రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం.. | UP Bahraich Accident Several Dead Many Injured Bus Truck Collision | Sakshi
Sakshi News home page

రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టిన ట్రక్కు.. ఆరుగురు దుర్మరణం.. 15 మందికి గాయాలు

Published Wed, Nov 30 2022 11:44 AM | Last Updated on Wed, Nov 30 2022 11:45 AM

UP Bahraich Accident Several Dead Many Injured Bus Truck Collision - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బహ్రాయిచ్‌లో బుధవారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పే సిపా సమీపంలో రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  వీరందరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

బస్సు జైపూర్ నుంచి బహ్రాయిచ్‌ వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష‍్యమే ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. ఈ విషాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement