
సాక్షి, కర్ణాటక : సుజిత్ శెట్టి అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో హోంగార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఒంటి మీద ఖాకీ చొక్కాని అడ్డు పెట్టుకొని అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు. ఒకరికి తెలియకుండా మరొకరిని మాయమాటలు చెప్పి ట్రాప్ చేసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు సుజీత్‌పై కేసు నమోదు చేసి, సస్పెండ్ చేశారు. సుజిత్ కర్ణాటకలోని ఉడుపిలో ఉన్న శిర్వా పోలీస్ స్టేషన్‌లో గత ఆరు నెలలుగా హోంగార్డ్‌గా పనిచేస్తున్నాడు.
అయితే ఇతడు 11 మంది అమ్మాయితో దిగిన సెల్ఫీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పోలీసులు ‘మహిళల రక్షణ కోసం షీ టీమ్‌లు ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పుకుంటారు.. మరి మీ నుంచి మహిళల్ని రక్షించేదెవరు. అమ్మాయిలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా చేస్తుంటే ఏవరితో చెప్పాల’ని ఈ వీడియో చూసిన నెటిజన్లు మండిపడుతున్నారు.










Comments
Please login to add a commentAdd a comment