
బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే అంతేనట!
న్యూఢిల్లీ: ప్రజల జీవన విధానం కారణంగా ఆహార ఆలవాట్లలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బిజీ బిజీ జీవితంలో వ్యాయామం చేయడానికి కూడా తీరికలేనంతగా అలసిపోతున్నారు. దీనికి తో్డు ఫాస్ట్ ఫుడ్ కు అలవాటుపడటం కూడా ఊబకాయానికి దారి తీస్తోంది. ముఖ్యంగా రాత్రి ఎనిమిదిలేదా ఆరుగంటల విరామం తర్వాత ఆహారం శరీర బరువు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో నిపుణులు సూచిస్తున్న అయిదు చిట్కాలు.
1. బ్రేక్ ఫాస్ట్
ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి. సాధారణంగా పని ఒత్తిడిలో పడి ఉదయం పూట అల్పాహారం సంగతి పక్కన పెడతాం. కానీ రోజులో మనం తీసుకునే అతి ముఖ్యమైన ఆహారాన్ని తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయకూడదు. శరీర మెటబాలిజం నియంత్రణకు ఉదయం ఆహారంచాలా కీలకమైందని సూచిస్తున్నారు. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకోవడం ముఖ్యం.
2. ఆహారం
ఈ క్రమంలో మనం తీసుకునే ఆహారంపై, కాలరీలపై దృష్టిపెట్టాలి. తక్కువ శాతం సుగర్, కొవ్వు ఉన్నపదార్దాలను తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా.. కొంచెం కొంచెం గా తీసుకో్వడం ద్వారా ఊబకాయాన్ని నియంత్రించవ్చని సలహా ఇస్తున్నారు.
3.ప్రతిరోజు అరగంట వ్యాయామం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఒబెసిటీ ద్వారా వచ్చిప్రమాదకరమైన వ్యాధులనుంచి బయటపడవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, గుండె జబ్బు నిరోధించవచ్చు. దీనితోపాటు అధిక రక్తపోటు, ఒత్తిడిలనుంచి కూడా ఇది సహాయం చేస్తుంది. ముఖ్యంగా నడుము, పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించుకోవడానికి వ్యాయామం అవసరం.
4. నిద్ర
కంటి నిండా నిద్రకూడా శరీర బరువు నియంత్రణలో చాలా కీలకమైంది. నిద్ర లేమి అధిక బరువుకు దారి తీస్తుంది. రోజువారీ తగినంత నిద్ర శరీరానికి కావాలి. నిద్ర లేమితో బాధపడుతున్న వారు త్వరగా ఆలసిపోతారు. వ్యాయామం చేయలేనంత నీరసం ఆవహిస్తుంది. సో..రోజూ సరియైన నిద్రపోవడం అవసరం.
5. డాక్టర్ల సలహా
వీటన్నింటికి మరో ముఖ్యమైన విషంయ అధిక బరువుతో బాధపడుతున్నపుడు డాక్టర్ ను సంప్రదించిన సరియైన చికిత్స తీసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి అపోహలు భయాలు, లేకుండా నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా అవసరమని పేర్కొంటున్నారు.