Indus
-
మరో ఫార్మా సెజ్ ఫ్యాక్టరీలో ప్రమాదం
-
టెక్ మహీంద్రా ప్రాజెక్ట్ ఇండస్
న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా తాజాగా ప్రాజెక్ట్ ఇండస్‌ను ప్రారంభించింది. బహుళ భారతీయ భాషలు, మాండలికాలలో సంభాíÙంచడానికి దేశీయంగా రూపొందించిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) ఇది. ఇండస్ ఎల్ఎల్ఎం మొదటి దశ హిందీ భాషతోపాటు దాని 37కుపైగా మాండలికాల కోసం అభివృద్ధి చేశారు. ఇండస్ మోడల్ ప్రారంభంలో మౌలిక సదుపాయాలు, కంప్యూటింగ్‌ను ఒక సేవగా, సంస్థలకు ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను అందించడం వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెడుతుందని కంపెనీ తెలిపింది. ఎల్ఎల్ఎంకు అవసరమైన అధిక–పనితీరు గల కంప్యూటింగ్ సొల్యూషన్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి డెల్ టెక్నాలజీస్‌తో టెక్ మహీంద్రా చేతులు కలిపింది. కస్టమర్లు జెన్ఏఐ అప్లికేషన్లలో ఇండస్ మోడల్‌ను ఏకీకృతం చేసేందుకు వీలుగా ఇంటెల్ జియాన్ ప్రాసెసర్లు, వన్ఏపీఐ సాఫ్ట్వేర్, ఇంటెల్ అడ్వాన్స్డ్ మ్యాట్రిక్స్ ఎక్స్టెన్షన్స్ సహా ఇంటెల్–ఆధారిత మౌలిక సదుపాయాల పరిష్కారాలను ప్రాజెక్ట్ ఇండస్ స్వీకరిస్తుంది. -
ఇండస్ నుంచి వొడాఫోన్ ఔట్!
ముంబై: దేశీ మొబైల్ టవర్ల కంపెనీ ఇండస్ టవర్స్‌లో వాటాను విక్రయించేందుకు టెలికం రంగ బ్రిటిష్ దిగ్గజం వొడాఫోన్ గ్రూప్ ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండస్లోగల పూర్తి వాటాను వొడాఫోన్ 2.3 బిలియన్ డాలర్లకు(రూ. 19,100 కోట్లు) విక్రయించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే వారం బ్లాక్‌డీల్స్ ద్వారా స్టాక్ మార్కెట్లో ఇండస్ వాటాను మొబై ల్ దిగ్గజం విక్రయించే వీలున్నట్లు తెలియజేశాయి. ఇండస్‌లో గ్రూప్‌లోని వివిధ సంస్థల ద్వారా వొడాఫోన్ 21.5 శాతం వాటాను కలిగి ఉంది. బీఎస్ఈలో ఇండస్ టవర్స్ శుక్రవారం ముగింపు ధర రూ. 341తో చూస్తే వొడాఫోన్ వాటా విలువ రూ. 19,100 కోట్లుగా విశ్లేషకులు మదింపు చేశారు. నిధులను రుణ చెల్లింపులకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క ఇటీవల నిధుల సమీకరణ బాటలో సాగుతున్న వొడాఫోన్ ఐడియా షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 16.7 వద్ద ముగిసింది. గత కొద్ది రోజులుగా వొడాఫోన్ ఐడియా షేరు ర్యాలీ బాటలో సాగుతోంది. కాగా.. డిమాండు ఆధారంగా వొడాఫోన్ గ్రూప్.. ఇండస్‌లో వాటా విక్రయాన్ని చేపట్టే వీలున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వాటా విక్రయాన్ని నిర్వహించేందుకు వీలుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా, మోర్గాన్ స్టాన్లీ, బీఎన్పీ పారిబాస్లను వొడాఫోన్ ఎంపిక చేసినట్లు పేర్కొన్నాయి. అయితే వొడాఫోన్ ఇండియా, బ్రిటిష్ మాతృ సంస్థ ప్రతినిధులు ఈ అంశంపై స్పందించకపోవడం గమనార్హం! 2022లోనూ.. నిజానికి 2022లో వొడాఫోన్.. ఇండస్ టవర్స్‌లోగల 28 శాతం వాటాను విక్రయించేందుకు నిర్ణయించినప్పటికీ స్వల్ప వాటాను మాత్రమే అమ్మగలిగింది. వాటా విక్రయానికి ప్రత్యర్ధి టెలికం దిగ్గజాలతో చర్చలు చేపట్టినప్పటికీ ఫలించలేదు. ఇండస్‌లో వాటా విక్రయం ద్వారా 42 బిలియన్ డాలర్లకుపైగా గల నికర రుణాల్లో కొంతమేర తిరిగి చెల్లించేందుకు వొడాఫోన్ ప్రణాళికలు వేసింది. ప్రపంచంలోనే టెలికం టవర్ల దిగ్గజాలలో ఒకటిగా నిలుస్తున్న ఇండస్ టవర్స్ దేశీయంగా రెండో పెద్ద మొబైల్ టవర్ల కంపెనీగా నిలుస్తోంది. సుమారు 2,20,000 టవర్లు కలిగిన కంపెనీలో మరో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు సైతం వాటా ఉంది. -
ఆర్యవర్త, భరతవర్ష, ఇండియా.. ఈ పేర్లు ఎలా వచ్చాయి? ‘సిం’ని ‘హిం’ అని ఎవరన్నారు?
మన దేశాన్ని ఇండియా అని పిలవాలా లేక భారతదేశం అనాలా అనే విషయంపై అటు రాజకీయ పార్టీల మధ్య, ఇటు ప్రజల మధ్య సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. మన రాజ్యాంగంలో ‘ఇండియా దట్ ఈజ్ భారత్’ అని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, వివిధ క్రీడలు, ప్రపంచ వేదికలపై ఇండియా అనే పేరు ప్రబలంగా ఉంది. అయితే మన దేశాన్ని వివిధ కాలాల్లో పలు పేర్లతో సంబోధించేవారనే విషయం మీకు తెలుసా? వీటిలో జంబూద్వీపం, ఆర్యవర్త, భరతవర్ష, హింద్, హిందుస్థాన్ మొదలైనవి అత్యంత ప్రాచుర్యం పొందిన పేర్లు. ఈ పేర్లు ఎప్పుడు వచ్చాయి? ఈ పేర్ల వెనుక ఉన్న అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్యవర్త ఆర్యులు మన దేశాన్ని స్థాపించారని చెబుతారు. ఆర్య అంటే ఉత్తమమైనది. ఈ ప్రాంతంలో ఆర్యుల నివాసం ఏర్పరుచుకున్న కారణంగా మన దేశానికి ఆర్యవర్త అని పేరు వచ్చింది. ఆర్యవర్త సరిహద్దులు కాబూల్‌లోని కుంభా నది నుండి భారతదేశంలోని గంగా నది వరకు, అలానే కశ్మీర్ మైదానాల నుండి నర్మదా నది ఆవలి వైపు వరకు విస్తరించి ఉన్నాయి. ఆర్యుల నివాసానికి సంబంధించి పలువురు చరిత్రకారులలో ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జంబూద్వీపం మన దేశాన్ని పూర్వకాలంలో జంబూద్వీపం అని కూడా పిలిచేవారు. భారతదేశంలో జామున్(నేరేడు) చెట్లు అధికంగా ఉండటం వల్ల దీనికి ఈ పేరు వచ్చిందని చాలా మంది చరిత్రకారులు భావిస్తున్నారు. అదేవిధంగా జంబూ చెట్టు.. ఏనుగంత పరిమాణంలో భారీ ఫలాలను ఇస్తుందనే నమ్మకాలు ఉన్నాయి. ఈ పండ్లు పర్వతం మీద పడినప్పుడు వాటి రసం నుండి నది ఏర్పడిందని చెబుతారు. ఈ నది ఒడ్డున ఉన్న భూమిని జంబూద్వీపం అని పిలవసాగారు. భరతవర్ష మన భూభాగం పేరు ఎంతో ప్రజాదరణ పొందింది. మహారాజు దుష్యంతుడు, శకుంతల దంపతుల కుమారుడైన భరతుని పేరు మీదుగా దేశానికి భారత్ అనే పేరు వచ్చిందని చెబుతారు. అదేవిధంగా గురువు రిషభదేవుడు తన రాజ్యాన్ని తన కొడుకు భరతునికి అప్పగించాడని, అందుకే మన దేశానికి భరతవర్ష అని పేరు వచ్చిందని అంటారు. దశరథుని కుమారుడు, శ్రీరాముని సోదరుడు భరతుని ప్రస్తావన కూడా ఇదేవిధంగా కనిపిస్తుంది. అలాగే నాట్యశాస్త్రంలో కూడా భరతముని ప్రస్తావన ఉంది. దేశానికి ఆయన పేరు పెట్టారని కూడా అంటారు. పురాణాలలో కూడా భారతదేశ సరిహద్దులు సముద్రానికి ఉత్తరం నుండి హిమాలయాల దక్షిణం వరకు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. హిందుస్థాన్ పురాతన కాలంలో భారతదేశంలోని సింధు లోయ నాగరికత ఇరాన్, ఈజిప్ట్‌తో వాణిజ్య సంబంధాన్ని కలిగి ఉంది. ఇరానియన్లో ‘సిం’ని ‘హిం’ అని సంబోధించారట. ఫలితంగా సింధు కాస్తా హిందూగా మారిందని అంటారు. తరువాతి కాలంలో ఈ భూమి హింద్ పేరుతో ప్రసిద్ధి చెంది, చివరికి హిందువులుంటున్న ప్రదేశం కనుక హిందుస్థాన్ అయ్యిందని చెబుతారు. భారతదేశం మన దేశానికి ఈ పేరు బ్రిటిష్ వారు పెట్టారని అంటారు. బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పుడు, వారు సింధు లోయను తొలుత ఇండస్ వ్యాలీ అని పిలిచేవారు. దీనితో పాటు భారత్ లేదా హిందుస్థాన్ అనే పదానికి బదులుగా ఇండియా అనే పదాన్ని ఉపయోగించసాగారు. అది వారికి పలికేందుకు చాలా సులభంగా అనిపించిందట. చాలామంది ఇండియా అనేది బ్రిటిష్ యుగానికి చిహ్నమని, అందుకే ఈ పేరులో మార్పులు చేయాలని డిమాండ్ చేస్తుంటారు. ఇది కూడా చదవండి: దేశంలో అతిపెద్ద జిల్లా ఏది? -
పీకల్లోతు మునిగిన వొడాఫోన్ ఐడియా: కస్టమర్లకు బ్యాడ్ న్యూస్
సాక్షి, ముంబై: దేశంలో మూడో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు బ్యాడ్ న్యూస్. మీడియా నివేదికల ప్రకారం భారీగా అప్పుల్లో కూరుకుపోయిన టెలికాం కంపెనీకి చెందిన 25 కోట్ల మంది కస్టమర్లు భవిష్యత్తులో భారీ షాకే తగలనుంది. కంపెనీ అప్పులు చెల్లించకపోవడంతో ఈ ముప్పు ఏర్పడింది. ఇండస్ టవర్స్ వొడాఫోన్-ఐడియా హెచ్చరించిన వైనం ఇపుడు సంచలనంగా మారింది. (హీరో పండుగ కానుక అదిరిందిగా!ఎక్స్ట్రీమ్ 160ఆర్ స్టీల్త్ 2.0) విషయం ఏమిటంటే.. టెల్కో వొడాఫోన్ ఐడియా ఇండస్ టవర్స్‌కు దాదాపు రూ. 7000 కోట్లు బకాయిపడింది. వీలైనంత త్వరగాఈ రుణాన్ని చెల్లించకపోతే, నవంబర్ నాటికి టవర్లనుఉపయోగించడాన్ని నిలిపివేస్తామని ఇండస్ టవర్స్ హెచ్చరించింది. ఈ చెల్లింపుల విషయంలో వొడాఫోన్-ఐడియా విఫలమైతే మొబైల్ నెట్‌వర్క్‌లను మూసి వేస్తుంది. ఫలితంగా యూజర్లకు కష్టాలు తప్పవు. (Tiago EV: టాటా టియాగో ఈవీ వచ్చేసింది, వావ్...తక్కువ ధరలో!) సోమవారం ఇండస్ టవర్స్ డైరెక్టర్ల బోర్డు సమావేశం కంపెనీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించింది. ఈ సందర్బంగా సుమారు 7,000 కోట్ల రూపాయల బకాయిలను గుర్తించింది. దీనిపై ఆందోళన చెందిన డైరెక్టర్లు బకాయిల చెల్లింపుపై లేఖ రాశారు. ముఖ్యంగా ప్రస్తుత నెలవారీ బకాయిలలో 80 శాతం వెంటనే చెల్లించాలని వొడాఫోన్ ఐడియాకు సూచించినట్లు జాతీయ మీడియా నివేదించింది. నెలవారీ బకాయిల్లో 100 శాతం "సకాలంలో" చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. కాగా కంపెనీ మొత్తం టవర్ బకాయిలు రూ. 10,000 కోట్లు మించిపోయాయి. ఇందులో కేవలం ఇండస్ టవర్స్‌కే రూ.7,000 కోట్లు రావాల్సి ఉంది. అమెరికన్ టవర్ కంపెనీ (ఏటీసీ)కి రూ.3,000 కోట్లు బకాయి ఉంది. ఇదీ చదవండి: 28 రోజుల మొబైల్ రీఛార్జ్ ప్లాన్ వెనక మతలబు ఇదే! -
ఇండస్ టవర్స్‌లో ఎయిర్‌టెల్‌కు 4.7% వాటా!
న్యూఢిల్లీ: యూరో పసిఫిక్ సెక్యూరిటీస్ నుంచి ఇండస్ టవర్స్‌లో 4.7 శాతం వాటాల కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు భారతి ఎయిర్టెల్ మంగళవారం వెల్లడించింది. షేరు ఒక్కింటికి రూ. 187.88 రేటు చొప్పున తమ అనుబంధ సంస్థ నెటిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ 12,71,05,179 షేర్లను కొనుగోలు చేసినట్లు వివరించింది. వొడాఫోన్ గ్రూప్‌లో యూరో పసిఫిక్ సెక్యూరిటీస్ భాగంగా ఉంది. ఇండస్ టవర్స్ (గతంలో భారతి ఇన్ఫ్రాటెల్) సంస్థ వివిధ మొబైల్ ఫోన్ సర్వీస్ ఆపరేటర్ల కోసం టెలికం టవర్లు మొదలైన మౌలిక సదుపాయాలను నిర్వహిస్తోంది. 22 టెలికం సర్కిళ్లలో 1,84,748 టవర్లతో ఇండస్ టవర్స్ దేశీయంగా అతి పెద్ద టవర్ ఇన్ఫ్రా కంపెనీల్లో ఒకటి. -
బస్సు ట్రక్కు ఢీ .. 31 మంది దుర్మరణం
లాహోర్: పాకిస్తాన్లో సోమవారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 31 మంది చనిపోగా మరో 60 మంది గాయపడ్డారు. పంజాబ్ ప్రావిన్సులోని ఇండస్ హైవేపై సియాల్కోట్ నుంచి రాజన్‌పూర్ వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులోని అత్యధికులు బుధవారం బక్రీద్ పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారని అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే 18 మంది మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మరోవైపు పాక్ సమాచార ప్రసార మంత్రి ఫవాద్ చౌధరీ ఓ సంతాప ట్వీట్ చేశారు. ప్రజావాహనాలను నడిపేవారు జాగ్రత్తగా నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75 మంది ప్రయాణికులు ఉన్నారని జిల్లా అత్యవసర విధుల అధికారి డాక్టర్ నయ్యర్ ఆలం చెప్పారు. Chief Minister Inspection Team has been directed by CM @UsmanAKBuzdar to submit a fact finding inquiry report of DG Khan Bus Incident within 3 days. pic.twitter.com/YNdDTBVObN — Azhar Mashwani (@MashwaniAzhar) July 19, 2021 -
ఇన్ఫ్రాటెల్- అదానీ పోర్ట్స్ జూమ్
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 460 పాయింట్లు జంప్‌చేసి 44,537ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. నిఫ్టీ 135 పాయింట్లు ఎగసి 13,061 వద్ద ట్రేడవుతోంది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 13,000 పాయింట్ల మార్క్‌ను నిఫ్టీ అధిగమించింది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా మౌలిక సదుపాయాల కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టెలికం టవర్ల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ట్రాన్స్‌పోర్టేషన్, రవాణా మౌలిక సదుపాయాల విభాగంలో దేశీయంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌కు 14వ ర్యాంక్ లభించినట్లు డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండైసెస్(డీజేఎస్ఐ) తాజాగా పేర్కొంది. ఎస్ఏఎం కార్పొరేట్ సస్టెయినబిలిటీ ఆధారంగా డోజోన్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్‌కు మాత్రమే చోటు దక్కినట్లు తెలియజేసింది. దీంతో డీజేఎస్ఐ ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే పలు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఇకపై అదానీ పోర్ట్స్ కౌంటర్‌పై దృష్టి పెట్టే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. వెరసి అదానీ పోర్ట్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 7 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 402ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం ఎగసి రూ. 396 వద్ద ట్రేడవుతోంది. భారతీ ఇన్ఫ్రాటెల్ ఇండస్ టవర్స్‌తో విలీనం పూర్తి చేసుకోవడం ద్వారా భారతీ ఇన్ఫ్రాటెల్ అతిపెద్ద టవర్ల కంపెనీగా ఆవిర్భవించింది. ఇండస్ టవర్స్ కంపెనీ పేరుతో ఏర్పాటైన సంయుక్త సంస్థలో భారతీ ఎయిర్‌టెల్‌కు 36.7 శాతం, వొడాఫోన్ గ్రూప్‌నకు 28.12 శాతం చొప్పున వాటా లభించింది. ఈ బాటలో పీఎస్ ఏషియా హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ మారిషస్‌కు 3.25 శాతం వాటా దక్కింది. టవర్ల రంగంలో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించిన నేపథ్యంలో భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 230 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 238 వరకూ ఎగసింది. విలీనం పూర్తయిన వార్తలతో గత మూడు రోజులుగా ఈ కౌంటర్ జోరు చూపుతోంది. వెరసి 28 శాతంపైగా లాభపడింది. -
భారతి ఇన్ఫ్రాటెల్తో ఇండస్ టవర్స్ విలీనం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టెలికం టవర్ల సంస్థ ఏర్పాటు దిశగా భారతి ఇన్ఫ్రాటెల్, ఇండస్ టవర్స్ త్వరలో విలీనం కానున్నాయి. తద్వారా 14.6 బిలియన్ డాలర్ల (రూ. 96,500 కోట్లు) దిగ్గజం ఆవిర్భవించనుంది. ఏకంగా 1,63,000 టవర్లతో చైనా టవర్ సంస్థ తర్వాత ప్రపంచంలోనే రెండో అతి పెద్ద టవర్స్ సంస్థగా నిలవనుంది. విలీనానికి సంబంధించి ఇరు సంస్థలు ఒక అంగీకారానికి వచ్చాయి. విలీన సంస్థ పేరు ఇండస్ టవర్స్ లిమిటెడ్‌గా ఉంటుంది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ దీన్ని సంయుక్తంగా నిర్వహిస్తాయి. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ తదితర నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరులోగా డీల్ పూర్తి కాగలదని అంచనా. ప్రత్యేక స్కీమ్ ప్రకారం భారతి ఇన్ఫ్రాటెల్లో ఇండస్ టవర్స్ విలీనం అవుతుందని భారతి ఎయిర్టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇండస్ టవర్స్ ప్రస్తుతం 15 టెలికం సర్కిల్స్‌లోను, భారతి ఇన్ఫ్రాటెల్ మిగతా 7 సర్కిల్స్‌లోనూ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2017–18లో ఇరు కంపెనీల ఆదాయాలు రూ. 25,360 కోట్ల పైగా ఉన్నాయి. వాటాల పంపకం ఇలా.. ప్రస్తుతం భారతి ఎయిర్‌టెల్‌కి భారతి ఇన్ఫ్రాటెల్లో 53.5 శాతం వాటాలున్నాయి. విలీన సంస్థలో దీనికి 33.8 నుంచి 37.2 శాతం వాటాలు దక్కే అవకాశం ఉంది. ఇండస్ టవర్‌లో వొడాఫోన్‌కి 42 శాతం వాటాలుండగా, విలీన సంస్థలో 26.7 శాతం నుంచి 29.4 శాతం దాకా వాటాలు దక్కనున్నాయి. ఇండస్ టవర్‌లో భారతి ఇన్ఫ్రాటెల్కు కూడా 42 శాతం వాటా ఉండగా, ఐడియాకి 11.15 శాతం, ప్రావిడెన్స్‌కి 4.85 శాతం వాటాలున్నాయి. విలీన సంస్థలో ఐడియా, ప్రావిడెన్స్లు తమ వాటాలను అట్టే పెట్టుకోవడం లేదా విక్రయించడాన్ని బట్టి ఎయిర్టెల్, వొడాఫోన్ల వాటాలు పెరగడం లేదా తగ్గడం ఆధారపడి ఉంటుంది. విలీన కంపెనీలో కొంత వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లతో చర్చించనున్నట్లు భారతి ఎయిర్టెల్ తెలిపింది. డీల్ ప్రకారం భారతి ఇన్ఫ్రాటెల్కి చెందిన ప్రతి 1,565 షేర్లకు ఇండస్ టవర్ షేరు ఒక్కటి చొప్పున లభిస్తుంది. విలీన సంస్థలో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్‌కి సమాన అధికారాలుంటాయి. డీల్ పూర్తయ్యాక 11 మంది డైరెక్టర్లలో ఇరు సంస్థల నుంచి చెరి ముగ్గురు నియమితులవుతారు. ఐడియా, ప్రావిడెన్స్లు వాటాలు విక్రయిస్తే.. ఒకవేళ ఐడియా తన వాటాలను పూర్తిగా, ప్రావిడెన్స్ తనకున్న 4.85 శాతం వాటాలో 3.35 శాతాన్ని విక్రయించాలనుకున్న పక్షంలో .. విలీన సంస్థలో భారతి ఎయిర్‌టెల్‌కు 37.2 శాతం, వొడాఫోన్ గ్రూప్‌నకు 29.4 శాతం, ప్రావిడెన్స్‌కి 1.1 శాతం, మిగతా వాటాలు పబ్లిక్ షేర్‌హోల్డర్ల దగ్గర ఉంటాయి. అలా కాకుండా ఐడియా, ప్రావిడెన్స్ తమ పెట్టుబడులను కొనసాగించాలనుకుంటే భారతి ఎయిర్‌టెల్‌కి 33.8 శాతం, వొడాఫోన్‌కి 26.7 శాతం వాటాలు ఉంటాయి. ఐడియా గ్రూప్‌నకు 7.1 శాతం, ప్రావిడెన్స్‌కి 3.1 శాతం, మిగతా 29.3 శాతం వాటాలు పబ్లిక్ షేర్‌హోల్డర్స్ దగ్గర ఉంటాయి. -
అతిపెద్ద మొబైల్ టవర్ కంపెనీగా ఎయిర్టెల్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తన టవర్ యూనిట్‌ను ప్రత్యర్థి కంపెనీలో విలీనం చేసేందుకు ఆమోదం తెలిపింది. భారతి ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్‌ను ఇండస్ టవర్స్ లిమిటెడ్‌తో విలీనం చేస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. ఈ డీల్ విలువ 10.8 బిలియన్ డాలర్లు(రూ. 71,500 కోట్లు)ఈ ఒప్పందంలో భారతి ఇన్ఫ్రాటెల్ ప్రతి ఇండస్ టవర్ వాటాకి 1,565 షేర్లను చెల్లించేందుకు అంగీకరించినట్టు భారతి ఎయిర్టెల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2019 , మార్చి 31 ఈ ఒప్పందం పూర్తి కానుందని భావిస్తున్నామని తెలిపింది తాజా డీల్‌తో చైనా వెలుపల భారత్‌లో అతిపెద్ద మొబైల్ టవర్ కంపెనీగా ఎయిర్టెల్ ఆవిర్భవిస్తుంది. విలీనం తరువాత ఆవిర్భవించే ఉమ్మడి సంస్థ ఇండస్ టవర్స్ లిమిటెడ్‌గా కొనసాగనుంది. దీనికి మార్కెట్ రెగ్యులేటర్ల తుది ఆమోదం పొందాల్సి ఉంది. సంస్థగా విలీనం అనంతరం భారతదేశం అంతటా 163,000కు పైగా టవర్లను నియంత్రిస్తుంది. మరోవైపు ఒప్పందం ప్రకారం భారతి-ఇండస్ జాయింట్ సంస్థలో 783.1 మిలియన్ల కొత్త షేర్లు వోడాఫోన్‌కు లభిస్తాయి. అయితే ఇండస్‌లో వాటాను మరో టెలికాం సంస్థ ఐడియా అమ్ముకోవచ్చు లేదా, అదనంగా కొత్తషేర్లను కొనుక్కునే అవకాశాన్ని కల్పించింది. ఈ వార్తల అనంతరం భారతి ఎయిర్టెల్ 2 శాతం లాభాలతో కొనసాగుతుండగా , భారతి ఇన్ఫ్రాటెల్ స్వల్ప నష్టాలతో కొనసాగుతోంది. కాగా ఇన్ఫ్రాటెల్, వొడాఫోన్ ఇండియాలకు ఇండస్ టవర్స్‌లో 42 శాతం వాటా ఉండగా మిగిలిన వాటా ఐడియా సెల్యులార్‌ది. తాజా ఒప్పందంతో సమీప ప్రత్యర్థి అయిన బీఎస్ఎన్ఎల్తో పోలిస్తే రెండున్నర రెట్ల పరిమాణం గల కంపెనీ అవుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి -
ఆఖరి పోరులో సాగని జోరు
ఫైనల్లో ఓడిన సింధు, సమీర్ వర్మ రజత పతకాలతో సరి హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీ కౌలూన్: రియో ఒలింపిక్స్ రజత పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్ గెలిచే అవకాశాన్ని త్రుటిలో కోల్పోరుుంది. హాంకాంగ్ ఓపెన్ టోర్నీ ఆసాంతం చక్కటి ఆటతీరు కనబర్చిన సింధు, ఫైనల్లో పరాజయం పాలైంది. మరోవైపు సంచలన ఆటతో పురుషుల విభాగంలో ఫైనల్‌కు చేరిన భారత ఆటగాడు సమీర్ వర్మ పోరాడి ఓడిపోయాడు. దాదాపు ఏకపక్షంగా సాగిన మహిళల ఫైనల్లో సింధు 15-21, 17-21 స్కోరుతో చిరకాల ప్రత్యర్థి తై జు రుుంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడింది. పురుషుల ఫైనల్లో లాంగ్ ఆంగస్ (హాంకాంగ్) 21-14, 10-21, 21-11 తేడాతో సమీర్ వర్మపై గెలుపొందాడు. రన్నరప్‌లుగా నిలిచిన సింధు, సమీర్ వర్మలకు 15,200 డాలర్ల (రూ. 10 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీతోపాటు 7,800 ర్యాంకింగ్ పారుుంట్లు లభించారుు. రన్నరప్ సిక్కి రెడ్డి జంట మరోవైపు గ్లాస్గోలో ముగిసిన స్కాటిష్ ఓపెన్గ్రాండ్ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్లోనూ భారత్‌కు నిరాశే మిగిలింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంక్ ద్వయం సిక్కి-ప్రణవ్ 21-13, 18-21, 16-21తో ప్రపంచ 229వ ర్యాంక్ జోడీ గో సూన్ హువాట్-జేమీ లై షెవోన్ (మలేసియా) చేతిలో ఓడిపోరుుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సిక్కి-ప్రణవ్ 16-12తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ వరుసగా 9 పారుుంట్లు కోల్పోరుు ఓటమిని మూటగట్టుకోవడం గమనార్హం. నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. నేను మెరుగ్గానే ఆడినా ప్రత్యర్థి నెట్ వద్ద చాలా చక్కటి ఆటతీరు కనబర్చింది. ఆమె ఎలాంటి తప్పులూ చేయలేదు. గతంలోనూ తై జుతో ఆడాను. ఆమె బలాల గురించి తెలిసే సన్నద్ధమయ్యా. అరుుతే ఆటలో ఓటమి సహజం. గత వారం చైనా ఓపెన్ గెలుపు కారణంగా నేను ఈ మ్యాచ్‌కు ముందు ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ఈ రోజు ఆమెది. తిరిగి వెళ్లాక మరింతగా సాధన చేస్తా. వరుసగా రెండు టోర్నీల్లో నా ఆట సంతోషాన్ని కలిగించింది. - పీవీ సింధు -
రాగి ఆకుపై సింధు చిత్రం
కదిరి టౌన్ : రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధు చిత్రాన్ని అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన చిత్రకారుడు శేషు రాగి ఆకుపై చిత్రించి తన అభిమానాన్ని చాటుకున్నారు. భారతదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసిన సింధు కోసం ఆమె చిత్రాన్ని ఇలా గీసి స్వాగతం పలుకుతున్నట్లు శేషు చెప్పారు. -
నరనరాన పోరాటం
►మ్యాచ్ మ్యాచ్‌కూ పురోగతి సాధించిన సింధు ►అంచనాలను మించి రాణించిన తెలుగు తేజం ►అద్వితీయ ప్రదర్శనతో అందరికీ ఆదర్శం సాక్షి క్రీడావిభాగం అంతర్జాతీయస్థాయిలో ఎన్ని విజయాలు సాధించినా ఒలింపిక్స్‌లాంటి విశ్వ వేదికపై రాణిస్తేనే క్రీడాకారుల కెరీర్‌కు పరిపూర్ణత లభిస్తుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించినా ఒలింపిక్స్ పతకం లేకుంటే ఏదో వెలితిలా ఉంటుంది. క్రీడా సంస్కృతి అంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటుందో ఇప్పుడిపుడే తెలుసుకుంటున్న భారత్‌లాంటి దేశంలో ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం వహిస్తే చాలనుకునే క్రీడాకారులెందరో ఉన్నారు. అయితే ప్రాతినిధ్యంతో సరిపెట్టుకోకుండా పతకంతోనే తిరిగి రావాలనే పట్టుదల పూసర్ల వెంకట సింధుది. రియో ఒలింపిక్స్‌లో 21 ఏళ్ల ఈ తెలుగు అమ్మాయి సాధించిన ఘనతను ఏ రకంగా ప్రశంసించినా తక్కువే అవుతుంది. ఏడాది కాలంగా సరైన ఫలితాలు లేకున్నా, ఒకవైపు గాయాలు బాధిస్తున్నా... అందుబాటులో ఉన్న సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకొని అద్వితీయ ప్రదర్శనతో యావత్‌దేశం గర్వపడేలా చేసింది. ఫిట్నెస్ కీలకం రియో ఒలింపిక్స్‌కంటే ముందు సింధు ఖాతాలో పెద్దగా విజయాలు లేవు. జనవరిలో మలేసియా గ్రాండ్ప్రిగోల్డ్ టోర్నీలో టైటిల్ సాధించిన తర్వాత సింధు తాను పాల్గొన్న 12 టోర్నమెంట్లలో ఫైనల్‌కు కూడా చేరలేదు. జూన్ తొలి వారంలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో ఈ హైదరాబాద్ అమ్మాయి తొలి రౌండ్లోనే ఓడిపోయింది. ఈ టోర్నీ తర్వాత సింధు మరే టోర్నీలోనూ పాల్గొనకుండా నేరుగా ఒలింపిక్స్‌లోనే అడుగుపెట్టింది. ఈ మెగా ఈవెంట్‌కు సన్నద్ధం కావడానికి ఆమెకు రెండు నెలల సమయం లభించింది. ఫిట్నెస్ మెరుగు కావడానికి సింధు కొన్నిరోజులు ముంబైకు వెళ్లి వచ్చింది. ఫిట్‌నెస్‌లో అద్భుతమైన పురోగతి సాధించడంతో ఆ ప్రభావం సింధు ఆటతీరులో స్పష్టంగా కనిపించింది. సుదీర్ఘ ర్యాలీలు సాగినా... కోర్టుకిరువైపులా పాదరసంలా కదలాల్సి వచ్చినా... సింధు ఏమాత్రం అలసటకు గురి కాలేదు. ఆత్మవిశ్వాసం అద్భుతం నాకౌట్ దశలో తనకంటే ఎంతో మెరుగైన ర్యాంక్ ఉన్న క్రీడాకారిణులు ప్రత్యర్థులుగా ఉన్నా సింధు ఏమాత్రం తొణకలేదు. ముఖాముఖి రికార్డు తనకు వ్యతిరేకంగా ఉన్నా తనదైన రోజున తాను చెలరేగితే విజయం తథ్యమని నిరూపించింది. లీగ్ దశ రెండో మ్యాచ్‌లో చైనా సంతతికి చెందిన కెనడా క్రీడాకారిణి మిచెల్లి లీ చేతిలో తొలి గేమ్ కోల్పోయినా... వెంటనే తేరుకొని వరుస గేముల్లో విజయాన్ని దక్కించుకుంది. ఇంతకుముందు తనలో బలహీన అంశంగా ఉన్న డిఫెన్స్‌ను సరిదిద్దుకున్న సింధు అన్ని మ్యాచ్‌ల్లో దూకుడుగా కూడా ఆడింది. ముఖ్యంగా ప్రపంచ రెండో ర్యాంకర్ యిహాన్ వాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో గేమ్ కీలకదశల్లో సింధు సంయమనంతో ఆడి ఫలితాన్ని తనవైపునకు తిప్పుకుంది. అనవసర తప్పిదాలను కూడా తగ్గించుకొని చాలా పాయింట్లను విన్నర్స్ ద్వారానే సాధించింది. ఆఖరికి ఏ లక్ష్యంతో రియోలో అడుగుపెట్టిందో ఆ లక్ష్యాన్ని సాకారం చేసుకుంది. రజతం గెలిచిన మా అమ్మాయి దేశ ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయింది. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధిస్తుంది. సింధు సాధించిన ఘనతకు తల్లిగా నేను గర్విస్తున్నాను. గోపీచంద్ మార్గదర్శకత్వంలో తను అత్యున్నత శిఖరాలకు చేరుతుందనే నమ్మకం ఉంది’ - విజయలక్ష్మి (సింధు తల్లి) -
ఇండస్ కాఫీ ఫ్యాక్టరీలో ప్రమాదం
-
టూకీగా ప్రపంచ చరిత్ర 80
ఏలుబడి కూకట్లు పర్షియా సువిశాలమైన ప్రదేశమేగానీ, రాతిగుట్టల మూలంగా పచ్చిక బయళ్లు తక్కువ. ఇక్కడి నుండి పడమటికి సాగాలంటే, జాగ్రోస్ పర్వతపంక్తి అడ్డగిస్తుంది. దాన్ని దాటుకున్నా అప్పటికే బలమైన రాజ్యాధికారంగా ఎదిగిన సుమేరియన్లను అక్కడ ఎదుర్కోవాలి. దానికంటే, తూర్పు దిశగా ఉన్న సింధుస్థాన్ (ఇప్పటి ఆఫ్గనిస్థాన్, పడమటి పాకిస్థాన్‌లు) అనువైనదిగా ఆర్యులు ఎంచుకున్నారు. క్రీ.పూ. 1500 ప్రాంతంలో ఆ దిశగా సాగిన ఆర్యులు, స్థానిక ప్రజలతో యధేచ్ఛగా మమేకమౌతూ సింధూనదిని చేరుకున్నారు. నడుమ నడుమ నాగరికతకు ఎదగని ఆటవికులతో అక్కడక్కడ ఇబ్బందులు ఎదురైవుండొచ్చు. మహాభారతంలో భీమసేనుడు రాక్షసకన్య హిండిబిని పెళ్లాడిన రీతిలో కయ్యము, వియ్యాలతో ఆర్యులు ఆ సమస్యలు ఎదుర్కొంటూ సింధూనది వరకు వేగంగా విస్తరించారు. ఈ పరిణామం గమనిస్తే, సింధూనాగరికత అంతరించిపోయేందుకు కారణం వాతావరణంలో వచ్చిన మార్పువల్ల భూములు బీడుపడటంగా కొందరు చేస్తున్న వాదనగూడా వాస్తవం కాదని తెలుస్తుంది. అదే నిజమైతే, పచ్చికబయళ్లకోసం పాకులాడే ఆర్యులు ఇటువైపుగా విస్తరించే అవసరమే ఉండేదిగాదు. వేదంలో తొలుత సూచనప్రాయంగా కనిపించే వ్యవసాయానికి తరువాతి కాలంలో ప్రాముఖ్యత పెరగడం గమనిస్తే, సింధూపీఠభూమికి చేరిన ఆర్యులు వ్యవసాయంలో దిగినట్టు అర్థమౌతుంది. అప్పుడుగాని వాళ్లకు సేవకులతోనూ బానిసలతోనూ అవసరం ఏర్పడలేదు. పరిమితమైన వ్యాపారం, వ్యవసాయాలతో ఆర్యన్ భారతీయుల్లో వర్ణవ్యవస్థ సంపూర్ణంగా చోటుచేసుకుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు గోత్రాలుగా విభజించబడిన ఆర్యులుగానూ, సేవకులుగా వినియోగించుకునే శూద్రులు కులాలవారీగా విభజింపబడిన అనార్యులుగానూ కాలక్రమంలో స్థిరపడినట్టు అర్థమౌతుంది. వ్యవసాయం అనగానే స్థిరనివాసం తప్పనిసరి. ఆ అవసరం ఏర్పడినప్పుడు కూడా ఆర్యులు అదివరకటి వాళ్లు వదిలిపోయిన గృహాలను ఆక్రమించలేదు. వాళ్లు ఏ కారణంగా వాటిని బహిష్కరించారో ఊహించడం కష్టం. గ్రామాలుగా స్థిరపడిన ఆర్యులు మట్టిగుడిసెలతోనే గడుపుకున్నారు. యమునా, గంగా తీరాలకు విస్తరించిన తరువాత కూడా, పౌరాణిక గాథల్లో వినిపించే నగరాలూ, చక్రవర్తులు మినహా, ఆర్యులకు నగరాలున్నట్టు నిరూపించే ఆధారాలు కనిపించవు. ఒకప్పుడు సింధూనదికి తూర్పున మొదలై, ఉత్తరావర్తమంతా విస్తరించిన ‘ద్రవిడ నాగరికత’ ఒకటుండేదనీ, ఆర్యులు వాళ్లను దక్షిణాదికి తరిమేసి ఉత్తరాపథం ఆక్రమించారనీ, ఒక కొత్త వాదన ఇటీవల ముమ్మరంగా ప్రచారమైంది. క్రీ.పూ. 8వ శతాబ్దం దాకా ఉత్తరావర్తంలో నగరాల ఆనవాళ్లే చరిత్రకు అందనప్పుడు, ఏదో నాగరికత అక్కడ గొప్పదశలో ఉండేదని వాదించడం ఊహకు అతీతమైన తర్కం. పురాణాల్లో కనిపించే ‘హస్తినాపురం’, ‘ఇంద్రప్రస్థం’ వంటి పట్టణాలను వదిలేస్తే, క్రీ.పూ. 6వ శతాబ్దంలో అక్కడ మగధ, కోసల, కాశీ, వత్స, అంగ, పాంచాల, అవంతి, విదర్భ, గాంధార, కాంభోజ వంటి కొన్ని రాజ్యాలూ, శాక్య, మల్ల, వృజి, లిచ్ఛవి వంటి కొన్ని గణతంత్రాలూ ఏర్పడివున్నట్టు సమకాలీన సాహిత్యం ద్వారా తెలుస్తూంది. పేరుకు రాజ్యాలేగానీ, చెప్పుకోదగ్గ వైశాల్యం కలిగినవిగా ఇవి కనిపించవు. ఆ శతాబ్దం చివరిలో (బహువా క్రీ.పూ. 580 ప్రాంతంలో) కాశీ, కోసల రాజ్యాలనూ, వృజి గణతంత్రాన్నీ హస్తగతం చేసుకుని, విశాలంగా విస్తరించిన మొట్టమొదటి సామ్రాజ్యం మగధ. కట్టుకథలను దాటిన వాస్తవచరిత్ర భారతదేశానికి ఇక్కడ మొదలౌతుంది. ‘రాజగృహ’ పట్టణం రాజధానిగా, ‘హర్యాంక’ వంశానికి చెందిన ‘బింబిసారుడు’ మొదటి చక్రవర్తిగా మగధ సింహాసనం అధిరోహించాడు. చైనా చరిత్ర గూడా మనదానికి మల్లే పురాణ చక్రవర్తులతో మొదలౌతుంది. ఆధారాలులేని ఐదుగురు చక్రవర్తులూ, గ్జియా వంశాలను వదిలేస్తే, ‘షాంగ్’ వంశంతో వాస్తవ చరిత్ర మొదలౌతుంది. క్రీ.పూ. 1750 ప్రాంతంలో వీళ్ల పాలన మొదలైన తరువాత, పోగు తెగకుండా చైనా రాచరికచరిత్ర ఆనవాళ్లతో కొనసాగుతుంది. కనీసం క్రీ.పూ. 200 వరకూ ఆ రాజులు పాలించినవి ఒక మోస్తరు భూ భాగాలే తప్ప, సామ్రాజ్యాలని పిలిచేందుకు వీలుపడేది కాదు. ఒకప్పుడు సింధూనదికి తూర్పున మొదలై, ఉత్తరావర్తమంతా విస్తరించిన ‘ద్రవిడ నాగరికత’ ఒకటుండేదనీ, ఆర్యులు వాళ్లను దక్షిణాదికి తరిమేసి ఉత్తరాపథం ఆక్రమించారనీ, ఒక కొత్త వాదన ఇటీవల ముమ్మరంగా ప్రచారమైంది. క్రీ.పూ. 8వ శతాబ్దం దాకా ఉత్తరావర్తంలో నగరాల ఆనవాళ్లే చరిత్రకు అందనప్పుడు, ఏదో నాగరికత అక్కడ గొప్పదశలో ఉండేదని వాదించడం ఊహకు అతీతమైన తర్కం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
క్వార్టర్స్‌లో సింధు, సైనా
లక్నో: సయ్యద్ మోడి స్మారక గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ స్టార్ షట్లర్లు పి.వి.సింధు, సైనా నెహ్వాల్ జోరు కొనసాగిస్తున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో మూడోసీడ్ సింధు 21-18, 21-14తో జియాన్ చెన్ (సింగపూర్)పై గెలవగా... టాప్‌సీడ్ సైనా 21-15, 21-9తో రీతూపర్ణ దాస్‌ను ఓడించింది. తద్వారా ఈ ఇద్దరు క్వార్టర్స్‌కు అర్హత సాధించారు. జియాన్తో కేవలం 31 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో సింధు దూకుడును ప్రదర్శించింది. తొలి గేమ్‌లో 7-7, 14-14తో స్కోరు సమమైనా... చివర్లో వరుస పాయింట్లతో 19-16 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో జియాన్ రెండు పాయింట్లు గెలిచినా... హైదరాబాదీ ముందు నిలువలేకపోయింది. ఇక రెండో గేమ్‌లో 4-4తో స్కోరు సమమైన తర్వాత సింధు వరుసగా ఆరు పాయింట్లు నెగ్గింది. తర్వాత ఒకటి, రెండు పాయింట్లతో చకచకా గేమ్‌తో పాటు మ్యాచ్‌ను ముగించింది. పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్ కిడాంబి శ్రీకాంత్ 22-20, 20-22, 21-11తో జైనుద్దీన్ (మలేసియా)పై కష్టపడి గెలిచాడు. గంటా ఏడు నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్‌కు గట్టిపోటీ ఎదురైంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో హైదరాబాద్ కుర్రాడు ఒక్కసారిగా చెలరేగిపోయాడు. స్కోరు 3-3, 4-4తో సమమైన తర్వాత ఏ దశలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు. కనిష్టంగా రెండు పాయింట్లకు తక్కువ కాకుండా గెలుస్తూ జైనుద్దీన్ దెబ్బతీశాడు. స్కోరు 18-11 ఉన్న దశలో వరుసగా నాలుగు పాయింట్లు నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో మ్యాచ్‌లో 3వ సీడ్ పారుపల్లి కశ్యప్... 11వ సీడ్ మిషా జిల్బెర్మాన్ (ఇజ్రాయెల్)పై నెగ్గాడు. స్కోరు 21-16, 20-12 ఉన్న దశలో జిబ్బెర్మాన్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఇతర మ్యాచ్‌ల్లో 6వ సీడ్ బి.సాయి ప్రణీత్ 21-16, 24-26, 21-13తో 15వ సీడ్ సుపాన్యు అవింగ్సనాన్ (థాయ్‌లాండ్)పై; 8వ సీడ్ ఆర్‌ఎంవీ గురుసాయిదత్ 21-16, 21-19తో థామసిన్ సితికోమ్ (థాయ్‌లాండ్)పై గెలిచి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. పురుషుల డబుల్స్‌లో హేమ నాగేంద్ర-అరుణ్; నందగోపాల్-అర్జున్; మను అత్రి-సుమీత్ రెడ్డి జంటలు; మహిళల డబుల్స్‌లో జ్వాల-అశ్విని; జమునా రాణి-లీలా లక్ష్మీ జంటలు క్వార్టర్స్‌కు చేరాయి. -
శాండల్‌వుడ్ నటుడు రఘువీర్ కన్నుమూత...
సాక్షి, బెంగళూరు : కన్నడ సినీ రంగంలో 22ఏళ్ల పాటు ప్రయాణాన్ని సాగించిన నటుడు రఘువీర్(46) మృతిచెందారు. గుండెపోటు కారణంగా ఆయన మృతి చెందినట్లు కుటుంబ వర్గాలు వెల్లడించాయి. అజయ్-విజయ్ చిత్రంతో శాండిల్‌వుడ్‌కు పరిచయమైన రఘువీర్ అసలు పేరు దినేష్. చైత్రద ప్రేమాంజలి సినిమా ఆయనకు మంచి నటుడిగా పేరు తెచ్చింది. ‘శృంగార కావ్య’ సినిమాలో తనతో పాటే నటించిన హీరోయిన్ సింధును రఘువీర్ వివాహమాడారు. ఈ వివాహం రఘువీర్ కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో కుటుంబానికి ఆయన దూరమయ్యారు. వివాహమైన కొన్ని సంవత్సరాలకు అనారోగ్య కారణంగా భార్య సింధు మరణించడంతో మానసికంగా కుంగిపోయిన రఘువీర్ చాలా కాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. ఇటీవల తిరిగి వచ్చి కావేరీ తీరదల్లి, నవిలూర నైదిల, మౌన సంగ్రామ వంటి సినిమాలు చేసినా అవి నిరాశనే మిగిల్చాయి. గురువారం రాత్రి తన స్నేహితులు, పిల్లలతో కలిసి ఎస్టేట్‌కి వెళుతున్న సమయంలో ఉన్నపళంగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. తక్షణమే ఆయన్ను బీటీఎం లేఅవుట్లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించినా చికిత్స ఫలించక తనువు చాలించారు. సంపంగి రామనగరలోని రఘువీర్ నివాసంలో ప్రజల సందర్శనార్ధం పార్ధివ దేహాన్ని ఉంచారు. నటీనటులు శోభరాజ్, లీలావతి, వినోద్‌రాజ్, కె.మంజు, జగ్గేష్ తదితరులు రఘువీర్ పార్ధివ శరీరానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం శుక్రవారం మధ్యాహ్నం విల్సన్ గార్డెన్ స్మశాన వాటికలో రఘువీర్ అంత్యక్రియలు పూర్తిచేశారు. రఘువీర్ కుటుంబానికి రూ1.75లక్షల ధన సహాయాన్ని అందించనున్నట్లు కన్నడ చలనచిత్ర వాణిజ్య మండలి వెల్లడించింది. -
రిజర్వాయర్‌లో విద్యార్థిని గల్లంతు
విహారయాత్రలో విషాదం బొమ్మకూరు జలాశయంలో ఘటన నర్మెట, న్యూస్‌లైన్ : సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఓ విద్యార్థిని మండలంలోని బొమ్మకూరు రిజర్వాయర్‌లో ప్రమాదశాత్తూ పడి గల్లంతైన సంఘటన శుక్రవా రం జరిగింది.మండలంలోని మరియపురం గ్రామానికి చెందిన తిర్మల్‌రెడ్డి భాస్కర్‌రెడ్డి, మరియమ్మ దంపతుల చిన్నకూతురు సింధూ(14) మరియపురంలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఎన్నికల సందర్భంగా పాఠశాలకు సెలవు కావడంతో తన మిత్రులు స్థానిక చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్న కమాల్రెడ్డితో కలిసి విహారయాత్రకు వెళ్తున్నందున తనను కూడా పంపించాలని పట్టుబట్టింది. దీంతో తల్లిదండ్రులు అంగీకరించారు. అనంతరం తన మిత్రులు సృజన, ఆనందవర్షిత, జీవని, హర్షిత్, రాజశేఖర్‌తోపాటు ఫాదర్ కమాల్‌రెడ్డి బొమ్మకూరు రిజర్వాయర్‌కు విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం వారి వెంట తీసుకెళ్లిన భోజనం తిన్నారు. అందరిలో మొదటగా తిన్న సింధూ, సృజన చేతులు కడుక్కోవడానికి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రమాదవశాత్తూ సింధూ నీళ్లలో పడిపోయింది. పక్కనే చేతులు కడుక్కుంటున్న సృజన ఆందోళనకు గురై వెంటనే వెళ్లి మిత్రులకు, ఫాదర్ కమల్‌కు చెప్పడంతో వారు పరుగెత్తుకొచ్చారు. అయితే అప్పటికే సింధూ నీట మునిగింది. వెంటనే ఫాదర్ కమాల్ స్థానికులకు, తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినా ఆమె జాడ తెలియరాలేదు. -
అమ్మమ్మ ఇంటికి వెళుతూ.. అనంత లోకాలకు
నర్సింహులపేట, న్యూస్‌లైన్ : అమ్మమ్మ ఇంటికి వెళదామనగానే ఆ ఇద్దరు చిన్నారులు నిమిషాల్లో రెడీ అయిపోయూరు.. తండ్రి ద్విచక్రవాహనం స్టార్ట్ చేయగానే ముందు ఎక్కి కూర్చున్నారు. ఆ ప్రయూణమే ఆ పసిపిల్లలకు ఆఖరి ప్రయూణమైంది. ముందు వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో అక్కాచెల్లెలు అక్కడికక్కడే మృతిచెందగా, వారి తల్లిదండ్రులు, తమ్ముడు గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని కుమ్మరికుంట్ల శివారులో సోమవారం జరిగింది. కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం... కుమ్మరికుంట్లకు చెందిన చిరగా ని శ్రీనివాస్, ప్రవళిక దంపతులకు కుమార్తెలు సింధూ(లాస్య)(6), శశి(శ్రీవల్లి)(5), కుమారుడు కిట్టు(18 నెలలు) ఉన్నా రు. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం అత్తగారింటి వద్ద నిర్వహించే కోర్ల పౌర్ణమి(పండగ)కి హాజరయ్యేందుకు అతడు తన భార్య, పిల్లలను తీసుకుని ఇదే మండలంలోని వేములపల్లి శివారు దొనకొండకు బయల్దేరాడు. అమ్మమ్మ ఇంటికి వెళదామనగానే సింధూ, శశి సంతోషంతో కొత్త బట్టలు వేసుకుని రెడీ అయిపోయి ద్విచక్ర వాహనం ముందు ట్యాంక్‌పై కూర్చున్నారు. వెనుక కుమారుడిని పట్టుకుని భార్య కూర్చోగా శ్రీనివాస్ బైక్ నడుపుతున్నాడు. గ్రామం నుంచి అర కిలోమీటర్ దూరం వెళ్లగానే ఎదురుగా ఓ వాహనం వేగంగా రావడంతో దానిని తప్పించబోయి శ్రీనివాస్ ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. గడ్డి లోడ్‌తో ఉన్న ట్రాక్టర్ కిందికి బైక్ దూసుకెళ్లడంతో ముందు భాగంలో కూర్చున్న కుమార్తెలు సింధూ, శశి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో శ్రీనివాస్, తల్లి ప్రవళికకు తీవ్ర గాయూలయ్యూయి. 18 నెలల చిన్నా రి బాలుడు కిట్టు క్షేమంగా బయటపడ్డాడు. ముగ్గురిని తొర్రూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కన్నీటిసంద్రమైన కుమ్మరికుంట్ల సంఘటన స్థలానికి ప్రజలు వందలాదిగా చేరుకున్నారు. చిన్నారుల మృతితో కుమ్మరికుంట్ల, దొనకొండలో విషాద ఛాయలు అలుముకున్నా యి. గ్రామస్తులు కన్నీటి పర్యం తమయ్యూరు. సంఘటన స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ సంఘటన స్థలాన్ని మానుకోట డీఎస్పీ శోభన్‌కుమార్, సీఐ సార్ల రాజు, ఎస్సై వెంకటప్రసాద్ పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పంచనామా నిర్వహించి మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వై.వీ.ప్రసాద్ వెల్లడించారు.