పార్కుగా మారనున్న పాడుబడ్డ స్టేషన్ ఇది పాతకాలం నాటి రైల్వేస్టేషన్. దశాబ్దాలుగా వినియోగంలో లేకపోవడంతో పూర్తిగా పాడుబడింది. ఇంగ్లండ్ కెంట్ కౌంటీలోని లాయిడ్ పట్టణంలో ఉంది ఈ స్టేషన్. దీనిని 1881లో నిర్మించారు. తొలినాళ్లలో ఇక్కడకు రైళ్ల రాకపోకలు బాగానే కొనసాగేవి. అయితే, ఐదు దశాబ్దాలుగా రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. స్థానికంగా గొడవలు జరిగినప్పుడు ఇక్కడి యువకులు ఈ స్టేషన్‌పై రాళ్లు రువ్వడం, నిప్పుపెట్టడం వంటి పనులు చేస్తుండటం పరిపాటిగా మారింది.
స్థానికుల దాడుల వల్ల ఈ భవంతి బాగా దెబ్బతింది. దీని గోడల నిండా ఆకతాయిలు రాసిన పిచ్చిపిచ్చి రాతలు కనిపిస్తుంటాయి. ఇన్నాళ్లకు స్థానిక అధికారులకు ఈ రైల్వేస్టేషన్‌ను పార్కుగా మార్చాలనే బుద్ధిపుట్టింది. పాడుబడిన రైల్వేవ్యాగన్లతో ఇరవై జంట క్యారవాన్లను, ఆరు సింగిల్ క్యారవాన్లను సిద్ధం చేయనున్నారు. పిల్లలు ఆడుకునేందుకు వీలుగా తగిన వసతులను ఏర్పాటు చేసి, త్వరలోనే పూర్తిస్థాయి పార్కుగా మార్చనున్నారు.
(చదవండి: ఇంకో యాభై ఏళ్లలో ఆ దేశం అదృశ్యం!)
Comments
Please login to add a commentAdd a comment