jonnada
-
ఇలస చేప.. పులసగా ఎలా మారుతుందో తెలుసా?
పెనుగొండ(పశ్చిమ గోదావరి జిల్లా): గోదావరికి ఎర్రనీరు వచ్చిందంటే చాలు సముద్రం నుంచి పులసలు ఎర్రెక్కుతాయి. వారం రోజులుగా గోదావరిలో ఎర్రటి నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పులసలు లభ్యమయ్యే కాలం ఆసన్నమైంది. ఇప్పటికే గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పులసల జాడ కనిపిస్తోంది. సముద్రంలో జీవించే ఇలస చేప గోదావరికి వరద నీరు రాగానే ఎర్రదనంలోని తీపిని ఆస్వాదిస్తూ బంగాళాఖాతం నుంచి ఎదురీతుకుంటూ నదిలోకి వస్తుంది. ముఖ్యంగా వశిష్ట గోదావరిలో సిద్ధాంతం నుంచి ప్రారంభమై మల్లేశ్వరం, ఖండవల్లి, తీపర్రు, పెండ్యాల, గౌతమి గోదావరిలో జొన్నాడ, ఆలమూరు, చెముడులంక, కేదారిలంక ప్రాంతాల్లో జాలర్లకు చిక్కుతుంటాయి. ధవళేశ్వరం ఆనకట్ట వరకూ పులసల జాడ కనిపిస్తుంటుంది. వారం రోజులుగా గోదావరి వరద నీరు ఉధృతంగా సముద్రంలో కలుస్తుండటంతో పులసలు సమృద్ధిగా దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అ‘ధర’హో.. ‘పుస్తెలు అమ్మి అయినా పులస తినాలి’ ఇది గోదావరి ప్రాంతంలో నానుడి. ఏడాదికి ఓసారి మాత్రమే లభించే పులసల కోసం మాంసప్రియులు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ధర ఎంతైనా కొనేందుకు వెనుకాడరు. దీంతో వీటికి డిమాండ్ అధికంగానే ఉంటుంది. బరువును బట్టి చేప ఒకటి రూ.1,500 నుంచి రూ.6 వేల వరకు ధర పలుకుతుంది. ఇలసలను పులసలుగా.. పులసల డిమాండ్ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇలసలను పులసలుగా చెబుతూ విక్రయిస్తుంటారు. ఒడిషా సముద్ర తీరంలో విరివిగా లభించే ఇలసలను తక్కువ ధరలకు తీసుకొచ్చి జిల్లాలో పులసలుగా అమ్ముతుంటారు. వీటి మధ్య తేడా గుర్తించడం కూడా కష్టమే. ఎర్రనీటిలో ప్రయాణించడం వల్ల పులసలు ఎరుపు, గోధుమ వర్ణంలో కనిపిస్తుంటాయి. ఇలసలు తెలు పు రంగులోనే ఉంటాయని జాలర్లు అంటున్నారు. -
తూర్పుగోదావరిలో వింత జంతువు కలకలం..
సాక్షి, తూర్పుగోదావరి: జిల్లాలోని జొన్నాడలో వింత జంతువు కలకలం రేపింది. కొద్దిరోజులుగా ఆ జంతువు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్టు స్థానికులు సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆ వింత జంతువు పశువులపై దాడిచేసి చంపుతున్నట్లు వారు చెప్తున్నారు. ఆలమూరు మండలం పెనికేరులోని ఓ పాడుబడ్డ బావిలో ఆ వింత జంతువు ఉన్నట్లు రైతులు గుర్తించారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చదవండి: (షాకిచ్చిన కరెంటు బిల్లు.. నోటమాట రాలేదు..) -
ఏసీబీ వలలో వీఆర్వో
రూ.ఐదు వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం ఆలమూరు (కొత్తపేట) : పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరు కోసం రైతును లంచం అడిగిన వీఆర్వో ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. జొన్నాడలో విలేజ్ రెవెన్యూ అధి కారి (వీఆర్ఓ)గా పి.బాబూరావు పనిచేస్తున్నాడు. స్థానిక రెవెన్యూ పరిధిలో మూలస్థాన అగ్రహారం గ్రామానికి చెందిన రైతు ఉండమట్ల శ్రీనివాసు కుటుంబానికి చెందిన తొమ్మిది ఎకరాల భూమి ఉంది. దానికి సంబంధించి ఆ¯ŒSలై¯ŒSలో కుటుంబసభ్యుల పేర్లలో తప్పులు దొర్లడంతో వాటిని సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని రైతు శ్రీనివాసు వీఆర్వో బాబూరావును పలుమార్లు కోరినా పట్టించుకోలేదు. సుదీర్ఘ ప్రక్రియ కావడంతో అడంగల్‌లో పేర్లు సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాల మంజూరుకు మార్గం సుగమం కావాలంటే రూ.20 వేలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. వీఆర్వో చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతు శ్రీనివాసు ఏసీబీని ఆశ్రయించాడు. రాజమహేంద్రవరం అవినీతి నిరోధకశాఖ డీఎస్పీ ఎం.