దంతాలు చూసి వయసు చెప్పొచ్చు
అన్నానగర్ : దంత వైద్యులు మీ దంతాలను పరీక్షించి మీరు ఏ సంవత్సరంలో పుట్టారో చెప్పే ఒక కొత్త టెక్నిక్ త్వరలో నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. వృక్షాల వయస్సును నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు ఏ విధంగా అయితే వార్షిక వలయాల మీద ఆధారపడతారో సరిగ్గా అదే విధానానికి దగ్గరగా ఉండే శాశ్వత దంతాల్లోని పదార్థాన్ని విశ్లేషించడం ద్వారా దంత వైద్యులు మీరు ఏ సంవత్సరంలో, ఏ నెలలో పుట్టారో ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉందట. డెంటల్ డేటా టెక్నిక్ అనే పేరుతో ఇది అందుబాటులోకి రానుంది.
మానవ నోటిలోని మోలార్స్, ప్రీమోలార్స్, కానైన్స్ ఇన్‌సిసార్స్ అనే మూడు రకాల దంతాలను ఈ టెక్నిక్ ద్వారా విశ్లేషిస్తారు. 32 దంతాలు పూర్తిగా ఏర్పడడానికి 192 నెలల కాలం పడుతుంది. అంటే ఒక్కొక్క పల్లు పూర్తిగా ఏర్పడడానికి ఆరు నెలలు పడుతుంది. అంటే అన్ని దంతాలు ఏర్పడడానికి 16 ఏళ్లు పడుతుంది. పూర్తిగా ఏర్పడిన దంతంలోని పల్స్ పైన పేరుకొన్న వృద్ధి కారకాలను అనుసరించి సదరు దంతం ఎన్నేళ్ల వయసునో నిర్ధారిస్తారు. దీని ఆధారంగా వ్యక్తి వయసును అంచనా వేసి దానిని సంవత్సరాల్లోని మార్చి రివర్స్ టైమ్, ఎనాలసిస్ పద్ధతి ద్వారా వచ్చిన మనిషి వయసును ఖచ్చితంగా లెక్కగ డుతారు.
విదేశాల్లో ఈ పద్ధతి బాగా ప్రాచుర్యంలో ఉంది. ఒక వేళ వ్యక్తి తాలుకూ బర్త్‌డే సర్టిఫికెట్లు ప్రభుత్వ రికార్డుల్లో నుంచి మాయమైతే అక్కడి వైద్యులు ఈ పద్ధతిని ఉపయోగించి వారి పుట్టిన తేదీ వివరాలను అందిస్తున్నారు. వ్యక్తి పుట్టిన తేదీలో అటు - ఇటుగా ప్లస్ ఆర్ మైనస్ ఆరు గంటల వ్యవధిలో దంత వైద్యులు వ్యక్తి పుట్టిన తేదీన, నెలను, సంవత్సరాన్ని విజయవంతంగా అందిస్తున్నారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన ఒక డెంటల్ వైద్య సంస్థ ఇందుకు కావాల్సిన సాంకేతిక సాయాన్ని అందించడానికి ముందుకొచ్చిందని చెన్నై డెంటల్ సర్జన్ల సమాఖ్య తెలిపింది.