
లాహోర్: పాకిస్తాన్‌లో సోమవారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 31 మంది చనిపోగా మరో 60 మంది గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్సులోని ఇండస్ హైవేపై సియాల్‌కోట్ నుంచి రాజన్‌పూర్ వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులోని అత్యధికులు బుధవారం బక్రీద్ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
అయితే అప్పటికే 18 మంది మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు పాక్ సమాచార ప్రసార మంత్రి ఫవాద్ చౌధరీ ఓ సంతాప ట్వీట్ చేశారు. ప్రజావాహనాలను నడిపేవారు జాగ్రత్తగా నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నారని జిల్లా అత్యవసర విధుల అధికారి డాక్టర్ నయ్యర్ ఆలం చెప్పారు.
Chief Minister Inspection Team has been directed by CM @UsmanAKBuzdar to submit a fact finding inquiry report of DG Khan Bus Incident within 3 days. pic.twitter.com/YNdDTBVObN
— Azhar Mashwani (@MashwaniAzhar) July 19, 2021