మధుసూదనరావు ఆధ్వర్యంలో అధికారుల బృందం జొన్నాడలో నిఘా పెట్టి వీఆర్వోను లంచం తీసుకుంటుండగా పట్టుకుంది. ఏసీబీ అధికారులతో పాటు రాజమహేంద్రవరంలోని ఆర్టీఓ అధికారులైన టీకే పరంధామరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ జీవీవీ సత్యనారాయణను సాక్ష్యులుగా ఉన్నారు. పక్కా ప్రణాళికతో ఏసీబీ వల జొన్నాడ వీఆర్వో పి.బాబూరావు అవినీతిపై నెల రోజుల కిందటే ఫిర్యాదు అందడంతో ఏసీబీ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. వీఆర్వోను జొన్నాడ సెంటర్లోని ఒక ప్రదేశానికి రప్పించారు. రైతులు మాదిరిగా వచ్చిన ఏసీబీ అధికారుల సమక్షంలో రైతు శ్రీనివాసు అడిగిన లంచంలో అడ్వా¯Œ్సగా రూ.ఐదు వేలు అందజేశారు. అందులో రెండు రెండు వేల నోట్లు, రెండు ఐదు వందల నోట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు అడంగల్ సవరణ కోసం చేసుకున్న రైతు దరఖాస్తును పరిశీలించేందుకు ఆలమూరు తహసీల్దారు కార్యాలయానికి వచ్చి వివరాలు నమోదు చేసుకున్నారు. దరఖాస్తు గడువు నిర్ణీత సమయంలో బడే ఉందని అధికారులు నిర్ధా రించుకున్నారు. అడంగల్‌లో సవరణకు సమగ్ర వివరాలు అందించాలన్నందుకే తనపై కక్ష కట్టి ఉద్దేశపూర్వకంగా ఇరికించారని నిందితుడైన వీఆర్వో బాబూరావు వివరించారు. బాధిత రైతు శ్రీనివాసు మాట్లాడుతూ బీ 1 ఫారం సరిచేసి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలంటే కోరిన లంచం ఇవ్వాల్సిందేనని, కూరగాయల బేరం ఆడవద్దని వీఆర్వో బాబూరావు హేళన చేశారని విలేకర్లకు తెలిపారు. ఏసీబీ సీఐ సూర్యమోహన్, ఎస్సై టి.నరేష్ తదితరులు పాల్గొన్నారు. -
అంబులెన్స్‌లో ఉన్న వ్యక్తి గోదావరిలో పడి గల్లంతు
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని జొన్నాడ వంతెనపై శనివారం ప్రమాదం జరిగింది. అంబులెన్స్ అదుపుతప్పి రైలింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లోని వ్యక్తి ప్రమాదవశాత్తు గోదావరి నదిలో పడిపోయాడు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి.... అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తీవ్ర అనారోగ్యం పాలైన వ్యక్తిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా... ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. అయితే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. -
పెళ్లికారు బోల్తా: ఇద్దరు చిన్నారుల మృతి
ఆలమూరు(తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వీసాకోడేరు గ్రామంలో మహేష్‌రాజు, దేవీప్రియాంక వివాహం ఆదివారం రాత్రి 11.30 గంటలకు జరిగింది. అనంతరం నూతన దంపతులు బంధువులతో కలసి మొత్తం 12 మంది కారులో అన్నవరం దర్శనానికి బయలుదేరారు. వారి వాహనం ఆలమూరు మండలం జొన్నాడ సమీపంలోని మలుపులో అదుపు తప్పి బోల్తాపడింది. అనంతరం పక్కనే ఉన్న పంటకాల్వలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న కృష్ణశ్రీ, మాధవీశ్రీ అనే పదేళ్లలోపు బాలికలు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా 10 మంది గాయాలపాలయ్యారు. నూతన వధూవరులకు స్వల్పగాయాలయ్యాయి. మిగతా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. -
గోదావరిలో ఇద్దరి గల్లంతు
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి స్నానానికి వెళ్లి ఇద్దరు గల్లంతయ్యారు. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామానికి చెందిన మట్టా వెంకటరమణ(35), ఆయనకు వరుస కుమారుడైన మట్టా సురేంద్ర (15) ఆదివారం సాయంత్రం స్నానానికి వెళ్లి గోదావరి నదిలో గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.