లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో కరాచీ నుంచి ఇస్లామాబాద్ వెళ్తున్న ఓ బస్సు తన ముందున్న వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ వ్యాన్‌లో ఇంధన ట్యాంక్ ఉంది. దీంతో రెండు వాహనాలు వెంటనే నిప్పంటుకున్నాయి. ఈ ఘటనలో బస్సులోని పలువురు మహిళలు, చిన్నారులు సహా 18 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. మరో 16 మంది గాయపడ్డారు.
కొందరు బస్సు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు లాహోర్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మృతిచెందడం పట్ల పంజాబ్ ముఖ్యమంత్రి మొహిసిన్ నక్వీ విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment