ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. జాబ్ మార్కెట్‌లో ఆందోళనలు కొనసాగుతున్న వేళ సంస్థ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గత ఏడాది విడుదలై జాబ్ మార్కెట్‌లో అలజడి సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై 8 వేల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. వ్యూహాత్మక అడుగుతో జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ డిమాండ్‌ను తీర్చేందుకు కంపెనీ సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా టెక్ మహీంద్రా గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, మార్కెటింగ్ హెడ్ హర్షేంద్ర సోయిన్ సంస్థ వృద్ధి సాధించడంలో ఏఐ ప్రాముఖ్యతను వివరించారు.బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్, మ్యానఫాక్చరింగ్, రిటైల్‌పై సంస్థ దృష్టి సారించినట్లు చెప్పారు. అందుకు అనుగుణంగా సంస్థ నిర్ణయాలు తీసుకుంటుందని వెల్లడించారు.
సవాళ్లు - అవకాశాలు
ఏఐ,ఎమర్జింగ్ టెక్నాలజీలపై టెక్ మహీంద్రా దృష్టి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, జూన్ త్రైమాసికంలో కంపెనీ సవాళ్లను ఎదుర్కొంది, గత సంవత్సరంతో పోలిస్తే నికర లాభంలో 38% క్షీణతను చవిచూసింది. కమ్యూనికేషన్స్, మీడియా అండ్ ఎంటర్ టైన్‌మెంట్ (సీఎంఈ) విభాగంలో ఈ సవాళ్లకు దోహదం చేసింది. అయితే భవిష్యత్తుపై ఆశాభావం వ్యక్తం చేసిన ప్రస్తుత సీఈఓ, ఎండీ సీపీ గుర్నానీ జనరేటివ్ ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీలను వృద్ధికి కీలక టెక్నాలజీ రంగాలుగా గుర్తించారు. ఇందులో భాగంగా, ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ఏఐపై శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి ➤ ఐటీఆర్ ఫైల్ చేశారా? లేదంటే ఇప్పుడే చేయండి.. ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment