avalanche
-
కేదార్‌నాథ్‌లో మంచు వరద
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ గాంధీ సరోవర్ ప్రాంతంలో ఆదివారం(జూన్30) ఉదయం మంచు వరద పోటెత్తింది. ‘కేదార్నాథ్ దామ్ వెనుకాల ఉన్న మంచుపర్వతం దగ్గర ఉదయం 5 గంటలకు మంచు వరద వచ్చింది. మంచు వరద వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు జరగలేదు. పర్వతం మీద నుంచి మంచు కిందికి వచ్చింది. ఇది కేదార్‌నాథ్‌లో అలజడికి కారణమైంది’అని రుద్రప్రయాగ్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాఖ అశోక్ తెలిపారు. కాగా, బ్రదినాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలను కలిపి చార్దామ్ యాత్రా సర్క్యూట్‌గా పిలుస్తారు. -
US: న్యూ జెర్సీలో మంచు తుఫాను బీభత్సం
న్యూజెర్సీ: అమెరికాలో దట్టమైన మంచు తుఫాను కురుస్తోంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటైన న్యూజెర్సీలో మంచు తుఫాను విశ్వరూపం చూపుతోంది. వింటర్ స్టార్మ్ కారణంగా హైవేలపై అడుగుల కొద్దీ మంచు పేరుకుపోయింది. రోడ్డపై గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోవడం వల్ల కార్లు నడవలేని పరిస్థితి ఏర్పడింది. వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై సుమారు 2 నుంచి 6 అంగుళాల మధ్య మంచు కమ్మేసినట్లు స్థానికులు చెబుతున్నారు. Winter Wonderland! ❄️#OceanCity #NewJersey #SnowDay #Beach #MancoPizza #MissingHome 📸 OffShore Drones pic.twitter.com/dUyzOhxcLT — Shannon 🎄❄️🌴✨💫 (@shanrobinson7) January 20, 2024 #snow #snowday #newjersey@News12NJ @njdotcom https://t.co/J3nQYoca35 — José Eduardo 🇵🇪👊🏼 (@JoseEdu87) January 19, 2024 న్యూజెర్సీతో పాటు దేశంలోని చాలా నగరాల్లో కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమైపోయాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం రాలేని పరిస్థితి నెలకొంది. #Driving the snowy roads of central #NewJersey tonight . Icy conditions as temps dip a real concern #takeitslow #snow #roads #fridaycommute pic.twitter.com/9HaqfXfulI — Checkey Beckford (@Checkey4NY) January 20, 2024 #Driving the snowy roads of central #NewJersey tonight . Icy conditions as temps dip a real concern #takeitslow #snow #roads #fridaycommute pic.twitter.com/9HaqfXfulI — Checkey Beckford (@Checkey4NY) January 20, 2024 #winterishere #snow #southjersey #newjersey pic.twitter.com/dVRy95fpFk — Amanda Fitzpatrick (@WatchAmandaTV) January 19, 2024 మంచు తుఫాన్ కారణంగా విమానాలు, రైళ్లు, ఇతర రవాణా సర్వీసులను రద్దు చేశారు. పలు ప్రాంతాల్లో 4 నుంచి 12 అంగుళాల మధ్య మంచు కురిసే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ తెలిపింది. భారీ మంచు తుఫాన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. ఇదీచదవండి.. జనవరి 22 రామ్ మందిర్డేగా గుర్తించిన కెనడా మునిసిపాలిటీలు -
China: చైనాను వణికిస్తున్న మంచు తుఫాన్లు
బీజింగ్ : వాయువ్య చైనాను వరుస మంచు తుఫాన్లు బెంబేలెత్తిస్తున్నాయి. డజన్ల కొద్దీ వస్తున్న మంచు తుఫాన్ల ప్రభావంతో ఈ ప్రాంతంలో తీవ్రంగా మంచు కురుస్తోంది. దీంతో ఈ ప్రాంతంలో వారం రోజుల్లో 1000 మంది దాకా మంచులో చిక్కుకుపోయారు. మంచు తుఫాన్ల దాటికి జింజ్యాంగ్ ప్రాంతంలో పలు రోడ్లు బ్లాక్ అవడంతో ఇక్కడున్న పలు గ్రామాల వారికి కనెక్టివిటీ లేకుండా పోయింది. దీంతో ఇక్కడి వారికి ఆహారం, ఇంధనం తదితర నిత్యావసరాలను హెలికాప్టర్లో సరఫరా చేస్తున్నారు. మంచులో చిక్కుకున్న వారిని కూడా హెలికాప్టర్ల సాయంతో తరలిస్తున్నారు. ఈ విషయాలను చైనా అధికారిక టీవీ సీసీటీవీ ప్రసారం చేసింది. చిక్కుకుపోయిన వారిలో కొందరు పర్యాటకులు కూడా ఉన్నారు. మంచు తుఫాన్ల దాటికి వాయువ్య చైనాలో మొత్తం 350 కిలోమీటర్ల దాకా రోడ్లుబ్లాక్ అయ్యాయి. ఇదీచదవండి.. సౌత్ కొరియా ఆక్రమణే లక్ష్యం: కిమ్ -
సిక్కింలో భారీ హిమపాతం.. ఏడుగురు పర్యాటకులు సజీవ సమాధి..
గ్యాంగ్టాక్: మంచుసోయగాలు, ప్రకృతి రమణీయతను చూసేందుకు వచ్చిన పర్యాటకులను ప్రకృతి హిమపాతం రూపంలో కబళించింది. సిక్కింలోని హిమాలయ పర్వతసానువుల్లోని లోయ మార్గం నాథూలా ప్రాంతంలో మంగళవారం సంభవించిన భారీ హిమపాతం ధాటికి ఏడుగురు పర్యాటకులు మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఒక మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నారు. 11 మంది గాయపడ్డారు. ఐదారు వాహనాలతోసహా దాదాపు 30 మంది మంచు దిబ్బల కింద చిక్కుకున్నారన్న అనుమానాలతో అక్కడ అన్వేషణ, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్యాంగ్టాక్, నాథూ లాను కలిపే జవహర్లాల్ నెహ్రూ మార్గంలోని 14వ నంబర్ మైలురాయి వద్ద ఉదయం 11.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వద్దన్నా వినకుండా.. ప్రమాదం విషయం తెలియగానే సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్ఓ) సిబ్బంది, రాష్ట్ర విపత్తు స్పందన దళం, స్థానికులు అక్కడికి చేరుకుని 23 మందిని కాపాడారు. నెహ్రూ మార్గ్‌లో ఆగిపోయిన 80 వాహనాల్లోని 350 మందికిపైగా పర్యాటకులను సురక్షితంగా వెనక్కి పంపించారు. ప్రతికూల వాతావరణం దృష్ట్యా 13వ నంబర్ మైలురాయి దాటాక సాధారణంగా పర్యాటకులకు అనుమతి ఉండదు. కానీ, పర్యాటకులు ఘటనాస్థలి దాకా తీసుకెళ్లాలని టూర్ ఆపరేటర్లు, డ్రైవర్లను బలవంతపెట్టారని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం వ్యక్తంచేశారు. చైనా సరిహద్దు సమీపంలో నాథూ లా మార్గముంది. వాణిజ్య సంబంధ రాకపోకలకు భారత్, చైనాలు వినియోగిస్తున్న మూడు సరిహద్దు పోస్ట్‌లలో నాథూ లా ఒకటి. సముద్రమట్టానికి 14,450 అడుగుల ఎత్తులోని మంచుమయమైన ఈ ప్రాంతాలను చూసేందుకు ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలిరావడం తెల్సిందే. గ్యాంగ్టాక్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతముంది. ప్రమాదం జరిగాక క్షతగాత్రులను గ్యాంగ్‌టాక్‌కు పంపించి చికిత్సనందిస్తున్నారు. చదవండి: విషాదం.. సెప్టిక్ ట్యాంకులోకి దిగి ఊపిరాడట్లేదని అరిచిన పారిశుద్ధ్య కార్మికులు.. కాసేపటికే.. -
విషాదం: ప్రపంచ ఛాంపియన్.. మంచు కింద సజీవ సమాధి
క్రీడలో విషాదం నెలకొంది. అమెరికాకు చెందిన స్కీయింగ్ స్టార్(Skieing Game), మాజీ వరల్డ్ ఛాంపియన్ కైల్ స్మెయిన్.. హిమపాతంలో కూరుకుపోయి సజీవ సమాది అవడం అందరిని కలచి వేసింది. ఆదివారం(జనవరి 29న) జపాన్‌లోని నాగానో ప్రిఫెక్చర్‌లోని 2,469 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ హకుబా నోరికురా వద్ద జరిగిన దుర్ఘటనలో స్మెయిన్ (31) సహా వేరే గ్రూపుకు చెందిన ఆస్ట్రియన్ స్కీయర్ కూడా మరణించినట్లు ది గార్డియన్ పత్రిక వెల్లడించింది. కాగా మార్కెటింగ్ ఫిల్మ్ షూటింగ్ కోసం మౌంట్ హకుబా నోరికురాకు వెళ్లినట్లు మౌంటెన్గెజిట్ ఫోటోగ్రాఫర్ గ్రాంట్ గండర్సన్ తెలిపాడు. షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో హిమపాతం స్మెయిన్ సహా ఆస్ట్రియా స్కీయర్ను భూమిలోకి కూరుకుపోయేలా చేసింది. వారి కోసం గాలింపు చేపట్టినప్పటికి లాభం లేకుండా పోయింది. ఈ సందర్భంగా గ్రాంట్ గండర్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్మెయిన్ ఫోటో షేర్ చేస్తూ.. ''ఇది నిజంగా పీడకల అయ్యుంటే బాగుండేది'' అని విచారం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Kyle Smaine (@kylesmaine) అయితే స్మెయిన్ చనిపోవడానికి ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ''పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికి స్కీయింగ్‌పై తనకున్న అభిమానం ఎంత కష్టమున్నా లెక్కచేయనివ్వదు. కష్టంలోనే మన సక్సెస్ ఏంటో తెలుస్తుంది'' అని చెప్పుకొచ్చాడు. కాగా 1991, జూన్ 27న అమెరికాలో జన్మించిన కైల్ స్మెయిన్ చిన్నప్పటి నుంచే కొండలు, గుట్టలపై క్లైంబింగ్ చేయడం హాబీగా మార్చుకున్నాడు. అలా స్కీయర్‌గా మారిన స్మెయిన్ 2015లో ఎఫ్ఐఎస్ ఆల్పైన్ వరల్డ్ స్కై చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2018 ఒలింపిక్స్‌లో స్కీయింగ్‌లో పాల్గొన్న తొలి అమెరికన్ అథ్లెట్‌గా కైల్ స్మెయిన్ నిలిచాడు. -
‘బాంబ్’ కోరల నుంచి బయటపడని అమెరికా.. కనీవినీ ఎరగని విధ్వంసం
బఫెలో: ఈ శతాబ్దంలోకెల్లా అత్యంత తీవ్రమైన మంచు తుపాన్ (Bomb Cyclone) కోరల నుంచి అమెరికా ఇంకా బయట పడలేదు. గత వారం రోజులతో పోలిస్తే హిమపాతం కాస్త తగ్గినా దేశవ్యాప్తంగా అతి శీతల వాతావరణం కొనసాగుతోంది. రోడ్లపై దట్టంగా పేరుకున్న మంచును తొలగించడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడం వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. దాంతో తుఫాన్ విధ్వంసం తాలూకు తీవ్రత క్రమంగా వెలుగులోకి వస్తోంది. మంచులో కూరుకుపోయిన కార్లలో నిస్సహాయంగా మరణించిన వారి శవాలు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. మంచు తుఫాన్ ధాటికి కనీసం 100 మందికి పైగా మృత్యువాత పడ్డట్టు భావిస్తున్నారు. దీన్ని తరానికి ఒక్కసారి మాత్రమే సంభవించే మహోత్పాతంగా వాతావరణ శాఖ అభివర్ణిస్తోంది. మెరుగవని రవాణా వ్యవస్థ దేశవ్యాప్తంగా వారం రోజులుగా దాదాపుగా స్తంభించిపోయిన రవాణా వ్యవస్థ ఇంకా కుదురుకోలేదు. మంగళవారం కూడా 6,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. బుధవారం బయల్దేరాల్సిన 3,500 పై చిలుకు విమానాలను ముందస్తుగానే రద్దు చేశారు. దాంతో విమానాశ్రయాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. చిక్కుబడిపోయిన ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బయటికెళ్లే పరిస్థితి లేక ప్రయాణికులంతా టెర్మినల్స్‌లోనే కాలం గడుపుతున్నారు. డిసెంబర్ 22 నుంచి రద్దయిన విమానాల సంఖ్య 25 వేలు దాటింది. సకాలంలో సేవలను పునరుద్ధరించడంలో సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ వైఫల్యం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది. సంస్థకు చెందిన వేలాది విమాన సర్వీసులు వరుసగా ఆరో రోజూ రద్దవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఆగ్రహించారు. ఎయిర్‌లైన్స్ నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయాలని ప్రయాణికులకు సూచించారు! కానీ పరిస్థితి చక్కబడేందుకు కనీసం ఇంకో వారం పట్టొచ్చని సౌత్‌వెస్ట్ ప్రకటించింది. యథేచ్ఛగా లూటీలు రవాణా వ్యవస్థ స్తంభించడంతో అమెరికాలో చాలా ప్రాంతాల్లో నిత్యావసరాలు తదితరాల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దాంతో చాలా రాష్ట్రాల్లో ఆకలి కేకలు విన్పిస్తున్నాయి. బయటికెళ్లే పరిస్థితి లేక జనం రోజుల తరబడి ఇళ్లకే పరిమితం కావడంతో ఆహార పదార్థాలు నిండుకున్నాయి. నాలుగైదు రోజులుగా దుకాణాలూ తెరిచుకోక సమస్య మరింతగా విషమించింది. ఫలితంగా మొన్నటిదాకా బఫెలో నగరంలోనే వెలుగు చూసిన లూటీ ఉదంతాలు ఇప్పుడు పలు రాష్ట్రాల్లోనూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిత్యావసరాల కోసం దుకాణాల్లోకి చొరబడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న లక్షలాది మంది తెలుగువాళ్లు కూడా నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కెనడాలోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువ నమోదవున్నాయి! వరద ముప్పు క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అమెరికా ఇప్పుడు వరద ముప్పును ఎదుర్కొంటోంది. మంచు శరవేగంగా కరగడం వల్ల ఊహాతీత వేగంతో ఆకస్మిక వరదలు ముంచెత్తవచ్చని పలు రాష్ట్రాలను వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. పూర్తిగా మంచులో కూరుకుపోయిన బఫెలో వంటి ప్రాంతాలకు ఈ ప్రమాదం ఎక్కువగా ఉందని పేర్కొంది. బఫెలో.. దయనీయం! పశ్చిమ న్యూయార్క్‌లోని బఫెలో నగరంలో ఇంకా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. చాలాచోట్ల ఇంకా 8 అడుగుల ఎత్తున మంచు పేరుకుపోయింది. దాంతో అవసరాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు అత్యవసర సర్వీసులు కూడా సకాలంలో చేరుకోలేని పరిస్థితి! నగరంలోకి వెళ్తుంటే యుద్ధరంగంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఉందని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచల్ వాపోయారు. నగరం, పరిసరాల్లో రోడ్డు ప్రయాణాలపై నిషేధం ఇంకా అమల్లోనే ఉంది. దాని అమలుకు మిలిటరీ పోలీసులు రంగంలోకి దిగారు. పొరుగు రాష్ట్రం న్యూజెర్సీ నుంచి ఎమర్జెన్సీ సేవల సిబ్బంది న్యూయార్క్‌కు తరలుతున్నారు. చాలామంది కార్లలోనే చిక్కుకుపోయి ఉన్నారు. 30కి పైగా మృతదేహలను వెలికితీసినట్టు చెబుతున్నారు. ఇంతటి ప్రతికూల వాతావరణాన్ని తమ సర్వీసులోనే ఎన్నడూ చూడలేదని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యల్లో భాగంగా సిబ్బంది ఇంటింటికీ తిరుగుతున్నారు. చావు అంచుల దాకా వెళ్లాం మంచు తుఫాను బారిన పడి అదృష్టవశాత్తూ బతికి బయటపడ్డవాళ్లు తామెదుర్కొన్న కష్టాలను కథలుగా చెబుతున్నారు. మేరీలాండ్కు చెందిన డిట్జక్ ఇలుంగా అనే వ్యక్తి తన ఆరు, పదహారేళ్ల కూతుళ్లతో కలిసి కార్లో హామిల్టన్ వెళ్తూ బఫెలో వద్ద తుఫానులో చిక్కాడు. చూస్తుండగానే కారు చుట్టూ మంచు పేరుకుపోవడంతో గంటల తరబడి కారు ఇంజన్ ఆన్‌లో ఉంచి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ‘‘చివరికి ప్రాణాలకు తెగించాం. ధైర్యం చేసి కష్టమ్మీద కారు దిగాం. చిన్న కూతుర్ని వీపున వేసుకుని, పెద్దమ్మాయీ నేనూ భయానక వాతావరణంలో అతికష్టమ్మీద షెల్టర్ హోమ్ దాకా వెళ్లాం. లోపలికి అడుగు పెడుతూ నేనూ నా పిల్లలూ ఒక్కసారిగా ఏడ్చేశాం. ఇంతటి భయానక అనుభవం జీవితంలో ఎన్నడూ ఎదుర్కోలేదు. ఒక్క అడుగూ వేయడానికి ప్రాణాలన్నీ కూడదీసుకోవాల్సి వచ్చింది. కానీ సాహసం చేయకపోతే కార్లోనే నిస్సహాయంగా మరణించేవాళ్లం’’ అంటూ డిట్జక్ గుర్తు చేసుకున్నాడు. -
ఉత్తర కాశీ దుర్ఘటన.. 27కు చేరిన మృతులు
ఉత్తర కాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో మంచుచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 27కు చేరింది. ఘటనాస్థలిలో ఆరు రోజులుగా గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగిస్తున్న సిబ్బంది ఆదివారం మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ఈ నెల 4వ తేదీన 17 వేల అడుగుల ఎత్తులో మంచుచరియలు పడి విషాదం చోటు చేసుకుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెయినీరింగ్(ఎన్ఐఎం)లో శిక్షణ పొందుతున్న 27 మంది, ఇద్దరు ఇన్స్ట్రక్టర్లు ‘ద్రౌపదీ కా దండా–2’ శిఖరం నుంచి వెనుదిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు 21 మృతదేహాలను గుర్తించి, సంబంధీకులకు అధికారులు అందజేశారు. మరో ఇద్దరు ట్రైనీల జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎన్ఐఎం పేర్కొంది. ఇదీ చదవండి: Bharat Jodo Yatra: యాత్ర తర్వాత కొత్త రాహుల్‌ను చూస్తారు -
కేదార్నాథ్ ఆలయాన్ని చుట్టుముట్టిన భారీ హిమపాతం: వీడియో వైరల్
ఉత్తరాఖండ్‌లోని పవిత్రక్షేత్రమైన కేదార్నాథ్ ఆలయం చుట్టూతా ఉన్న పర్వతాలపై భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటన ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోరాబరి గ్లేసియర్ పరీవాహక ప్రాంతంలో చోటు చేసుకుంది. దీనివల్ల రుద్రప్రయాగ్‌లో ఎలాంటి నష్టం జరగలేదని, ఈ తాము ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రుద్రప్రయాగ్‌లోని జాతీయ రహదారిని బ్లాక్ చేసిన కొద్ది క్షణాల ముందే ఈ హిమపాతం సంభవించడం గమనార్హం. ఈ హిమపాతం కారణంగా కొండచరియలు విరిగిపడి తర్సాలి గ్రామ సమీపంలోకి దొర్లిపడ్డాయి. వాస్తవానికి ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అలాగే వాతావరణ శాఖ రానున్న రెండు రోజుల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అంతేగాక మధ్య ఉష్ణమండల పశ్చిమాలలో ఒక ద్రోణి ఏర్పడిందని, ఇది పశ్చిమంగా కదలడంతో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొంది. ఆ తదనంతరం ఈ ద్రోణి వాయువ్య భారతదేశం వైపుగా కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న రోజుల్లో మధ్యప్రదేశ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అస్సాం, మేఘాలయాల్లో కూడా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #Avalanche in #Kedarnath #flood pic.twitter.com/sAgLU3TTJn — Amit Shukla (@amitshuklazee) September 23, 2022 (చదవండి: ఏరులై పారుతున్న రహదారులు..ఎల్లో అలర్ట్ చేసిన వాతావరణ శాఖ) -
మంచు పర్వత అధిరోహణ.. దూసుకొచ్చిన హిమపాతం!
ఇంతవరకు ఎముకలు కొరికే మంచు కొండల్లో విహరించడం, విచిత్రమైన స్టంట్లు చేయడం చూశాం. గడ్డకట్టే చలిని సైతం లెక్కచేయకుండా ట్రెక్కింగ్ వెళ్లిన వాళ్ల గురించి విన్నాం. అయితే ఇక్కడొక వ్యక్తి ఏకంగా మంచు పర్వతాన్ని అధిరోహించాలనుకున్నాడు. కానీ ఒక్కసారిగా హిమపాతం బారిన పడ్డాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసా!. అసలు విషయంలోకెళ్తే... యూఎస్‌కి చెందిన లేలాండ్ నిస్కీ మంచుతో నిండిన కొలరాడో పర్వతాన్ని అధిరోహిస్తున్నాడు. అయితే ఒక్కసారిగా భారీ హిమ పాతం వచ్చింది. ఆ హిమపాతం తన ఉద్ధృతిని పెంచుతూనే ఉంది. ఏ మాత్రం అతను పట్టు వదిలిన అంతే సంగతులు. ఎందుకంటే అతను భూమి నుండి సుమారు 400 అడుగుల ఎత్తులో ఉండగా హిమపాతం బారిన పడ్డాడు. కానీ అతను తన ధైర్యాన్ని ఏ మాత్రం కోల్పోకుండా బలంగా తన పట్టును కోల్పోకుండా గట్టిగా తన సాధనాలతో తవ్వి పట్టుకున్నాడు. ఆ హిమపాతం తగ్గే వరకు అలాగే గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అయితే అతను చివరికి సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వెన్నులో వణుకు పుట్టించే ఈ భయంకరమైన వీడియోని మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Leland Nisky (@nemonisky) (చదవండి: ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం.. అదే శాపమయింది..!) -
బాప్రే!.. ఎంత పెద్ద భయానక దృశ్యం!
న్యూఢిల్లీ: కొన్ని ప్రకృతి వైపరిత్యాలు అత్యంత భయానకంగా ఉంటాయి. పైగా వాటిని మళ్లీ చూడాలనే సాహాసం కూడా చేయలేనంత భయం వేస్తుంది. అచ్చం అలాంటి భయానక ప్రకృతి వైపరిత్యం నేపాల్‌లో సంభవించింది. (చదవండి: ప్రాణాలకోసం మూగ జీవీ పాకులాట.. మనసును కదిలించేలా..) అసలు విషయంలోకెళ్లితే... నేపాల్‌లోని ముస్తాంగ్ జిల్లాలో మంచుతో కప్పబడిన పర్వతాలు చూపురులను ఆకర్షించేలా ఎంతో ప్రశాంతంగ కనిపిస్తుంది. అంతే ఇంతలో ఒక్కసారిగా అతి పెద్ద హిమపాతం సంభవిస్తుంది. దీంతో అక్కడున్నవారందరూ భయంతో అరుస్తూ పరుగులు పెడుతుంటారు. అంతే అప్పటివరకు ఎంతో అందంగా కనిపించిన ప్రాంతం కాస్త ఒక్కసారిగా భయంకరంగా మారిపోతుంది. ఒక వైపు నుంచి వేగవంతంగా మంచు అక్కడున్న ప్రజలను తరుముతున్నట్లుగా తెల్లటి బిళ్ల వలే చుట్టుముట్టేస్తుంటుంది. అయితే ఈ ఘటనలో ఏడుగురు విద్యార్థులతో సహా 11 మంది గాయపడ్డారని, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ముస్తాంగ్ చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ వెల్లడించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఎంత భయానక దృశ్యం అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: మదురై జైలులో రూ.100 కోట్లు హాంఫట్) View this post on Instagram A post shared by Everest Base camp 2022 (@mountain.trekking) -
ఉత్తరాఖండ్ ముంగిట మరో ముప్పు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో హిమానీనదం కారణంగా వరదలు ముంచెత్తినపుడు రిషిగంగ నదీ ప్రవాహమార్గంలో అత్యంత ప్రమాదకరమైన భారీ సరస్సు ఏర్పడిందని ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా వెల్లడైంది. నదీ ప్రవాహ మార్గంలో భారీగా రాళ్లు, మట్టి పడడంతో ప్రవాహం పాక్షికంగా ఆగి కృత్రిమంగా ఓ సరస్సు తయారైంది. ఈ సరస్సుతో మళ్లీ ముప్పు రాకుండా ఉండడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఒ), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) సంయుక్తంగా ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టుగా ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎస్ఎన్ ప్రధాన్ ఎన్డీటీవీతో చెప్పారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా గుర్తించిన ప్రాంతంలో సరస్సు ఎలా ఉంది, ఎంత ఉధృతంగా ప్రవహిస్తోందో తెలుసుకోవడం కోసం ఇప్పటికే కొన్ని బృందాలు హెలికాప్టర్ల ద్వారా పరిస్థితిని సమీక్షించాయి. డ్రోన్లు, మానవ రహిత విమానాల్ని కూడా ఆ ప్రాంతానికి పంపించి అవి తీసిన చిత్రాలు, వీడియోలను పరిశీలిస్తున్నట్టుగా ప్రధాన్ వెల్లడించారు. ఆ సరస్సు మహోగ్రరూపం దాల్చకుండా నిరోధించేలా డీఆర్డీఓ, ఎన్డీఆర్ఎఫ్లు సంయుక్తంగా పని చేస్తున్నాయి. మరోవైపు ఈ సరస్సు వల్ల కలిగే ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ చెప్పారు. ‘‘ఇప్పుడు మనం ఆందోళన పడకూడదు. అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే కొన్ని బృందాలు ఆ సరస్సు గురించి తెలుసుకునే పనిలో ఉన్నాయి’’అని రావత్ చెప్పారు. ఫుట్‌బాల్ స్టేడియం కంటే మూడింతలు పెద్దది డ్రోన్లు, ఇతర విమానాలు తీసిన చిత్రాల్లో సరస్సు చాలా పెద్దదిగా కనిపిస్తోంది. ఫుట్‌బాల్ గ్రౌండ్ కంటే మూడు రెట్లు పొడవున సరస్సు ప్రవహిస్తోంది. 350 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తు, 10 డిగ్రీల లోతు ఉన్న ఈ సరస్సు నుంచి మంచు పెళ్లలు, బురద, రాళ్లతో కూడిన నీళ్లు రిషిగంగ నదిలోకి ప్రవహించి రెండు విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేశాయి. ఆ సమయంలో ఏర్పడిన కృత్రిమ సరస్సుని మట్టి పెళ్లలు, రాళ్లతో కూడిన శిథిలాలు అడ్డుగోడగా ఉన్నాయి. అయితే బుధవారం నాడు తీసిన శాటిలైట్ చిత్రాల్లో సరస్సు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ అడ్డుగోడని ఛేదించుకొని సరస్సు ప్రవహిస్తే ఏ స్థాయిలో ముప్పు జరుగుతుందో ఎవరి అంచనాకి అందడం లేదు. ఆ సరస్సు చాలా ప్రమాదకరంగా మారుతోందని శాటిలైట్ చిత్రాలను పరిశీలించిన ఘర్వాల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వైపీ సండ్రియల్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘నేను రిషిగంగ నదికి ఈశాన్యంవైపు ఉన్నాను. ఆ పై నుంచే నీటి ప్రవాహం ముంచుకొస్తోంది. ప్రస్తుతానికి రాళ్లు ఒక గోడలా అడ్డుగా ఉండడం ఊరట కలిగించే అంశం. కానీ ఏ క్షణంలోనైనా అది కొట్టుకుపోతే చాలా ప్రమాదం. సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది’’అని చెప్పారు. 38కి చేరుకున్న మృతుల సంఖ్య ఉత్తరాఖండ్‌లోని తపోవన్ సొరంగ మార్గం దగ్గర వరుసగా ఆరో రోజు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. లోపల చిక్కుకున్న 30–35 మందిని కాపాడడానికి సహాయ సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు. సొరంగానికి అడ్డంగా కొట్టుకొచ్చిన రాళ్లను డ్రిల్లింగ్ చేయడం, బురదని తోడడం వంటి పనులు ఏక కాలంలో నిర్వహిస్తున్నట్టుగా ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. వీలైనంత ఎక్కువ మంది ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా తాము ముందుకు వెళుతున్నామని తెలిపారు. మరోవైపు శుక్రవారం నాడు మరో రెండు మృతదేహాలు లభ్యమవడంతో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. మరో 166 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. రిషిగంగ హైడల్ ప్రాజెక్టు దగ్గర ఒక మృతదేహం లభిస్తే, మైథన ప్రాంతంలో మరొకటి గుర్తించినట్టుగా సహాయ బృందాలు తెలిపాయి. సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల కుటుంబాల ఆవేదనకు అంతే లేదు. లోపల వాళ్లు ఏ స్థితిలో ఉన్నారో ఊహించుకోవడానికే వారు భయపడుతున్నారు. ఎన్టీపీసీ ప్రాజెక్టు తమ ప్రాంతానికి ఒక శాపంగా మారిందని స్థానికులు అంటున్నారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్న ప్రాంతానికి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్టీపీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తపోవన్ గ్రామ సభకు చెందిన మహిళలు అత్యధికులు వచ్చి తమ నిరసన తెలిపారు. మొదట మా పొలాలను పోగొట్టుకున్నాం, ఇప్పుడు మా ప్రియమైన వారినే పోగొట్టుకున్నామంటూ కన్నీరు మున్నీరవుతున్నారు. -
సిక్కింలో హిమపాతం.. జవాను గల్లంతు
న్యూఢిల్లీ: సిక్కింలో దారుణం జరిగింది. విధి నిర్వహణలో ఉన్న భారత సైనిక బృందంపై పెద్ద ఎత్తున మంచు చరియలు విరిగిపడ్డాయి. వివరాలు.. ఉత్తర సిక్కిం ప్రాంతంలోని లుగ్నాక్ లాలో సుమారు 17 నుంచి 18 మంది సైనికులు పెట్రోలింగ్-కమ్-స్నో క్లియరెన్స్ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి మంచు చరియలు ఈ బృందంపై విరుచుకు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఒక సైనికుడిని మినహా మిగతా వారందరిని రక్షించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గల్లైంతన సైనికుడి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుందన్నారు. మిగతా జవాన్లంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
అంత దగ్గరనుంచి తీస్తే పోతారు
సిమ్లా: తరుముకొస్తున్న హిమపాతం నుంచి పర్యాటకులు తప్పించుకున్న ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కిన్నౌర్ జిల్లాలోని టింకు నల్లా ప్రాంతంలో మంచు కొండలను చూడటానికి పర్యాటకులు వెళ్లారు. ఆ సమయంలో హిమపాతం కదులుతూ వీరు వెళుతున్న రోడ్డుపై ప్రవేశించింది. అయితే కొంతమంది పర్యాటకులు దీన్ని లెక్క చేయకుండా ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించేందుకు ప్రయత్నించారు. అయితే హిమపాతం వారిని వెంటాడుతున్నట్టుగా రోడ్డుపై మరింత ముందుకు వస్తూనే ఉంది. దీంతో ఓ పర్యాటకుడు ‘వెనక్కి వెళ్లిపొమ్మని ఇతరులకు సూచించాడు. కొంతమంది భయంతో వెనక్కి వెళ్లి తమ కార్లలో ఎక్కి కూర్చున్నారు. కానీ కొందరు మాత్రం కదులుతున్న మంచు కొండను వీడియో తీస్తూనే పరుగెత్తుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను నవీద్ ట్రుంబో అనే అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. మంచు ముద్ద.. వెంటాడుతున్న యముడిలా రోడ్డు మీదకు రావటాన్ని చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఇక పర్యాటకులు కొంచెం కూడా జాగ్రత్తపడకుండా దాన్ని దగ్గర నుంచి వీడియో తీయడాన్ని పలువురు తప్పుపట్టారు. ‘అంత దగ్గర నుంచి తీస్తే పోతారు’ అంటూ ఓ నెటిజన్ టూరిస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘హిమపాతం భారీ పరిమాణంలో ఉండి చాలా నెమ్మదిగా కదులుతుంది. మరి అది నిజంగానే హిమపాతమేనా?’ అని ఓ నెటిజన్ అనుమానం వ్యక్తం చేయగా ‘హిమపాతంలో అది ఓ భాగం అయ్యుండొచ్చ’ని మరో నెటిజన్ సమాధానమిచ్చాడు. -
అంతులేని విషాదంగా మారిన వీడియో
డెహ్రాడూన్: నందాదేవి పర్వతారోహణకు వెళ్లి మృత్యు ఒడికి చేరుకున్నవారి చివరి వీడియోను ఇండో టిబెటన్ పోలీసులు మంగళవారం విడుదల చేశారు. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో చివరికి విషాదంగా మారింది. సాయంత్రం సూర్యుడు మంచును ముద్దాడుతున్నట్టుగా మనోహరంగా కనిపించే దృశ్యంతో ప్రారంభమవుతుందీ వీడియో. ఇందులో ఎనిమిది మంది సభ్యులు మంచుతో కప్పబడ్డ పర్వతంపై శిఖరాన్ని అధిరోహించడానికి తాడు సహాయంతో ఒకరివెంట ఒకరు నడుస్తున్నారు. చివరిగా నడుస్తున్న వ్యక్తి ఈ వీడియోను చిత్రీకరిస్తున్నాడు. ఇంతలో పెద్ద శబ్దం వినిపించడంతో వీడియో ఆగిపోతుంది. ఈ శబ్దాన్ని హిమపాతం లేదా మంచు తుపానుగా అధికారులు అంచనా వేస్తున్నారు. హిమపాతం వల్లే వారందరూ చనిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. హిమాలయ శ్రేణుల్లో అత్యంత కష్టతరమైన పర్వతాల్లో ఒకటైన నందాదేవి శిఖరాన్ని అధిరోహించటానికి ఎనిమిది మంది సభ్యులు పూనుకున్నారు. వీరిలో ఏడుగురు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌కు చెందిన వారు కాగా మరొకరు ఇండియన్ మౌంటనీరింగ్ ఫౌండేషన్ అధికారి. ఉత్తరాఖండ్‌లోని పితోరాఘర్ జిల్లాలో మే 13న మున్సారీ నుంచి పర్వతారోహకుల బృందం బయలుదేరింది. మే 25 నుంచి ఈ బృందం కనిపించకుండా పోయింది. వారిని గుర్తించటం కోసం పర్వత యుద్ధాలకు శిక్షణ పొందిన డేర్‌డెవిల్స్ బృందం ఆపరేషన్ చేపట్టింది. దీనికోసం 500 గంటలు అంటే సుమారు 15 రోజులు శ్రమించి జూలై 3న భూమికి 19 వేల అడుగుల ఎత్తులో మృతదేహాలను వెలికి తీశారు. హెలికాప్టర్ల ద్వారా మృతదేహాలను పితోరాఘర్‌కు తరలించారు. మృతదేహాలు లభ్యమైన ప్రదేశంలో ఒక కెమెరా కూడా లభించింది. ఇందులోని వీడియోను ఇండో టిబెటన్ పోలీసులు వారి ప్రధాన కార్యాలయంలో విడుదల చేశారు. Last visuals of the mountaineers' team near the summit on unnamed peak near the #NandaDevi east. ITBP search team of mountaineers found the memory video device at 19K ft while they were searching the area where bodies were spotted. pic.twitter.com/0BI87MEA8Y — ITBP (@ITBP_official) July 8, 2019 -
ఊహించని ప్రమాదం.. ఉత్త చేతులతో కాపాడారు
కాలిఫోర్నియా : ఉవ్వెత్తున్న ముంచుకోచ్చిన హిమపాతంతో అక్కడంతా గందరగోళంగా మారింది. స్నోబోర్డింగ్ కోసం వెళ్లిన ఐదుగురు చెల్లాచెదురు అయిపోయారు. వారిని చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు హాహాకారాలు చేయసాగారు. అంత సురక్షితంగా ఉన్నారనుకున్న క్రమంలో ఓ మహిళ తన భర్త కనిపించటం లేదంటూ బిగ్గరగా అరిచింది. రక్షణ సిబ్బందితోపాటు ప్రేక్షకులు కూడా రంగంలోకి దిగి అతన్ని వెతకటం ప్రారంభించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత మంచు పొరల్లో కూరుకుపోయిన అతన్ని గుర్తించారు. గడ్డ కట్టిన మంచును ఉత్త చేతులతో తవ్వి అతని ప్రాణాలు కాపాడారు. వెంటనే ఆస్ప్రతికి తరలించగా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. కాలిఫోర్నియా, నెవాడా మధ్యలో ఉన్న స్క్వా వ్యాలీలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. తన పుట్టినరోజు జరుపుకునేందుకు భార్యతోసహా వచ్చిన వ్యక్తికి ఈ అనుభవం ఎదురైంది. స్థానికుల చొరవతో అతను ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. మంచు కప్పేయటంతో ఆ రిసార్ట్‌ను తాత్కాలికంగా మూసేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. -
ఊహించని ప్రమాదం.. ఉత్త చేతులతో కాపాడారు
-
వాహనంపై పడిన భారీ మంచుకొండ
సాక్షి, కశ్మీర్ : జమ్ముకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భారీ మంచుకొండచరియలు విరిగిపడటంతో ఎనిమిదిమంది గల్లంతయ్యారు. కుప్వారా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో పడిన వారంతా కుప్వారా నుంచి కర్ణా ప్రాంతానికి వెళుతున్నారు. వారు తమ వాహనంలో వెళుతుండగా సరిగ్గా సాధనటాప్ అనే ప్రాంతంలోని తంగ్దార్ వద్ద సాయంత్రం 4గంటల ప్రాంతంలో ఓ భారీ మంచుకొండ విరిగి వారి వాహనంపై పడింది. దాంతో దాదాపు ఎనిమిదిమంది మంచుదిబ్బల కింద పడిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, ఆర్మీ, పర్వత ప్రాంతాల్లో భద్రతను చూసేవారు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. సరిహద్దు రహదారుల విభాగంలో పనిచేసే ఓ అధికారి కూడా ఈ ప్రమాదంలో కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. -
కశ్మీర్లో మళ్లీ విషాదం
జమ్ము: జమ్ము కశ్మీర్లో మరోసారి విషాదం చోటు చేసుకుంది. కశ్మీర్లో లడక్ ప్రాంతంలోని బాటలిక్ సెక్టార్లో మంచు తుఫాన్ రావడంతో ఇద్దరు సైనికులు మరణించగా, మరో సైనికుడి ఆచూకీ తెలియడం లేదని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. బాటలిక్ సెక్టార్లో మంచు చరియలు విరిగిపడటంతో ఓ సైనిక శిబిరం ధ్వంసమైంది. ఐదుగురు సైనికులు మంచు తుఫానులో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఆపరేషన్ ప్రారంభించి ఇద్దరిని ప్రాణాలతో రక్షించారు. కాగా ఈ శిబిరంలో ఉన్న మరో ఇద్దరు సైనికులు మరణించగా, మరో సైనికుడి ఆచూకీ ఇప్పటికీ లభించడం లేదు. జమ్ముకశ్మీర్‌లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీనగర్‌లో 83.9 మిల్లీ మీటర్లు, కొకెర్నాగ్లో 69.9 మి.మీ, పహల్గాంలో 64.2 మి.మీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక్కడ ఎడతెరిపి లేకుండా మంచు కురుస్తోంది. గత జనవరిలో కశ్మీర్లో మంచు తుఫాన్ రావడంతో మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఓ మేజర్ సహా 20 మంది సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. -
పర్వతారోహణకు వెళ్లి ప్రాణాపాయ స్థితిలో..
-
పదిమంది జవాన్లను మింగిన మంచు
శ్రీనగర్ : 68వ గణతంత్రదినోత్స వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న సమయంలోనే దేశ ప్రజలకు ఓ విషాద వార్త తెలిసింది. గుర్జు సెక్టర్లో రెండు వేర్వేరు చోట్ల మంచు తుఫానులో చిక్కుకొని పదిమంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు వెల్లడించారు. మంచులో ఇరుక్కున్న మరో ఏడుగురు ఆర్మీ అధికారులు రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో నలుగురు జవాన్ల ఆచూకీ లభించాల్సి ఉంది. -
హోటల్‌పై భారీ కొండచరియ.. 30మంది బలి
రోమ్: ఇటలీలో ప్రకృతి ప్రకోపానికి 30మంది బలైనట్లు తెలుస్తోంది. ఓ పర్వతం పక్కనే ఉన్న హోటల్‌పై ఓ భారీ కొండచరియ విరిగి పడటంతో వారంతా మృత్యువాత పడినట్లు సమాచారం. అంతకుముందు రోజు ఏర్పడిన భూకంపాలే ఈ దుర్ఘటనకు కారణమని తెలుస్తోంది. ఇటలీ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం నాలుగుసార్లు శక్తిమంతమైన ప్రకంపనలు వచ్చాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్ని ఈ భూప్రకంపనల కారణంగా కొన్ని క్షణాలపాటు వణికిపోయాయి. అదే సమయంలో గ్రాన్ సాసో పర్వతం పక్కనే రిగోపియానో అనే హోటల్‌పై దాదాపు రెండు మీటర్ల వెడల్పు, ఆరు అడుగుల ఎత్తుతో ఓ భారీ మంచుకొండచరియ విరిగి పడింది. దీంతో అందులో పనిచేసే సిబ్బంది, అతిథులు, ఇతరులు మొత్తం 30మంది వరకు దీనికింద పడి నలిగిపోయారు. ఇంకా ఎక్కువమందే చనిపోయి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే ఆ పర్వతాల్లో గస్తీ కాసే పోలీసులు వెంటనే హెలికాప్టర్ ద్వారా అక్కడి చేరుకుని మృతదేహాలను వెలికి తీయడంతోపాటు గాయపడిన వారిని రక్షించే చర్యలు ప్రారంభించారు. ఆ మంచుకొండ దెబ్బకి ఆ హోటల్ పది మీటర్ల ముందుకు కదిలిందట. -
సియాచిన్‌లో మంచుతుపాను, జవాన్ అదృశ్యం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడిన ఘటనలో ఓ జవాను అదృశ్యమయ్యారు. టర్టుక్ సెక్టార్‌లోని మంచు కొండలు విరగడంతో అక్కడ గస్తీలో ఉన్న ఆర్మీ పెట్రోల్ పార్టీ జవాను శుక్రవారం ఉదయం గల్లంతయ్యాడు. ఈ ఘటనలో అదృశ్యమైన జవాను కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా మరో సైనికుడు గాయపడినట్లు సమాచారం. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల సియాచిన్‌లో మంచు చరియలు విరిగిపడి ఓ అధికారి సహా పది ది సైనికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆకస్మికంగా మంచు చరియలు విరిగిపడటంతో మరోవైపు అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఏటవాలు ప్రాంతాలకు రాకుండా ప్రజలను అప్రమత్తం చేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి చేరేదాకా ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు సూచించారు. జమ్మూ కాశ్మీర్ కుప్వారా, బారాముల్లా, బందీపూర్, కార్గిల్, గందర్బల్ జిల్లాల్లో ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. -
కార్గిల్ సెక్టార్లో జవాను మిస్సింగ్
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఏర్పడిన స్వల్ప ప్రకంపనల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒక జవాను కనిపించకుండా పోయాడు. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది ఒక జవానును మాత్రం రక్షించగలిగారు. కానీ, రెండో సైనికుడి జాడ మాత్రం తెలియడం లేదు. రెండు రోజుల కిందట కార్గిల్ సెక్టార్ లో ఏర్పడిన స్వల్ప ప్రకంపనల కారణంగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. -
సియాచిన్‌లో మరో జవాను మృతదేహం లభ్యం
న్యూఢిల్లీ: సియాచిన్‌లో మరో జవాను మృతదేహం లభ్యమైంది. హనుమంతప్పను గుర్తించిన చోటే ముస్తాన్ మహ్మద్ అనే వ్యక్తి మృతదేహం లభించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ముస్తాన్ అహ్మద్‌ది కర్నూలు జిల్లా అని అధికారులు చెప్పారు. సియాచిన్‌లో మంచుకొండచరియలు విరిగిపడి పదిమంది జవాన్లు వాటికింద పడిపోయిన విషయం తెలిసిందే. వారిలో, హనుమంతప్ప అనే జవాను కొన ప్రాణాలతో బయటపడినా చివరకు ప్రాణాలుకోల్పోయాడు. ఆ తర్వాత తొమ్మిది మృతదేహాలు ఆచూకీ లభ్యం కాలేదు. కానీ, గురువారం జవాను ముస్తాన్ మహ్మద్ మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు చెప్పారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన మృతదేహాన్ని స్వస్థలం తరలించేందుకు ఆలస్యమయ్యే అవకాశముందని ఆర్మీ అధికారులు తెలిపారు. -
ప్రమాదంలో 10 మంది సైనికులు
లడఖ్: లడఖ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. భారీ కొండచరియలు విరిగిపడి దానికింద సైనికులు చిక్కుకున్నారు. దాదాపు పదిమంది సైనికులు కొండచరియల శిథిలాల కింద ఇరుక్కుపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సియాచిన్ గ్లేసియర్ వద్ద ఈ ఘటన సంభవించింది. శిథిలాల కింద ఇరుక్కున్న సైనికులను రక్షించేందుకు ఇండియన్ ఆర్మీ, వాయుసేన రంగంలోకి దిగాయి. సముద్రమట్టానికి 19 వేల అడుగుల ఎత్తున ఈ ఘటన సంభవించిన ప్రాంతం ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.