ఏసీబీ వలలో వీఆర్‌వో
ఏసీబీ వలలో వీఆర్‌వో
Published Thu, Mar 23 2017 11:55 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
రూ.ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
ఆలమూరు (కొత్తపేట) : పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరు కోసం రైతును లంచం అడిగిన వీఆర్వో ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. జొన్నాడలో విలేజ్ రెవెన్యూ అధి కారి (వీఆర్‌ఓ)గా పి.బాబూరావు పనిచేస్తున్నాడు. స్థానిక రెవెన్యూ పరిధిలో మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన రైతు ఉండమట్ల శ్రీనివాసు కుటుంబానికి చెందిన తొమ్మిది ఎకరాల భూమి ఉంది. దానికి సంబంధించి ఆ¯ŒSలై¯ŒSలో కుటుంబసభ్యుల పేర్లలో తప్పులు దొర్లడంతో వాటిని సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతు శ్రీనివాసు వీఆర్వో బాబూరావును పలుమార్లు కోరినా పట్టించుకోలేదు. సుదీర్ఘ ప్రక్రియ కావడంతో అడంగల్‌లో పేర్లు సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరుకు మార్గం సుగమం కావాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. వీఆర్వో చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతు శ్రీనివాసు ఏసీబీని ఆశ్రయించాడు. రాజమహేంద్రవరం అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ ఎం.మధుసూదనరావు ఆధ్వర్యంలో అధికారుల బృందం జొన్నాడలో నిఘా పెట్టి వీఆర్వోను లంచం తీసుకుంటుండగా పట్టుకుంది. ఏసీబీ అధికారులతో పాటు రాజమహేంద్రవరంలోని ఆర్‌టీఓ అధికారులైన టీకే పరంధామరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ జీవీవీ సత్యనారాయణను సాక్ష్యులుగా ఉన్నారు.
పక్కా ప్రణాళికతో ఏసీబీ వల
జొన్నాడ వీఆర్వో పి.బాబూరావు అవినీతిపై నెల రోజుల కిందటే ఫిర్యాదు అందడంతో ఏసీబీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. వీఆర్వోను జొన్నాడ సెంటర్‌లోని ఒక ప్రదేశానికి రప్పించారు. రైతులు మాదిరిగా వచ్చిన ఏసీబీ అధికారుల సమక్షంలో రైతు శ్రీనివాసు అడిగిన లంచంలో అడ్వా¯Œ్సగా రూ.ఐదు వేలు అందజేశారు. అందులో రెండు రెండు వేల నోట్లు, రెండు ఐదు వందల నోట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అడంగల్ సవరణ కోసం చేసుకున్న రైతు దరఖాస్తును పరిశీలించేందుకు ఆలమూరు తహసీల్దారు కార్యాలయానికి వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. దరఖాస్తు గడువు నిర్ణీత సమయంలో బడే ఉందని అధికారులు నిర్ధా రించుకున్నారు. అడంగల్‌లో సవరణకు సమగ్ర వివరాలు అందించాలన్నందుకే తనపై కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా ఇరికించారని నిందితుడైన వీఆర్వో బాబూరావు వివరించారు. బాధిత రైతు శ్రీనివాసు మాట్లాడుతూ బీ 1 ఫారం సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలంటే కోరిన లంచం ఇవ్వాల్సిందేనని, కూరగాయల బేరం ఆడవద్దని వీఆర్వో బాబూరావు హేళన చేశారని విలేకర్లకు తెలిపారు. ఏసీబీ సీఐ సూర్యమోహన్, ఎస్సై టి.నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement