మంకీ ట్రాప్ గురించి విన్నారా..? | What Is The Monkey Trap Theory, Letting Go And Unlocking Freedom, Know More Inside | Sakshi
Sakshi News home page

Monkey Trap Theory: మంకీ ట్రాప్ గురించి విన్నారా..? తెలియకుండానే అందరూ..!

Published Mon, Jul 15 2024 1:28 PM | Last Updated on Mon, Jul 15 2024 3:40 PM

What Is The Monkey Trap Theory Letting Go And Unlocking Freedom

మంకీ ట్రాప్‌ ఏంటీ అనుకోకండి. ఎందుకుంటే తెలియకుండానే మన అందరం ఈ ట్రాప్‌లో పడిపోతున్నాం. చేజేతులారా జీవితాలని నాశనం చేసుకుంటున్నాం. నిజానికి మన పెద్దవాళ్లు కొన్నింటిని వదిలేసేందుకు ఇష్టపడితేనే హాయిగా ఉండగలం అని చెబుతుంటారు. కానీ మనం వదలం.  పట్టుకుని కూర్చొంటాం. జరగాల్సిన నష్టం జరిగేటప్పటికే మనం ఉండం. ఇలా ఈ భూమ్మీద ఎందరో ఈ విధంగానే ప్రవర్తిస్తున్నారు. అసలు ఏంటీ ట్రాప్‌..? అంతలా మనం ఆ ట్రాప్‌లో ఎలా పడతామంటే..

రెండు రోజుల క్రితం పేపర్లో వచ్చిన వార్త పరిశీలిస్తే..భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు... అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ  వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి సంచిలో అక్షరాల మొత్తం 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. "బిచ్చగాడి దగ్గర భారీ మొత్తం".  ఇక్కడ... విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది మానసిక శాస్త్రం.

మంకీ ట్రాప్‌ అంటే..
దీన్నే "మంకీ ట్రాప్" అంటారు. ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని ఒక తెగ వారు ఉపయోగిస్తారు. వాళ్లు కోతులను వేటాడటానికి  చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ... ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంద్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే  ఇది కోతి చేయి పట్టే అంత పెద్దది గా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. ఇక ఈ రంద్రంలో కోతి కి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి  రంద్రములో చేయి పేట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ  తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న... ప్రమాదం పొంచి ఉన్న.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది. తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది. చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.

నిజంగా మనకు ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతే..? అయితే ఇటువంటి మంకీ ట్రాప్‌లో మనం ఉన్నట్లే.. కష్టపడి సంపాదించుకున్న  డబ్బులను దాచిపెట్టుకొని ..ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు రాక.. తనువు చాలించిన వారు చాలా మందే సమాజంలో ఉన్నారు.  డబ్బు నిజంగా మనిషిని అంతగా కట్టి పడేస్తుందా?? అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్‌లో పడేస్తుంది. నిశితంగా  పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. మనకు తెలియకుండానే మనం కూడా అదే ట్రాప్ లో ఉన్నామనే విషయం గ్రహించకపోవడం విశేషం.  

ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేం? ఒక్క మాట పంతానికి పోయి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా? వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు ఉన్నారు.  అందుకే చిన్న మోతాదులో కానీ, పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్‌లో ఏమైనా ఉన్నామేమో? చెక్‌ చేసుకోవాలి.

అది బంధం కావచ్చు, డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం. ఉదాహారణకు..

  • మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు...

  • నో చెప్పలేని మోహమాటలు...

  • తిరిగి అడగలేని అప్పులు...

  • దండిచలేని ప్రేమలు...

  • ఊపిరి సలపనివ్వని పనులు...

  • ఒత్తిడి పెంచే కోరికలు....

  • ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు...

  • పేరు కోసం తీసే పరుగులు....

  • అన్నీ మంకీ ట్రాప్ లే!!

అందుకే  కొన్నిటిని వదిలేయడం అలవాటు చేసుకుందాం...... మరింత మనశ్శాంతిగా...ప్రశాంతముగా" ఉండేందుకు ప్రయత్నించండి అని చెబుతున్నారు మనస్తత్వ నిపుణులు. 

(చదవండి: ఉల్లిపాయలు తీసుకోకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement