trap
-
Stock market: ఈ ట్రాప్‌లో పడకండి
స్టాక్ మార్కెట్లో ఏమాత్రం అనుభవం లేకుండా డబ్బులు సంపాదించేయాలి అనుకుంటే అంతకుమించిన బుద్ధి పొరపాటు మరోటి ఉండదు. మిమ్మల్ని ఎలా ట్రాప్ లో ఇరికించి పబ్బం గడుపుకొంటారో మీకు అర్ధమయ్యేలా చెబుతా.. దయచేసి ఇలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. నాకు తెల్సిన ఒక మిత్రుని కథ అనుకోండి... వ్యథ అనుకోండి... అదెలాగో చెబుతా...నాకు బాగా కావాల్సిన మిత్రుడే... అతనికి అంతో ఇంతో స్టాక్ మార్కెట్ నాలెడ్జి ఉంది.. తన దగ్గరున్న డబ్బులతో కాస్తో కూస్తో బాగానే సంపాదించుకుంటున్నాడు. ఎప్పటినుంచో సొంత ఇల్లు కట్టుకోవాలని కోరిక.అందుకు తగ్గట్టే నాలుగు రూపాయలు రెడీ చేసుకుని... బ్యాంకు లోన్ కూడా తీసుకుని ఇంటి పనులు మొదలెట్టాడు. అవి చివరి దశకు వచ్చాయి. ఓ 3 లక్షలు ఎక్సట్రా కావాల్సి వస్తే ఓ మిత్రుడి దగ్గర 3 రూపాయల వడ్డీకి చేబదులు తీసుకున్నాడు. అంటే నెలకు రూ.9,000 వడ్డీ.కూలీల సమస్యో, తగిన మెటీరియల్ దొరక్కో మధ్యలో పనులు ఓ 15 రోజులు ఆగిపోయాయి. ఇదే అతని కొంప ముంచింది... ఇప్పుడతను... రూ. 4 వడ్డీకి (అంటే నెలకు రూ. 12,000) అప్పు తెచ్చి ఆ పాత బాకీ తీర్చి కొత్త బాకీ నెత్తికెత్తుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే...అసలేం జరిగి ఉంటుందో తెలియాలి. ముందే చెప్పానుగా...మనవాడికి స్టాక్ మార్కెట్ గురించి కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉందని. ఇంటి పనులకు 15 రోజులు గ్యాప్ రావడం కూడా అతని బుర్రని ఖరాబు చేసింది. ఆ 3 లక్షలు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టాడు. కనీసం ఓ పాతిక వేలు అయినా సంపాదించుకుందామని. అతని ప్లాన్ బాగానే పనిచేసింది.కేవలం పది రోజుల్లోనే పాతిక కాదు... 50 వేలు పైనే సంపాదించాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇంతలో... ఓ ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేశాడు. అవతలివైపు నుంచి...హలో సర్..చెప్పండి..మేము xyz ట్రేడింగ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామండీ ... మీరు మార్కెట్లో ట్రేడింగ్ చేస్తారా...? అవతలి వ్యక్తి ప్రశ్న. మనవాడు కూడా మార్కెట్ పండితుడిగా... వాళ్ళేం చెబుతారో విందామని...అవునండీ చేస్తున్నా...ఎందులో చేస్తారు... ఇండెక్స్ లోనా... స్టాక్స్ లోనా...రెండూ..మీ క్యాపిటల్ ఎంతో తెలుసుకోవచ్చా...3 లక్షలు..ట్రేడింగ్ లో రోజుకెంత సంపాదిస్తారు...?4000 -5000 దాకా...అంత తక్కువా...? మీదగ్గరున్న క్యాపిటల్ కి రోజుకు పాతిక వేలు అయినా సంపాదించొచ్చు... మీరు మంచి అవకాశం వదులుకుంటున్నారన్న మాట...(అవతలి వ్యక్తి అన్న మాటకి మనవాడిలో ఎక్కడో అహం దెబ్బతింది. మరోపక్క రోజుకు పాతిక వేలు సంపాదించొచ్చు అన్న మాట ఎక్కడో సూటిగా గుచ్చుకుంది. ఆ క్షణం లోనే అతని మనసు రకరకాల ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది. అసలే ఫ్రెండ్ దగ్గర అప్పుచేసి ఉన్నాడు.. రోజుకు పాతిక వేలు అంటే 15 రోజులు తిరిగేసరికి అప్పు మొత్తం తీర్చేయొచ్చు. ఇప్పుడు చేతిలో ఉన్న మూడు లక్షలు ఎటూ ఉండనే ఉంటాయి... ఇలా ఆనుకుంటూనే...అంత ఆశ లేదులెండి... నాకు వచ్చేది చాలు అని చెప్పబోయాడు..అదేంటి సర్... అలా అంటారు.. మార్కెట్ గురించి మీకు నేను చెప్పాలా...? రోజుకి కనీసం పాతిక వేలు దాకా సంపాదించొచ్చు... మీరు సరేనంటే అదెలాగో చెబుతా..(మనవాడిలో ఆశ బలపడింది.) అయితే చెప్పండి..మీరు ఏ బ్రోకరేజ్ సంస్థలో ట్రేడింగ్ చేస్తారు...?ఫలానా దాంట్లో...మీరు మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తే చాలు... మేము ఇక్కడ మా సిస్టం నుంచి లాగిన్ అవుతాం. మీ తరపున మేం ట్రేడ్ చేస్తాం. మీ సిస్టం లో లాగిన్ అయ్యి ట్రేడింగ్ ను మీరు కూడా గమనించొచ్చు. వచ్చే లాభాల్లో 30% మాకు, 70% మీకు.. ఏమంటారు?ఇలా అనేసరికి కాస్త ఆలోచనలో పడ్డాడు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇమ్మంటున్నారు... దానివల్ల ప్రమాదం ఏమీ లేదులే... ఎందుకంటే మన ఫండ్స్ మన అకౌంట్ లోనే ఉంటాయి. ఒకవేళ వాడు విత్ డ్రా పెట్టినా... పడేది నా అకౌంట్ లోనే... వాడు చేసే మోసమేమీ లేదు.. పైగా ఇక్కడ నేను కూడా చూసుకుంటూనే ఉంటానుగా.. అని అనుకుంటూనే... ఎందుకైనా మంచిదని... మీ ఆఫీస్ ఎక్కడ ? అని అడిగాడు...హైదరాబాద్ లో సర్.. కూకట్ పల్లి.అడ్రస్ చెబుతారా...? అని అడిగితే అతను అడ్రస్ కూడా చెప్పాడు.అన్నీ బాగానే ఉన్నాయి కదా అనుకుంటూ... అవతలి వ్యక్తి ఇచ్చిన బంపర్ ఆఫర్ కు ఒప్పుకున్నాడు. వెంటనే ఆ డీటెయిల్స్ అవతలివాని చేతిలో పెట్టాడు. అప్పటికి అతని డీమ్యాట్ అకౌంట్ లో ఉన్న మొత్తం రూ.. 3,55,000. ఫోన్ కట్ అయింది.. ట్రేడింగ్ మొదలైంది. ఆరోజు రూ. 10,000 దాకా ప్రాఫిట్ వచ్చింది. బాగానే ఉంది అనిపించింది. సాయంత్రం అవతలి వ్యక్తి మళ్ళీ ఫోన్ చేశాడు.చూశారుగా మా ట్రేడింగ్... మొదటిరోజు కదా ఎక్కువ చేయలేదు.. రేపటి నుంచి మనం టార్గెట్ తో పనిచేద్దాం సర్... అని చెప్పేసరికి.. మనవాడు ఆనందం తో సరే అంటూ ఫోన్ పెట్టేశాడు.తెల్లారింది.. ట్రేడింగ్ మొదలైంది. కొన్న షేర్లలో లాభాలు వస్తున్నట్లే కనిపించింది.. అంతలోనే నష్టాల్లోకి జారుతున్నట్లు అనిపించింది. ఫర్వాలేదులే అనుకున్నాడు. అలా... అలా... 30,000... 40,000 .... నష్టాల్లోకి కూరుకుపోతున్నట్లే ఉంది.. అవతలివాళ్ళకు ఫోన్ చేస్తే... కంగారుపడకండి సర్... మేమున్నాముగా.. అని చెప్పేసరికి కాస్త ధైర్యం వచ్చింది...ఆ షేర్ కాస్త కోలుకున్నట్లు అనిపించినా.. మళ్ళీ అంతలోనే భారీగా పడిపోయింది. కట్ చేస్తే... సాయంత్రానికి మొత్తం అకౌంట్ ఖాళీ అయిపోయింది.. మధ్యమధ్యలో ఫోన్ చేస్తున్నా... కంగారు పడకండి అన్న సమాధానమే...పోనీ అకౌంట్ తన చేతిలోనే ఉందిగా.. ఇక్కడితో లాస్ బుక్ చేసేసి బయటకు వచ్చేద్దామన్న సాహసం చేయలేకపోయాడు. పైగా అవతలివాళ్ళు ఎక్స్పర్ట్స్. వాళ్లకు తెలుసులే... అని చూస్తూ ఉండిపోయాడు. ఇక ఆ తర్వాత ఎన్ని ఫోన్లు చేసినా అవతలినుంచి సమాధానమే లేదు.. మర్నాడు కూకట్ పల్లి లో వాడి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే అలాంటి సంస్థే లేదు. పిచ్చెక్కి పోయింది. ఈ షాక్ నుంచి తేరుకునేసరికి దాదాపు ఆరు నెళ్ళు పట్టింది. మరిన్ని వివరాల్లోకి వెళ్లట్లేదు కానీ... ఇదీ మావాడి విషాదాధ్యాయం.పొరపాటున కూడా ఇలాంటి ట్రాప్ లో చిక్కుకోకండి..మిమ్మల్ని మీరు నమ్ముకోండి... ీకు తెలిస్తే ట్రేడింగ్ చేయండి... లేదంటే నేర్చుకునే ప్రయత్నం చేయండి.. అంతవరకు మంచి షేర్లు సెలెక్ట్ చేసుకుని దీర్ఘకాలానికి పెట్టుబడులపై దృష్టి పెట్టండి. ఇవే మీకు భవిష్యత్ లో లాభాలు పూయిస్తాయి.-బెహరా శ్రీనివాస రావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
మంకీ ట్రాప్ గురించి విన్నారా..?
మంకీ ట్రాప్ ఏంటీ అనుకోకండి. ఎందుకుంటే తెలియకుండానే మన అందరం ఈ ట్రాప్‌లో పడిపోతున్నాం. చేజేతులారా జీవితాలని నాశనం చేసుకుంటున్నాం. నిజానికి మన పెద్దవాళ్లు కొన్నింటిని వదిలేసేందుకు ఇష్టపడితేనే హాయిగా ఉండగలం అని చెబుతుంటారు. కానీ మనం వదలం. పట్టుకుని కూర్చొంటాం. జరగాల్సిన నష్టం జరిగేటప్పటికే మనం ఉండం. ఇలా ఈ భూమ్మీద ఎందరో ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. అసలు ఏంటీ ట్రాప్..? అంతలా మనం ఆ ట్రాప్‌లో ఎలా పడతామంటే..రెండు రోజుల క్రితం పేపర్లో వచ్చిన వార్త పరిశీలిస్తే..భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు... అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి సంచిలో అక్షరాల మొత్తం 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. "బిచ్చగాడి దగ్గర భారీ మొత్తం". ఇక్కడ... విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది మానసిక శాస్త్రం.మంకీ ట్రాప్ అంటే..దీన్నే "మంకీ ట్రాప్" అంటారు. ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని ఒక తెగ వారు ఉపయోగిస్తారు. వాళ్లు కోతులను వేటాడటానికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ... ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంద్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టే అంత పెద్దది గా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. ఇక ఈ రంద్రంలో కోతి కి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంద్రములో చేయి పేట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న... ప్రమాదం పొంచి ఉన్న.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది. తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది. చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.నిజంగా మనకు ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతే..? అయితే ఇటువంటి మంకీ ట్రాప్‌లో మనం ఉన్నట్లే.. కష్టపడి సంపాదించుకున్న డబ్బులను దాచిపెట్టుకొని ..ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు రాక.. తనువు చాలించిన వారు చాలా మందే సమాజంలో ఉన్నారు. డబ్బు నిజంగా మనిషిని అంతగా కట్టి పడేస్తుందా?? అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్‌లో పడేస్తుంది. నిశితంగా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. మనకు తెలియకుండానే మనం కూడా అదే ట్రాప్ లో ఉన్నామనే విషయం గ్రహించకపోవడం విశేషం. ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేం? ఒక్క మాట పంతానికి పోయి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా? వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు ఉన్నారు. అందుకే చిన్న మోతాదులో కానీ, పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్‌లో ఏమైనా ఉన్నామేమో? చెక్ చేసుకోవాలి.అది బంధం కావచ్చు, డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం. ఉదాహారణకు..మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు...నో చెప్పలేని మోహమాటలు...తిరిగి అడగలేని అప్పులు...దండిచలేని ప్రేమలు...ఊపిరి సలపనివ్వని పనులు...ఒత్తిడి పెంచే కోరికలు....ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు...పేరు కోసం తీసే పరుగులు....అన్నీ మంకీ ట్రాప్ లే!!అందుకే కొన్నిటిని వదిలేయడం అలవాటు చేసుకుందాం...... మరింత మనశ్శాంతిగా...ప్రశాంతముగా" ఉండేందుకు ప్రయత్నించండి అని చెబుతున్నారు మనస్తత్వ నిపుణులు. (చదవండి: ఉల్లిపాయలు తీసుకోకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..!) -
అమ్మాయిలూ.. జర జాగ్రత్త!: హైదరాబాద్ సీపీ
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో అపరిచితులపట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య. అమ్మాయిలు వీలైనంత వరకు తమ ఫొటోలు, వివరాలను పోస్ట్ చేయొద్దని కోరారాయన. శనివారం నగర శాంతి భద్రతల అంశంపై ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన.. తాజాగా నగర పోలీసులు చేధించిన సైబర్ నేరాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ సూచన చేశారు. కేసు వివరాలు.. సోషల్ మీడియాలో నగరానికి చెందిన ఇద్దరు బాలికలను కొందరు ఆగంతకులు ట్రాప్ చేశారు. ఈ మూడు నెలలుగా వాళ్ల మధ్య ఛాటింగ్ వ్యవహారం నడిచింది. బాలికల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేశారు ఆ కేటుగాళ్లు. చివరకు.. కోరికలు తీర్చకపోతే ఇంటర్నెట్లో ఆ ఫొటోలు, వీడియోలు పెడతామని బెదిరించారు. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని ట్రాప్ చేసి మరీ పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ కేసులపై సీపీ శాండిల్య మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్ సీపీ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. రెండు కేసులు నా దృష్టికి వచ్చాయి. ఈ రెండింటిలోనూ యువతులే బాధితులుగా ఉన్నారు. వాళ్ల ఫొటోల్ని మార్ఫింగ్ చేసి దుండగులు బ్లాక్మెయిల్ చేశారు. ఆ బెదిరింపులతోనే అత్యాచారం చేశారు. ఈ రెండు ఘటనలు యువతులు ప్రొఫైల్ ఫోటోలు పెట్టుకోవడం వల్లే.. అపరిచితులతో ఛాటింగ్ చేయడం వల్లే జరిగాయి. కాబట్టి ఎవరూ అలాంటి ట్రాప్‌ల్లో పడొద్దు.. బాధితులు కావొద్దు అని అన్నారాయన. మేమున్నాం.. ‘‘సోషల్ మీడియా పట్ల అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. అకౌంట్లలో వ్యక్తిగత ఫొటోలు పెట్టొద్దు. ఒకవేళ పెట్టినా సోషల్ మీడియాలో ప్రొఫైల్ లాక్ పెట్టుకోండి. అపరిచితుల నుంచి రిక్వెస్ట్ వస్తే అంగీకరించవద్దు. ప్రొఫైల్‌ను రెండు దశలుగా సెక్యూర్ పెట్టుకోండి. స్నేహితులతో, అపరిచితులతో వీడియో కాలింగ్ చేయొద్దు. ఎవరైనా బ్లాక్మెయిల్, ఒత్తిడి చేస్తే ఆందోళన చెందకండి. మీకు మేమున్నాం. ఎవరైనా ఇబ్బందులు పెడితే మా అన్న పోలీసు అని చెప్పండి. నేరుగా మా నెంబర్లను సంప్రదించండి.. ఫోన్ నెంబర్లు.. 9490616555, 8712660001 అమ్మాయిలు, మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే.. ఫిర్యాదు చెయ్యండి. పోలీసులను మీ సోదరులుగా భావించండి. నన్ను(కమిషనర్ శాండీ తనను తాను ఉద్దేశించుకుంటూ..) మీ అన్నగా భావించండి. మీ ఫిర్యాదుల ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారాయన. తల్లిదండ్రులకు సూచన బీదర్ నుంచి మత్తు ట్యాబెట్లు తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతున్నారు. ఆ ముఠా విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుంటోంది. బీదర్‌కు నిందితుల్ని పట్టుకోవడానికి వెళ్లినప్పుడు పోలీసులపై నిందితులు దాడి చేశారు. దాడుల్లో నార్కోటిక్ పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు కూడా. పిల్లల తల్లిదండ్రులకు చేసే విజ్ఞప్తి ఒక్కటే. వాళ్లతో కలిసి ఉండండి.. ఒంటరిగా వాళ్లను వదిలేయకుండా దృష్టి పెట్టండి. -
కిలాడీ లేడీ.. ఆమె ట్రాప్‌లో పడితే అంతే సంగతులు!
ఫేక్ ఐడెంటిటీల సాయంతో ఆన్లైన్లో పలువురు మహిళలను మోసం చేస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. మహిళలే స్వయంగా ఇటువంటి మోసాలకు దిగడం విశేషం. వారు ఫేక్ ఐడెంటిటీల సాయంతో కొంతమంది మహిళలకు ఫోన్ చేసి.. మీకు ఖరీదైన బహుమతులు వచ్చాయని, వాటిని తీసుకునేందుకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని చెబుతూ, వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ మధ్య దేశ రాజధాని ఢిల్లీలో ఇదేకోవకు చెందిన ఒక ఉదంతంలో పోలీసులు 36 ఏళ్ల నైజీరియన్‌ను అరెస్టు చేశారు. అరెస్టయిన మహిళ పలువురు మహిళలకు ఫోన్ చేసి, మీకు వచ్చిన ఖరీదైన బహుమతులు అందుకోవాలంటే వెంటనే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని చెబుతూ మోసానికి పాల్పడ్డారు. ఈ కేసులో అరెస్టయిన మహిళను పోలీసులు నైజీరియాకు చెందిన ఒఫోరిగా గుర్తించారు. ఆమె వలలో పడి 20 మంది బాధితులు మోసపోయినట్ల పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎనిమిది బ్యాంకు ఖాతాల ద్వారా ఈ మోసం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తనను తాను తాను డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఒక మహిళ ఆన్లైన్లో తనతో స్నేహం చేసిందని పేర్కొంటూ, ఆ తరువాత జరిగిన సంఘటనల గురించి ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపధ్యంలోనే ఈ తరహా కేసు వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఆ మహిళతో కొద్దికాలంలోనే మంచి స్నేహం ఏర్పడిందని, అప్పటి నుంచి ఆమె బహుమతులు పంపేదని తెలిపారు. అయితే కొన్ని రోజుల తర్వాత తనకు కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్న ఒక మహిళ నుండి కాల్ వచ్చిందని తెలిపారు. తన పేరు మీద విమానాశ్రయానికి కొన్ని బహుమతులు వచ్చాయని, వాటిని విడుదల చేయాలంటే కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలని ఫోన్ చేసిన వ్యక్తి తనకు తెలిపారని పేర్కొన్నారు. దీంతో తాను రూ. 25 వేలు చెల్లించినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాను చెల్లించినదానికన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలని డిమాండ్ చేయడంతో తనకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులకు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూశారు. మోసానికి పాల్పడిన ఆ మహిళ సోషల్ మీడియా ఖాతాల కోసం ఉపయోగించిన ఐడిలు నైజీరియాకు చెందినవని తేలింది. బాధితురాలి కాల్ రికార్డింగ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా నైజీరియన్ మహిళ ఓఫోరి ఈ మోసానికి కీలక సూత్రధారి అని తేలింది. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: తల్లీకొడుకుల ప్రాణం తీసిన మొబైల్ చార్జర్ -
ప్రాణాలు పణంగా పెట్టి మరీ ఆ తోడేలుని..: వీడియో వైరల్
ఇంతవరకు ఎన్నో జంతువులను రక్షించిన ఘటనలు చూసి ఉంటాం. కొన్ని క్రూరమృగాలు అనుకోకుండా ఏ ప్రమాదంలోనో చిక్కుకుంటే.. రక్షించేందుకు అంతతేలికగా ఎవరూ ముందుకు రాలేరు. ఎందుకంటే వాటిని రక్షించేలోపే మనకు హాని చేసే అవకాశం లేకపోదు కాబట్టి. ఐతే ఇక్కడొక వ్యక్తి మాత్రం అవేమి పట్టించుకోకుండా ఓ తోడేలు కోసం ప్రాణాలు పణంగా పెట్టి మరీ రక్షించేందుకు రెడీ అయ్యాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఒక చోట తోడేలు కాలుకి ఏదో రాడ్‌లాంటి దానిలో రెండు కాళ్లు ఇరుకుపోయాయి. పాపం అది కదిలేందుకు లేక అలా ఉండిపోయింది. సడెన్ ఓ వ్యక్తి వచ్చి దాన్ని చాలా తెలిగా చిన్న కర్రతో ట్రాప్ చేస్తూ.. ఓ పక్క నుంచి దాన్ని కాపాడే యత్నం చేశాడు. ఆ తర్వాత అది బతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోతున్నట్లు వీడియోలో కనిపించింది. దీంతో నెటిజన్లు అతను చాలా ధైర్యవంతుడు అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Brave Man Rescues Wolf from Trap with the Help of a Stick pic.twitter.com/ZqSGJqJxXi — Terrifying Nature (@TerrifyingNatur) May 8, 2023 (చదవండి: నడిరోడ్డుపై కారుని ఆపి దౌర్జన్యం: వీడియో వైరల్) -
తూ.గో. జిల్లా కు చెందిన మహిళ తో ట్రాప్ చేయించిన ముట్ట
-
పెళ్లి పేరుతో యువకుడికి ‘మాయలేడి’ వల.. రూ.31లక్షలకు టోకరా
సాక్షి, హైదరాబాద్: మత్తెక్కించే మాటలతో ఆకట్టుకుంటుంది. చూపు తిప్పుకోలేని అందమైన ఫొటోలు, వీడియోలతో ఆకర్షిస్తుంది. పెళ్లి చేసుకుందామని నమ్మించి జేబు ఖాళీ చేసేస్తుంది ఈ మాయలేడి! సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు తెరిచి యువకులకు గాలం వేస్తున్న యువతితో పాటు ఆమెతో సహజీవనం చేస్తున్న మరొకరిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ బీ రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా, గిద్దలూరుకు చెందిన పరాస తనుశ్రీ, పరాస రవితేజ ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని భావించిన ఇరువురూ పథకం వేశారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతా తెరిచి యువకులను ఆకర్షించాలని నిర్ణయించుకున్నారు. తనుశ్రీ పేరుతో ఇన్‌స్ట్రాగామ్‌లో నాలుగు అకౌంట్లు తెరిచి అందమైన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసేది. దీంతో తక్కువ సమయంలోనే ఆమెకు ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. కామెంట్లు పెట్టేవారిలో బ్యాచిలర్స్, అమాయకులను ఎంపిక చేసుకుని వారికి రిప్లై ఇచ్చేది. ఫోన్ నంబర్లు తీసుకుని తియ్యని మాటలతో ప్రేమగా మాట్లాడుతూ నమ్మించేది. ఈ క్రమంలో ఓ రోజు ఫిర్యాదుదారుడికి తనుశ్రీ ఇన్‌స్ట్రాగామ్ నుంచి మెసేజ్ వచ్చింది. తక్కువ సమయంలో ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారు. ఒకరికొకరు ఫోన్ నంబర్లు మార్చుకొని గంటల కొద్దీ మాట్లాడుకునేవారు. తల్లికి ఆరోగ్యం బాలేదని, గృహ రుణం వాయిదా చెల్లించాలని, కరోనా వచ్చిందని ఇలా రకరకాల సాకులతో ఖర్చులకు డబ్బులు కావాలని అడగడంతో 8 నెలల కాలంలో రూ.31.66 లక్షలు బదిలీ చేశాడు. ఒక రోజు యువతి బాధితుడితో పెళ్లి చేసుకుందామని చెప్పింది. నిజమేనని నమ్మిన బాధితుడు ఎదురుచూశాడు. ఆపై ఆమె నుంచి రిప్లై రాకపోవటంతో మోసపోయానని గుర్తించి రాచకొండ సైబర్ క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సాంకేతికత ఆధారాల ఆధారంగా తనుశ్రీ, రవితేజలను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించారు. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వీరు ఇద్దరూ పలువురు యువకులను మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే వీరిపై మేడిపల్లి ఠాణాలోనూ కేసు నమోదయింది. ఇదీ చదవండి: Anti Hijab Protests: ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అరెస్ట్ -
రాజవంశానికి చెందిన వాడినంటూ మహిళలకు వల...చివరికీ..
రాజకుటుంబానికి చెందిన వాడినంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియాలో మహిళలను ట్రాప్ చేసి వారి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. చివరికి అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ముంబైకి చెందిన రాజ్వీర్ సింగ్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో తనను తాను రాజస్తాన్‌లోని రాజకుటుంబానికి చెందిన వాడిగా పరిచయం చేసుకుంటూ పలువురు మహిళల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో అతని వేధింపులు తాళలేక ఒక మహిళా అతడిపై ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన గోరెగావ్ పోలీసులు అతన్ని ఒక ప్రైవేట్ హోటల్లో పట్టుకుని అరెస్టు చేశారు. అతను రాజస్తాన్‌లోని రాజకుటుంబానికి చెందినవాడిగా నటించి అమ్మాయిల నుంచి డబ్బులు ఎలా వసూలు చేసేవాడో వివరించారు. ఇప్పటి వరకు అతడు బాధిత మహిళ నుంచి సుమారు రూ. 13 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. నిందితుడు రాజ్వీర్ సింగ్‌పై ఇప్పటికే జుహు పోలీస్టేషన్లో కేసు నమోదైందని, అతను ఒక ఏడాదిపాటు జైల్లో ఉండి వచ్చాడని చెప్పారు. ఐతే ఆ తర్వాత కూడా తన తీరు మార్చుకోకుండా మరో మహిళను వేదించడమే కాకుండా ఆమె ఎనిమిదేళ్ల కుమార్తెను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు చెప్పారు. (చదవండి: అమానుష ఘటన: విద్యార్థికి డ్రిల్లింగ్ మిషన్‌తో పనిష్మెంట్ ఇచ్చిన టీచర్) -
కొంప ముంచుతున్న అత్యాశ
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలపై పోలీసులు ఎంత ప్రచారం చేసినా కొందరిలో మార్పు రావటం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ, చిన్న మొత్తంలో పొదుపు చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని వాట్సాప్‌లలో లింకులు పంపిస్తూ సైబర్ నేరస్తులు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరస్తుల చేతిలో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులే అధికంగా ఉంటున్నాయి. నేరస్తులు ఇతర రాష్ట్రీయులే.. రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బహుళ జాతి కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ నిపుణులు, బ్యాంకింగ్ రంగం ఉద్యోగులు సైతం గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి కూడా పాస్‌కాని సైబర్ మాయగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. ఇప్పుడు పెట్టుబడితో వారంలో డబుల్, త్రిబుల్ అవుతుందని చెప్పగానే నమ్మి మోసపోతున్నారు. సైబర్ బాధితుల్లో 60 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులు ఉండటమే ఇందుకు నిదర్శనం. 200 శాతం పెరిగిన మోసాలు.. ఇతర సైబర్ నేరాలతో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 200 శాతం మేర పెరిగాయని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వడమే మోసాలకు ప్రధాన కారణం. ఉద్యోగిణులు, ఐటీ ఉద్యోగులు, పెన్షన్‌దారులు కూడా నేరస్తులో వలలో పడిపోతున్నారు. వర్చువల్‌గా లాభాలు వచి్చనట్లు చూపించి, రూ.5 లక్షల నుంచి కోటి వరకు పెట్టుబడి పెట్టిస్తున్నారు. ఆ తర్వాత కాంటాక్ట్ కట్ చేస్తున్నారని వివరించారు. యాప్‌లలో పెట్టుబడితో లక్షల లాభం వచి్చనట్లు ఫోన్లో కనిపించినా అవి బ్యాంక్ ఖాతాలో జమ కావని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. (చదవండి: పండుగ ముగిసింది.. తిరుగు పయనం) -
మాయలేడీలు.. న్యూడ్ వీడియోలతో వలపు వల..
సాక్షి, కామారెడ్డి: అపరిచిత మహిళల ఫోన్ కాల్స్ విషయంలో కొందరు చేస్తున్న ‘తప్పు’టడుగులు వారిని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ముందువెన కా ఆలోచించకుండా అపరిచిత మహిళలతో జరిపే సంభాషణలు దారితప్పి వారి మెడకే చుట్టుకుంటున్నాయి. కైపెక్కించే మాయ మాటలతో మాయలేడీలు విసురుతున్న వలలో చిక్కి ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలి కాలంలో జిల్లాలో పలువురు వలపు వలలో పడి మానసిక ఆందోళనకు గురవుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం.. ఇంట్లో సహజీవనం చేస్తున్న వ్యక్తితో కనిపించడంతో.. తెలిసీ తప్పు చేశామని తరువాత బాధపడుతున్నారు. విషయం ఎవరికీ చెప్పుకోలేక, బయటకు పొక్కితే పరువు ఎక్కడ పోతుందోనన్న ఆందోళనతో మనోవ్యధకు గురవుతున్నారు. భిక్క నూరులో ప్రభుత్వ ఉద్యోగి ఒకరు వలపు వలలో పడిన విషయంలో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సంచలనం కలిగించింది. ఇటీవల జిల్లాలో జరిగిన పలు ఘటనలను పలువురు ‘సాక్షి’కి వివరించారు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఉద్యోగి కూడా వలపు వలలో పడి ఇబ్బందులపాలయ్యాడు. చాలా డబ్బు లు పోగొట్టుకున్నానని బాధితుడు ‘సాక్షి’కి వివరించాడు. ఎల్లారెడ్డికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కూడా ఓ తల్లీకూతురు వలపు వలలో చిక్కి ఆర్థికంగా చితికిపోయాడు. వీడియోకాల్స్‌తో తల్లీ కూ తురు న్యూడ్‌గా లైవ్‌లో కనబడడం, దానికి సదరు వ్యక్తి కూడా న్యూడ్‌గా మారి వాళ్లు ఆన్లైన్లో డబ్బు లు పంపమని కోరినపుడల్లా పంపాల్సి వచ్చింది. వేల రూపాయలు వారికి చెల్లించాడు. అప్పట్లో కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్‌లో నివసించే ఓ గ్రామ స్థాయి ప్రజాప్రతినిధి మాయలేడీల వలలో పడి ఇబ్బందులు పడిన విషయం ‘సాక్షి’ పాఠకులకు విధితమే. వీడియోకాల్‌తో కైపెక్కిస్తున్నారు.. వారం, పది రోజులు మాట్లాడిన మాయలేడీలు ఓ సారి వీడియోకాల్ చేయండి సార్ అంటారు. ఇంకేముంది మనోడు ఆ మాయలో పడి వీడియో కాల్ చేయడం, ఆమెను చూసి చొంగచార్చుకోవడం జరుగుతోంది. రోజూ ఒకటి, రెండు సార్లు వీడియో కాల్ చేస్తూ మరింత దగ్గరవుతున్నారు. భార్య, సెక్స్ విషయాలను ఓపెన్‌గా మాట్లాడుతూ ‘నేను నచ్చా నా’ అంటూ మొదలవుతుంది. వీడియో కాల్లో ఉండగానే న్యూడ్‌గా మారుతున్నారు. దీంతో మగవాళ్లు కూడా ఆ మత్తులో న్యూడ్ అవుతున్నారు. ఎంతోమంది బాధితులు.. మాయలేడీలు విసురుతున్న వలలో చిక్కి ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. నమ్మించే మాటలతో, కైపెక్కించే వలపులతో వలలో వేసుకుని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు. జిల్లాలో చాలామంది ఇలా మోసపోతూనే ఉన్నారు. కొందరైతే తెలిసి మరీ మోసపోతున్నారు. అయితే తమకు జరిగిన ఇబ్బందిని బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని వెనకడుగు వేస్తున్నారు. మాయలేడీల వలలో పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. తియ్యటి మాటలతో స్నేహం అపరిచిత మహిళలు ఫోన్ చేసి ‘సార్’ అంటూ తియ్యగా మాట్లాడతారు. ఎవరు అని ప్రశ్నిస్తే మేం వేరే వాళ్లకు కాల్ చేశామని, పొరపాటున మీ కు వచ్చిందంటూ సారీ చెబుతారు. పరవాలేదని అంటే చాలు ‘మీ పేరు, మీ ఊరు సార్, ఏం చేస్తారు సార్’ అంటూ మాటలు కలుపుతారు. ఆడగొంతు, ఆపై తియ్యగా మాట్లాడడంతో సహజంగా మగవాళ్లు వాళ్లతో మాట కలపడం, ఇదే అదనుగా అపరిచిత మహిళ మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. రోజూ కాల్ చేసి ఏదో మాట్లాడుతూ టైంపాస్ చేయడం ద్వారా, ఆమె ఫోన్ కోసం ఎదురుచూసే పరిస్థితిని తీసుకువస్తున్నారు. వీడియో కాల్ రికార్డులు పంపి బ్లాక్ మెయిలింగ్.. పది, పదిహేను రోజులుగా ఫోన్‌కాల్ ఆ తరు వాత వీడియో కాల్స్ ద్వారా దగ్గరైన మహిళలు న్యూడ్ వీడియోలను రికార్డు చేసి, వాటిని వాట్సాప్‌కు పంపుతున్నారు. ఆ వీడియోలను చూసి మనోళ్లు షాక్ అవ్వాల్సిందే. వీడియో క్లిప్పింగులు పంపి, డబ్బులు డిమాండ్ చేస్తున్నా రు. అడిగినన్ని డబ్బులు ఇవ్వకపోతే సోషల్ మీ డియాలో వైరల్ చేస్తామంటూ బ్లాక్ మెయిలింగ్‌కు దిగుతున్నారు. కొందరు బతిమాలుకుని ఎంతో కొంత డబ్బు అప్పగించి క్లోజ్ చేసుకుంటుండగా, డబ్బులు ఇవ్వని వారిని మానసికంగా వేధిస్తున్నారు. -
రోజూ చిల్లరకొట్టుకు వస్తూ.. నిర్వాహకుడి కూతురిని ట్రాప్ చేసి..
సాక్షి, అనంతపురం క్రైం: రోజూ చిల్లరకొట్టుకు వస్తూ సిగరెట్లు, తదితర వాటిని కొనుగోలు చేస్తూ ఓ కొట్టు నిర్వాహకుడి కూతురిని ట్రాప్ చేశాడు ఓ నయవంచకుడు. కొన్ని నెలలుగా బాలికకు మాయమాటలు చెప్పి.. చివరకు ఈ నెల 2న బాలికను తీసుకుని ఉడాయించాడు. అనంతపురం రూరల్ పోలీసులు బాలిక అదృశ్యం కింద కేసు నమోదు చేశారు. రూరల్ ఎస్ఐ కేవీ రమణ వివరాల మేరకు... వన్‌టౌన్ పరిధిలో ఉండే ఓ వ్యక్తి చిల్లరకొట్టు నిర్వహించేవాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. నవోదయ కాలనీకి చెందిన సాకే శేషు (వాచ్మెన్) చిన్న కుమారుడు సాకే వినేష్ చిల్లర కొట్టుకు వెళ్లేవాడు. ఇదే క్రమంలో కొట్టు నిర్వాహకుడి చిన్న కూతురితో పరిచయం పెంచుకున్నాడు. ఆ బాలికకు సెల్‌ఫోన్ లేకున్నా.. అప్పుడప్పుడూ తన తండ్రి సెల్‌ఫోన్‌తోనే వినేష్‌తో చాట్ చేసేది. సెల్ఫోన్లతో లక్ష్మీ అనే పేరుతోనే నంబర్ ఉండటంతో బాలిక తండ్రి కూడా పెద్దగా పట్టించుకోలేదు. చదవండి: (యువతితో ఐదేళ్లుగా ప్రేమ.. నమ్మించి మోసం.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో..) పెళ్లికి వెళ్లి... : ఈ నెల 2న బాలిక తన స్నేహితురాలి అక్క వివాహం రూరల్ పరిధిలోని సిండికేట్‌నగర్‌లో జరిగింది. ఆ వివాహ వేడుకకు తండ్రితో కలిసి బాలిక వెళ్లింది. భోజనం చేద్దామనుకున్న సమయంలో బాలిక కనిపించలేదు. అంతా వెతికినా ఫలితం లేకపోయింది. చేసేదిలేక అనంతపురం రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా అదృశ్యం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పదికి పైగా కేసులు: బాలికను తీసుకెళ్లిన నిందితుడు సాకే వినేష్‌పై వన్‌టౌన్, టూటౌన్ పరిధిలోని దొంగతనాలు, తదితర కేసులు పదికి పైగా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బాలికను ఏం చేస్తాడోనన్న భయంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. -
సేవ్ వాటర్
చేతులు కడగడానికి ట్యాప్ తిప్పుతాం. చేతిలో పట్టేటంతటి ధారతో సంతృప్తి చెందం. పూర్తిగా ఓపెన్ చేస్తాం. ఒక్కసారిగా నీరు ధారాపాతంగా వచ్చి దోసిట్లోకి పడిపోవాలన్నంత ఆత్రం. చేతులు కడుక్కోవడం పూర్తయ్యే సరికి కనీసంగా ఇరవై సెకన్ల సేపు ట్యాప్ రన్నింగ్‌లో ఉంటుంది. అంత సమయంలో సింక్‌లోకి జారిపోయే నీరెంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? నాలుగు లీటర్లకు తక్కువ ఉండదు. ఆశ్చర్యంగా ఉన్నా సరే ఇది నిజం. ‘ట్యాప్ పూర్తిగా తిప్పవద్దు. ఎంత కావాలో అంతవరకే ఓపెన్ చేయండి’ అని ఇంట్లో వాళ్లకు చెప్పి చెప్పి విసిగిపోయింది లలితాంబ విశ్వనాథయ్య. అందుకే ఓ చిన్న సాధనంతో నీరు తగినంత మాత్రమే వచ్చేటట్లు ట్యాప్‌కు ఉచ్చు బిగించింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లే అవుట్ నివాసి లలితాంబ. నీటివృథాను అరికట్టడానికి ఆమె వాటర్ ఏరియేటర్, వాటర్ రిస్ట్రిక్టర్లకు రూపకల్పన చేసింది. వీటిని అమర్చడం ద్వారా నీటి వాడకం మూడవ వంతుకు తగ్గిపోతుంది. సాధారణంగా ఓ కొత్త ఆవిష్కరణ మనిషి జీవనశైలిని ఆధునీకరించడం కోసమే ఉంటుంది. వాటికి మార్కెట్లో మంచి ఆదరణ కూడా లభిస్తుంది. లలితాంబ రూపొందించిన సాధనాలు సామాజిక ప్రయోజనార్థం పని చేస్తాయి. ప్రకృతి పరిరక్షణ, వనరుల సంరక్షణలో కీలకమైన పాత్ర వహిస్తాయి. వాటర్ బాటిల్ లేదు! ‘నీరు అనేది చాలా విస్తృతమైన సబ్జెక్ట్. నదుల సంరక్షణ, పరిశుభ్రతనే ప్రధానంగా చూస్తాం, కానీ పర్యావరణ పరిరక్షణ నుంచి దైనందిన జీవనం వరకు అడుగడుగునా అది కీలకమైన అంశమే’ అంటారు ప్రముఖ పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి. ‘‘నాకు ఎనభై ఏళ్లు. నా బాల్యంలో స్కూలుకెళ్లేటప్పుడు నీటిసీసా తీసుకెళ్లడం మాకు తెలియదు. దారిలో రోడ్డు పక్కన కనిపించిన నల్లా తిప్పి చేయి పట్టి దాహం తీరే వరకు తాగేవాళ్లం. ఎంతో ఆరోగ్యంగా పెరిగాం. నీటి కాలుష్యం అనే పదమే తెలియదప్పట్లో. మా ఇంట్లో బావి ఉండేది. వర్షాకాలంలో అయితే బకెట్‌కు తాడు కట్టి మూడు– నాలుగు అడుగుల లోతులో ఉన్న నీటిని ముంచుకోవడమే. ఎండాకాలంలో అదే బావిలో నీరు ఇరవై అడుగుల లోతుకి వెళ్లేది. భూగర్భ జలాల కనీస స్థాయులంటే ఇరవై అడుగులే. హైదరాబాద్ చుట్టూ వందల చెరువులు, కుంటలు ఉండేవి. క్రమంగా ఒక్కొక్కటీ మాయమవుతున్నాయి. నీటిచుక్క పాతాళానికి పోయింది. నీటి జాడ కోసం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ లోతుకు బోర్లు వేస్తున్నారు. నీటిని అవసరానికి మించి వాడడం అంటే సహజ వనరులను వృథా చేయడమే. ఈ మధ్య ప్రభుత్వం జారీ చేసిన 111 జీవో మీద కూడా మేము అభ్యంతరం తెలియచేశాం. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ మంచి నీటి రిజర్వాయర్లు కూడా ఈ జీవో ఫలితంగా హుస్సేన్‌సాగర్ లాగానే మారిపోతాయని హెచ్చరించాం. భావి తరాలకు అందాల్సిన సహజ వనరులను విచక్షణ రహితంగా వాడేసే హక్కు ఎవరికీ ఉండదు. మనదేశంలో జలకాలుష్యనిరోధానికి ‘వాటర్ యాక్ట్ ఆఫ్ 1974’ అనే చట్టం ఉంది. దానిని అమలు చేయడానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఏర్పాటైంది. ఎన్ని చట్టాలున్నా సరే... మన దగ్గర నీటి సంరక్షణ విషయంలో సమన్వయలోపంతోనే పనులు జరుగుతున్నాయి. ఫ్యాషన్ ఉత్పత్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మార్కెట్లోకి రాగానే కొనేస్తారు. కాని, ఇలాంటి సమాజహితమైన, పర్యావరణ పరిరక్షణ సహితమైన వాటర్ రిస్ట్రిక్టర్లను వాడమని ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తోంది’’ అని ఆవేదనగా అన్నారాయన. ప్రతిజ్ఞ చేద్దాం! నీటి వనరులను పరిరక్షించుకోవడం అనగానే భూగర్భ జలాలు పెరిగి ఎండిపోయిన బావుల్లోకి నీరు చేరడం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి పెద్ద విషయాల మీదనే చర్చ జరుగుతుంటుంది. కానీ... ఇంట్లో మనం వాడే ప్రతి నీటి చుక్కనూ గౌరవించుకోవాలి. ‘ఆహారాన్ని వృథా చేయము’ అని ప్రతిన పూనుతున్నాం. అలాగే నీటిని వృథా చేయను అని కూడా ఎవరికి వాళ్లు మనసులోనే ప్రతిజ్ఞ చేసుకోవాలి. అప్పుడు లీకవుతున్న ట్యాప్‌ను చూసినప్పుడు దానిని కట్టేసేవరకు మనసు ఊరుకోదు. ట్యాప్ లీకవుతుంటే ఒక్కో చుక్కే కదా అని తేలిగ్గా తీసుకోవడం జరగదు. గమనించిన తక్షణమే ట్యాప్ మారుస్తాం. ఒక్కో చుక్క నీరు కారుతున్న ట్యాప్ నుంచి ఇరవై నాలుగ్గంటల్లో ఎనభై లీటర్ల నీరు వృథా అవుతుంది తెలుసా! ఇది నిజం... నమ్మండి! వాటర్ రిస్ట్రిక్టర్ ధర వంద రూపాయలకు మించదు. దీని ద్వారా నీటి వృథాను అరికట్టగలుగుతాం. నిమిషానికి నాలుగు లీటర్ల చొప్పున ఆదా చేయగలుగుతాం. కాలేజ్‌లు, కల్యాణమండపాల వంటి చోట నెలకు సరాసరిన పదిహేను వేల లీటర్ల నీరు ఆదా అవుతుంది. – లలితాంబ, వాటర్ రిస్ట్రిక్టర్ రూపకర్త మహిళలే సంరక్షకులు మహిళలు స్వచ్ఛందంగా స్పందిస్తేనే నీటి సమస్య అదుపులో ఉంటుంది. మన కిచెన్‌లో ట్యాప్ తిప్పగానే నీరు ధారగా ప్రవహిస్తోందంటే... దాని వెనుక కనిపించని శ్రమ ఎంతో ఉంటుంది. నదుల జన్మస్థానాలైన కొండల మీద నుంచి మన ఇంటికి వస్తున్నాయనే విషయాన్ని మర్చిపోకూడదు. కొండ శిఖరం నుంచి మన ఇంటి ట్యాప్‌కు చేరడానికి మధ్య ఎంత మెకానిజం పని చేస్తోందో గమనించాలి. మీ పిల్లల కోసం ఎన్నెన్నో ఆస్తులను కూడబెడుతుంటారు, అంతకంటే విలువైన ఆస్తి నీరు. ఆ నీటిని వృథా చేయకండి. ఎండిన భూమిని కాదు, చల్లని భూమిని భావితరాలకు వారసత్వంగా ఇవ్వండి. – ప్రొ‘‘ కె. పురుషోత్తమ్‌రెడ్డి, పర్యావరణవేత్త – వాకా మంజులారెడ్డి -
డాన్.. డబుల్ జీరో నెంబర్.. దీని వెనుక పెద్ద కథే ఉంది..
Scrap Don: ఆరోజు మార్నింగ్ వాక్‌కి వెళ్ళినవారికి రైల్వే స్క్రాప్ యార్డ్ సమీపంలో ఓ శవం కనిపించింది. వార్త అందగానే విశాఖపట్టణం 3–టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. హతుడి వయసు 35 ఏళ్ళుంటుంది. తెల్ల షర్ట్, బ్లూ ప్యాంటులో వున్నాడు. శరీరం పైన 5 లోతైన కత్తిపోట్లు ఉన్నాయి. రక్తం మడుగుకట్టింది. హతుడి పేరు గోవిందరావు అనీ, సీతమ్మధారకు చెందిన ఓ రైల్వే స్క్రాప్ కాంట్రాక్టరనీ తెలిసింది. పోలీసులు హత్యాప్రదేశాన్ని కార్డనాఫ్ చేసి తమ తతంగం ఆరంభించారు. శవాన్ని పరీక్షించిన డాక్టర్ ‘రిగర్ మార్టిస్’ని బట్టి, హత్య జరిగి సుమారు పది గంటలయినా కావచ్చునని చెప్పాడు. గాయాల లోతును బట్టి హత్యకు ఉపయోగించిన కత్తి పొడవు ఆరేడు అంగుళాలు ఉండవచ్చని అభిప్రాయపడ్డారు నిపుణులు. స్నిఫర్ డాగ్ రప్పించబడింది. అది నేలను వాసన చూస్తూ అక్కడికి సుమారు రెండువందల మీటర్ల దూరంలోని రైల్వే స్క్రాప్ యార్డ్ కాంపౌండు వెనుక భాగంలో వున్న చిన్నబండల వద్దకు వెళ్ళి ఆగింది. అక్కడ రెండు ఖాళీ బీరు బాటిల్స్, తినుబండారాలను తినేసి పడేసిన కాగితపు పొట్లాలు, సిగరెట్ పీకలు, బూట్ల ఆనవాళ్ళున్నాయి. చెప్పుల ఆనవాళ్ళు కూడా కనిపించాయి. ఓ పాత తువాలు పీలిక పడివుంది. పరిసరాలను గాలించిన పోలీసులకు కొన్ని అడుగుల దూరంలో ఉన్న తుప్పల్లో పొడవాటి కత్తి ఒకటి దొరికింది. దానిపైన రక్తం ఎండిపోయి వుంది. హత్యాయుధం అదేనని గ్రహించిన పోలీసులకు– మర్డర్ చేశాక హంతకులు ఆ బండల దగ్గర కూర్చుని డ్రింక్ చేసివుంటారని అర్థమయింది. దుండగులు కూర్చున్న స్థలాన్ని, కత్తిని, సీసాలను, గుడ్డపీలికను వాసన చూసిన శునకం ఓ క్షణంపాటు దిక్కులు చూసి ఓ దిశగా పరుగుతీసింది. కొంతదూరం వెళ్ళాక ఓ పాక వద్ద ఆగింది. అక్కడ చింకిచాప పైన పడుకుని ఉన్నాడు ఓ బిచ్చగాడు. ఓ మూలన ఓ గుడ్డసంచి, అందులో కొన్ని పాతబట్టలు వున్నాయి. పక్కనే చిరిగిన ఓ పాత తుండు కనిపించింది. తమకు దొరికిన గుడ్డపీలిక దానినుంచే చింపబడ్డట్టు గుర్తించారు పోలీసులు. శునకం దాని దగ్గరకు వెళ్ళి భీకరంగా మొరగడంతో తుళ్ళిపడి లేచాడు వాడు. కుక్కను, పోలీసులను చూసి భయంతో ఒణికిపోయాడు. రైల్వే స్క్రాప్ యార్డ్ దగ్గర జరిగిన హత్య గురించి గద్దించి అడిగితే, తనకేమీ తెలియదని మొత్తుకున్నాడు. రెండు తగిలించి, వాడి తువాలు పీలిక అక్కడికి ఎందుకు వచ్చిందని గద్దించడంతో జరిగిందేమిటో ఏడుస్తూ చెప్పాడు. గతరాత్రి వాడు బిచ్చమెత్తుకుని అడ్డదారిలో తన పాకకు తిరిగివస్తూంటే, రైల్వే స్క్రాప్ యార్డ్ కాంపౌండ్ వెనుక ఇద్దరు వ్యక్తులు కూర్చుని హిందీలో మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తున్నారు. వారి దగ్గరకు వెళ్ళి తనకూ కాస్త డ్రింక్ పోయమని అడిగాడు వాడు. కసిరారు వాళ్ళు. వాడు కదలకుండా బతిమాలుతుంటే.. ‘అరె, చల్ బే!’ అంటూ తిట్టారు. అయినా ఆశ చావక ఇంకా అక్కడే నిలుచునివున్నాడు వాడు. దాంతో వాళ్ళలో ఒకడు కోపంతో లేచి వాడి భుజమ్మీది తుండుగుడ్డను పట్టుకుని లాగి ముందుకు తోసేశాడు. అది పాతది కావడంతో చిరిగి కొంతముక్క కింద పడిపోయింది. వాడు భయంతో గబగబా అక్కణ్ణుంచి వెళ్ళిపోయాడు. పాకకు వచ్చి అన్నం తిని పడుకున్నాడు. హత్య సంగతి ఎరుగడు. వాళ్ళ ఆకారాలు, వేషభాషలు చూస్తే వేరే రాష్ట్రం నుంచి వచ్చిన గూండాల్లా ఉన్నారనీ చెప్పాడు బిచ్చగాడు. విచారణ ముగిసేంతవరకూ వాణ్ణి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోవిందరావు శవానికి ‘పోస్ట్‌మార్టమ్’ చేసిన సర్జన్, హత్యా సమయాన్ని రాత్రి 9 గంటలకు కొంచెం అటు ఇటులో తేల్చాడు. పోలీసులు టీమ్స్‌గా ఏర్పడి గాలింపు మొదలుపెట్టారు. రాత్రి కానీ, ఉదయం కానీ ఎవరైనా పాసింగ్ ట్రక్స్‌లో ఎస్కేప్ అయినవారున్నారేమోనని ఆరా తీస్తే చిన్నవాల్తేరు లోని ఓ లాడ్జ్‌లో దొరికారు ఇద్దరు రౌడీలు. హత్యకు ముందురోజున వాళ్ళు బిహార్ నుంచి వచ్చి ఆ లాడ్జ్‌లో దిగినట్లు తెలిసింది. లాకప్‌లో పడేసి డ్రెస్సింగ్ డౌన్ ఇచ్చేసరికి గోవిందరావును చంపింది తామేనని ఒప్పుకున్నారు. ఆ హత్య వెనుకున్న మోటివ్ కోసం ప్రశ్నించిన పోలీసులను వాళ్ళు బైటపెట్టిన విషయాలు షాక్‌కి గురిచేశాయి. రైల్వేల్లో ఏడాదికి జనరేట్ అయ్యే 20 లక్షల టన్నుల స్క్రాప్‌లోని ఇనుము, స్టీల్, అల్యూమినియం, ఇత్తడి, రాగి విలువ ఇంచుమించు 5 వేల కోట్లుంటుంది. దాన్ని పబ్లిక్ వేలం ద్వారా అమ్మేస్తుంటారు. స్క్రాప్ కాంట్రాక్టర్స్ ఆ వేలంపాటలో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. అది మిక్కిలి లాభసాటి బిజినెస్ కావడమే అందుకు కారణం. అయితే, ఆ వేలంపాటను ఓ వ్యక్తి నియంత్రించడం విశేషం! అతని పేరు భానోజీ. స్క్రాప్ మాఫియా డాన్. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, అసన్సోల్లతో ఆరంభమైన అతని ఆపరేషన్స్ అనతికాలంలోనే తూర్పు, దక్షిణ–తూర్పు కోస్తాలకు పాకిపోయాయి. ‘ఎక్స్టార్షన్’, ‘మర్డర్ త్రెట్’ భానోజీ ఆయుధాలు. ఏ జోన్లో ఎవరు, ఎప్పుడు వేలంపాటలో పాల్గొనాలో అతను నిర్ణయిస్తాడు. అందుకు ఆ కాంట్రాక్టర్ అతను కోరిన సొమ్మును చెల్లించాలి. అంతేకాదు స్క్రాప్‌ని రైల్వే యార్డ్ నుండి తరలించేటప్పుడు ఒక టన్నుకు వేయి రూపాయల చొప్పున ‘గూండా టాక్స్’ కూడా వసూలు చేస్తుంటారు భానోజీ మనుషులు. ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ కాంట్రాక్టర్‌కి భూమి మీద నూకలు చెల్లినట్టే! ఆ సంగతులన్నీ తెలిసినా, తెలియనట్టే వుంటుంది రైల్వే శాఖ. మునుపు స్క్రాప్ కాంట్రాక్టర్స్ కొందరు ‘సిండికేట్’గా ఏర్పడి వేలాన్ని నియంత్రించేవారు. భానోజీ రంగప్రవేశం చేశాక సీన్ పూర్తిగా మారిపోయింది. అతను చెప్పిందే శాసనం. తనకు ఎదురు తిరిగినవారిని నిర్దాక్షిణ్యంగా చంపేయసాగాడతను. అందువల్ల ఆయా రాష్ట్రాల్లోని స్క్రాప్ కాంట్రాక్టర్స్ అంతా కలసి ఓ అసోసియేషన్‌గా ఏర్పడి భానోజీతో ఒప్పందానికి వచ్చారు. నెలనెలా కొంత సొమ్ము అసోసియేషన్ తరపున మామూళ్ళు సమర్పించుకుంటే వేలంపాటలో పాల్గొనేందుకు అతను వంతులవారీగా కాంట్రాక్టర్లను ఎంపిక చేసేట్టు.. ఆ కాంట్రాక్టర్ అతను కోరిన సొమ్మును చెల్లించేటట్టు ఒడంబడిక జరిగింది. దాన్ని ఉల్లంఘించిన వారు హత్య చేయబడతారు. చిత్రమేమిటంటే అతనెవరో, ఎలా వుంటాడో, ఎక్కడ వుంటాడో ఎవరికీ తెలియదు. అతని అసలు పేరు కూడా తెలియదు. కాంట్రాక్టర్స్‌కి అతని నుండి ఫోన్ వస్తుంది. వారి సెల్‌ఫోన్ స్క్రీన్ మీద అతని మొబైల్ నంబర్ కానీ, పేరు కానీ కనపడవు. కేవలం ‘రెండు సున్నాలు (00)’ ప్రత్యక్షమవుతాయి. అందువల్ల అతన్ని ‘డబుల్ జీరో’గా వ్యవహరిస్తుంటారంతా. మాఫియా లీడర్‌కి లొంగిపోయినందుకు అసోసియేషన్‌ని తప్పుపడుతూ, భానోజీ డిక్టాట్స్ని వ్యతిరేకించడానికి పూనుకున్నారు కొందరు యువ కాంట్రాక్టర్స్. పర్యవసానంగా వారు హత్యకు గురవసాగారు. వారిలో విశాఖపట్టణానికి చెందిన గోవిందరావు ఒకడు. ఆ ప్యాటర్న్‌లోనే ఇతర రాష్ట్రాలతో పాటు హౌరా, సీల్దాల్లోనూ జరగడంతో బెంగాల్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సి.ఐ.డి. నుండి ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. అది డాన్ గురించిన సమాచారాన్ని సేకరించడంలో కొంతవరకు విజయం సాధించింది. భానోజీ బిహార్‌కి చెందినవాడు. నేపాల్‌ని స్థావరంగా చేసుకుని రైల్వే స్క్రాప్ మాఫియాని నడుపుతున్నాడు. అతనికి కొందరు రాజకీయనేతల అండదండలే కాక, పోలీసువర్గాల్లోనూ అతని మద్దతుదారులున్నట్టు అనుమానం. అతని పాత ఫొటోగ్రాఫ్‌ని ఎలాగో సంపాదించగలిగారు. ఓసారి బొకారో స్టీల్ సిటీకి చెందిన ఓ యువ కాంట్రాక్టర్ అసోసియేషన్ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ భానోజీని ధిక్కరించే ప్రయత్నం చేశాడు. వేలంపాటలో పాల్గొనబోతున్నట్టు, చేతనైతే తనను ఆపమనీ స్క్రాప్ డాన్‌కి సవాల్ విసిరాడు. భానోజీకి విషయం తెలియడంతో, ఆ కాంట్రాక్టర్‌కి ఫోన్‌చేసి వేలంపాట సమయంలోనే అతన్ని స్వయంగా పబ్లిక్‌లో చంపుతానని బెదిరించాడు. ఆ సంగతి తెలిసిన పోలీసులు స్క్రాప్ డాన్ కోసం వల పన్నారు. ఆ యువకాంట్రాక్టర్ ధైర్యంగా ఆ వేలంపాటలో పాల్గొన్నాడు. రైల్వే పోలీసులు, లోకల్ పోలీసులకుతోడు ప్లెయిన్ క్లోత్స్ పోలీస్‌మెన్ కూడా అచ్చటి జనంలో కలసిపోయి ఉన్నారు డాన్ కోసం పరికిస్తూ. వేలంపాట ముమ్మరంగా సాగుతూన్న సమయంలో ఆ యువకాంట్రాక్టర్ పోలీసుల సాక్షిగా పబ్లిక్‌గా పిస్టల్‌తో కాల్చి చంపబడ్డాడు! ఆ తరువాత విచారణలో తెలిసిందేమిటంటే భానోజీ పోలీస్ యూనిఫామ్‌లో వచ్చి ఆ మర్డర్ చేసి మాయమయ్యాడని! ఆ సంఘటనతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సంబంధిత రాష్ట్రాలకు చెందిన ఉన్నత పోలీసు అధికారులు కోల్‌కతాలో అత్యవసర సమావేశమయ్యారు. ∙∙ నేపాల్ రాజధాని ఖట్మండూలోని పార్టీ యానిమల్స్ ఫేవరేట్ ఏరియా– లజీంపేట్.. రాత్రి 9 గంటలు అవుతోంది. ఓ అందమైన యువతి ఆ వీధిలో పరుగెడుతోంది. పోలీసులు ఆమెను తరుముతున్నారు. సందుగొందులు తిరుగుతూ తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ మెయిన్ రోడ్డును చేరుకున్న ఆ యువతి వేగంగా వస్తూన్న ఓ కారుకు అడ్డుపడింది. సడన్ బ్రేక్‌తో ఆగింది కారు. కంగారులో కిందపడిపోయిందామె. డ్రైవ్ చేస్తూన్న నడివయస్కుడు దిగి వచ్చాడు. అప్పటికే కంగారుగా పైకి లేచి, మోచేతికి తగిలిన గాయాన్ని చూసుకుంటోంది. నేపాలీస్ భాషలో కోపంగా అరిచాడతను.‘పోలీసులు తరుముకొస్తున్నారు’ అంటూ మళ్ళీ పరుగెత్తబోయిందామె. సందుమలుపులో ప్రత్యక్షమైన పోలీసుల్ని చూసి, ‘త్వరగా కారెక్కు’ అన్నాడు. మారు యోచన చేయకుండా ఎక్కేసిందామె. కొంతసేపటికి ఓ విల్లా వద్ద ఆగింది కారు. ఆమె దిగి వెళ్ళిపోతానన్నా వినకుండా లోపలికి తీసుకువెళ్ళాడతను. ‘ఇప్పుడు చెప్పు, పోలీసులు నిన్ను ఎందుకు తరుముతున్నారు? ఏం నేరం చేశావ్?’ అనడిగాడు. ఆమె సంశయిస్తూంటే, ‘నిజం చెప్పకపోతే పోలీసులకు ఫోన్ చేసి నిన్ను అప్పగిస్తాను’ అని బెదిరించాడు. ఆ యువతి చెబుతూంటే ఆశ్చర్యంతో వింటూండిపోయాడతను. ఆమె పేరు పారెల్. ఓ పిక్ పాకెట్. రెండురోజుల కిందట అరబ్ షేక్ ఒకడు ఖట్మండూ వచ్చాడు. బత్తీస్ పుటలి రోడ్‌లోని ద్వారికా హోటల్లో బసచేశాడు. అతని వద్ద కోటిరూపాయల విలువచేసే వజ్రం ఒకటి ఉందనీ, దాన్ని అమ్మడానికే నేపాల్ వచ్చాడనీ తెలిసింది. ఆ యువతి బాయ్ ఫ్రెండ్ బైజూ కూడా పిక్ పాకెటే. అతని ప్రోద్బలంతో ఆ వజ్రాన్ని దొంగిలించడానికి సిద్ధపడ్డారిద్దరూ. ఏదో మిషతో ఆ రోజు రాత్రి ద్వారికా హోటల్‌కి వెళ్ళి అరబ్ షేక్‌ని కలవడానికి ప్రయత్నించారు. అతనికేం అనుమానం వచ్చిందో పోలీసుల్ని పిలిపించాడు. ఆ జంట పారిపోజూసింది. బైజూ దొరికిపోయాడు. ఆమె ఎలాగో తప్పించుకుంది. అంతా విని ‘వజ్రం గురించి నువ్వు చెబుతున్నది నిజమేనా?’ అనడిగాడు. నిజమే అందామె. ‘ఈరాత్రికి నువ్వు బైటకు వెళ్ళడం మంచిదికాదు. తెల్లవారాక ఆలోచిద్దాం’ అన్నాడు. తరువాత ఎవరికో ఫోన్ చేసి, కొద్ది నిముషాలు మాట్లాడాడు. మర్నాడు అతను 35 ఏళ్ళ వ్యక్తిని కలిశాడు. ‘భాయ్! రాత్రి నువ్వు చెప్పినట్టే ఆ పిల్ల బ్యాక్ గ్రౌండ్ చెక్ చేశాను. ఆమె చెప్పిందంతా నిజమేనని తేలింది. నయానో భయానో ఆమెను ఒప్పించి ఆ షేక్ మీద ప్రయోగిద్దాం. వీలు చూసుకుని వజ్రాన్ని కైవసం చేసుకుందాం’ అన్నాడు. ∙∙ కాఠ్మాండూలోని ‘ద ద్వారికా హోటల్’ అంతర్జాతీయ అతిథుల తొలి ఛాయిస్ అది. ఆ రాత్రి హోటల్ డా¯Œ ్స ఫ్లోర్లో పారెల్ అందాన్ని తిలకించిన అరబ్ షేక్ ఫ్లాట్ అయిపోయాడు. ఆమె వద్దకు వెళ్ళి ‘ఈ రాత్రి నాతో ఉంటే నీపైన దీనార్ల వర్షం కురిపిస్తాను’ అన్నాడు. అరగంట తరువాత ఇద్దరూ కలసి షేక్ ఉంటున్న స్వీట్‌కి వెళ్ళారు. ఇద్దరికీ షేకే స్వయంగా డ్రింక్స్ కలిపాడు. అతను దుస్తులు మార్చుకుంటూంటే చాటుగా అతని డ్రింక్‌లో ఏదో పొడిని కలిపిందామె. అతను వచ్చాక ‘ఛీర్స్’ చెప్పుకుని డ్రింక్ చేయనారంభించారిద్దరూ. ఐదు నిముషాల తరువాత ఏదో మత్తు ఆవహించడంతో సోఫాలో వెనక్కి వాలిపోయాడు షేక్. పారెల్ అతన్ని కుదిపిచూసి, సెల్లో ఎవరికో ఫోన్ చేసింది. రెండు నిముషాల్లో ‘భాయ్’, అతని అనుచరుడూ ప్రవేశించారు. షేక్ ముక్కు దగ్గర వేలుపెట్టి చూసి, ‘వెల్ డన్!’ అంటూ పారెల్ని ప్రశంసించి, వజ్రంకోసం ఎడ్జాయినింగ్ రూమ్‌లోని ఐరన్ సేఫ్ తెరవడానికి ఉపక్రమించారు. దానికి డిజిటల్ లాక్ ఉండడంతో ఎలక్ట్రానిక్ కట్టర్‌తో తెరవచూశారు. అదే సమయంలో షేక్ నిశ్శబ్దంగా లేచి నిలుచున్నాడు. తలగడ కిందనుంచి రివాల్వర్ తీసుకుని సేఫ్ ఉన్న గదిలోకి వెళ్ళాడు. ‘భాయ్’ తలకు గురిపెట్టి ‘హ్యాండ్సప్ భానోజీ!’అన్నాడు. అదిరిపడ్డారు వాళ్ళు. రెండవ వ్యక్తి చేయి జేబులోకి వెళ్ళబోతే, ‘డోంట్ మూవ్, మ్యాన్!’ అంటూ షేక్ వెనుకే వచ్చిన పారెల్ పిస్టల్ని గురిపెట్టింది. ∙∙ ఈ సీక్రెట్ మిషన్‌లో ప్రభుత్వం చెన్నైకి చెందిన ప్రైవేట్ డిటెక్టివ్ ప్రాణ్ సహాయాన్ని కోరింది. అతను తన అసిస్టెంట్ మిస్ గీతతో కలసి నేపాల్ వెళ్ళి మూడు నెలలపాటు అక్కడే మకాం వేసి భానోజీ కోసం గాలించాడు. అతని జాడ తెలియగానే, అతన్ని ట్రాప్ చేసేందుకు తగిన స్కెచ్ వేశాడు. తాను అరబ్ షేక్గానూ, గీత పారెల్గాను మారి వజ్రం పేరిట వలపన్ని భానోజీని హోటల్‌కి రప్పించడం, బంధించడం చేశారు. ఇటు భారత పోలీసులు, అటు నేపాల్ పోలీసుల ప్రమేయం లేకపోవడంతో ఆపరేషన్ అత్యంత గోప్యంగా, విజయవంతంగా జరిగిపోయింది. (యధార్థ సంఘటనల ఆధారంగా మలచిన ఈ కథ వాస్తవంలో ‘మాఫియా డాన్’ అసలు పేరు మాధవ్ సింగ్. కాంట్రాక్టర్లకు అతను ‘డబుల్ జీరో’ గానే తెలుసు. బిహార్, నేపాల్ సరిహద్దులోని సీతామర్హి జిల్లాలోని బరారీ సొంతూరు. తొలుత మాఫియా డాన్ బీరేందర్ కింద పనిచేసి ఆ తరువాత తన స్వంత ‘సామ్రాజ్యాన్ని’ ఏర్పరచుకున్నాడు. ఈనాటి వరకు డబుల్ జీరోని పోలీసులు అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. చదవండి: బస్ నెంబర్ 375.. వణుకుపుట్టించే మిస్టరీ.. నిజమా? అబద్ధమా? -
రైతు ఐడియా చూసి వావ్ అనాల్సిందే!.. ఫన్నీ వీడియో
సాక్షి,హైదరాబాద్: శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు మనిషి తనకెదురయ్యే అపాయాలకు, కష్టాలకు మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాడు. తనకున్న పరిధిలో ఎప్పటికపుడు అనేక ఉపాయాలను కనుక్కుంటూనే ఉంటాడు. ఇదొక నిరంతర ప్రక్రియ. ఆ అన్వేషణ, తపనే అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఆసక్తిని రేపుతోంది. కాకులు, ఇతర పక్షుల బెడదనుంచి తన పొలాన్ని తప్పించుకునేందుకు ఒక రైతు చేసిన ప్రయోగం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. స్ప్రింగ్ ద్వారా ఒక బొమ్మను నిరంతరం కదులుతూ ఉండేలా, పక్షులను అదిలిస్తున్నట్టుగా ఏర్పాటు చేశాడు. ఇది చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. అంతేకాదు కాకులేమోగానీ, మనుషులకు మాత్రం హార్ట్ ఎటాక్ రావడం గ్యారంటీ అంటూ చమత్కరిస్తున్నారు. కాగా సాధారణంగా పొలంలో పశువులు, ఇతర పక్షులనుంచి పంటను రక్షించుకునేందుకు దిష్టిబొమ్మలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. పంట చేతికొచ్చే సమయానికి పక్షులు, పశువులు తినకుండా, నరదిష్టి తగులకుండా పంట చేలల్లో రకరకాల దిష్టిబొమ్మలు పెడుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్లు పోటోలు పొలంలో దిష్టి బొమ్మలుగా పెట్టుకున్న వైనం విచిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. O bhai saheb...did Ramsay brothers create this one??! crows ka toh nahi pata, insano ka heart attack guaranteed. https://t.co/sVFpd4bxo6 — Smita Sharma (@Smita_Sharma) July 12, 2021 -
‘డేటింగ్ ట్రాప్’ ముంబై వ్యక్తి పనే..
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన బాలికకు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమై, వేధింపులకు పాల్పడిన వ్యక్తి ముంబైకి చెందిన అమీర్ అహ్మద్ ఖాన్‌గా సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు తేల్చారు. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం శుక్రవారం అతడిని అరెస్టు చేసి సిటీకి తీసుకువచ్చింది. నగరానికి చెందిన బాలిక (14) డేటింగ్ యాప్‌ను తన సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంది. దాని ద్వారా ఆమె అనేక మందితో చాటింగ్ చేసింది. ఈ నేపథ్యంలో అమీర్ అహ్మద్ ఖాన్‌తో సదరు బాలికకు పరిచయం ఏర్పడింది. అక్కడి ఓ చెప్పుల కంపెనీలో పని చేసే ఇతగాడు నిత్యం వివిధ యాప్స్ ద్వారా అనేక మందికి ఎర వేస్తుంటాడు. ఇదే తరహాలో నగర బాలికతో పరిచయం పెంచుకున్న ఖాన్ తొలినాళ్లల్లోస్నేహపూర్వకంగా మాట్లాడుతూ ట్రాప్ చేశాడు. ఆపై ఆమెను ఆన్లైన్ అశ్లీలం ముగ్గులోకి దింపాడు. ఆమెతో వీడియో కాల్స్ కూడా చేయించుకున్న అతగాడు ఓ సందర్భంలో వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు సంగ్రహించాడు. ఆపై అసలు కథ మొదలెట్టిన నిందితుడు తక్షణం బయలుదేరి ముంబై రావాలని, లేదంటే ఆ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్లో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. ఓ దశలో ఆమె జీమెయిల్ ఐడీ, పాస్వర్డ్ సైతం తీసుకుని కాంటాక్ట్స్‌ను తన ఆదీనంలోకి తీసుకున్నాడు. అతడి బెదిరింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. దీంతో వారు సోమవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ ప్రశాంత్, ఎస్సై తిరుమలేష్‌లతో కూడిన బృందం ఈ కేసు దర్యాప్తు చేసింది. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి తీసుకువచ్చింది. మరోపక్క ఓఎల్ఎక్స్లో తక్కువ ధరకే ద్విచక్ర వాహనం విక్రయిస్తున్నట్లు ప్రకటన ఇచి్చన సైబర్ నేరగాళ్లు ఓ ఆర్మీ జవాన్‌కు టోకరా వేశారు. ఈయన నుంచి వివిధ చార్జీల పేరుతో రూ.3.2 లక్షలు కాజేశారు. చదవండి: పోలీస్‌పై దాడి.. దొంగపై కాల్పులు -
ఉచ్చులో చిక్కిన చిరుత
చండూరు: అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపురం అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. అజిలాపురం, రంగా రెడ్డి జిల్లా సరిహద్దు అడవుల మధ్య అజిలాపురం గ్రామానికి చెందిన రైతులు తమ పంటలను అడవి పందుల బారినుంచి కాపాడుకునేందుకు ఉచ్చులు వేశారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆ ఉచ్చులో చిరుతపులి చిక్కింది. ఉదయాన్నే వచ్చి చూసిన రైతులకు చిరుత కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని ఫారెస్ట్, జూపార్క్ అధికారులకు సమాచారం ఇచ్చారు. జూ సిబ్బంది వచ్చి చిరుతకు మత్తు మందు ఇచ్చి జూపార్క్‌కు తరలించారు. -
ట్రాప్‌లో పడతారు
మహేందర్ ఇప్పలపల్లి హీరోగా, షాలు, కాత్యాయనీ శర్మ హీరోయిన్లుగా బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ట్రాప్’. ఆళ్ల స్వర్ణలత నిర్మాతగా పరిచయమవుతున్న ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా వీఎస్ ఫణింద్ర మాట్లాడుతూ–‘‘లవ్, క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఈ చిత్ర కథ చెప్పగానే నాతో సినిమా తీయడానికి ఒప్పుకున్న ఆళ్ల స్వర్ణలతగారికి థ్యాంక్స్. ‘సింధూరం’ సినిమా బ్రహ్మాజీగారికి ఎంత మంచి పేరు తీసుకువచ్చిందో ‘ట్రాప్’ చిత్రం నాకు అంత మంచిపేరు తీసుకువస్తుందని నమ్ముతున్నాను’’అన్నారు. ‘‘నిర్మాణ రంగంలోకి రావాలంటే తొలుత చాలా భయం వేసింది. కానీ, హీరో, హీరోయిన్, సాంకేతిక నిపుణులందరూ మంచి సహకారం అందించడంతో సినిమా చాలా బాగా వచ్చింది. మా చిత్రం అన్ని కార్యక్రమాలను ఫణీంద్ర దగ్గరుండి చూసుకున్నారు’’ అన్నారు ఆళ్ల స్వర్ణలత. రచ్చరవి, విట్టల్, పరమేశ్వర శర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె, శివ, సంగీతం: ఈశ్వర్ పెరావలి, నేపథ్య సంగీతం: హర్ష ప్రవీణ్. -
ట్రాప్‌లో పడేస్తారు
‘‘ట్రాప్’ సినిమా ట్రైలర్ చూడగానే తెలుగు ప్రేక్షకులందర్నీ ట్రాప్‌లో పడేస్తుందనిపించింది’’ అని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మహేందర్ ఎప్పలపల్లి, కాత్యాయనీ శర్మ జంటగా బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో వీఎస్ ఫణీంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ట్రాప్’. స్వర్ణలత నిర్మించారు. ప్రేమ కవితాలయ పతాకం లోగోను నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ‘ట్రాప్’ లోగోను నిర్మాత సురేష్ చౌదరి, టీజర్‌ను రచయిత మోహన్ వడపట్ల, ట్రైలర్‌ని బాలకిషన్ విడుదల చేశారు. ‘‘హీరో, హీరోయిన్‌తో పాటు సాంకేతిక నిపుణులందరూ మంచి సపోర్ట్ అందించారు’’ అన్నారు స్వర్ణలత. ‘‘క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు విఎస్ ఫణీంద్ర. కాత్యాయనీ శర్మ పాల్గొన్నారు. -
ముల్లును ముల్లుతోనే తీయడమంటే ఇదే!
న్యూఢిల్లీ: ముల్లును ముల్లుతోనే తీయడమంటే ఇదే. ఢిల్లీలో దాడి చేయడానికి వచ్చిన ఐఎస్ ఉగ్రవాదిని నిఘా వర్గాలు ఉచ్చు పన్ని మరీ పట్టుకున్నాయి. సుమారు 18 నెలల పాటు సాగిన ఈ ఆపరేషన్ హాలివుడ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదంటే అతిశయోక్తి కాదు. ఆ ఉగ్రవాదిని నమ్మించడానికి మనోడిని ఉగ్రవాదిగా అతనికి పరిచయం చేయడం దగ్గర నుంచి, పట్టుబడిన ఉగ్రవాది వెల్లడించిన సమాచారం వరకు ఇదో మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. గత సెప్టెంబర్‌లోనే ఐఎస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా, అధికారులు ఆ వివరాలను తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్లో ఉగ్రశిక్షణ పొందిన 12 మంది ఐఎస్ ఉగ్రవాదుల బృందం భారత్‌తో పాటు ఇతర దేశాల్లో బాంబుదాడులకు తెగపడనున్నట్టు నిఘావర్గాలకు (రిసెర్చీ అనాలిసిస్ వింగ్–రా) సమాచారం అందింది. ఐఎస్ కార్యకలాపాల నిమిత్తం దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు అఫ్గానిస్తాన్‌కు సుమారు రూ.34 లక్షలు పంపినట్లు అమెరికా నిఘా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అనేక టెలిఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసిన తరువాత అఫ్గానిస్తాన్ సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడేందుకు వస్తున్నట్టు తెలిసింది. కీలక సమాచారం లభ్యం.. ఇంజనీరింగ్ విద్యార్ధిగా భారత్‌కు వచ్చిన ఉగ్రవాదితో స్నేహం పెంచుకునేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ ఏజెంట్ అవతారంలో ఓ వ్యక్తిని పంపింది. అతని ద్వారానే ఉగ్రవాదికి లజ్‌పత్‌నగర్‌లో వసతితో పాటు, పేలుడుపదార్థాలు సమకూర్చారు. ఢిల్లీలో ఐఎస్ ఉగ్రవాది కదలికలపై నిఘా పెట్టేందుకు నెలరోజుల నిరంతరం 80 మంది సిబ్బంది పనిచేశారు. ఆత్మాహుతి దాడుల కోసం ఢిల్లీ విమానాశ్రయం, అన్సల్ ప్లాజా మాల్, వసంత్‌కుంజ్ మాల్, సౌత్ ఎక్స్టెన్షన్ మార్కెట్లలో ఉగ్రవాది రెక్కీ నిర్వహించాడు. వీటన్నింటిని కనిపెట్టిన భద్రతా అధికారులు సమయం చూసుకుని అతన్ని అరెస్ట్ చేసి అఫ్గానిస్తాన్‌లోని అమెరికా దళాలకు అప్పగించారు. పట్టుబడిన ఉగ్రవాది ద్వారా 11 మంది సహచరుల కదలికలు కనుక్కోవడంతో పాటు, అతడిచ్చిన సమాచారంతో అనేక ఐఎస్ స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇటీవల అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లపై అమెరికా దళాలు పై చేయి సాధించేందుకు అవసరమైన సమాచారాన్ని అతడి వద్దే సేకరించారు. 2017 మే 22న బ్రిటన్‌లో 23 మందిని బలిగొన్న మాంచెస్టర్ దాడి అతడి సహచరుల్లోని ఒకరి పనేనని తేలింది. ఆ దాడిలో ఏయే పేలుడు పదార్థాలు వాడారో, అలాంటి వాటినే ఢిల్లీ పేలుళ్లలో వాడాలని అతడు కోరుకున్నట్లు తెలిసింది. -
మరణశయ్యపై మరో పులి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల, చెన్నూర్: చెన్నూర్ ఫారెస్టు డివిజన్లో ఓ పులి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. వేటగాళ్లు అమర్చిన ఇనుప తీగల ఉచ్చు రోజురోజుకు బిగుసుకుపోతుండటంతో గాయం తీవ్రమవుతోంది. మూడు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా చెన్నూర్ అటవీ ప్రాంతంలో తీవ్ర గాయంతో ఆ పులి సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాకు చిక్కింది. ఏడాదిన్నర వయసు గల ఈ కే–4 పులి ప్రాణాలకు ప్రమా దం ఉందని గతంలో ‘సాక్షి’కథనాలు ప్రచురిం చిన విషయం తెలిసిందే. గతేడాది కోటపల్లి అటవీ ప్రాంతంలో జేష్ట అనే పులి వేటగాళ్ల చేతిలో హతమైనా, మరో పులి గాయంతో సంచ రిస్తోందని తెలిసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి ఇంతవరకు వచ్చింది. సంరక్షణ ఏదీ? చెన్నూర్ ఫారెస్టు డివిజన్లో సంచరిస్తున్న ఈ పులి ఆవుల్ని హతమారుస్తోంది. హతమైన ఆవు లు, పశువులకు అటవీ అధికారులు పరిహారం చెల్లిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 30 మంది కి పరిహారం చెల్లించారు. పులికి అటవీ ప్రాం తంలో ఆహారం లభిస్తే పశువులను హతమార్చే అవకాశాలు లేవని గ్రహించి జన్నారం అటవీ ప్రాంతం నుంచి 25కు పైగా జింకల్ని తీసుకొచ్చి అటవీ ప్రాంతంలో వదిలేశారని సమాచారం. ఆహారంపై దృష్టి పెట్టిన అధికారులు.. గాయం తీవ్రమైనట్లు తెలిసినా చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నూర్ ఫారెస్టు డివిజన్ పరిధిలోని చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి రేంజ్‌లలో వన్యప్రాణి సంరక్షణ కోసం 200 సీసీ కెమెరాలు, 3 బేస్ క్యాం పులు, 1 స్ట్రైకింగ్ ఫోర్స్, 1 యానిమల్ ట్రాకర్స్ బృందాలు ఏర్పాటు చేశారు. వీరితోపాటు ఫారెస్ట్ సిబ్బంది 50 మందికి పైగానే ఉన్నారు. వీరంతా పులి సంరక్షణకు ప్రయత్నం చేయకపోవడం నిర్లక్ష్యమేనని తెలుస్తోంది. పాత కథే పునరావృతం అవుతుందా.. కోటపల్లి మండలం పిన్నారంలో గత డిసెంబర్ లో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ వైర్లకు తగిలి పులి హతమైంది. దీనిపై ఇద్దరు ఫారెస్టు అధికారులను సస్పెండ్ చేసి ఉన్నతాధికారులు చేతులు దులిపేసుకున్నారు. ఈ పులి విషయంలోనూ ఇదే పునరావృతం అవుతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులి బతికుంటే సంరక్షణ కోసం పాట్లు పడాల్సి వస్తుందనే అ«ధికారులు నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆరోగ్యంగానే ఉంది.. పులి ఆరోగ్యంగానే ఉంది. రోజుకు 10 కిలోమీటర్లు సంచరిస్తోంది. ఇప్పటివరకు 26 పశువుల్ని హతమార్చింది. అనారోగ్యంగా ఉంటే ఆహారం తీసుకోలేదు. ఏప్రిల్‌లో సీసీ కెమెరాలను పరిశీలించాం. పులి సంచారం కానరాలేదు. పులి జాడ, పరిస్థితి గురించి తెలుసుకోడానికి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం. – అనిత, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, చెన్నూర్ -
ఖాకీ చొక్కాని అడ్డుపెట్టుకొని.. అమ్మాయిలతో సెల్ఫీలా?
