- ∙రూ.30వేల లంచం తీసుకుంటూ దొరికిపోయిన వీఆర్‌ఓ
- ∙రూ.10 వేల కోసం రైతును డిమాండ్ చేసిన తహసీల్దార్..
- ∙ఇద్దరి అరెస్టు, రిమాండ్
ఏసీబీ వలలో తహసీల్దార్, వీఆర్‌ఓ
Published Tue, Sep 20 2016 12:17 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
చిట్యాల :
పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం డబ్బులు ఇవ్వాలంటూ రైతును వేధించిన తహసీల్దార్, వీఆర్‌ఓ ఏసీబీకి అధికారులకు చిక్కారు. ఇందులో వీఆర్‌ఓ డబ్బు తీసుకుంటూ దొరికిపోగా.. వీఆర్‌ఓకు ఇచ్చే నగదు కాకుండా తనకు మరికొంత ఇవ్వాలంటూ సంతకం చేయకుండా ఆపిన తహసీల్దార్‌ను సైతం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.
పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం..
మండలంలోని పంగిడిపల్లి గ్రామ శివారు పెద్దంపల్లికి చెందిన గౌడ సమ్మయ్య అదే గ్రామంలో ఏడు ఎకరాల పది గుంటల భూమి కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిసే్ట్ర¯ŒS పూర్తయ్యాక పట్టాదార్ పాస్ పుస్తకాల కోసం మీ–సేవలో దరఖాస్తు చేసుకుని గ్రామ వీఆర్‌ఓ కొత్తూరి రవీందర్‌ను సంప్రదించాడు. దీని కోసం రూ.30వేలు ఖర్చవుతాయని వీఆర్‌ఓ చెప్పగా చిట్యాల తహసీల్దార్ భూక్యా పాల్‌సింగ్ వద్దకు వెళ్లగా.. ఆర్‌ఐ, డీటీ, డేటా ఎంట్రీ ఉద్యోగులతో పాటు ఆర్‌డీఓ ఆఫీస్‌లో వీఆర్‌ఓలు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పాడు. దీనికి తోడు వీఆర్‌ఓకు ఇచ్చే రూ.30వేలు కాకుండా తనకు మరో రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ మేరకు రైతు సమ్మయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇందులో భాగంగా సోమవారం పంగిడిపల్లి గ్రామపంచాయితీలో రైతు సమ్మయ్య దగ్గర రూ.30 వేల లంచం తీసుకుంటుండగా వీఆర్‌ఓ రవీందర్‌ను అరెస్ట్ చేశారు. ఇక డబ్బు కోసం వేధిస్తూ పట్టాదార్ పాసు పుస్తకాలపై సంతకం చేయకుండా ఈనెల 6వ తేదీ నుంచి వీఆర్‌ఏ చందు బీరువాలో ఉంచిన తహసీల్దార్‌ను పాల్‌సింగ్‌ను సెల్‌ఫో¯ŒS సంభాషణ ఆధారంగా అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సాయిబాబా తెలిపారు.
80 రోజుల పాటు ఇబ్బంది పెట్టారు
: గౌడ సమ్మయ్య ,రైతు
పట్టాదారు పాస్‌బుక్‌ల కోసం వెళ్లే డబ్బులు ఇవ్వాల్సిందేనం టూ వీఆర్‌ఓ రవీందర్, తహసీల్దార్ పాల్‌సింగ్ 80 రోజుల పా టు ఇబ్బంది పెట్టారని బాధిత రైతు గౌడ సమ్మ య్య తెలిపారు. సోమవారం తహసీల్ కార్యాలయంవద్ద విలేకరులతో మాట్లాడారు. డబ్బులు వేధిస్తుండడంతో వారికి బుద్ధి చెప్పాలని ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు.
17న రెక్కీ..
రైతు సమ్మయ్యను వేధించిన వీఆర్‌ఓ, తహసీల్దార్ కోసం ఈనెల 17న(శనివారం) ఏసీబీ అధికారులు రెక్కి నిర్వహించినట్లు తెలిసింది. అదే రోజు డబ్బులు ఇచ్చేందుకు సమ్మయ్య ఆఫీస్‌కు వెళ్లడంతో వీఆర్‌ఓ, తహశీల్దార్‌లు అప్పటికే బయలుదేరడంతో ఏసీబీ అధికారులు వెనుతిరిగినట్లు సమాచారం.
ఏసీబీకి చిక్కిన రెండో తహసీల్దార్
చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తు ఏసీబీ వలలో చిక్కిన తహసీల్దార్ల సంఖ్య రెండుకు చేరింది. 2006–07లో తహసీల్దార్‌గా పని చేసిన లింగాల సూరిబాబు పరకాలలోని అద్దె ఇంట్లో ఒడితలకు చెందిన రైతు వద్ద రూ. 30 వేల లంచం తీసుకుంటు దొరికిపోయాడు. ఇప్పుడు పాల్‌సింగ్ సైతం పట్టుబడడం గమనార్హం.
Advertisement
Advertisement