పెళ్లికారు బోల్తా: ఇద్దరు చిన్నారుల మృతి | 3 dies as van turns turtle in east godavari district | Sakshi
Sakshi News home page

పెళ్లికారు బోల్తా: ఇద్దరు చిన్నారుల మృతి

Published Mon, Apr 25 2016 8:10 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

3 dies as van turns turtle in east godavari district

ఆలమూరు(తూర్పుగోదావరి): తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వీసాకోడేరు గ్రామంలో మహేష్‌రాజు, దేవీప్రియాంక వివాహం ఆదివారం రాత్రి 11.30 గంటలకు జరిగింది. అనంతరం నూతన దంపతులు బంధువులతో కలసి మొత్తం 12 మంది కారులో అన్నవరం దర్శనానికి బయలుదేరారు.

వారి వాహనం ఆలమూరు మండలం జొన్నాడ సమీపంలోని మలుపులో అదుపు తప్పి బోల్తాపడింది. అనంతరం పక్కనే ఉన్న పంటకాల్వలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న కృష్ణశ్రీ, మాధవీశ్రీ అనే పదేళ్లలోపు బాలికలు అక్కడికక్కడే చనిపోయారు. మిగతా 10 మంది గాయాలపాలయ్యారు. నూతన వధూవరులకు స్వల్పగాయాలయ్యాయి. మిగతా వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో రాజమండ్రిలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement