టోక్యో : చిన్నపిల్లలు తాము ఆడుకునేటప్పుడో లేక పడుకొని లేచినప్పుడు తల్లిదండ్రులు కనిపించకపోతే ఏడ్వడం అనేది సాధారణమైన విషయం. అప్పుడు వారి ఏడ్పును ఆపడం ఎవరి తరం కాదు. కానీ ఇలాంటి ఘటన ఎదురైతే దానికి మా దగ్గర పరిష్కారం ఉందటున్నారు జపాన్‌కు చెందిన దంపతులు.
వివరాలు .. జపాన్‌కు చెందిన ఒక పిల్లాడు తన తల్లి ఒక్క క్షణం కనిపించకపోయినా గుక్కపట్టి ఏడ్చేవాడు. దీంతో ఆ దంపతులు ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక కొత్త మెకానిజమ్‌ను కనుగొన్నారు. అదేంటంటే.. పిల్లాడి తల్లికి సంబంధించిన రెండు కటౌట్‌లను ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి పిల్లాడి పక్కనే కూర్చునేలా, మరొకటి తల్లి నిలబడిన కటౌట్‌లను తయారు చేయించాడు. కాకపోతే అవి పిల్లాడికి అందకుండా ఏర్పాటు చేసుకున్నారు. ఎంతకైనా మంచిదని ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదనుకొని పిల్లాడు టీవీ చూస్తుండగా వెనుక ఒక కటౌట్‌ను ఏర్పాటు చేసి తల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
తర్వాత వెనక్కి తిరిగి చూసిన పిల్లాడికి తల్లి కటౌట్ కనిపించడంతో ఏడ్వకుండా మళ్లీ ఆడుకోవడం మొదలుపెట్టాడు. తాము కనుగొన్న ఈ టెక్నిక్ విజయవంతం కావడంతో ఆ తల్లిదండ్రులు తెగ సంతోషపడిపోయారు. అయితే తండ్రి ఇదంతా వీడియో తీసీ ట్విటర్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు పిల్లాడి తల్లిదండ్రులను పొగడ్తలతో ముంచెత్తారు. పిల్లాడి ఏడ్పును కంట్రోల్ చేయడంతో పాటు వారి పనులు కూడా సజావుగా జరిగేందుకు కటౌట్ ఉపయోగపడుతుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లలు కూడా ఏడ్వకుండా ఉండేందుకు ఇలాంటి కటౌట్లను ఏర్పాటు చేసుకోండి.
結果、20分くらい気づかれず。これはたまには役立つかも…
— 佐藤ねじ🌲ブルーパドル (@sato_nezi) December 8, 2019
このパネルは、ビッグダミー(スーパーとかにある巨大なパネル)など、販促物をつくってるリンクスさんにお願いして、「ビッグマミー」をつくってもらいました🙏https://t.co/zLfGDZpiPa pic.twitter.com/zp5qiyqoRq
Comments
Please login to add a commentAdd a comment