counties
-
పార్కుగా మారనున్న రైల్వేస్టేషన్
పార్కుగా మారనున్న పాడుబడ్డ స్టేషన్ ఇది పాతకాలం నాటి రైల్వేస్టేషన్. దశాబ్దాలుగా వినియోగంలో లేకపోవడంతో పూర్తిగా పాడుబడింది. ఇంగ్లండ్ కెంట్ కౌంటీలోని లాయిడ్ పట్టణంలో ఉంది ఈ స్టేషన్. దీనిని 1881లో నిర్మించారు. తొలినాళ్లలో ఇక్కడకు రైళ్ల రాకపోకలు బాగానే కొనసాగేవి. అయితే, ఐదు దశాబ్దాలుగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. స్థానికంగా గొడవలు జరిగినప్పుడు ఇక్కడి యువకులు ఈ స్టేషన్‌పై రాళ్లు రువ్వడం, నిప్పుపెట్టడం వంటి పనులు చేస్తుండటం పరిపాటిగా మారింది. స్థానికుల దాడుల వల్ల ఈ భవంతి బాగా దెబ్బతింది. దీని గోడల నిండా ఆకతాయిలు రాసిన పిచ్చిపిచ్చి రాతలు కనిపిస్తుంటాయి. ఇన్నాళ్లకు స్థానిక అధికారులకు ఈ రైల్వేస్టేషన్‌ను పార్కుగా మార్చాలనే బుద్ధిపుట్టింది. పాడుబడిన రైల్వేవ్యాగన్లతో ఇరవై జంట క్యారవాన్లను, ఆరు సింగిల్ క్యారవాన్లను సిద్ధం చేయనున్నారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా తగిన వసతులను ఏర్పాటు చేసి, త్వరలోనే పూర్తిస్థాయి పార్కుగా మార్చనున్నారు. (చదవండి: ఇంకో యాభై ఏళ్లలో ఆ దేశం అదృశ్యం!) -
చెలరేగిన అశ్విన్.. 69 పరుగులకే ప్రత్యర్ధి ఆలౌట్
లండన్: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2021 ఫైనల్లో తేలిపోయిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్ గడ్డపై సత్తాచాటాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో సర్రే తరఫున ఆడుతున్న అశ్విన్ ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగాడు. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన యాష్.. 6 వికెట్లు తీసి ప్రత్యర్ధి నడ్డి విరిచాడు. అశ్విన్‌కి మరో స్పిన్నర్ డేనియల్ మోరియార్టీ (4 వికెట్లు) తోడవ్వడంతో సోమర్సెట్ 69 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ధాటికి ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగా, జె హిల్డ్రెత్ (14) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, జులై 11న (ఆదివారం) మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సోమర్సెట్, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హిల్డ్రెత్(107) శతకానికి మరో అయిదుగురు ఆటగాళ్లు 40లు సాధించడంతో సోమర్సెట్ తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులకు ఆలౌటైంది. సర్రే బౌలర్లు జోర్డాన్ క్లార్క్, అమర్ విర్ధి చెరో 3 వికెట్లు పడగొట్టగా, డేనియల్ మోరియార్టీ 2, అశ్విన్, ఆర్ క్లార్క్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్రే జట్టులో ఓపెనర్లు రోరీ బర్న్స్(50), స్టోన్మెన్(67) మాత్రమే రాణించడంతో కేవలం 240 పరుగులకే ఆలౌటైంది. సోమర్సెట్ బౌలర్లు జాక్ లీచ్ 6, వాన్ డెర్ మెర్వే 4 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సోమర్సెట్కు స్పిన్నర్లు అశ్విన్(6), మోరియార్టీ(4) చుక్కలు చూపించారు. వీరి ధాటికి సోమర్సెట్ రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్రే జట్టు కడపటి వార్తలందేసరికి 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజ్‌లో హషీమ్ ఆమ్లా(24), జేమీ స్మిత్(26) ఉన్నారు. సర్రే గెలుపునకు మరో 178 పరుగుల అవసరం ఉంది. కాగా, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ముగిశాక టీమిండియా ఆటగాళ్లకు మూడు వారాల విరామం దొరకడంతో వారంతా కుటుంబాలతో కలిసి విహార యాత్రలో ఉన్నారు. అశ్విన్‌కు మాత్రం అనుకోకుండా కౌంటీ జట్టు సర్రే నుంచి ఆహ్వానం అందిండంతో ఆయన వెంటనే జట్టుతో చేరాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు ఈ కౌంటీ మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని భావించిన యాష్.. వెంటనే సర్రే జట్టు ఆహ్వానాన్ని అంగీకరించాడు. -
టీమిండియా స్పిన్నర్ అరుదైన ఘనత.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ అలా..
లండన్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2010లో న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ ఆరంభ ఓవర్ వేయగా.. మళ్లీ ఇన్నాళ్లకు అశ్విన్ ఇన్నింగ్స్ తొలి బంతిని వేశాడు. ఆదివారం సోమర్‌సెట్‌తో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో సర్రే తరఫున బరిలోకి దిగిన అశ్విన్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేశాడు. పిచ్ మందకొడిగా ఉండటంతో సర్రే కెప్టెన్ రోరీ బర్న్స్ కొత్త బంతిని అశ్విన్‌కు అప్పజెప్పాడు. తొలిరోజు 28 ఓవర్లు వేసిన అశ్విన్.. 70 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఎక్కువగా వైవిధ్యం ప్రదర్శించలేదు. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని ఒకే ప్రాంతంలో నిలకడగా బంతులు విసిరి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చాడు. మ్యాచ్ సాగుతున్న కొద్ది బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడంతో అశ్విన్ తెలివిగా బౌలింగ్ చేశాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి సోమర్సెట్ 98 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 280 పరుగులు స్కోర్ చేసింది. ఇదిలా ఉంటే, టీమిండియా ఇదే మైదానంలో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ఆడనుంది. కాగా, ప్రస్తుతం టీమిండియా సభ్యులకు విరామం దొరకడంతో ఇంగ్లండ్ పరిసరాల్లో కుటుంబ సభ్యులతో పాటు పర్యటిస్తున్నారు. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ముగిశాక భారత ఆటగాళ్లకు మూడు వారాల విరామం దొరికింది. ఈ మధ్యలో యాష్‌కు అనుకోకుండా సర్రే జట్టు నుంచి ఆహ్వానం అందింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ఈ కౌంటీ మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని భావించిన యాష్.. వెంటనే సర్రే జట్టు ఆహ్వానాన్ని అంగీకరించాడు. కాగా, యాష్‌కు గతంలో నాటింగ్హమ్షైర్, వొర్సెస్టర్‌షైర్ కౌంటీలకు ఆడిన అనుభవం ఉంది. -
278 బంతుల్లో 37 నాటౌట్.. బౌలర్లకు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా లెజెండ్
లండన్: టీమిండియా మాజీ కెప్టెన్, ద వాల్ రాహుల్ ద్రవిడ్ డిఫెన్స్‌కు పెట్టింది పేరు. అతని తర్వాత ఆ స్థానాన్ని టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా ఆక్రమించాడు. అయితే వీరిద్దరి డిఫెన్స్‌ను తలదన్నేలా, ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ హాషీమ్ ఆమ్లా. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక కౌంటీ క్రికెట్లో సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సౌథాంప్టన్ వేదికగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 278 బంతులను ఎదుర్కొన ఆమ్లా.. 37 పరుగులతో అజేయంగా నిలిచి డిఫెన్స్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. ఈ క్రమంలో బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టి, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ను గుర్తుకు తెచ్చాడు. ఆమ్లా డిఫెన్సివ్ ఇన్నింగ్స్‌తో సర్రే జట్టు ఓటమి నుంచి బయటపడింది. Hashim Amla has played one of the great first-class innings - 37* off 278!balls to secure a draw for Surrey against Hampshire. An epic performance. pic.twitter.com/QfBF388UDl — Derek Alberts (@derekalberts1) July 7, 2021 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగులు చేసింది. కివీస్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 213 బంతుల్లో 174 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో సర్రే కేవలం 72 పరుగులకే ఆలౌటైంది. ఇందులో హషీమ్ ఆమ్లా చేసిన 29 పరుగులే అత్యధికం. దీంతో ఫాలో ఆన్ ఆడిన సర్రే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కష్టాల్లో పడింది. ఆఖరి రోజు 6/2తో ఆట ఆరంభించిన ఆ జట్టు మరో 3 పరుగులకే మూడో వికెట్ కోల్పోయింది. నాలుగో స్థానంలో దిగిన ఆమ్లా తన క్లాస్ ఆటతీరుతో జట్టును ఆదుకున్నాడు. ఆఖరి రోజంతా క్రీజులో నిలబడ్డ ఆయన.. బౌన్సర్లు, యార్కర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ క్రికెట్లోని క్లాస్‌ను ప్రత్యర్ధులకు రుచి చూపించాడు. Hashim Amla batting on 5 runs in 114 deliveries for Surrey. Pujara bhai Wada Wau Wau moment for England series loading. — Silly Point (@FarziCricketer) July 7, 2021 తొలి 100 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన ఆమ్లా.. హాంప్‌షైర్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఎంత కఠినంగా బంతులేసినా.. ఊరించినా అస్సలు వికెట్ చేజార్చుకోలేదు. తాను ఆడిన 125వ బంతికి తొలి బౌండరీ కొట్టిన ఈ మిస్టర్ డిఫెన్స్.. 13.31 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. మరో పక్క వికెట్లు పడుతున్నా.. ఆమ్లా క్రీజులో నిలవడంతో సర్రే మ్యాచ్ ముగిసే సమయానికి 122/8తో నిలిచింది. దీంతో ఆ జట్టు మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. ఈ క్రమంలో ఆమ్లా ఓ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ రికార్డును తిరగరాశాడు. 40లోపు పరుగులు(37*) సాధించేందుకు అత్యధిక బంతులను(278) ఎదుర్కొన్న క్రికెటర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. ఆమ్లా ఆడిన ఈ మాస్టర్ క్లాస్ డిఫెన్సివ్ ఇన్నింగ్స్‌పై నెట్టింట జోకులు పేలుతున్నాయి. నయా వాల్ చతేశ్వర్ పుజారా మాదిరిగా ఆమ్లా కూడా జట్టును రక్షించాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Most balls faced in a first-class innings of less than 40: 278 HM Amla (37*) Surrey v Hampshire Southampton 2021 277 TE Bailey (38) England v Australia Leeds 1953 (where balls faced are known) — Andrew Samson (@AWSStats) July 7, 2021 -
విహారికి ఎప్పటికీ గుర్తుండిపోయే కౌంటీ అరంగేట్రం!
