jawans killed
-
కశ్మీర్లో ఎన్కౌంటర్.. నేలకొరిగిన ఇద్దరు జవాన్లు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఇద్దరు జవాన్లు నేలకొరగ్గా మరో నలుగురు జవాన్లు సహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదుల కదలికలపై నిఘా సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కొకెర్నాగ్ ప్రాంతం అహ్లాన్ గగర్‌మండులో 10 వేలఅడుగుల ఎత్తులోని అటవీప్రాంతంలో కార్డన్ సెర్ఛ్ చేపట్టాయి. తనిఖీలు జరుపుతున్న బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఈ సందర్భంగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఘటనలో ఆరుగురు జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరు జవాన్లు అమరులైనట్లు అధికారులు వెల్లడించారు. మిగతా వారు చికిత్స పొందుతున్నారన్నారు. తప్పించుకుపోయిన ఉగ్రమూకల కోసం గాలింపు కొనసాగుతోందని వివరించారు. నలుగురు ఉగ్రవాదుల స్కెచ్ విడుదల జూలై 8వ తేదీన కథువా జిల్లాలోని మచెడిలో భద్రతా బలగాలపై దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను పోలీసులు విడుదల చేశారు. స్థానికులు ఇచి్చన సమాచారం ఆధారంగా ఊహా చిత్రాలను రూపొందించారు. ఆచూకీ తెలిపిన వారికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు. అప్పటి ఘటనలో ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ సహా ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. -
సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం
లేహ్/రాచర్ల: సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకుతో నదిని దాటుతుండగా హఠాత్తుగా వరద పోటెత్తడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ) ముత్తముల రామకృష్ణారెడ్డి సహా ఐదుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్–చైనా సరిహద్దు వాస్తవా«దీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలోని షియోక్ నదిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సైనికాధికారులు వెల్లడించారు. లేహ్ నుంచి 148 కిలోమీటర్ల దూరంలోని మందిర్ మోర్హ్ వద్ద భారత సైన్యం విన్యాసాలు చేపట్టింది. ఈ విన్యాసాల్లో భాగంగా జవాన్లు యుద్ధ ట్యాంకులు నడుపుతూ షియోక్ నదిని దాటుతుండగా, టి–72 ట్యాంకు నదిలో ఇరుక్కుపోయింది. ఇంతలో ఎగువ ప్రాంతం నుంచి ఆకస్మికంగా వరద పోటెత్తింది. నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. క్షణాల వ్యవధిలోనే టి–72 ట్యాంకు నీట మునిగిపోయింది. యుద్ధ ట్యాంకుపై ఉన్న ఐదుగురు సైనికులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ నదిలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో జవాన్లను రక్షించలేకపోయాయి. నదిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఐదుగురు జవాన్లు తూర్పు లద్దాఖ్ దౌలత్ బేగ్ ఓల్డీ మిలటరీ బేస్‌లోని 52 ఆర్మర్డ్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. విన్యాసాల్లో పాల్గొంటూ దుదృష్టవశాత్తూ మరణించారు. ఈ సైనిక శిబిరం చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో∙ఉంది. ఎగువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడం వల్లే షియోక్ నదిలో వరద ప్రవాహం హఠాత్తుగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. దేశ రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన దెప్సాంగ్ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తోంది. పదవీ విరమణకు ఆరు నెలల ముందు మృత్యువాత తూర్పు లద్దాఖ్‌లో సైనిక విన్యాసాల్లో ప్రాణాలు కోల్పోయిన ముత్తముల రామకృష్ణారెడ్డి(47) స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లె. ఆయన భారత సైన్యంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రామకృష్ణారెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉందని గ్రామస్థులు తెలిపారు. ఆయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల చదువుల కోసం ఉమాదేవి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. రామకృష్ణారెడ్డి మృతదేహం ఆదివారం సాయంత్రం కాలువపల్లెకు చేరుకోనున్నట్లు స్థానికులు చెప్పారు. రామకృష్ణారెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన భార్య ఉమాదేవి, కుమారులు కాలువపల్లెకు బయలుదేరారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజ్‌నాథ్ సింగ్ వాస్తవా«దీన రేఖ సమీపంలో ఐదుగురు సైనికులు మరణించడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంక సంతాపం ప్రకటించారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్
జమ్మూ/భదర్వా: కశ్మీర్లో మళ్లీ ఉగ్ర ఘటనలు పెచ్చరిల్లుతున్నాయి. కథువా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమారిస్తే, దోడా జిల్లాలో చెక్‌పోస్ట్‌పై ఉగ్రవాదులు బుల్లెట్ల వర్షం కురిపించి పారిపోయారు. శివ్‌ఖోరీ నుంచి కాత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి జరిగి 9 మంది మరణించిన ఘటన మరువకముందే మళ్లీ కశ్మీర్లో కాల్పుల మోత మోగింది. వివరాలను జమ్మూ జోన్ అదనపు డీజీపీ ఆనంద్ బుధవారం వెల్లడించారు. ‘‘మంగళవారం రాత్రి సరిహద్దు దాటి వచ్చిన ఉగ్రవాదులు సైదా సుఖాల్ గ్రామంలో చొరబడి ఒక ఇంట్లో తాగేందుకు నీళ్లు అడగడంతో గ్రామస్థులు భయపడి మాకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్, ఆర్మీ, పోలీసు బృందాలు ముమ్మర గాలింపు చేపట్టాయి. ఈ గాలింపు సందర్భంగా ఉగ్రవాది విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మధ్యప్రదేశ్‌కు చెందిన కబీర్ దాస్ అనే సీఆర్పీఎఫ్ జవాను తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ సందర్భంగా ఆర్మీ జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలి నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలు, ఐఈడీలు, గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాం’’ అని ఆయన చెప్పారు. ఈ ఘటనలో ఒక పౌరునికి సైతం గాయాలయ్యాయి.చెక్‌పోస్ట్‌పై గుళ్ల వర్షందోడా జిల్లాలోని భదర్వా–పఠాన్‌కోట్ రోడ్డులోని ఛత్తర్గల్లా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారంతో తాత్కాలిక సంయుక్త చెక్‌పోస్ట్‌ను ఆర్మీ, పోలీసులు ఏర్పాటుచేశారు. మంగళవారం రాత్రి ఆ చెక్‌పోస్ట్ దాటేందుకు వచ్చిన నలుగురు ఉగ్రవాదులు చెక్‌పోస్ట్‌పై బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడ్డారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. -
ఉక్రెయిన్‌లో రష్యా క్షిపణి దాడి
కీవ్: ఉక్రెయిన్‌లో సైనిక అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుండగా రష్యా సైన్యం క్షిపణిని ప్రయోగించింది. ఈ ఘటనలో 19 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారు. ఉక్రెయిన్‌లోని జపొరిజాజియాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రష్యా క్షిపణి దాడిలో 19 మంది తమ జవాన్లు మరణించినట్లు ఉక్రెయిన్ సోమవారం ధ్రువీకరించింది. వీరంతా 128వ మౌంటెయిన్–అసాల్ట్ బ్రిగేడ్‌కు చెందినవారు. రష్యా క్షిపణి దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. -
సిక్కిం వరదలు.. 26కు చేరిన మరణాలు
గ్యాంగ్‌టక్: సిక్కింలోని తీస్తా నదికి బుధవారం సంభవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిరి్వరామంగా గాలిస్తున్నాయి. ఇప్పటి దాకా 26 మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో ఏడుగురు జవాన్ల మృతదేహాలున్నాయి. బర్దంగ్ ఏరియాలో సంభవించిన వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైన విషయం తెలిసిందే. జవాన్లు సహా మొత్తం 143 మంది జాడ తెలియాల్సి ఉంది. జల దిగ్బంధానికి గురైన మొత్తం 2,413 మందిని రక్షించి, సహాయక శిబిరాలకు తరలించామని అధికారులు చెప్పారు. బర్దంగ్ ప్రాంతంలో ఇసుక మేటను తొలగించి ఆయుధ డిపోను వెలికితీసినట్లు రక్షణ శాఖ తెలిపింది. అన్వేషణ కార్యకలాపాల్లో స్పెషల్ రాడార్లు, జాగిలాలను రప్పించామని తెలిపింది. సింగ్టమ్–బర్దంగ్ మధ్య ధ్వంసమైన రహదారిని వాహనాల రాకపోకలకు వీలుగా పునరుద్ధరించినట్లు తెలిపింది. ఇలా ఉండగా, రాష్ట్రానికి అవసరమైన సాయం అందజేస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని సీఎం తమాంగ్ చెప్పారు. అడ్వాన్సుగా రూ.44.8 కోట్లు విడుదల చేస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా చెప్పారన్నారు. ఆకస్మిక వరద నష్టం అంచనాకు హోం శాఖ, ఇతర విభాగాల అధికారులతో కూడిన బృందాన్ని కూడా పంపుతామని అమిత్ షా తెలిపినట్లు సీఎం వెల్లడించారు. -
జమ్ముకశ్మీర్‌లో ఐఈడీ పేల్చిన ఉగ్రవాదులు.. ఇద్దరు జవాన్లు మృతి..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. కండి ఫారెస్ట్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నారనే పక్కా సమాచారంతో జాయింట్ ఆపరేషన్ నిర్వహించేందుకు శుక్రవారం ఉదయం వెళ్లారు జవాన్లు. ఓ గుహలో ఉన్న ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. అయితే జవాన్లు లక్ష్యంగా ఉగ్రవాదులు ఐఈడీని పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భారత సైన్యం ఈ విషయాన్ని అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇద్దరు సైనికులను బలిగొన్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఘటనా స్థలానికి అదనపు బలగాలను పంపిటన్లు తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య కాల్పుల ఘటన జరగడం మూడు రోజుల్లో ఇది మూడోసారి కావడం గమనార్హం. గురువారం బారాముల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఉద్దరు ఉగ్రవాదులను జవాన్లు మట్టుబెట్టారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మణిపూర్‌లో హైటెన్షన్.. మంత్రిపై దాడి.. రైళ్లు బంద్ -
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం
-
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 11 మంది జవాన్లు మృతి..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ దంతెవాడ జిల్లా అరాన్పుర్ సమీపంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. జవాన్లతో వెళ్తున్న మినీ బస్సును టార్గెట్ చేసి ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు 10 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా డిస్ట్రిక్ట్ రిజర్వుడు గార్డు(డీఆర్డీ)కు చెందినవారు. మావోయిస్టులు ఉన్నారని నిఘా వర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో అడవిలో కూంబింగ్ నిర్వహించేందుకు జవాన్లు వెళ్తుండగా.. వీరి రాకను పసిగట్టి మావోయిస్టులు దాడి చేశారు. మినీ బస్సును లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేల్చారు. అమరులైన జవాన్ల పేర్లు 1. రామ్‌కుమార్ యాదవ్ - హెడ్ కానిస్టేబుల్ 2. టికేశ్వర్ ధ్రువ్ - అసిస్టెంట్ కానిస్టేబుల్ CAF, ధమ్తరి 3. సలిక్ రామ్ సిన్హా - కానిస్టేబుల్, కంకేర్ 4. విక్రమ్ యాదవ్, హెడ్ కానిస్టేబుల్ 5. రాజేష్ సింగ్ - కానిస్టేబుల్ (ఘాజీపూర్, యుపి) 6. రవి పటేల్ - కానిస్టేబుల్ 7. అర్జున్ రాజ్‌భర్, కానిస్టేబుల్ (CAF) సీఎంకు అమిత్‌షా ఫోన్.. ఈ ఘటన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఛత్తీస్‌గఢ్ సీఎం బూపేశ్ బఘేల్‌కు ఫోన్ చేశారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలపై ఆరా తీశారు. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. జవాన్లు ప్రాణాలను బలిగొంటున్న మావోయిస్టులను వదిలిపెట్టబోమని సీఎం బఘేల్ తేల్చిచెప్పారు. పోరాటం చివరి దశలో ఉందని పేర్కొన్నారు. ఘటనలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ములుగు పోలీసులు అప్రమత్తం.. ఛత్తీస్‌గఢ్ ఘటనతో తెలంగాణలోని ములుగు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. డ్రోన్ కెమెరాలతో ఏజెన్సీని జల్లెడ పడుతున్నారు. వెంకటాపురం-భద్రాచలం ప్రధాన రహదారిపై మావోయిస్ పార్టీ అగ్ర నేతల వాల్ పోస్టర్లతో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ములుగు జిల్లా ఏజెన్సీలో మావోయిస్టు యాక్షన్ టీం కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: భార్యను సమాధి చేసి దానిపై డ్యాన్సులు.. ఈ కేసు ఆధారంగా వెబ్ సిరీస్.. -
ఉగ్రదాడిలో అమరులైన జవాన్లు వీరే.. రంగంలోకి ఎన్ఐఏ
కశ్మీర్: అయిదుగురు భారత జవాన్లను హతమార్చిన ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) రంగంలోకి దిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు ఎన్ఐఏ అధికారుల బృందం కాసేపట్లో జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాకు చేరుకోనున్నారు. ఢిల్లీకి చెందిన ఎనిమిది మంది ఫోరెన్సిక్ నిపుణులతోపాటు ఎన్ఐఏ బృందం మధ్యాహ్నం 12.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకోనుంది. General Manoj Pande #COAS and All Ranks of #IndianArmy salute the supreme sacrifice of 05 #IndianArmy Bravehearts, Hav Mandeep Singh, L/Nk Debashish Baswal, L/Nk Kulwant Singh, Sep Harkrishan Singh & Sep Sewak Singh who laid down their lives in the line of duty at #Poonch Sector. https://t.co/7YSI1sEiEb — ADG PI - INDIAN ARMY (@adgpi) April 21, 2023 అమరులైన జవాన్లు వీరే ఉగ్రదాడిలో అమరులైన జవాన్లను హవల్దార్ మన్దీప్ సింగ్, లాన్స్‌నాయక్ దేవాశిష్ బస్వాల్, లాన్స్‌నాయక్ కుల్వంత్ సింగ్, హర్కిషన్ సింగ్, సేవక్ సింగ్‌గా గుర్తించారు. వీరులైన సైనికులకు ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే నివాళులు అర్పించారు. అమరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. చదవండి: Char Dham Yatra: ‘ఛార్‌ధామ్’కు మంచు తిప్పలు అసలేం జరిగిందంటే.. పూంచ్ జిల్లాలో రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ ట్రక్‌పై గురువారం మధ్యాహ్నం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భింబెర్ గలి నుంచి సింగియోట్ వైపు వస్తుండగా గ్రనేడ్లు విసరడంతో వాహనానికి నిప్పంటుకుంది. ఈ ఘటనలో అయిదుగురు సైనికులు వీర మరణం పొందగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షం, తక్కువ వెలుతురు మాటున ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను మట్టుబెట్టేందుకు వెళ్తున్న క్రమంలోనే ఈ దాడి జరిగినట్లుపేర్కొన్నారు. J&K | Visuals from Bhimber Gali in Poonch where five soldiers lost their lives in a terror attack yesterday. (Visuals deferred by unspecified time) pic.twitter.com/331XNOeQWj — ANI (@ANI) April 21, 2023 హై అలర్ట్ పిడుగుపాటు వల్ల ఈ ఘటన జరిగి ఉంటుందని తొలుత భావించినా, ఆ తర్వాత ఇది ఉగ్రవాదుల పనేనని సైన్యం నిర్ధారించింది. ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ దాడి అనంతరం బటా-డోరియా ప్రాంతంలోని అడవులలో భద్రతా దళాలు భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఘటనా ప్రాంతాన్ని చుట్టిముట్టిన భద్రతా దళాలు.. ఉగ్రవాదుల జాడ కోసం డ్రోన్లు, స్నిఫర్ డాగ్‌లను ఉపయోగిస్తున్నారు. దాడిని పరిశీలించేందుకు బాంబు డిస్పోసల్ స్క్వాడ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) కూడా సంఘటనా ప్రాంతంలో ఉన్నాయి. మరోవైపు పూంచ్‌లో దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ (పీఏఎఫ్ఎఫ్) ప్రకటించింది. 2021 అక్టోబర్‌లో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు 9 మంది భారత సైనికులను కాల్చి చంపారు. చదవండి: Karnataka: ఈశ్వరప్ప కుమారుడికి మొండిచేయి -
నలుగురు సైనికులను కాల్చి చంపింది మన జవానే.. ఉగ్ర కోణం లేదు..
చండీగడ్: గత బుధవారం పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు మరణించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇది ఉగ్రవాదుల పనా? అని అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ ఘటనలో ఉగ్ర కోణం లేదని పంజాబ్ పోలీసులు సోమవారం వెల్లడించారు. దాడి చేసింది తోటి జవాన్ మోహన్ దేశాయ్ అని తెలిపారు. కాల్పుల అనంతరం అనుమానంతో అతడ్ని అరెస్టు చేసి విచారించగా నేరంగా అంగీకరించినట్లు పేర్కొన్నారు. కాల్పుల్లో చనిపోయిన నలుగురు జవాన్లు తనను వేధించడం వల్లే దాడి చేసి హతమార్చినట్లు మోహన్ దేశాయ్ అంగీకరించినట్లు అధికారులు చెప్పారు. మొదట పోలీసులను అయోమయానికి గురి చేసేందుకు కట్టు కథలు చెప్పాడని, ఆ తర్వాత విచారణలో నిజాన్ని ఒప్పుకున్నాడని వివరించారు. ఈ ఘటనలో ఉపయోగించిన ఆయుధాలను మిలిటరీ స్టేషన్ నుంచే మోహన్ దొంగిలించాడని పేర్కొన్నారు. మోహన్‌కు ఇంకా పెళ్లి కాలేదని ఒంటరిగానే ఉంటున్నాడని అధికారులు వెల్లడించారు. అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా? అనే విషయంపైనా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఏం జరిగిందంటే? పంజాబ్‌లోని భటిండా సైనిక శిబిరంలో శతఘ్ని దళానికి చెందిన జవాన్లు నివసించే ఆర్మీ స్టేషన్‌లోని ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇందులో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలిలో ఇన్సాస్ రైఫిల్‌కు చెందిన 19 ఖాళీ తూటాలు లభించాయి. ఘటన విషయం తెల్సిన వెంటనే తక్షణ స్పందన దళం రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు, సైన్యం.. నిందితుడి కోసం వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అనుమానాస్పదంగా కన్పించిన మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: మిలిటరీ స్టేషన్‌పై దుండగుల దాడి.. తుపాకులతో కాల్పులు.. నలుగురు సైనికులు మృతి.. -
జమ్మూకశ్మీర్: ఆర్మీ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడి.. ముగ్గురు జవాన్లు వీర మరణం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో ఆర్మీ క్యాంప్‌పై గురువారం ఉదయం ఆత్మహుతి దాడి జరిగింది. ఆర్మీ క్యాంపులోకి చొరబడిన ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందగా.. ఇద్దరికి గాయాలయ్యాయి. ఎదురు కాల్పులకు దిగిన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. రాజౌరికి 25 కి.మీ దూరంలోని దర్హాల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాజౌరీలోని దర్హాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్గల్ వద్ద ఆర్మీ క్యాంపులోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను గురువారం తెల్లవారుజామున మట్టుబెట్టినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు ఆర్మీ జవాన్లు మరణించినట్లు జమ్మూ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. ఘటనా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. అదనపు బలగాలను మోహరించామని వెల్లడించారు. చదవండి: ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలొస్తే.. బిహార్‌లో వారిదే హవా -
సీఆర్పీఎఫ్ వీర జవాన్ల కుటుంబాలకు పరిహారం పెంపు
న్యూఢిల్లీ: విధి నిర్వహణలో ఉండగా అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. విధి నిర్వహణలో లేదా విధుల్లో ఉండగా ఇతర కారణాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు తాజా నిర్ణయం వర్తిస్తుందని వారు తెలిపారు. తాజా నిబంధనల ప్రకారం..క్షేత్ర స్థాయిలో పోరాట విధుల్లో నేలకొరిగిన జవాన్ల కుటుంబాలకు ప్రస్తుతం ఉన్న రూ.21.5 లక్షల పరిహారాన్ని రూ.35 లక్షలకు పెంచారు. ఎవరైనా జవాను ప్రమాదం, అనారోగ్యం, తదితర ఏ ఇతర కారణాలతోనైనా విధి నిర్వహణలో ఉండగా చనిపోతే ఆయన కుటుంబానికిచ్చే పరిహారాన్ని రూ.16.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచారు. సెప్టెంబర్‌లో జరిగిన వార్షిక గవర్నింగ్ బాడీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
నేలకొరిగిన మరో ఇద్దరు జవాన్లు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి, పూంచ్ జిల్లాల్లోని అటవీ ప్రాంతంలో వరుసగా ఆరు రోజులుగా కొనసాగుతున్న గాలింపులో జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీవో) సహా ఇద్దరు జవాన్లు నేలకొరిగారు. దీంతో సోమవారం నుంచి కొనసాగుతున్న ఎదురుకాల్పుల్లో ఇద్దరు జేసీవోలు సహా మొత్తం 9 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లయింది. గురువారం నార్‌ఖాస్ ప్రాంతంలో ఉగ్రమూకలతో ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతంలోనే తాజాగా జేసీవో అజయ్ సింగ్, జవాన్ హరేంద్ర సింగ్ మృతదేహాలు దొరికాయని అధికారులు తెలిపారు. పర్వతమయమైన దట్టమైన అటవీప్రాంతంలో గాలింపు కష్టసాధ్యంగా, ప్రమాదకరంగామారిందన్నారు. మెంధార్ నుంచి థానామండి వరకు మొత్తం అటవీ ప్రాంతాన్ని పారా మిలటరీ కమాండోలు, హెలికాప్టర్లతో జల్లెడపడుతున్నామన్నారు. ఇలా ఉండగా, బిహార్‌లోని బాంకా ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం వలసవచి్చన అర్వింద్‌కుమార్ షా(30)ను శ్రీనగర్‌లోని ఈద్గా ప్రాంతంలో, యూపీ నుంచి వచ్చిన సాగిర్ అహ్మద్ అనే కార్పెంటర్‌ను పుల్వామాలో శనివారం ఉగ్రవాదులు కాల్చి చంపారని అధికారులు వెల్లడించారు. లష్కరే కమాండర్ హతం జమ్మూకశీ్మర్‌లోని పుల్వామా జిల్లా పంపోరే ప్రాంతంలో శనివారం భద్రతాబలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఉమర్ ముస్తాక్ ఖాన్దేతోపాటు మరో గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. పలు నేర ఘటనలతోపాటు ఈ ఏడాది జరిగిన ఇద్దరు కానిస్టేబుళ్ల హత్యతో ఖాన్దేకు సంబంధముందని అధికారులు తెలిపారు. -
బస్సును పేల్చిన మావోలు
చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోమారు రెచ్చిపోయారు. ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమేనంటూ ప్రకటించి వారం కూడా గడవక ముందే పోలీసులు ప్రయాణిస్తున్న బస్సును పేల్చివేశారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు మృత్యువాతపడగా, 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. చర్చలకు సిద్ధమని తెలిపినా బలగాలు కూంబింగ్‌కు వస్తుండడంతోనే మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ నారాయణ్‌పూర్ జిల్లాల సరిహద్దుల్లో గల బొదిలి, కాడిమెట్ట అటవీ ప్రాంతాల్లో రెండు జిల్లాలకు చెందిన 90 మంది డీఆర్జీ(డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డు) పోలీసులు కూంబింగ్ చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం 3.10 గంటలకు ఆపరేషన్ ముగించుకొని 27 మంది పోలీసులు బస్సులో నారాయణ్‌పూర్ బయలుదేరారు. ఆ బస్సు సాయంత్రం 4.14 గంటలకు కదేనార్–కన్హర్‌గావ్ మార్గంలోని వంతెన సమీపంలోకి రాగానే మావోయిస్టులు రిమోట్ సాయంతో మందుపాతరను పేల్చి వేశారు. దీంతో బస్సు 20 అడుగుల మేర ఎగిరి వాగులో పడింది. దీంతో బస్సు డ్రైవర్ సహా ఐదుగురు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. 13 మందికి తీవ్ర గాయాలుకాగా వారిని నారాయణ్‌పూర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి ఆరుగురిని ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్ డీజీపీ డీఎం అవస్తి వెల్లడించారు. మృతుల్లో కానిస్టేబుళ్లు సర్వెంట్ సలాం, సాహిత్, పవన్ మండవి, అసిస్టెంట్ కానిస్టేబుల్ విజయ్ పటేల్ లెవీ, డ్రైవర్ కానిస్టేబుల్ కరుణ్‌డెహారీ ఉన్నారు. మావోయిస్టుల కోసం సంఘటనా ప్రాంతానికి పోలీసు బలగాలను తరలించి కూం బింగ్ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
మావోయిస్టుల బాంబు దాడి; ఐదుగురు జవాన్లు మృతి
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో మావోయిస్టులు బాంబు పేల్చడంతో ఒక డ్రైవర్‌తోపాటు నలుగురు పోలీసులు మృత్యువాత పడ్డారు. ఈ దాడిలో 15 మంది గాయపడగా..వారందరినీ నారాయణపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో అయిదుగురు పరిస్థితి విషమంగా ఉంది. యాంటీ నక్సల్స్ ఆపరేషన్‌లో పాల్గొన్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్(డీఆర్జీ) పార్టీ తిరిగి వస్తుండగా మంగళవారం సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో ఓ బ్రిడ్జ్ వద్ద మావోయిస్టులు బాంబు పెట్టి బస్సును పేల్చేసినట్లు ఛత్తీస్‌గఢ్ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ డీజీ అశోక్ జునేజా చెప్పారు. డ్రైవరు, ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మరణించారని.. మరో ఇద్దరు హాస్పిటల్‌కి తీసుకెళ్లిన తరువాత మరణించారని.. మొత్తం అయిదుగురు ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. మావోయిస్టులు దాడి చేసిన సమయానికి బస్సులో 27 జవాన్లు ఉన్నట్లు, పేలుడు తీవ్రతకు బస్సు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైనట్లు పేర్కొనఆనరు. Anti-naxal ops were going on. One DRG party was returning after the op when around 4.15 pm, 3 IED blasts took place at a bridge in their route. Driver & 2 jawans died on spot, 2 died later at hospital - 5 jawans lost their lives: Ashok Juneja, DG, Anti Naxal Ops#Chhattisgarh pic.twitter.com/SEEIF5Wqr1 — ANI (@ANI) March 23, 2021 -
కశ్మీర్లో ఉగ్రదాడి
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కుప్వారా జిల్లాలోని ఒక చెక్‌పాయింట్ వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు. అనంతరం, ఇరు వర్గాల కాల్పుల్లో మొహమ్మద్ హజీమ్ భట్ అనే 15 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ‘వాంగమ్– ఖాజియాబాద్ వద్దనున్న చెక్పాయింట వద్ద సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు’ అని అధికారులు సోమవారం వెల్లడించారు. ఘటనాప్రాంతానికి అదనపు దళాలను తరలించామని, ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని వివరించారు. -
ఉగ్రవాదుల దాడి.. ముగ్గురు జవాన్ల మృతి
శ్రీనగర్ : కశ్మీర్లో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య మరోసారి కాల్పుల మోత మోగింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్ సమీపంలో శనివారం పెద్ద ఎత్తున ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఉగ్రవాద దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అహాగ్‌బాబ్ క్రాసింగ్ సమీపంలో ఉన్న నూర్బాగ్ వద్ద సీఆర్పీఎఫ్, పోలీసులపై ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. వెంటనే తేరుకున్న జవాన్లు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (మాజీ ఈసీ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు) సోపోర్ పట్టణంలో విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారని స్థానిక ఎస్పీ తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారని, డ్రైవర్‌తో సహా ముగ్గురు పారా మిలటరీ సైనికులు గాయపడ్డారని ఎస్పీ ధృవీకరించారు. కాగా సంఘటన జరిగిన వెంటనే దాడికి తెగబడిన వారిని పట్టుకోవడానికి భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని ఎస్పీ తెలిపారు. (భారత్ మందులు ఎగుమతి చేస్తుంటే.. పాక్..) భీకర కాల్పులు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం -
మందుపాతర పేల్చిన మావోలు
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బస్తర్ జిల్లాలో శనివారం మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్రాజ్ కథనం ప్రకారం.. జిల్లాలోని బాన్సూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొద్లీ–బాల్వాయి గ్రామాల మధ్య రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు పనుల వద్ద భద్రతగా నిలిచేందుకు బాన్సూర్ పోలీస్ స్టేషన్ నుంచి సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక బలగాలు వెళ్తుండగా, మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఉపేందర్ సాహూ, దేవేందర్ సాహూ మృతిచెందారు. సీఆర్పీఎఫ్ జవాన్‌కు తీవ్ర గాయాలు కాగా ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించి వైద్య సేవలనందిస్తున్నారు. మందుపాతర పేల్చిన అనంతరం మావోయిస్టులు, పోలీసులకు మధ్య 15 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. -
కశ్మీర్లో ఉగ్ర దుశ్చర్య
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా దళాలపై జరిపిన దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రదాడిని తిప్పికొట్టడానికి భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని అధికారులు వెల్లడించారు. ‘116వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు, రాష్ట్ర పోలీసులు ఇక్కడి కేపీ రోడ్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఒక్కసారిగా తమ వద్ద ఉన్న రైఫిళ్లతో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. అలాగే వారి వాహనంపై గ్రెనేడ్లను విసిరారు. దీంతో జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా గాయపడిన మరో ముగ్గురుని ఆస్పత్రికి తరలించాం’అని తెలిపారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన అనంతనాగ్ పోలీస్ స్టేషన్ అధికారి అర్షద్ అహ్మద్‌ను చికిత్స కోసం శ్రీనగర్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ ఉగ్రవాదులను జైషే మొహ్మద్ ఉగ్రవాద గ్రూపునకు చెందిన వారుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ముగ్గురు సహచరుల్ని కాల్చి చంపిన జవాన్
న్యూఢిల్లీ : కశ్మీర్లో ఓ సీఆర్ఫీఎఫ్ జవాన్ రెచ్చిపోయాడు. ముగ్గురు సహచర జవాన్లు వాగ్వాదానికి దిగడంతో వారిని తన సర్వీసు రైఫిల్‌తో కాల్చి చంపాడు. సీఆర్ఫీఎఫ్ 187వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ అజిత్ కుమార్ కశ్మీర్లో నిధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ముగ్గురు సహచరులకు అజిత్‌తో వాగ్వాదం జరిగింది. దీంతో సహనం కోల్పోయిన అజిత్ తన తుపాకీతో ముగ్గురు సహచరుల్ని కాల్చి, తానూ ఆత్మహత్యకు యత్నించాడు. అధికారులు వీరిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, ముగ్గురు జవాన్లు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు. ఈ కాల్పులకు పాల్పడింది కాన్పూర్‌కు చెందిన కుమార్ అని అధికారులు తెలిపారు. మృతి చెందిన వారు రాజస్థాన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఆర్ పొకార్మల్, ఢిల్లీకి చెందిన యోగేంద్ర శర్మ, హర్యానాకు చెందిన ఉమెద్ సింగ్‌లుగా గుర్తించారు. దాడికి పాల్పడిన కుమార్ ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు సమాచారం. జవాన్ల మధ్య వచ్చిన విభేధం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు సీఆర్ఫీఎఫ్ 187వ బెటాలియన్ కమాండర్ హరీందర్ సింగ్ తెలిపారు. -
పుల్వామా’ కుటుంబాలకు కోటి ఎక్స్‌గ్రేషియా
న్యూఢిల్లీ: పుల్వామాలో ఉగ్రదాడిలో అసువులు బాసిన 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు సర్వీస్ నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించినట్లు భద్రతాదళాధికారి ఒకరు చెప్పారు. వీటితోపాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను అదనంగా అందజేస్తామన్నారు. ఇందులో సీఏపీఎఫ్‌కి చెందిన సిబ్బంది విధి నిర్వహణ లో మృతి చెందినపుడు కేంద్రం ప్రకటించే ఎక్స్‌గ్రేషియా కింద రూ.35 లక్షలు, నష్ట నివారణ నిధి కింద రూ.21.50 లక్షలు, ‘భారత్ కే వీర్’నిధి కింద రూ.15 లక్షలు, ఎస్బీఐ పారామిలిటరీ సేవల బీమా నుంచి రూ.30 లక్షలు చెల్లించారు. ‘కొన్ని సంస్థలు జవాన్ల పిల్లల విద్యా బాధ్యతలను తీసుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి’అని ఆయన చెప్పారు. కొన్ని సందర్భాల్లో మృతి చెందిన జవాన్ల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించాయని, వారు సీఆర్పీఎఫ్లోని ఉద్యోగాలకూ అర్హులేనన్నారు. -
మంచుచరియలు పడి ఆరుగురు జవాన్ల మృతి
సిమ్లా: మంచుచరియలు విరిగిపడి ఆరుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన బుధవారం హిమాచల్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హిమాచల్‌కు చెందిన జవాను రాకేశ్ కుమార్(41) మృతదేహాన్ని మాత్రం మంచు దిబ్బల కింద సహాయకదళాలు గుర్తించారు. మిగతా జవాన్ల మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. కినౌర్ జిల్లాలో భారత్–చైనా సరిహద్దులోని షిప్కీలా బోర్డర్ పోస్ట్ వద్ద నీటపారుదల వ్యవస్థ రిపేర్ కోసం 16 మంది జవాన్ల బృందం అక్కడికి వెళ్లింది. అదే సమయంలో హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ జవాన్లు సైతం గాయపడ్డారు. చాలామంది జవాన్లు మంచులో కూరుకుపోయినా అందరినీ రక్షించామని కినౌర్ డెప్యూటీ కమిషనర్ గోపాల్ చంద్ చెప్పారు. దాదాపు 150 మంది జవాన్ల బృందం గాలింపు చర్యల్లో నిమగ్నమైంది. -
బలగాలపై మావోల పంజా
చర్ల / రాయ్‌పూర్: ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో తనిఖీలకు వెళ్లివస్తున్న భద్రతా బలగాల మైన్‌ప్రూఫ్ వాహనాన్ని శక్తిమంతమైన మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ వాహనం తునాతునకలైంది. ఈ విషయమై బీజాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్పీ) మోహిత్ గార్గ్ మాట్లాడుతూ.. ఇక్కడి మర్దొండ క్యాంప్‌లో ఉన్న సీఆర్పీఎఫ్ 168వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు రోడ్లు, బ్రిడ్జీల తనిఖీలకు బయలుదేరినట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగివస్తుండగా బేస్క్యాంపుకు కేవలం కిలోమీటరు దూరంలో జవాన్లు ప్రయాణిస్తున్న మైన్ ప్రూఫ్ వాహనాన్ని మావోలు శక్తిమంతమైన మందుపాతరతో పేల్చేశారని వెల్లడించారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాద ఘటన అనంతరం అదనపు బలగాలను రంగంలోకి దించామని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ సుక్మా జిల్లాలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రోజే మావోలు రెచ్చిపోవడం గమనార్హం. 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి వచ్చే నెల 12న, 20వ తేదీన రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
సైనిక కవాతుపై ఉగ్ర దాడి
టెహ్రాన్: ఇరాన్లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. వార్షిక సైనిక కవాతు జరుగుతుండగా నలుగురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 29 మంది చనిపోగా, 57 మంది గాయపడ్డారు. ఇరాక్‌కు సరిహద్దుగా ఉన్న కుజెస్తాన్ ప్రావిన్స్‌లోని ఆవాజ్ పట్టణంలో శనివారం ఈ ఘటన జరిగింది. మృతిచెందినవారిలో సైనికులతో పాటు కవాతు వీక్షించడానికి వచ్చిన ప్రజలు, అధికారులున్నారు. ఈ దాడి చేసింది తామేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురిని భద్రతా బలగాలు అక్కడే మట్టుబెట్టగా, ఒకరు గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో చనిపోయాడు. అమెరికా మిత్ర దేశమే దాడికి బాధ్యత వహించాలని, ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ అన్నారు. సౌదీ అరేబియా పాత్ర ఉంది.. 1980–88 మధ్య ఇరాక్‌తో జరిగిన యుద్ధానికి స్మారకంగా ఇరాన్ ఏటా సైనిక కవాతు నిర్వహిస్తోంది. ప్రేక్షకులు కూర్చున్న స్టాండ్ వెనక వైపు నుంచి దుండగులు లోనికి చొరబడ్డారని స్థానిక మీడియా పేర్కొంది. సంఘటనా స్థలంలో సాయం కోసం అరుస్తున్న బాధితుల చిత్రాలను పలు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. తమ శత్రువైన సౌదీ అరేబియా ఈ దాడికి నిధులు సమకూర్చిందని ఇరాన్ సైన్యం ఆరోపించింది. -
కాల్పుల విరమణకు తూట్లు
జమ్మూ: దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. జమ్మూకశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంట భారత బలగాలు లక్ష్యంగా మంగళవారం రాత్రి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. ఈ దాడిలో ఓ అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంక్ అధికారి సహా నలుగురు సరిహద్దు భద్రతాదళం(బీఎస్ఎఫ్) జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయమై బీఎస్ఎఫ్ పశ్చిమ కమాండ్ అదనపు డైరెక్టర్ జనరల్(ఏడీజీ) కేఎన్ చౌబే స్పందిస్తూ.. ‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసేందుకు భారత్ అంగీకరిస్తే, పాకిస్తాన్ మాత్రం దానికి తూట్లు పొడిచింది. పాక్ చేయాల్సింది చేసింది. ఈ నమ్మక ద్రోహానికి దీటుగా స్పందించడం ఇప్పుడు మావంతు’ అని వ్యాఖ్యానించారు. సాంబా జిల్లాలోని రామ్‌గఢ్ సెక్టార్లో ఉన్న ఛామ్లియాల్ బోర్డర్ పోస్ట్‌కు రక్షణ సామగ్రిని తీసుకెళ్తున్న బీఎస్ఎఫ్ బృందంపై పాక్ రేంజర్లు మంగళవారం రాత్రి 9.40 గంటలకు ఏకపక్షంగా కాల్పులు జరిపారన్నారు. దీంతో వీరిని రక్షించేందుకు అసిస్టెంట్ కమాండెంట్ జితేందర్ సింగ్ బృందం అక్కడికి చేరుకోగానే పాక్ బలగాలు వెంటనే మోర్టార్లను ప్రయోగించాయన్నారు. ఈ దాడిలో బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ జితేందర్ సింగ్(రాజస్తాన్)తో పాటు ఎస్సై రజ్నీశ్ కుమార్(యూపీ), ఏఎస్సై రామ్నివాస్(రాజస్తాన్), కానిస్టేబుల్ హన్స్‌రాజ్(రాజస్తాన్) ప్రాణాలు కోల్పోయినట్లు చౌబే తెలిపారు. పాక్ కాల్పుల్లో గాయపడ్డ ఐదుగురు జవాన్లను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామన్నారు. పాక్ కాల్పులు బుధవారం తెల్లవారుజాము 4.30 గంటలవరకూ కొనసాగాయనీ, భారత బలగాలు పాక్ దాడిని దీటుగా తిప్పికొట్టాయన్నారు. దీనిపై పాక్‌కు నిరసన తెలియజేస్తామన్నారు. -
పాక్ దొంగదెబ్బ.. ఐదుగురి మృతి
శ్రీనగర్: పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో ఆదివారం తెల్లవారుజామున పాకిస్తాన్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూకశ్మీర్ పరగ్వాల్ సెక్టార్‌లోని అక్నూర్లో జమాన్ బెళా పోస్టుపై పాకిస్తాన్ రేంజర్లు దొంగ చాటుగా దాడి చేశారు. ఈ దాడిలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ వీకే పాండే (27), ఏఎస్ఐ ఎస్ఎన్ యాదవ్ (48) సహా ముగ్గురు పౌరులు మృతి చెందారనీ పరగ్వాల్ చెక్ పోస్ట్ ఇన్చార్జ్ బ్రిజిలాల్ శర్మ తెలిపారు. ప్రతిగా భారత బలగాలు దాడులు ప్రారంభించాయని, కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించారు. పరగ్వాల్ సెక్టార్‌లోని 10 పోలీసు పోస్టులు, 30 గ్రామాలను పాకిస్తాన్ బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయని బ్రిజిలాల్ చెప్పారు. సరిహద్దుల్లోని భద్రతపై కట్టుదిట్టమైన, దృఢమైన నిర్ణయాలు తీసుకుందామని పాకిస్తాన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్.. మే 29న భారత్‌కు పిలుపునివ్వడం గమనార్హం. కాల్పులతో దిన దిన గండంగా బతుకున్న సరిహద్దు ప్రజల కష్టాలను తొలగిద్దామని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ పిలుపుపై భారత్ సానుకూలత వ్యక్తం చేసింది. సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం చర్చలకు సిద్ధమని తెలిపింది. అయితే, ప్రతిసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ఉల్లంఘిస్తూ, శాంతియుత వాతావరణానికి తావులేకుండా చేస్తోంది. -
మావోయిస్టుల ఘాతుకం
చర్ల/పర్ణశాల : ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. వరుస ఘటనల్లో తమ అనుచరులను కోల్పోతున్న మావోయిస్టులు మరోసారి ప్రతీకారం తీర్చుకున్నారు. సీఏఎఫ్, డీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బొలెరో వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) బాంబును పేల్చారు. ఈ ఘటనలో ఆరుగురు జవాన్లు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా పరిధిలోని చోల్నార్ గ్రామ సమీపంలో ఆదివారం ఉదయం సుమారు 10 గంటలకు జరిగింది. బచెలి నుంచి చోల్నార్ వరకు రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు చేస్తున్న కూలీలకు రక్షణగా ఉండేందుకు బచెలి నుంచి ఒక బొలెరో వాహనంలో బచేలి స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాంకుమార్ యాదవ్‌తో పాటు సీఏఎఫ్, డీఎఫ్లకు చెందిన మరో ఆరుగురు జవాన్లు బయలుదేరారు. జవాన్ల రాకను ముందుగానే గమనించిన మావోయిస్టులు మార్గమధ్యంలోని ఓ కల్వర్టు వద్ద ఏర్పాటు చేసిన శక్తివంతమైన మందుపాతరను పేల్చివేశారు. దీంతో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం సుమారు 20 అడుగుల మేర ఎత్తు ఎగిరి పడి తునాతునకలైంది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాంకుమార్ యాదవ్‌తో పాటు టీకేశ్వర్ బర్గ్, తాలిగ్రాం, విక్రమ్‌యాదవ్, రాజేష్‌సింగ్, వీరేందర్నాథ్లు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. జవాన్ల మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అర్జున్రాజ్వరున్ అనే జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి అనంతరం జవాన్లు మృతి చెందారని నిర్ధారించుకున్న మావోయిస్టులు రెండు ఏకే–47, రెండు ఎస్ఎల్ఆర్, రెండు ఐఎన్ఎస్ఏఎస్లు, రెండు గ్రెనేడ్లను అపహరించుకుపోయారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న బచేలి స్టేషన్ బలగాలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. గాయపడ్డ జవాన్‌ను అర్జున్ వరుణ్‌కు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. ఘటనలో 200 మంది మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చిన సమయంలో ఘటనాస్థలం వద్ద దాదాపు 200మంది సాయిధులైన మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడికి కోసం సుమారు యాభై కేజీల ఐఈడీని మావోయిస్టులు వాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసు బలగాలు సంఘటన జరిగిన చుట్టూ గల అటవీప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశారు. సంఘటన స్థలాన్ని బస్తర్ డీఐజీ రత్నల్ దాగ్ని పరిశీలించారు. ఈ నెల 22న ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసేందుకు రానున్నారు. ఈ పర్యటనకు వ్యతిరేకంగా మావోయిస్టులు ఈ దుర్చర్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మార్చిలో తొమ్మిది మంది ఈ ఏడాది మార్చి 13న సుక్మా జిల్లా క్రిష్టారాం పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో మావోయిస్టులు భారీ ఐఈడీ అమర్చి సీఆర్పీఎఫ్ జవాన్లను క్యాంపునకు తీసుకెళ్తున్న మైన్ ప్రొటెక్టెడ్ వాహనాన్ని పేల్చడంతో తొమ్మిది మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువక ముందే మళ్లీ దాడితో మావోయిస్టులు, పోలీసు బలాగాల మధ్య పరస్పర దాడులతో దండకారణ్య అట్టుడుకుతోంది. -
బలగాల వాహనం పేల్చివేత
రాయ్‌పూర్ / చర్ల / చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. దంతేవాడ జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు గస్తీ నిర్వహిస్తున్న బలగాల వాహనాన్ని ఆదివారం మందుపాతరతో పేల్చివేశారు. ఈ దాడిలో ఏడుగురు జవాన్లు దుర్మరణం చెందారు. మావోల దాడిని పిరికిపందల చర్యగా ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ అభివర్ణించారు. దంతేవాడ జిల్లాలోని బచేలి–చోల్నార్ రోడ్డు నిర్మాణ పనులకు సామగ్రిని తరలిస్తున్న వాహనాలకు ఛత్తీస్‌గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్(సీఏఎఫ్), డిస్ట్రిక్ ఫోర్స్(డీఎఫ్) సంయుక్త బలగాలు రక్షణ కల్పిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇందులోభాగంగా గస్తీ నిర్వహిస్తున్న బలగాల వాహనం చోల్నార్ గ్రామ సమీపంలోకి రాగానే మావోలు శక్తిమంతమైన మందుపాతరను పేల్చారన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరిగిన ఈ దాడిలో బలగాల వాహనం తునాతునకలైందని వెల్లడించారు. ల్యాండ్‌మైన్ పేలుడు అనంతరం దాదాపు 200 మంది మావోలు బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారన్నారు. ఐదుగురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారని పేర్కొన్నారు. మృతుల్లో డీఎఫ్ బలగాలకు చెందిన హెడ్‌కానిస్టేబుల్ రామ్‌కుమార్, కానిస్టేబుల్ తికేశ్వర్ ధ్రువ్, అసిస్టెంట్ కానిస్టేబుల్ షాలిక్‌రామ్, సీఏఎఫ్ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ విక్రమ్ యాదవ్, కానిస్టేబుళ్లు రాజేశ్ కుమార్, రవినాథ్ పటేల్, అర్జున్ రాజ్భర్లు ఉన్నారు. దాడి అనంతరం బలగాల దగ్గరున్న ఆయుధాల్ని మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. ఇటీవల గడ్చిరోలీ, మల్కన్‌గిరితో పాటు బీజాపూర్‌లో భద్రతాబలగాల దాడిలో భారీగా నష్టపోయిన మావోలు.. ప్రతీకారంగానే ఈ దాడికి పాల్పడినట్లు పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి. -
‘మావోయిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటాం’
సాక్షి, రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు జరిపిన ఎన్కౌంటర్లో ఆరుగురు రక్షణ సిబ్బంది మరణించడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ స్పందించారు. మవోయిస్టులు అభివృద్ధికి వ్యతిరేకమని, వారు కేవలం రక్షణ సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని కాల్పులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటువంటి ఘటనలపై ప్రతీకారం తీర్చుకుంటామని రమణ్‌సింగ్ అన్నారు. మావోయిస్టులు వారి పోరాటం కంటే రక్షణ సిబ్బందిని చంపడంపైనే వారు దృష్టిసారించారని కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని సాత్నాలో విలేకరులతో మాట్లాడిన రాజ్‌నాథ్ ఘటనలో ఆరుగురు జవాన్లు మరణించడం దురదృష్టకరమన్నారు. -
మావోయిస్టుల ప్రతీకార చర్య
సాక్షి, రాయపూర్ : వరుస ఎదురుదెబ్బలతో డీలాపడ్డ మావోయిస్టులు అదును చూసి ప్రతీకారం తీర్చుకున్నారు. ఛత్తీస్‌గఢ్ దంతెవాడ, చోల్నార్ అటవీ ప్రాంతంలో పోలీస్‌లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్ట్‌లు మందుపాతర పేల్చారు. ఈదుర్ఘటనలో ఆరుగురు జవాన్లు మరణించగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ప్రథమ చికిత్స అనంతరం రాయపూర్ తరలించారు. దాదాపు 10 అడుగుల లోతులో మందుపాతర అమర్చారు. పేలుడు ధాటికి జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం తునాతునకలు అయ్యింది. దంతెవాడ జిల్లాలో రోడ్డు నిర్మాణానికి జవాన్లు రక్షణగా వెళ్లారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న మావోయిస్టులు పథకం ప్రకారం మందుపాతర పేల్చి ఆరుగురు జవాన్ల ప్రాణాలు తీశారు. అనంతరం వారి అధునాతన ఏకే 47, ఇన్సాన్ ఆయుధాలను ఎత్తుకెళ్లారు. -
ముగ్గురు జవాన్లను హతమార్చిన మావోయిస్టులు
చర్ల(భద్రాద్రి కొత్తగూడెం): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మారోమారు మావోయిస్టులు రెచ్చిపోయారు. రాజ్‌నందిగామ్ జిల్లాలోని భాగ్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో రవి అనే జవాను మృతి చెందాడు. ఇదే ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న ప్రత్యేక పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. కూంబింగ్ ఆపరేషన్‌ను ముమ్మరం చేసినట్లు రాజ్‌నంద్‌గామ్ జిల్లా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. -
బలగాల బస్సును పేల్చేసిన మావోలు
చర్ల/రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ప్రధాని మోదీ శనివారం పర్యటించనున్న నేపథ్యంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతాబలగాలే లక్ష్యంగా రెండుచోట్ల మందుపాతరలను పేల్చి ఇద్దరు జవాన్లను బలిగొన్నారు. బీజాపూర్ జిల్లాలోని పుట్రు–నమ్మేడ్ గ్రామాల మధ్య నిర్మిస్తున్న రహదారిని తనిఖీ చేసి తిరిగివస్తున్న భద్రతాబలగాల బస్సే లక్ష్యంగా సోమవారం మధ్యాహ్నం మావోలు శక్తిమంతమైన మందుపాతరను పేల్చారు. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వు గార్డుల(డీఆర్జీ)కు చెందిన ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షతగాత్రుల్ని రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది జవాన్లు ఉన్నారన్నారు. -
మావోయిస్టుల దుశ్చర్య: జవాన్ల మృతి
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని కుత్రు వద్ద మావోయిస్టులు ఐఈడీ పేల్చడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, జవాన్లు కలిసి సోమవారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తుండగా పేలుడు సంభవించినట్లు స్పెషల్ డీజీ తెలిపారు. గాయపడ్డ జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కశ్మీర్లో పాక్ దురాగతం
జమ్మూ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ సైన్యం మరోసారి దురాగతానికి తెగబడింది. ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకపోయినప్పటికీ భారత సైనికులపైకి విచక్షణా రహితంగా కాల్పులు జరిపి నలుగురిని బలిగొంది. కాల్పుల్లో మరో ముగ్గురు గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఒకరు ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి కాగా, మిగిలిన ముగ్గురు జవాన్లు. జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో పాక్ సైనికులు ఆదివారం కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఆటోమేటిక్ తుపాకులు, మోర్టార్లతో పౌర ప్రాంతాలపైనా దాడి చేశారు. కొన్ని ఇళ్లు ధ్వంసమయ్యాయి. తొలుత ఉదయం 11.10 గంటల ప్రాంతంలో పూంచ్‌లోని షాపూర్ సెక్టార్లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మైనర్లు, ఓ ఆర్మీ జవాన్ గాయపడ్డారు. భారత సిబ్బంది తమ తుపాకులతో పాక్‌కు దీటైన సమాధానమిచ్చారని ఓ అధికారి చెప్పారు. రాజౌరీ జిల్లాలోని మధ్యాహ్నం 3.40 గంటలకు భీంభేర్ గలీ సెక్టార్‌లోనూ పాక్ సైనికులు మోర్టార్లతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మరణించగా, మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం తరలిస్తుండగా ఆయనా మృత్యువాత పడ్డారు. రాజౌరీలోనూ పాక్ కాల్పులకు భారత జవాన్లు దీటుగా సమాధానమిచ్చారు. ఆరు రోజుల్లో పుట్టినరోజు ఉందనగా... చనిపోయిన వారిలో వయసురీత్యా అందరికన్నా చిన్నవాడే ఆ అధికారి. హరియాణకు చెందిన కపిల్ కుందు (22) ఆర్మీలో లెఫ్టినెంట్‌గా విధులు నిర్వర్తించేవారు. మరో ఆరు రోజుల్లో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సి ఉంది. ఇంతలోనే పాక్ కాల్పులకు కుందు బలయ్యారు. చనిపోయిన జవాన్లలో కశ్మీర్‌కు చెందిన రోషన్ లాల్ (42), శుభం సింగ్ (23)తోపాటు మధ్య ప్రదేశ్‌కు చెందిన రామావతార్ (27) ఉన్నారు. మరోవైపు నియంత్రణ రేఖకు ఐదు కి.మీ. దూరంలో ఉన్న అన్ని పాఠశాలలనూ మూడురోజులపాటు మూసివేస్తున్నట్లు రాజౌరీ ఉప కమిషనర్ చెప్పారు. -
పంజా విసిరిన మావోయిస్టులు
-
పంజా విసిరిన మావోయిస్టులు
చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. నారాయణ్‌పూర్, బీజాపూర్ జిల్లాల్లో బుధవారం జరిపిన రెండు వేర్వేరు దాడుల్లో ఇద్దరు ఎస్ఐలు సహా ఐదుగురు పోలీసులు మృతి చెందారు. నారాయణ్‌పూర్ జిల్లాలోని అబూజ్‌మఢ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం అందడంతో వంద మంది పోలీసులు కూంబింగ్‌కు వెళ్లారు. దీంతో ఇర్పానార్ అటవీ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. నక్సల్స్ కాల్పుల్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (డీఆర్జీ) గ్రూప్‌కు చెందిన ఎస్ఐలు వినోద్ కౌశిక్, మూల్‌చంద్‌లతోపాటు కానిస్టేబుళ్లు దేవ్నా«థ్ పూజారి, రామ్‌సింగ్‌లు మృతిచెందారు. గాయాలపాలైన మరో తొమ్మిది మందిని చికిత్స కోసం రాయ్‌పూర్‌కు తరలించారు. మరో ఘటనలో బీజాపూర్ జిల్లా బాసగూడ అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. -
ఏడుగురు పాక్ సైనికుల కాల్చివేత
జమ్మూ/శ్రీనగర్: భారత బలగాలపై తరచూ కాల్పులకు పాల్పడుతూ కవ్విస్తున్న పాక్‌కు భారత ఆర్మీ దీటైన జవాబిచ్చింది. ఓ మేజర్ సహా ఏడుగురు పాక్ జవాన్లను సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో హతమార్చింది. జమ్మూకశ్మీర్‌లోని మంధార్ సెక్టార్‌తో పాటు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న భారత పోస్టులపై తెల్లవారుజాము నుంచే పాక్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించినట్లు ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన భారత్ బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు పాక్ సైనికులు చనిపోగా, నలుగురు గాయపడ్డారని వెల్లడించారు. మరోవైపు కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించిన ఐదుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని కూడా భద్రతా బలగాలు కాల్చిచంపాయి. భారత్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశించేందుకు వీలుగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోందనీ.. ఇదిలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించిన కొద్ది గంటలకే భారత బలగాలు పాక్ సైనికుల్ని హతమార్చాయి. ఇరుపక్షాల కాల్పులతో సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జమ్మూకశ్మీర్–పాక్ ఆక్రమిత కశ్మీర్‌ల మధ్య వ్యాపారాలతో పాటు రాకపోకల్ని నిలిపివేశారు. మరోవైపు, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశంలో అలజడి సృష్టించాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జీలం నది ద్వారా భారత్‌లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాలనుకున్న ఐదుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని సోమవారం హతమార్చాయి. -
సహచరులపై జవాన్ కాల్పులు
చర్ల (భద్రాచలం): సెలవు మంజూరు చేయలేదనే ఆక్రోశంతో సీఆర్పీఎఫ్ జవాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపి నలుగురు సహచరులను పొట్టనబెట్టుకున్నాడు. మరొకరిని తీవ్రంగా గాయపరిచాడు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రాబల్య బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని 168వ సీఆర్పీఎఫ్ బెటాలియన్ శిబిరంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు ఎస్సైలు, ఒక ఏఎస్సై, ఒక కానిస్టేబుల్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆ ఎస్సైలను వికీ శర్మ, మేఘ్ సింగ్‌లుగా, ఎఏస్సైని రజ్వీర్ సింగ్‌గా, కానిస్టేబుల్‌ను శంకరరావు(ఏపీలోని విజయనగరం జిల్లావాసి)గా గుర్తించారు. గజానంద్ అనే మరో ఏఎస్సై గాయాలపాలయ్యాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కానిస్టేబుల్ సనత్ కుమార్ తన ఏకే 47 సర్వీసు తుపాకీతో ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. దంతెవాడ రేంజ్ డిప్యూటీ ఐజీ సుందర్రాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఇటీవల సనత్‌కుమార్ సెలవు కోసం దరఖాస్తు చేసుకోగా అందుకు పైస్థాయి అధికారులు నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. దీంతో విచక్షణ కోల్పోయి కాల్పులు జరిపాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మిగతా సిబ్బంది సనత్‌ను అడ్డుకోవడంతో ప్రాణ నష్టం తగ్గినట్లు తెలిసింది. గాయపడిన ఏఎస్సై, మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్లో ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌కు తరలించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. -
ఛత్తీస్‌గడ్‌లో మావోయిస్టుల ఎన్కౌంటర్
-
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్: నలుగురు మృతి
ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లాలోని పురంకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. పురంకొండ అటవీ ప్రాంతంలో ఆర్మీ జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా... మావోయిస్టులు ఎదురుపడ్డారు.దాంతో జవాన్లపైకి మావోయిస్టులు కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. -
జవాన్లను బలిగొన్న కొండచరియలు
ఇద్దరు వీర జవాన్లను కొండచరియల రూపంలో మృత్యువు కభళించింది. వారు కాపలాగా ఉన్న చెక్‌పోస్ట్‌పై భారీ కొండ చరియలు విరిగిపడి ఇద్దరు సైనికులు అక్కడికక్కడే చనిపోగా మరో సైనికుడి ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని పితోర్గడ్ జిల్లాలోని సిలక్ సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. మొత్తం ఎనిమిది మంది ఈ చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా వారిలో ఐదుగురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్‌లో గత రెండు రోజులుగా మంచుతో కూడిన వర్షం పడుతున్న విషయం తెలిసిందే. -
ఘటనా స్థలం నుంచి మృతదేహాల స్వాధీనం
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అయిదుగురి జవాన్ల మృతదేహాలను తరలించారు. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 20మంది జవాన్లు మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. మృతుల్లో 15మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, అయిదుగురు పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న వారికి భద్రత కల్పించేందుకు జవాన్లు వెళుతున్న మార్గంలో ముందుగా మందుపాతర పేల్చి, అనంతరం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 150మంది నక్సల్స్ పాల్గొన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో డీఐజీ దీపాంశు కబ్రా తెలిపారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయిన విషయం తెలిసిందే. సుకుమా జిల్లా సొంపల అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై దాడి చేయడంతో దాదాపు 20 మంది జవాన్లు అక్కడికక్కడే మరణించారు. మరో 16 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జగదల్పూర్ తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సీఎస్, హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, ముఖ్య ఉన్నత అధికారులతో భేటీ అయ్యారు. దాడిపై చర్చించిన రమణ్ సింగ్...ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మావోయిస్టుల ఎదుర్కొనేందుకు తమ ముందున్న పెద్ద సవాల్ అన్నారు. మృతి చెందిన జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. -
ఛత్తీస్‌లో నక్సల్స్ పంజా
మందుపాతర పేలుడులో ఇద్దరు జవాన్ల బలి ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి చింతూర్(ఖమ్మం), న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ భద్రతా బలగాలపై పంజా విసిరారు. సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్ మందుపాతర పేల్చడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ అధికారులు మృతిచెందగా, 12 మంది జవాన్లు గాయపడ్డారు. మరోపక్క.. బీజాపూర్ జిల్లా లో శనివారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టు దళ కమాండర్లు చనిపోయారు. సుక్మా జిల్లాలోని బోధ్‌రాజ్ పదార్ గ్రామ సమీప అడవుల్లోకి కూంబింగ్‌కు వెళ్లిన ‘కోబ్రా’, సీఆర్పీఎఫ్, జిల్లా పోలీసు విభాగానికి చెందిన 400 మంది జవాన్ల కదలికను పసిగట్టిన మావోలు దారి కాచి భారీ మందుపాతర పేల్చారు. తర్వాత ఇరుపక్షాల మధ్య కాల్పులు జరిగాయి. పేలుడులో సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ నిహాల్ ఆలం, కానిస్టేబుల్ రాజీవ్ రావత్ అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్ఐ హృదయ్వర్మ, సీఆర్పీఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రత్నేశ్వర్, కానిస్టేబుళ్లు ప్రమోద్, మహేష్ శర్మ, జితేందర్, దినేశ్ యాదవ్, మహంతి, అసిస్టెంట్ కానిస్టేబుల్ నెహ్రులాల్ కాశ్యప్లు తీవ్రంగా గాయపడడంతో వారిని హెలికాప్టర్లో రాయ్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. శనివారం రాత్రి మహారాష్ట్ర సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సల్స్ మధ్య జరిగిన హోరాహోరీ ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ దళ కమాండర్లు మృతిచెందారు. వీరిలో భార్యాభర్తలు ఉన్నారు. ఛత్తీస్, మహారాష్ట్ర పోలీసులు బడే కాకిలేర్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్సల్స్ తారసపడ్డారు. ఇరుపక్షాలు కాల్పులు జరుపుకున్నాయి. ఘటనాస్థలంలో ఇద్దరు పురుషులు, ఓ మహిళా నక్సల్స్ మృతదేహాలు కనిపించాయి. మృతులను బీజాపూర్ జిల్లా పల్లెవాయి గ్రామానికి చెందిన గంగలూరు దళ కమాండర్ చైతు అలియాస్ నవీన్ మండావి, జైపేలీ గ్రామానికి చెందిన కమాండర్ మాసె తెల్లం(నవీన్ భార్య), సాగిమేటాకు చెందిన మిలీషియా కమాండర్ సన్ను ఉద్దేలుగా గుర్తించారు. -
మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి
గడ్చిరోలి : మహారాష్ట్రలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లా దానోరా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందు పాతర పేల్చారు. మందుపాతర పేలిన ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందారు. పోలీసులే లక్ష్యంగా మావోలు ఈ మందుపాతర పేల్చినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఒడిశాలో పేలిన మందుపాతర
సాలూరు(విజయనగరం), న్యూస్‌లైన్/కొరాపుట్(ఒడిశా): ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మంగళవారం మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఒడిశాలోని కొరాపుట్ జిల్లాలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 161వ బీఎస్ఎఫ్ బెటాలియన్‌కు చెందిన 18 మంది జవాన్లు మల్కన్‌గిరి నుంచి విశాఖపట్నానికి మూడు వాహనాల్లో బయలుదేరారు. ఉదయం 9.30కు కొరాపుట్-సాలూరు జాతీయ రహదారి సమీపంలోని సకిరాయి గ్రామం దగ్గరకు వాహనాలు వచ్చాయి. మొదటి వాహనం అక్కడి క ల్వర్టు దాటింది. రెండో వాహనం దాటుతుండగా కల్వర్టు కింద అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. పేలుడు ధాటికి వాహనం తునాతునకలైంది. అందులోని జవాన్లలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తర్వాత మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు ఎన్కౌంటర్లు చింతూరు, న్యూస్‌లైన్:ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. లోండిగూడ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఎస్టీఎఫ్, డీఎఫ్ బలగాలు సోమవారం సాయంత్రం సమీప అడవుల్లో కూంబింగ్ చేపడుతుండగా మర్దాపాల్ గ్రామం వద్ద మావోయిస్టులు తారసపడ్డారు. అప్పుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోలు మృతి చెందారు. -
పాక్ దుర్మార్గంపై మండిపడ్ద యువత
-
గీత దాటిన పాక్: ఐదుగురు భారత జవాన్ల హతం