న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా తాజాగా ప్రాజెక్ట్ ఇండస్‌ను ప్రారంభించింది. బహుళ భారతీయ భాషలు, మాండలికాలలో సంభాíÙంచడానికి దేశీయంగా రూపొందించిన లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్‌ఎల్‌ఎం) ఇది. ఇండస్ ఎల్‌ఎల్‌ఎం మొదటి దశ హిందీ భాషతోపాటు దాని 37కుపైగా మాండలికాల కోసం అభివృద్ధి చేశారు.
ఇండస్ మోడల్ ప్రారంభంలో మౌలిక సదుపాయాలు, కంప్యూటింగ్‌ను ఒక సేవగా, సంస్థలకు ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కారాలను అందించడం వంటి కీలక ప్రాజెక్టులపై దృష్టి పెడుతుందని కంపెనీ తెలిపింది. ఎల్‌ఎల్‌ఎంకు అవసరమైన అధిక–పనితీరు గల కంప్యూటింగ్ సొల్యూషన్స్, స్టోరేజ్, నెట్‌వర్కింగ్ సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి డెల్ టెక్నాలజీస్‌తో టెక్ మహీంద్రా చేతులు కలిపింది. కస్టమర్లు జెన్‌ఏఐ అప్లికేషన్‌లలో ఇండస్ మోడల్‌ను ఏకీకృతం చేసేందుకు వీలుగా ఇంటెల్ జియాన్ ప్రాసెసర్‌లు, వన్‌ఏపీఐ సాఫ్ట్‌వేర్, ఇంటెల్ అడ్వాన్స్‌డ్ మ్యాట్రిక్స్ ఎక్స్‌టెన్షన్స్ సహా ఇంటెల్–ఆధారిత మౌలిక సదుపాయాల పరిష్కారాలను ప్రాజెక్ట్ ఇండస్ స్వీకరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment