రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా అరాన్‌పుర్ సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లతో వెళ్తున్న మినీ బస్సును టార్గెట్ చేసి ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా డిస్ట్రిక్ట్ రిజర్వుడు గార్డు(డీఆర్‌డీ)కు చెందినవారు.
మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో అడవిలో కూంబింగ్ నిర్వహించేందుకు జవాన్లు వెళ్తుండగా.. వీరి రాకను పసిగట్టి మావోయిస్టులు దాడి చేశారు. మినీ బస్సును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేల్చారు.
అమరులైన జవాన్ల పేర్లు
1. రామ్‌కుమార్ యాదవ్ - హెడ్ కానిస్టేబుల్
2. టికేశ్వర్ ధ్రువ్ - అసిస్టెంట్ కానిస్టేబుల్ CAF, ధమ్తరి
3. సలిక్ రామ్ సిన్హా - కానిస్టేబుల్, కంకేర్
4. విక్రమ్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్
5. రాజేష్ సింగ్ - కానిస్టేబుల్ (ఘాజీపూర్, యుపి)
6. రవి పటేల్ - కానిస్టేబుల్
7. అర్జున్ రాజ్‌భర్, కానిస్టేబుల్ (CAF)
సీఎంకు అమిత్‌షా ఫోన్..
ఈ ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఛత్తీస్‌గఢ్ సీఎం బూపేశ్ బఘేల్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
జవాన్లు ప్రాణాలను బలిగొంటున్న మావోయిస్టులను వదిలిపెట్టబోమని సీఎం బఘేల్ తేల్చిచెప్పారు. పోరాటం చివరి దశలో ఉందని పేర్కొన్నారు. ఘటనలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
ములుగు పోలీసులు అప్రమత్తం..
ఛత్తీస్‌గఢ్ ఘటనతో తెలంగాణలోని ములుగు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాలతో ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు. వెంకటాపురం-భద్రాచలం ప్రధాన రహదారిపై మావోయిస్ పార్టీ అగ్ర నేతల వాల్ పోస్టర్లతో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టు యాక్షన్ టీం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
చదవండి: భార్యను సమాధి చేసి దానిపై డ్యాన్సులు.. ఈ కేసు ఆధారంగా వెబ్ సిరీస్..
Comments
Please login to add a commentAdd a comment