New technique
-
కాలుష్యం తగ్గించే టెక్నిక్
పరిశ్రమల గొట్టాల నుంచి వెలువడే పొగలోని కార్బన్ డైయాక్సైడ్‌ను మరింత సమర్థంగా తొలగించేందుకు ఒరెగాన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ కొత్త టెక్నిక్‌ను కనుక్కున్నారు. భూతాపోన్నతిని తగ్గించడంలో ఈ టెక్నిక్ కీలక పాత్ర పోషించగలదని అంచనా. పారిశ్రామిక విప్లవం మొదలైనప్పటి నుంచి గాల్లో కార్బన్‌డై యాక్సైడ్ మోతాదు సుమారు 40 శాతం వరకూ పెరిగిపోగా దీని ఫలితంగా భూమి సగటు ఉష్ణోగ్రతలు 0.84 డిగ్రీ సెల్సియస్ వరకూ ఎక్కువైంది. ప్రస్తుతం వాతావరణంలో ఉన్న కార్బన్‌డైయాక్సైడ్ మోతాదు ప్రతి పదిలక్షల కణాలకు 407.4గా ఉంది. భూమిపై గత ఎనిమిది లక్షల ఏళ్లలో ఇంత స్థాయి కాలుష్య వాయువు ఎప్పుడూ లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో పరిశ్రమల పొగగొట్టాల నుంచి కార్బన్‌డై యాక్సైడ్‌ను తగ్గించేందుకు ఏం చేయాలన్న విషయంపై ఒరెగాన్‌తోపాటు అనేక ఇతర వర్సిటీలు సంయుక్తంగా పరిశోధనలు ప్రారంభించాయి. వందల, వేల నానో పదార్థాల సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వీరు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ (ఎంఓఎఫ్) ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని నిర్ధారించుకున్నారు. ఈ ఎంఓఎఫ్ల్లో రెండిని పరీక్షించినప్పుడు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక పదార్థాల కంటే ఇవి 13 రెట్లు ఎక్కువ మెరుగ్గా పనిచేసినట్లు తెలిసింది. మరింత విస్తృత స్థాయి పరిశోధనలు చేయడం ద్వారా ఈ ఎంఓఎఫ్‌లను మెరుగుపరచవచ్చునని, పరిశ్రమల్లో వీటిని వాడటం ద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలో కార్బన్ డైయాక్సైడ్ వాతావరణంలోకి చేరకుండా అడ్డుకోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. -
వైరల్ : కటౌట్లతో పిల్లాడిని ఏడవకుండా చేశారు..
టోక్యో : చిన్నపిల్లలు తాము ఆడుకునేటప్పుడో లేక పడుకొని లేచినప్పుడు తల్లిదండ్రులు కనిపించకపోతే ఏడ్వడం అనేది సాధారణమైన విషయం. అప్పుడు వారి ఏడ్పును ఆపడం ఎవరి తరం కాదు. కానీ ఇలాంటి ఘటన ఎదురైతే దానికి మా దగ్గర పరిష్కారం ఉందటున్నారు జపాన్‌కు చెందిన దంపతులు. వివరాలు .. జపాన్‌కు చెందిన ఒక పిల్లాడు తన తల్లి ఒక్క క్షణం కనిపించకపోయినా గుక్కపట్టి ఏడ్చేవాడు. దీంతో ఆ దంపతులు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కొత్త మెకానిజమ్‌ను కనుగొన్నారు. అదేంటంటే.. పిల్లాడి తల్లికి సంబంధించిన రెండు కటౌట్లను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి పిల్లాడి పక్కనే కూర్చునేలా, మరొకటి తల్లి నిలబడిన కటౌట్లను తయారు చేయించాడు. కాకపోతే అవి పిల్లాడికి అందకుండా ఏర్పాటు చేసుకున్నారు. ఎంతకైనా మంచిదని ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదనుకొని పిల్లాడు టీవీ చూస్తుండగా వెనుక ఒక కటౌట్‌ను ఏర్పాటు చేసి తల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. తర్వాత వెనక్కి తిరిగి చూసిన పిల్లాడికి తల్లి కటౌట్ కనిపించడంతో ఏడ్వకుండా మళ్లీ ఆడుకోవడం మొదలుపెట్టాడు. తాము కనుగొన్న ఈ టెక్నిక్ విజయవంతం కావడంతో ఆ తల్లిదండ్రులు తెగ సంతోషపడిపోయారు. అయితే తండ్రి ఇదంతా వీడియో తీసీ ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లాడి తల్లిదండ్రులను పొగడ్తలతో ముంచెత్తారు. పిల్లాడి ఏడ్పును కంట్రోల్ చేయడంతో పాటు వారి పనులు కూడా సజావుగా జరిగేందుకు కటౌట్ ఉపయోగపడుతుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలు కూడా ఏడ్వకుండా ఉండేందుకు ఇలాంటి కటౌట్లను ఏర్పాటు చేసుకోండి. 結果、20分くらい気づかれず。これはたまには役立つかも… このパネルは、ビッグダミー(スーパーとかにある巨大なパネル)など、販促物をつくってるリンクスさんにお願いして、「ビッグマミー」をつくってもらいました🙏https://t.co/zLfGDZpiPa pic.twitter.com/zp5qiyqoRq — 佐藤ねじ🌲ブルーパドル (@sato_nezi) December 8, 2019 -
మనసులో అనుకున్నది గీసేస్తుంది!
టొరెంటో: మనసులో తలచుకునే దానిని చిత్ర రూపంలో చూపించే నూతన టెక్నాలజీని టోరెంటో యూనివర్సిటీకి చెందిన డాన్ నెమ్రోదేవ్ అనే పరిశోధకుడు అభివృద్ధి చేశారు. మెదడులోని తరంగాల కదలికల ఆధారంగా ఇది ముఖ చిత్రాన్ని గీస్తుందన్నారు. ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రఫీ(ఈఈజీ) డేటా ఆధారంగా ఇది పనిచేస్తుందని చెప్పారు. మనం దేనినైనా చూసినప్పుడు మెదడులో ఓ ఊహాచిత్రం ఏర్పడుతుందని, దీనిని ఈఈజీ సాయంతో బంధించి చిత్రం రూపంలోకి తీసుకురాగలమని పేర్కొన్నారు. నాడీ తరంగాల ఆధారంగా మనసులో గుర్తుంచుకున్న, ఊహించుకునే అంశాలను కూడా ఇది చిత్రీకరించగలదని వర్సిటీకి చెందిన ఆడ్రియాన్ నెస్టర్ తెలిపారు. ఇది విజయవంతమైతే నేరాల్లో ప్రత్యక్ష సాక్షుల మెదడు కదలికల ఆధారంగా నేరస్థుల చిత్రాలను గీయగలదని చెప్పారు. మాట్లాడలేని వారి మనసులో ఏముందో కూడా గుర్తించగలదన్నారు. అయితే దీనిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పరిశోధన వివరాలు ఈన్యూరో జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
పైరసీని అరికట్టడానికి కొత్త టెక్నిక్
పైరసీకి చెక్ పెట్టే విధంగా పులన్‌విచారణై -2 చిత్ర యూనిట్ కొత్తగా సాంకేతికపరమైన టెక్నిక్‌ను కనిపెట్టింది. విజయకాంత్ హీరోగా నటించిన పులన్‌విచారణై చిత్రం ఎంతో ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు ఆర్ కె సెల్వమణి, ప్రశాంత్ హీరోగా పులన్ విచారణై -2, తెరకెక్కించారు. రావేదర్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఇబ్రహీం రావుత్తర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పైరసీకి గురి కాకుండా సాంకేతిక పరమైన కొత్త టెక్నిక్‌ను కనుగొన్నట్లు చిత్ర దర్శకుడు ఆర్కె సెల్వమణి పేర్కొన్నారు. పులన్‌విచారణై -2 చిత్రాన్ని తాను తమిళనాడు, పాండిచ్చేరిలలో మాత్రమే ముందుగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్ర సీడీ, డీవీడీ, శాటిలైట్, వెబ్సైట్, ఇంటర్నెట్, కేబుల్‌టీవీ, ఇతర ఎలక్ట్రానిక్ హక్కులను ఎవరికీ విక్రయించలేదని తెలిపారు. చిత్రం ఎస్ఎంఎస్ హక్కులను ఎవరికీ ఇవ్వలేదన్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శికి, పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. మొదట విజయం : పులన్ విచారణ -2 చిత్ర యూనిట్ పైరసీని అరికట్టడలో తొలి విజయం సాధించారన్నారు. తమ ఫిర్యాదు మేరకు పోలీసు కమిషనర్ ఆమ్నీ బస్ నిర్వాహకులందరినీ పిలిపించి కొత్త చిత్రాలను ప్రదర్శించకుండా హెచ్చరించారని తెలిపారు. పైరసీకి పాల్పడితే కనుగొనడానికి తాముకొత్త టెక్నిక్‌ను కనిపెట్టినట్లు చెప్పారు. తమ చిత్ర పైరసీ సీడీలకు పాల్పడినట్లయితే ఏ థియేటర్ల్లో పైరసీకి పాల్పడుతున్నారన్నది ఆ ప్రాంత సెల్‌ఫోన్ టవర్స్ కోడ్ నెంబర్ నమోదవుతోందన్నారు. అదే విధంగా ఎక్కడ డీవీడీలను తయారు చేస్తున్నారు ఆ తరువాత దానికి ఎక్కడ కాపీ రూపొందిస్తున్నారన్న అంశాలు కూడా రిజిస్టర్ అవుతాయని తెలిపారు. ఇలాంటి కొత్త టెక్నిక్‌తో విడుదలవుతున్న తొలి చిత్రం పులన్ విచారణై -2 అని ఆర్కె సెల్వమణి పేర్కొన్నారు. నిర్మాత ఇబ్రహీం రావుత్తర్ నియాఖత్ అనీఖాన్, షణ్ముగధరన్ పాల్గొన్నారు. -
జన్యువుల కత్తిరింపు.. మలేరియాకు విరుగుడు!
మలేరియా వ్యాధితో ఏటా లక్షలాది మంది ప్రాణాలను హరించే ప్లాస్మోడియం పరాన్నజీవిని హతమార్చేందుకు శాస్త్రవేత్తలు కొత్త టెక్నిక్‌ను కనుగొన్నారు. ‘సీఆర్ఐఎస్పీఆర్’ అనే ఈ టెక్నిక్‌తో ప్లాస్మోడియంలో ఏదో ఒక కీలకమైన జన్యువును మార్చడం లేదా కత్తిరించడం ద్వారా దానిని వందశాతం అడ్డుకునేందుకు వీలవుతుందట. ప్లాస్మోడియం ఫాల్సిపెరమ్ పరాన్నజీవికి చెందిన మొత్తం జన్యుపటాన్ని రూపొందించినా.. ఇప్పటికీ ఆ జన్యుపటంలోని 2,500 జన్యువుల పనితీరును అర్థం చేసుకోవాల్సి ఉందని, అయితే జన్యువులను మార్చే పద్ధతి ద్వారా కొత్త ఔషధాలు కనుగొనేందుకు మార్గం సుగమం అయిందని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా ప్లాస్మోడియం పరాన్నజీవి సంక్రమించినప్పుడు మనిషి ఎర్ర రక్తకణాలు మృదుత్వాన్ని కోల్పోయి గురుకుగా మారతాయి. దాంతో ప్లాస్మోడియం రక్తకణానికి అతుక్కుని అందులోకి ప్రవేశించి రక్తకణాన్ని తినేస్తుంది. అయితే ఈ రెండు రకాల పనులు చేసేందుకు కార్ప్, ఎబా-175 అనే రెండు జన్యువులే ప్లాస్మోడియానికి ఉపయోగపడుతున్నాయని గుర్తించిన ఎంఐటీ శాస్త్రవేత్తలు.. దానిలోని ఈ జన్యువులను ఆటంకపర్చారు. ఫలితంగా ప్లాస్మోడియం ఎర్ర రక్తకణాలను గరుకుగా మార్చలేక , అందులోకి ప్రవేశించలేకపోయిందట. దీంతో ప్లాస్మోడియం జన్యువులను ఆటంకపర్చే ఔషధాల తయారుచేస్తే దానిని పూర్తిగా అడ్డుకోవచ్చని భావిస్తున్నారు. -
కొలువునిచ్చే ఐటీ సర్టిఫికేషన్లు!
సమాచార సాంకేతిక(ఐటీ) రంగం అభివృద్ధితో ఎన్నెన్నో నూతన టెక్నాలజీలు ఆవిర్భవిస్తూ, సరికొత్త కొలువులను సృష్టిస్తున్నాయి. వీటిని అందుకోవాలంటే ఏ టెక్నాలజీకి డిమాండ్ ఉందో తెలుసుకొని, సంబంధిత పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో కొలువు కలలను సాకారం చేసే ఐటీ సర్టిఫికేషన్లపై నేటి యువత మొగ్గు చూపుతోంది. ఐటీ సర్టిఫికేషన్లు... అభ్యర్థులకు నైపుణ్యవంతులుగా గుర్తింపునిచ్చి, నచ్చిన కొలువును సొంతం చేసుకునేందుకు దోహదపడు తున్నాయి. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు నిచ్చెన వేస్తున్నాయి. కంపెనీలు సైతం సర్టిఫికేష న్లకు ప్రాధాన్యతనిస్తుండడంతో ఆయా కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో విభిన్న సర్టిఫికే షన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో సిస్కో, మైక్రోసాఫ్ట్ అందించే ప్రముఖ కోర్సులు, మార్కెట్లో డిమాండ్ ఉన్న టాప్ సర్టిఫికేషన్ల సమాచారం... సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్ (సీసీఎన్ఏ) ఏ ఎంట్రీ లెవల్ నెట్వర్క్ ఇంజ నీర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారు ఈ సర్టిఫికేషన్ కోర్సులో చేరుతు న్నారు. ఈ సర్టిఫికేషన్ పొందిన వారికి మంచి ఉద్యోగావకాశాలుండడమే కారణం. ఏ కోర్సులో విద్యార్థులు ప్రధానంగా నెట్వర్క్స్ ఆపరేషన్స్, ట్రబుల్ షూటింగ్‌పై చదువుతారు. లోకల్ ఏరియా నెట్వర్క్(లాన్), వైడ్ ఏరియా నెట్వర్క్(వాన్) డిజైన్‌కు సంబంధించిన అడ్వాన్స్డ్ అంశాల గురించి నేర్చుకుంటారు. ఏ ఐపీ అడ్రస్‌లు, రూటర్లు, వాటి ప్రక్రియలు, వీలాన్, డబ్ల్యూలాన్, నెట్వర్క్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ తదితర అంశాలపై నైపుణ్యాలు పొందుతారు. ఏ వివరాలకు వెబ్సైట్: http://www.cisco.com/web/ learning/certifications/associate/ccna/index.html మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ అసోసియేట్ (ఎంసీఎస్‌ఏ): - నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్ అనాలిసిస్, టెక్నికల్ సపోర్ట్ తదితర విభాగాలతోపాటు విభిన్న ఐటీ ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలకు చేరుకోవాలనుకునేవారు ఈ సర్టిఫికెట్ కోర్సులో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. - 90 శాతానికి పైగా కంపెనీలు ఎంసీఎస్‌ఏ సర్టిఫికేషన్ పొందిన అభ్యర్థులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. - అడ్వాన్స్డ్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులను అభ్యసించే ముందు ఈ కోర్సును నేర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను అర్థం చేసుకోవడానికి, నిర్వహణ, ట్రబుల్ షూటింగ్ నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. - వివరాలకు వెబ్సైట్: https://www.microsoft.com/learning/en-in/mcsa-certification.aspx ఎంసీఎస్ఈ- షేర్‌పాయింట్: - సంస్థల వ్యాపార కార్యకలాపాలకు సహకరించే మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్లాట్‌ఫాం. దీన్ని ప్రొడక్ట్స్, టెక్నాలజీస్ సమ్మేళనంగా చెప్పొచ్చు. షేర్‌పాయింట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెబ్సైట్లను రూపొందించవచ్చు. షేర్‌పాయింట్ ఇటు అప్లికేషన్ ప్లాట్‌ఫాంగానూ అటు డెవలప్మెంట్ ప్లాట్‌ఫాంగానూ సమర్థవంతమైంది. - షేర్‌పాయింట్ కోర్సు నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులకు డాట్ నెట్ పరిజ్ఞానం అవసరం. కోర్సులో భాగంగా షేర్‌పాయింట్ విశ్లేషణ, మేనేజింగ్ సైట్ కలెక్షన్స్ అండ్ సైట్స్, బిజినెస్ కనెక్టివిటీ సర్వీసెస్, ఎంటర్ప్రైజ్ కంటెంట్ మేనేజ్మెంట్ తదితర అంశాలను అభ్యర్థులు నేర్చుకుంటారు. - షేర్‌పాయింట్ పరిజ్ఞానం సంపాదించిన వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. - వివరాలకు వెబ్సైట్: https://www.microsoft.com/learning/en-in/mcse-sharepoint-certification.aspx సీసీఎన్ఏ సెక్యూరిటీ: ఈ సర్టిఫికేషన్లు నెట్వర్క్ సెక్యూరిటీకి పునాది లాంటివి. ఐటీ సెక్యూరిటీ రంగంలో రాణించాలనుకునే వారు ఈ సర్టిఫికేషన్ కోర్సుల్లో చేరుతున్నారు. సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థ్రెట్స్‌ను గుర్తించడం, ఇన్స్టలేషన్, ట్రబుల్ షూటింగ్ తదితర అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. విభిన్న నెట్‌వర్క్‌లకు చెందిన ఐటీ సమస్యల అంచనా, అవగాహన, పరిష్కారానికి ఈ సర్టిఫికేషన్ దోహదపడుతుంది. వివరాలకు వెబ్సైట్: http://www.cisco.com/web/learning/certifications/associate/ccna_security/index.html సిస్కో సర్టిఫైడ్ ఎంట్రీ నెట్వర్కింగ్ టెక్నీషియన్(సీసీఈఎన్టీ): - సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్(సీసీఎన్ఏ) సర్టిఫికేషన్ పొందాలనుకునేవారు ముందుగా ఈ సర్టిఫికేషన్ పూర్తిచేయడానికి ఆసక్తి చూపుతారు. - చిన్న వ్యాపారాల్లో ఐటీ నెట్వర్క్స్తోపాటు ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఈ సర్టిఫికేషన్ మరిన్ని అవకాశాలను అందిస్తోంది. - ఓఎస్ఐ మోడల్స్, డీఎన్ఎస్, ఎన్ఏటీ, రూటర్ కాన్ఫిగరేషన్, జనరల్ రూటింగ్ ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఏ వివరాలకు వెబ్సైట్: http://www.cisco.com/ web/learning/certifications/entry/ccent/ index.html దరఖాస్తు: సర్టిఫికేషన్ల కోసం రాయాల్సిన దాదాపు అన్ని పరీక్షల నూ ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. నిర్ధారిత రుసుం చెల్లించి పరీక్షకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో అర్హత సాధిస్తే సర్టిఫైడ్ అసోసియేట్/ ప్రొఫెషనల్‌గా గుర్తింపు లభిస్తుంది. తద్వారా పుష్కలమైన అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. సర్టిఫికేషన్లతో ఉజ్వల భవిష్యత్తు ‘‘మార్కెట్లో సీసీఎన్ఏ, సీసీఎన్‌పీ తదితర సర్టిఫికేషన్‌స చేసిన వారికి విస్తృత అవకాశాలున్నాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులూ సర్టిఫికేషన్ రాయొచ్చు. ఈ సర్టిఫికేషన్లను రాయడానికి డిగ్రీ అర్హత కానప్పటికీ బ్యాచిలర్‌స డిగ్రీ కోర్సు కనీస అర్హతగా ఉండి ఏదో ఒక నెట్వర్కింగ్ సర్టిఫికేషన్ పూర్తి చేస్తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకో వచ్చు. అలాగే హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ సెంటర్లు ఆయా సర్టిఫికేషన్లలో శిక్షణనందిస్తున్నాయి. ఏదైనా సర్టిఫికేషన్ సాధించి, మంచి క మ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ కలిగి ఉంటే కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు’’ - అహ్మద్, నెట్మ్యాట్రిక్ సొల్యూషన్స్, మాసాబ్‌ట్యాంక్ -
దంతాలు చూసి వయసు చెప్పొచ్చు
అన్నానగర్ : దంత వైద్యులు మీ దంతాలను పరీక్షించి మీరు ఏ సంవత్సరంలో పుట్టారో చెప్పే ఒక కొత్త టెక్నిక్ త్వరలో నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. వృక్షాల వయస్సును నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు ఏ విధంగా అయితే వార్షిక వలయాల మీద ఆధారపడతారో సరిగ్గా అదే విధానానికి దగ్గరగా ఉండే శాశ్వత దంతాల్లోని పదార్థాన్ని విశ్లేషించడం ద్వారా దంత వైద్యులు మీరు ఏ సంవత్సరంలో, ఏ నెలలో పుట్టారో ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉందట. డెంటల్ డేటా టెక్నిక్ అనే పేరుతో ఇది అందుబాటులోకి రానుంది. మానవ నోటిలోని మోలార్స్, ప్రీమోలార్స్, కానైన్స్ ఇన్సిసార్స్ అనే మూడు రకాల దంతాలను ఈ టెక్నిక్ ద్వారా విశ్లేషిస్తారు. 32 దంతాలు పూర్తిగా ఏర్పడడానికి 192 నెలల కాలం పడుతుంది. అంటే ఒక్కొక్క పల్లు పూర్తిగా ఏర్పడడానికి ఆరు నెలలు పడుతుంది. అంటే అన్ని దంతాలు ఏర్పడడానికి 16 ఏళ్లు పడుతుంది. పూర్తిగా ఏర్పడిన దంతంలోని పల్స్ పైన పేరుకొన్న వృద్ధి కారకాలను అనుసరించి సదరు దంతం ఎన్నేళ్ల వయసునో నిర్ధారిస్తారు. దీని ఆధారంగా వ్యక్తి వయసును అంచనా వేసి దానిని సంవత్సరాల్లోని మార్చి రివర్స్ టైమ్, ఎనాలసిస్ పద్ధతి ద్వారా వచ్చిన మనిషి వయసును ఖచ్చితంగా లెక్కగ డుతారు. విదేశాల్లో ఈ పద్ధతి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఒక వేళ వ్యక్తి తాలుకూ బర్త్‌డే సర్టిఫికెట్లు ప్రభుత్వ రికార్డుల్లో నుంచి మాయమైతే అక్కడి వైద్యులు ఈ పద్ధతిని ఉపయోగించి వారి పుట్టిన తేదీ వివరాలను అందిస్తున్నారు. వ్యక్తి పుట్టిన తేదీలో అటు - ఇటుగా ప్లస్ ఆర్ మైనస్ ఆరు గంటల వ్యవధిలో దంత వైద్యులు వ్యక్తి పుట్టిన తేదీన, నెలను, సంవత్సరాన్ని విజయవంతంగా అందిస్తున్నారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఒక డెంటల్ వైద్య సంస్థ ఇందుకు కావాల్సిన సాంకేతిక సాయాన్ని అందించడానికి ముందుకొచ్చిందని చెన్నై డెంటల్ సర్జన్ల సమాఖ్య తెలిపింది. -
ట్విట్టర్ మీ జీవిత చరిత్రను చెప్పేయ గలదు!
వాషింగ్టన్: రెగ్యులర్‌గా ట్వీట్స్ పోస్టు చేసే అలవాటు మీకుందా? ట్విట్టర్లో మిమ్మల్ని తగినంత మంది ఫాలో అవుతున్నారా? అయితే, మీ ప్రమేయం లేకుండానే.. ట్విట్టర్ మీ జీవిత చరిత్రను ఇట్టే చెప్పేయగలదు.. జాగ్రత్త! మీరు పోస్ట్ చేసే ట్వీట్లలో పేర్కొన్న ముఖ్యమైన సంఘటనల ఆధారంగా మీ జీవిత చరిత్రను పూసగుచ్చే కొత్త టెక్నిక్ అందుబాటులోకి వచ్చింది. పిట్స్‌బర్గ్‌లోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ, ఇథకలోని కార్నెల్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు జివీ లీ, క్లైరె కార్డీ ఉమ్మడిగా రూపొందించిన అల్గోరిథమ్ టెక్నిక్ బ్రహ్మాండంగా పనిచేస్తోందని ఎంఐటీ టెక్నాలజీ రివ్యూ పేర్కొంది. వ్యక్తుల వివరాలు ఏమీ తెలియకుండానే.. కేవలం వారు పోస్ట్ చేసిన ట్వీట్లను జల్లెడపట్టి.. వారి జీవిత చరిత్రను చక్కగా రూపొందించవచ్చని తమ అధ్యయనంలో రుజువైందని లీ, కార్డీ స్పష్టం చేశారు. 2011-2013 మధ్యకాలంలో 21 నెలల కాలంలో 20 మంది సాధారణ వ్యక్తులు పోస్ట్ చేసిన ట్వీట్ల ఆధారంగా ముఖ్య సంఘటనలను రాసుకోమని లీ, కార్డీ వారికే పురమాయించారు. వికీపీడియా, ఇతరత్రా సేకరించిన సమాచారంతో 20 మంది ప్రముఖుల జీవిత చరిత్రలను రూపొందించారు. అదేమాదిరిగా, ట్వీట్ల ఆధారంగా అల్గోరిథమ్ టెక్నిక్ ద్వారా ఈ 40 మంది జీవిత చరిత్రలను లీ, కార్డీ తయారు చేశారు. ఈ రెండు రకాల జీవిత చరిత్రలను సరిపోల్చి చూసినప్పుడు.. వారి జీవితంలో దాదాపు అన్ని ముఖ్య సంఘటనలతో కూడిన జీవిత చరిత్రలను అల్గోరిథమ్ సమగ్రంగా రూపొందించినట్లు తేలింది. ట్విట్టర్లో అకౌంట్ ఉన్న స్నేహితుడు, పోటీదారు లేదా సినీ ప్రముఖుల్లో ఎవరి జీవిత చరిత్రనైనా ఈ టెక్నిక్ ద్వారా రూపొందించవచ్చని లీ, కార్డీ చెబుతున్నారు.