
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి సమీపంలో బైపాస్ రోడ్డు వద్ద మంగళవారం ఉదయం ప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఉదగిర్ వెళ్తున్న టాటా ఏస్ ట్రక్‌ను, ఆ వైపుగా ముంబయి నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో ప్రమాదవశాత్తు ట్రక్కు, బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ట్రక్ డ్రైవర్ సజీవ దహనం కాగా పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిని వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసింది. దీంతో పెను పెను ప్రమాదం తప్పింది.