందుకు చర్యలు తీసు కో వాలని డీజీపీ జితేందర్ సూచించారు. క్షేత్రస్థాయి లో నూతన నేర చట్టాల అమలుకు తీసుకోవలసిన చర్యలపై గురువారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో డీజీపీ పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సమీక్షలో సీఐడీ డీజీ శిఖాగోయెల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment