ఇద్దరు వీర జవాన్లను కొండచరియల రూపంలో మృత్యువు కభళించింది. వారు కాపలాగా ఉన్న చెక్పోస్ట్పై భారీ కొండ చరియలు విరిగిపడి ఇద్దరు సైనికులు అక్కడికక్కడే చనిపోగా మరో సైనికుడి ఆచూకీ తెలియడం లేదు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని పితోర్గడ్ జిల్లాలోని సిలక్ సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. మొత్తం ఎనిమిది మంది ఈ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా వారిలో ఐదుగురు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. ఉత్తరాఖండ్లో గత రెండు రోజులుగా మంచుతో కూడిన వర్షం పడుతున్న విషయం తెలిసిందే.