బర్మింగ్‌హామ్: ఇంగ్లండ్ దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ టోర్నమెంట్‌ల్లో భాగంగా అక్కడ జరిగే కౌంటీ క్రికెట్లో అరంగేట్రం చేసిన భారత ఆటగాడు హనుమ విహారి చెత్త రికార్డు నమోదు చేశాడు. వార్విక్షైర్ తరఫున ఆడటానికి ఒప్పందం కుదుర్చుకున్న విహారికి తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురైంది. 40 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉండి 23 బంతుల్ని ఎదుర్కొన్న విహారి డకౌట్ అయ్యాడు. బ్రాడ్ బౌలింగ్‌లో స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హసీబ్ హమీద్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇది విహారికి మరచిపోలేని కౌంటీ అరంగేట్రంగా ఎప్పటికీ గుర్తుండి పోవడం ఖాయం. కాగా, ఫీల్డింగ్‌లో మాత్రం ఆకట్టుకున్నాడు విహారి. నాటింగ్‌హామ్‌షైర్ ఇన్నింగ్స్ చేస్తున్నప్పుడు వన్ హ్యాండెడ్ డైవింగ్ క్యాచ్‌తో అలరించాడు. విల్ రోడ్స్ బౌలింగ్‌లో స్టీవన్ ములానే(31) ఇచ్చిన క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు. ఐపీఎల్ ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్‌లో ఇంగ్లండ్‌కు వెళ్లి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్... ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈసారీ ఐపీఎల్లో ఆడే అవకాశం రాకపోవడంతో ఈ సమయాన్ని భారత టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ హనుమవిహారి మరోరకంగా సద్వినియోగం చేసుకోనున్నాడు. రాబోయే ఇంగ్లండ్ పర్యటన కోసం విహారి ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాడు. 2019 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడాడు. అనంతరం విహారిపై టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడటంతో 2020, 2021 సీజన్లలో అతడిని ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. 27 ఏళ్ల విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. -
ఐపీఎల్‌కు పీటర్సన్ దూరం!
కౌంటీల కోసం హోబర్ట్: ఇంగ్లండ్ జట్టుకు తిరిగి ఆడాలనే ఆలోచనలో ఉన్న కెవిన్ పీటర్సన్ ఈ ఏడాది కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నాడు. గత సీజన్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు కెప్టెన్‌గా ఉన్న పీటర్సన్‌ను ఇటీవలి ఆటగాళ్ల వేలంలో కొనేందుకు ఎవరూ పోటీపడలేదు. దీంతో సన్‌రైజర్స్ జట్టు అతడిని కనీస ధరకే కొనుగోలు చేసింది. అయితే కౌంటీ సీజన్... ఐపీఎల్ మ్యాచ్‌లు ఒకేసారి జరుగుతుండడంతో పీటర్సన్ లీగ్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాడు. ‘ప్రస్తుతానికైతే నా ఆలోచన అదే. తిరిగి అవకాశం లభిస్తే ఇంగ్లండ్ జట్టు తరఫున బరిలోకి దిగాలనే ఉంది. ఈసీబీ కూడా ఈ విషయంలో ప్రోత్సహిస్తోంది’ అని పీటర్సన్ అన్నాడు. గతేడాది ఈసీబీచే వివాదాస్పద రీతిలో తను ఉద్వాసనకు గురయ్యాడు. అయితే ఈ మే నెలలో బోర్డు సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్న టామ్ హారిసన్, చైర్మన్‌గా రానున్న కోలిన్ గ్రేవ్స్... పీటర్సన్ పునరాగమనంపై సానుకూలంగా ఉండడం అతనికి కలిసొచ్చే అంశం. ఆరు కౌంటీ జట్లు ఇతని కోసం చూస్తున్నా.. కెవిన్ సర్రే కౌంటీకి ఆడే అవకాశాలున్నాయి.