
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రజతం గెలిచిన మీరాబాయి చాను ఒక్కసారిగా హీరో అయిపోంది. ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరీ తర్వాత మహిళల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో పతకం సాధించిన రెండో మహిళగా మీరాబాయి రికార్డు సృష్టించింది. దేశానికి సిల్వర్ అందించిన ఆమెపై ప్రశంసలతోపాటు అవార్డులు, రివార్డులు కూడా కురుస్తున్నాయి. తాజాగా డొమినోస్ పిజ్జా కూడా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మీరాబాయికి పిజ్జా అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని పతకం గెలిచిన తర్వాత మీరాబాయి ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.
''నేను పతకం సాధించినందుకు సంతోషంగా ఉంది. ఈ విజయానికి గుర్తుగా ముందు నేను పిజ్జా తింటాను. దానిని తిని చాలా రోజులైంది'' అని ఆమె చెప్పింది. మీరాబాయి చెప్పిన మాట విన్న డొమినోస్ పిజ్జా వెంటనే ఓ ట్వీట్ చేసింది. '' మెడల్‌ను తీసుకొస్తున్నందుకు కంగ్రాట్స్. వంద కోట్లకుపైగా భారతీయుల కలలను సాకారం చేశావు. అందుకే నీకు జీవితకాలం ఉచితంగా పిజ్జా ఇవ్వడం కంటే సంతోషం మాకు మరొకటి ఉండదు అని డొమినోస్ ట్వీట్ చేసింది.
#NDTVExclusive | “First of all, I will go and have a pizza. It has been a long time since I ate it. I will eat a lot today”: Mirabai Chanu (@mirabai_chanu), Olympic athlete, on winning India’s first silver medal in #TokyoOlympics pic.twitter.com/kmuW1zDb5J
— NDTV (@ndtv) July 24, 2021