
న్యూఢిల్లీ: చైనా దుందుడుకు వ్యవహారిశైలిపై భారత్ మరోమారు మండిపడింది. భారత్‌కు చెందిన భూభాగాన్ని చైనా ఆక్రమించడాన్ని భారత్ ఎన్నటికీ అంగీకరించబోదని స్పష్టం చేసింది. ఇటీవల చైనా(China) రెండు కొత్త కౌంటీలను సృష్టించింది. వీటిలో కొంత ప్రాంతం భారత్‌లోని లడఖ్‌లో ఉంది. దీనిపై భారత్ బలమైన నిరసనను వ్యక్తం చేస్తున్నట్లు పార్లమెంటులో పేర్కొంది.
లోక్‌సభ(Lok Sabha)లో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్పందిస్తూ.. భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించడాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడూ అంగీకరించలేదని, ఆ దేశపు కొత్త కౌంటీల ఏర్పాటు.. భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన దీర్ఘకాల వైఖరిని ప్రభావితం చేయబోదన్నారు. చైనా పాల్పడుతున్న చట్టవిరుద్ధమైన, బలవంతపు ఆక్రమణను భారత్ చట్టబద్ధం చేయబోదన్నారు.
లడఖ్‌లోని భారత భూభాగాన్ని కలుపుకొని హోటాన్ ప్రావిన్స్‌లో చైనా రెండు కొత్త కౌంటీలను సృష్టించడం గురించి ప్రభుత్వానికి తెలుసా? అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ వ్యూహాత్మక, దౌత్యపరమైన చర్యలు తీసుకుందో తెలపాలని సంబంధిత మంత్రిత్వ శాఖను అడినప్పుడు సింగ్ ఈ సమాధానం చెప్పారు. చైనాలోని హోటాన్ ప్రావిన్స్‌లో రెండు కొత్త కౌంటీల ఏర్పాటుకు సంబంధించి చైనా చేసిన ప్రకటన గురించి భారత ప్రభుత్వానికి తెలుసని, ఈ కౌంటీల అధికార పరిధిలోని కొన్ని ప్రాంతాలు భారతదేశంలోని లడఖ్(Ladakh) కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోకి వస్తాయన్నారు. సరిహద్దు ప్రాంతాలలో చైనా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోందని కూడా ప్రభుత్వానికి కూడా తెలుసునని ఆయన అన్నారు. దీనిని నివారించేందుకే భారత ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోందన్నారు. తద్వారా భారత్ తన వ్యూహాత్మక, భద్రతా అవసరాలను మెరుగుపరుచుకుంటుందన్నారు.
ఇది కూడా చదవండి: కొలంబియా వర్శిటీపై ట్రంప్ ఉక్కుపాదం
Comments
Please login to add a commentAdd a comment