Mirabai Chanu Saikhom
-
మీరాబాయి చాను విఫలం.. ఆరో స్థానానికి పరిమితం
జింజూ (దక్షిణ కొరియా): ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను నిరాశపరిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన ఈ మణిపూర్ లిఫ్టర్ శుక్రవారం జరిగిన 49 కేజీల విభాగంలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మీరాబాయి మొత్తం 194 కేజీలు బరువెత్తింది. ఆమె స్నాచ్‌లో 85 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలు బరువెత్తింది. క్లీన్ అండ్ జెర్క్‌లో మీరాబాయి చివరి రెండు ప్రయత్నాల నుంచి వైదొలిగింది. మీరాబాయి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన 207 కేజీలుకాగా, ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆమె 13 కేజీలు తక్కువ ఎత్తింది. జియాంగ్ హుయిహువా (చైనా; 207 కేజీలు) స్వర్ణం... హు జిహుయ్ (చైనా; 204 కేజీలు) రజతం... సెరోద్ చనా (థాయ్‌లాండ్; 200 కేజీలు) కాంస్య పతకం సాధించారు. సౌరవ్ శుభారంభం షికాగో: ప్రపంచ స్క్వాష్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన తొలి రౌండ్లో సౌరవ్ 5–11, 11–6, 11–13, 11–6, 11–3తో యాయా ఎల్నావాస్నీ (ఈజిప్ట్)పై గెలిచాడు. -
మణికట్టు గాయం బాధిస్తున్నా..‘రజతం’తో మెరిసి! మీరాబాయి అరుదైన ఘనత
World Weightlifting Championship- 2022- బొగోటా (కొలంబియా): మణికట్టు గాయం బాధిస్తున్నా... భారత స్టార్ మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వెనక్కి తగ్గలేదు. ప్రయత్నిస్తే పతకం రాకపోదా అని ఆశాభావంతో మొండి పట్టుదలగా బరిలోకి దిగిన ఈ మణిపూర్ తార అనుకున్నది సాధించింది. ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన 49 కేజీల విభాగం పోటీల్లో మీరాబాయి రెండో స్థానంలో నిలిచింది. 28 ఏళ్ల మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కేజీలు కలిపి మొత్తం 200 కేజీలు బరువెత్తింది. జియాంగ్ హుయ్‌హువా (చైనా; 206 కేజీలు) స్వర్ణం సాధించగా... జిహువా (చైనా; 198 కేజీలు) కాంస్యం దక్కించుకుంది. రెండో పతకం ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో మీరాబాయికిది రెండో పతకం. 2017లో ఆమె 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. ‘మణికట్టు గాయం వేధిస్తున్నా దేశానికి పతకం అందించాలనే పట్టుదలతో ప్రయత్నించి సఫలమయ్యాను. వచ్చే ఏడాది ఆసియా క్రీడల్లో, ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తా’ అని మీరాబాయి తెలిపింది. మీరాబాయి అరుదైన ఘనత ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు అంతకంటే ఎక్కువ పతకాలు సాధించిన నాలుగో భారత మహిళా లిఫ్టర్‌గా మీరాబాయి గుర్తింపు పొందింది. గతంలో కుంజరాణి దేవి (7 రజత పతకాలు), కరణం మల్లీశ్వరి (2 స్వర్ణాలు, 2 కాంస్యాలు), నీలంశెట్టి లక్ష్మీ (1 రజతం, 1 కాంస్యం) ఈ ఘనత సాధించారు. ఈ నేపథ్యంలో మీరాబాయిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. చదవండి: Rohit Sharma: సగం సగం ఫిట్నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా... BAN vs IND: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్‌తో పాటు View this post on Instagram A post shared by Vijay Sharma (@sharma1970vijay) Despite her wrist injury, she still won a silver medal at the WC with a total lift of 200kg Congratulations @mirabai_chanu on winning silver in women's 49kg at the WWC. She beats Olympic champ Hou Zhihua 198kg from China. 2017 WC🥇 2020 Olympics🥈 2022 WC🥈 Proud of you 👍 pic.twitter.com/cK8hq1W0Go — Anurag Thakur (@ianuragthakur) December 7, 2022 -