సాక్షి, కర్ణాటక : సుజిత్ శెట్టి అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఒంటి మీద ఖాకీ చొక్కాని అడ్డు పెట్టుకొని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సుజీత్‌పై కేసు నమోదు చేసి, సస్పెండ్ చేశారు. సుజిత్ కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న శిర్వా పోలీస్ స్టేషన్లో గత ఆరు నెలలుగా హోంగార్డ్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇతడు 11 మంది అమ్మాయితో దిగిన సెల్ఫీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసులు ‘మహిళల రక్షణ కోసం షీ టీమ్‌లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటారు.. మరి మీ నుంచి మహిళల్ని రక్షించేదెవరు. అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా చేస్తుంటే ఏవరితో చెప్పాల’ని ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు. -
ఖాకీ చొక్కాని అడ్డుపెట్టుకొని.. అమ్మాయిలతో..
-
స్మగ్లర్ల వలలో యువత
– కృష్ణగిరి కళాశాలలో ఎమ్మెస్సీ చదువుతున్న ఏలుమలై ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండాలని భావించాడు. ఉపాధి లేక అడవిబాట పట్టాడు. ఎర్రచందనం చెట్లు నరికి వాహనంలో తీసుకొస్తుండగా గత గురువారం రాత్రి కరకంబాడి సమీపంలోని ఆంజనేయపురం వద్ద టాస్క్‌ఫోర్స్ అధికారులకు చిక్కాడు. – వేలూరుకు చెందిన గోవిందరెడ్డి తిరువణ్ణామలై ఆర్ట్స్ కళాశాలలో ఎంకాం చదువుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులు గోవిందరెడ్డిని స్మగ్లర్‌గా మార్చాయి. కుటుంబ అవసరాల కోసం గోవిందు అడవిబాట పట్టాడు. తమిళనాడు నుంచి వాహనంలో అడవిలోకి వెళ్తుండగా గత గురువారం రాత్రి టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడిలో పట్టుబడ్డాడు. .. ఇలా ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు నిరుద్యోగంతో విసుగుచెంది స్మగ్లర్లుగా మారుతున్నారు. పుస్తకాలు చేతబట్టాల్సిన చేతులు గొడ్డళ్లు పట్టుకుని అడవి బాటపడుతున్నాయి. సాక్షి, తిరుపతి: ఆర్థిక ఇబ్బందులు.. చదువుకున్నా ఉపాధి లేక.. ఇంట్లో ఖాళీగా ఉండలేక.. కుటుంబంపై ఆధారపడలేక యువత నలిగిపోతోంది. ఏం చేయాలో తెలియక తప్పటడుగు వేస్తోంది. స్మగ్లర్లుగా మారి తల్లిదండ్రులకు తలవొంపులు తెస్తోంది. ఇటీవల ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్ దాడిలో పట్టుబడుతున్న వారిని చూస్తే ఇదే అనిపిస్తోంది. నెల క్రితం చంద్రగిరి సమీపంలో పట్టుబడ్డ సుబ్రమణియన్ (బీటెక్), మురుగన్ (ఎంటెక్)తో పాటు ఆర్థిక ఇబ్బందులతో చదువు పూర్తిచేయలేని వారు, ఉన్నత చదువులు పూర్తిచేసి ఉద్యోగం రాక ఇబ్బందులు ఎదుర్కొం టున్న వారు అనేక మంది ఉన్నారు. శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనానికి దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ దుంగలను గమ్యస్థానానికి చేరవేస్తే కోట్ల రూపాయలు వస్తుండడంతో స్మగ్లర్లు తమ అవసరాల కోసం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న యువతకు గాలం వేస్తున్నారు. అందులో భాగంగా వేలూరు కు సమీపంలోని తిరువణ్ణామలై కళాశాలలో చదువుతున్న విద్యార్థులపై దృష్టి సారించారు. వారే టార్గెట్ అర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని స్మగ్లర్లు లక్ష్యంగా చేసుకున్నారు. అటువంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా ఐదుగురి చొప్పున ఏడు గ్రూపులను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఈ గ్రూపులు కళాశాల సమీపంలో టీ అంగళ్లు, క్యాంటీన్ల వద్ద తిష్టవేస్తారు. అక్కడకు వచ్చే విద్యార్థులను ఆకర్షిస్తారు. రెండు, మూడు పర్యాయాలు మాటలు కలిపి పరిచయం చేసుకుంటారు. వారి ద్వారా నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తిస్తారు. ఎర్రచందనం రవాణా ద్వారా లక్షాధికారి కావొచ్చని ఆశలు చిగురింపజేస్తారు. సేలంలో ప్రత్యేక శిక్షణ ఎర్రచందనం అక్రమ రవాణాలో కొందరు అనుభవం ఉన్న స్మగ్లర్లతో యువతకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. విద్యార్థులు, నిరుద్యోగులను గుర్తించి వారిని సేలంకి తీసుకెళ్తారు. అక్కడ రహస్య ప్రాంతాల్లో వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వారం రోజుల పాటు ఎర్రచంనదం చెట్లు నరకడం, వాటిని దుంగలుగా మలచడం, వాటిని వాహనం వద్దకు తరలించడం వంటి మెళకువలు నేర్పిస్తున్నట్లు తెలిసింది. దుంగలు తరలిస్తున్న సమయంలో పోలీసులు, టాస్క్‌ఫోర్స్ అధికారులకు చిక్కకుండా పారిపోయే విషయం లోనూ మరింత శిక్షణ ఇస్తున్నారు. ఒకవేళ దొరికిపోతే విచారణలో ఏం చెప్పాలో కూడా నేర్పిస్తున్నారు. ఎవరు ఎంత విచారించినా ప్రధాన స్మగ్లర్ల పేర్లు చెప్పకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం శేషాచలం అడవిలోకి చొరబడుతున్న స్మగ్లర్లలో 35శాతం మంది యువతే అని టాస్క్‌ఫోర్స్, పోలీసులు స్పష్టం చేస్తున్నారు. యువతకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఎర్రచందనం అక్రమ రవాణాకు ఆకర్షితులవుతున్న యువతకు టాస్క్‌ఫోర్స్ బృందం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తోంది. యువత స్వగ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులను కలిసి వివరిస్తున్నారు. అందులో భాగంగా ఇటీవల టాస్క్‌ఫోర్స్ అధికారులు ఎర్రచందనంపై షార్ట్ ఫిలిమ్స్ తీసి యూట్యూబ్ ద్వారా ప్రచారం చేస్తుండడం గమనార్హం. -
ఏసీబీ వలలో సర్వేయర్
గోపాలపురం: గోపాలపురం తహసీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న పి.జాగారాలపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. బుధవారం రాత్రి ఏసీడీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొవ్వూరుపాడుకి చెందిన బసవ మంగరాజుకు భార్యకు చెందిన ఆరెకరాల పొలం ఉంది. కొంత కాలంగా పక్క రైతులతో విభేదాలు ఉండటంతో తన పొలాన్ని సర్వే చేయాలంటూ సర్వేయర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దీనిని సర్వేయర్ పి.జాగారాల రెండుసార్లు తిరస్కరించడంతో మరోసారి దరఖాస్తు చేసి రూ.585 చలానా తీశారు. సర్వేయర్ జాగారాల మాత్రం పొలం సర్వే చేయాలంటే రూ.20 వేలు కావాలని డిమాండ్ చేశారు. అంత నగదు ఇవ్వలేనంటే రూ.18 వేలకు ఒప్పుకున్నారు. మొదటి దఫాగా రూ.9 వేలు .. సర్వే జరిగిన రోజున మిగిలిన సొమ్ము పొలం వద్దే ఇవ్వాలని సర్వేయర్ జాగారాల చెప్పడంతో బాధిత రైతు మంగరాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అ«ధికారులు వ్యూహం ప్రకారం గోపాలపురం మీ సేవ కేంద్రం వద్ద రైతు మంగరాజు నుంచి రూ.9 వేలు తీసుకుంటుండగా సర్వేయర్ జాగారాలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువెళ్లి విచారించారు. ఏసీబీ సీఐ వీజే విల్సన్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో వీఆర్వో
రూ.ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం ఆలమూరు (కొత్తపేట) : పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరు కోసం రైతును లంచం అడిగిన వీఆర్వో ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. జొన్నాడలో విలేజ్ రెవెన్యూ అధి కారి (వీఆర్ఓ)గా పి.బాబూరావు పనిచేస్తున్నాడు. స్థానిక రెవెన్యూ పరిధిలో మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన రైతు ఉండమట్ల శ్రీనివాసు కుటుంబానికి చెందిన తొమ్మిది ఎకరాల భూమి ఉంది. దానికి సంబంధించి ఆ¯ŒSలై¯ŒSలో కుటుంబసభ్యుల పేర్లలో తప్పులు దొర్లడంతో వాటిని సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతు శ్రీనివాసు వీఆర్వో బాబూరావును పలుమార్లు కోరినా పట్టించుకోలేదు. సుదీర్ఘ ప్రక్రియ కావడంతో అడంగల్‌లో పేర్లు సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరుకు మార్గం సుగమం కావాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. వీఆర్వో చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతు శ్రీనివాసు ఏసీబీని ఆశ్రయించాడు. రాజమహేంద్రవరం అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ ఎం.మధుసూదనరావు ఆధ్వర్యంలో అధికారుల బృందం జొన్నాడలో నిఘా పెట్టి వీఆర్వోను లంచం తీసుకుంటుండగా పట్టుకుంది. ఏసీబీ అధికారులతో పాటు రాజమహేంద్రవరంలోని ఆర్టీఓ అధికారులైన టీకే పరంధామరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ జీవీవీ సత్యనారాయణను సాక్ష్యులుగా ఉన్నారు. పక్కా ప్రణాళికతో ఏసీబీ వల జొన్నాడ వీఆర్వో పి.బాబూరావు అవినీతిపై నెల రోజుల కిందటే ఫిర్యాదు అందడంతో ఏసీబీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. వీఆర్వోను జొన్నాడ సెంటర్లోని ఒక ప్రదేశానికి రప్పించారు. రైతులు మాదిరిగా వచ్చిన ఏసీబీ అధికారుల సమక్షంలో రైతు శ్రీనివాసు అడిగిన లంచంలో అడ్వా¯Œ్సగా రూ.ఐదు వేలు అందజేశారు. అందులో రెండు రెండు వేల నోట్లు, రెండు ఐదు వందల నోట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అడంగల్ సవరణ కోసం చేసుకున్న రైతు దరఖాస్తును పరిశీలించేందుకు ఆలమూరు తహసీల్దారు కార్యాలయానికి వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. దరఖాస్తు గడువు నిర్ణీత సమయంలో బడే ఉందని అధికారులు నిర్ధా రించుకున్నారు. అడంగల్‌లో సవరణకు సమగ్ర వివరాలు అందించాలన్నందుకే తనపై కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా ఇరికించారని నిందితుడైన వీఆర్వో బాబూరావు వివరించారు. బాధిత రైతు శ్రీనివాసు మాట్లాడుతూ బీ 1 ఫారం సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలంటే కోరిన లంచం ఇవ్వాల్సిందేనని, కూరగాయల బేరం ఆడవద్దని వీఆర్వో బాబూరావు హేళన చేశారని విలేకర్లకు తెలిపారు. ఏసీబీ సీఐ సూర్యమోహన్, ఎస్సై టి.నరేష్ తదితరులు పాల్గొన్నారు.