
చిరుతకు మత్తు మందు ఇచ్చి పట్టుకుంటున్న జూపార్కు అధికారులు
చండూరు: అడవి పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపురం అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున జరిగింది. అజిలాపురం, రంగా రెడ్డి జిల్లా సరిహద్దు అడవుల మధ్య అజిలాపురం గ్రామానికి చెందిన రైతులు తమ పంటలను అడవి పందుల బారినుంచి కాపాడుకునేందుకు ఉచ్చులు వేశారు. దీంతో మంగళవారం తెల్లవారుజామున ఆ ఉచ్చులో చిరుతపులి చిక్కింది. ఉదయాన్నే వచ్చి చూసిన రైతులకు చిరుత కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని ఫారెస్ట్, జూపార్క్ అధికారులకు సమాచారం ఇచ్చారు. జూ సిబ్బంది వచ్చి చిరుతకు మత్తు మందు ఇచ్చి జూపార్క్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment