
బరువు తగ్గాలంటే జీవన శైలి మార్పులు చేసుకోవాలి. వాకింగ్, యోగా ఇలాంటి ఏదో ఒక వ్యాయామం తప్పకుండా చేయాలి. అంతేకాదు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలన్నా కూడా వాకింగ్‌కు మించింది లేదు. ఈ వాకింగ్‌లో చాలా పద్దతులు న్నాయి. రోజులో కనీసం 5 వేల అడుగులు వేయాలని, 10 వేల అడుగులు నడిచే వారికి ఊబకాయం అనే సమస్య ఉండదని నిపుణులు చెబుతారు. అయితే ఒక పద్ధతిని పాటిస్తే వాకింగ్ బోర్ కొట్టకుండా ఉత్సాహంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అదేంటో తెలుసుకుందామా మరి.
ఫిట్‌గా ఉండటానికి నడక కంటే మెరుగైన వ్యాయామం లేదు. రెగ్యులర్ వాకింగ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నడక వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. గుండెకు బలం చేకూరుతుంది. కీళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు, దృఢంగా మారతాయి. కండరాల శక్తి పెరుగుతుంది. బీపీ, షుగర్ లాంటి వాటి నుంచి దూరంగా ఉండొచ్చు. వీటన్నింటికి మించి ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. అయితే, ఈ రోజువారీ నడకలో చిన్న మార్పులు చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలొస్తాయని నిపుణులు అంటున్నారు. అదే 2:2:1 వాకింగ్ ఫార్ములా
చదవండి: ఇంటి గుట్టు :దెబ్బకి రూ. 80 లక్షలు ఖతం, చివరికి!
ఏంటీ 2:2:1 వాకింగ్ ఫార్ములా
రెండు(2) నిమిషాలు వేగంగా నడవడం (Brisk walking)
తరువాతి రెండు(2) నిమిషాలు జాగింగ్ (jogging) చేయడం
ఆ తరువాత ఒక నిమిషం (1) పాటు సాధారణ నడక(normal walking) అన్నమాట. ఈ సైకిల్‌ను రిపీట్ చేస్తే అటు బరువు తగ్గడంతోపాటు, ఇటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. రోజులో కనీసం అరగంట ఈ పద్ధతినే పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గాలని చూస్తున్న వారికి గేమ్-ఛేంజర్‌గా భావిస్తారు.
ప్రయోజనాలు
కేలరీలు తొందరగా,ఎక్కువగా బర్న్ అవుతాయి. 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయడం వల్ల 200 కేలరీలు బర్న్ అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి
జీవక్రియ వేగవంతమవుతుంది.
వేగంగా నడవడం వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది.
ఆ తరువాత చేసే జాగింగ్ కొవ్వును వేగంగా కరిగించడానికి సాయపడుతుంది.
బ్రిస్క్ వాకింగ్, జాగింగ్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ స్తాయి పెరుగుతుంది.
నెమ్మదిగా నడుస్తున్నప్పుడు జాగింగ్‌తో అలసిన కండరాలకు విశ్రాంతి లభిస్తుంది. ఈ విధానంలో అలసట రాదు , ఆసక్తికరంగా ఉంటుంది కూడా.
నెమ్మదిగా, స్థిరంగా చేసే ఒకే రకమైన వ్యాయామాల కంటే ఇంటర్వెల్-స్టైల్ వ్యాయామాలు కొవ్వును కరిగించ డానికి, సమర్థవంతంగా ఉంటాయని అధ్యయనాల ద్వారా వెల్డైంది. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే 2:2:1 ఫార్ములా ఉత్తమమంటున్నారు నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment