![ప్రమాదంలో 10 మంది సైనికులు](/styles/webp/s3/article_images/2017/09/3/51454495841_625x300.jpg.webp?itok=Kpr-gVym)
ప్రమాదంలో 10 మంది సైనికులు
లడఖ్: లడఖ్లో ప్రమాదం చోటుచేసుకుంది. భారీ కొండచరియలు విరిగిపడి దానికింద సైనికులు చిక్కుకున్నారు. దాదాపు పదిమంది సైనికులు కొండచరియల శిథిలాల కింద ఇరుక్కుపోయినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
సియాచిన్ గ్లేసియర్ వద్ద ఈ ఘటన సంభవించింది. శిథిలాల కింద ఇరుక్కున్న సైనికులను రక్షించేందుకు ఇండియన్ ఆర్మీ, వాయుసేన రంగంలోకి దిగాయి. సముద్రమట్టానికి 19 వేల అడుగుల ఎత్తున ఈ ఘటన సంభవించిన ప్రాంతం ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.