'నా సుత్తిని అవలీలగా ఎత్తేస్తుందేమో'.. మీరాబాయిపై 'థోర్' ప్రశంసలు
భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై హాలివుడ్ స్టార్.. థోర్(క్రిస్ ఎమ్‌స్వర్త్) ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవలే కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన మీరాబాయి ప్రదర్శనను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. మార్వెల్ కామిక్స్‌లో థోర్ పాత్ర చేతిలో ఉండే సుత్తి చాలా బరువు ఉంటుంది. ఆ సుత్తిని అతను తప్ప ఎవరూ ఎత్తలేరు. అందుకే చాను సాధించిన విజయాన్ని కీర్తిస్తూ..'' ఎంత బరువైనా ఎత్తేస్తుంది.. థోర్ ఇక నీ సుత్తిని వదిలేయాల్సిన సమయం వచ్చేసింది.'' అన్నట్టుగా క్రిస్ హెమ్స్ను ట్యాగ్ చేశాడు సదరు అభిమాని. అభిమాని చేసిన ట్వీట్‌పై హెమ్స్‌వర్త్ స్పందించాడు. ''ఇక నేను సుత్తిని వదిలి వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఆమె నా సుత్తిని కూడా అవలీలగా ఎత్తేస్తుందేమో. అయినా అందుకు ఆమె అర్హురాలే. కంగ్రాట్స్.. సికోమ్.. నువ్వొక లెజెండ్'' అంటూ కామెంట్ చేశాడు. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చానూ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం ఒడిసి పట్టింది. గత శనివారం 49 కేజీల విభాగంలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్లో మీరాబాయి చాను స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి పతకం అందుకుంది. కాగా స్నాచ్ విభాగంలో 90 కేజీల బరువు ఎత్తాలని టార్గెట్‌గా పెట్టుకుంది మీరాబాయి చాను. కానీ స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. She is worthy! Congrats, Saikhom, you legend. — Chris Hemsworth (@chrishemsworth) August 4, 2022 చదవండి: Commonwealth Games 2022: పసిడి పట్టు.. ఆరు పతకాలతో మెరిసిన భారత రెజ్లర్లు Lifting 201kg never felt easy but thanks to the love and wishes of billions back home, every challenge is just an attempt away. 🇮🇳#WeAreTeamIndia #TeamIndia pic.twitter.com/GnyaftZkpv — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 30, 2022 -
CWG 2022: మా అమ్మ.. ఇంకా బంధువుల సంబరాలు! వీడియో వైరల్
Birmingham 2022- Mirabai Chanu: భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను తల్లి టాంబీ దేవి ‘పుత్రికోత్సాహం’తో పొంగిపోయారు. బంధువులతో కలిసి తమ సంప్రదాయ శైలిలో నాట్యం చేస్తూ కూతురి విజయాన్ని ఆస్వాదించారు. కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా మీరాబాయి భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన సంగతి తెలిసిందే. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగం ఫైనల్లో మీరాబాయి స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తంగా 201 కేజీలు) ఎత్తి.. పసిడి పతకం గెలిచింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన ఆమె.. ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో స్వర్ణం గెలిచి సత్తా చాటింది. తద్వారా బర్మింగ్‌హామ్‌లో భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి.. జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ క్రమంలో యావత్ భారతావనితో పాటు ఆమె కుటుంబ సభ్యులు కూడా సంతోషంలో మునిగిపోయారు. ఇక మీరాబాయి చాను తల్లి టాంబీ దేవి తమ ఇంట్లోనే సంబరాలు జరుపుకొన్నారు. My mom and other relatives celebrating victory at my home ✌️ pic.twitter.com/sTCIoTDVwM — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 31, 2022 ఇందుకు సంబంధించిన వీడియోను మీరాబాయి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘‘మా అమ్మ.. ఇంకా బంధువులు.. నా విజయాన్ని ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు’’ అంటూ ఆమె తన ఆనందాన్ని పంచుకుంది. ఈ వీడియోను రీషేర్ చేస్తూ నెటిజన్లు మీరాబాయికి, ఆమె తల్లికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా మీరాబాయి 2014 గ్లాస్కో గేమ్స్‌లో రజతం.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం, టోక్యో ఒలింపిక్స్‌లో రజతం.. తాజాగా స్వర్ణం సాధించింది. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి.. మణిపూర్‌కు చెందిన మీరాబాయి చానుది మధ్యతరగతి కుటుంబం. కుటుంబ సభ్యులతో కలిసి వంట కలప కోసం వెళ్లినపుడు తన అన్న కంటే ఎక్కువ బరువుల్ని మోసిన మీరాబాయి.. అప్పుడే తనలోని ప్రతిభను వారికి పరిచయం చేసింది. ఈ క్రమంలో ఆమెను ప్రోత్సహించిన కుటుంబం.. అంచెలంచెలుగా ఎదగడంలో అండగా నిలిచింది. తల్లితో మీరాబాయి చాను ఇక పదకొండేళ్ల వయసులోనే స్థానికంగా జరిగే వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించిన చాను.. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో వెండి పతకం సాధించి వెలుగులోకి వచ్చింది. ఇక 2016లో రియో ఒలింపిక్స్‌లో విఫలమైనా... పడిలేచిన కెరటంలా 2017లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచింది. ఇవేకాకుండా ఎన్నో అరదైన రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. మీరాబాయి ప్రయాణంలో కుటుంబ సభ్యులు.. ముఖ్యంగా ఆమె తల్లి ప్రోత్సాహం ఎంతగానో ఉంది. చదవండి: Mirabai Chanu: మన 'బంగారు' మీరాబాయి CWG 2022: మీరాబాయి ఇచ్చిన బూట్లతో బరిలోకి దిగి.. రజతంతో -
మీరాబాయి ఇచ్చిన బూట్లతో బరిలోకి దిగి.. రజతంతో
టోక్యో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన మీరాబాయి ఛానును బింద్యారాణి దేవి రోల్ మోడల్‌గా భావించింది. కనీసం బూట్లు కూడా కొనుక్కోలేని కడు పేదరికం నుంచి వచ్చిన బింద్యారాణ దేవి ఇవాళ అంతర్జాతీయ వేదికపై భారత పతకాన్ని రెపరెపలాడించింది. మీరాబాయి చానులాగే మణిపూర్ నుంచి వచ్చిన బింద్యారాణి దేవి, ఒకే అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ఓ చిన్న గుడిసెలో జీవనం సాగించిన మీరాబాయి ఛాను లైఫ్ స్టైల్, ఒలింపిక్ మెడల్ తర్వాత పూర్తిగా మారిపోయింది. అయితే తనలాగే పేదరికాన్ని అనుభవిస్తూ కూడా భారత్‌కి పతకాలు సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తున్న బింద్యారాణి దేవి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న మీరాబాయి ఛాను... ఖరీదైన బూట్లను కానుకగా ఇచ్చింది. అవే బూట్లు వేసుకొని బరిలోకి దిగిన బింద్యారాణి దేవి తాజాగా కామన్వెల్త్ గేమ్స్ 2022లో 55 కేజీల విభాగంలో రజతం సాధించింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86 కేజీలు, క్లీన్ అండ జెర్క్ కేటగిరిలో 116 కేజీలు.. మొత్తంగా 202 కేజీలు ఎత్తి రెండో స్థానంలో నిలిచింది. నైజీరియాకు చెందిన అడిజట్ ఒలారినోయ్ 117 కిలోల బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. ఒలారొనోయ్(స్నాచ్ 92 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 111 కేజీలు) మొత్తంగా 203 కేజీలు ఎత్తి స్వర్ణం చేజెక్కించుకుంది. కాగా కేవలం ఒక్క కేజీ కేజీ తేడాతో బింద్యారాణి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక లోకల్ క్రీడాకారిణి ఫ్రేర్ మారో 196 కేజీలు(86 స్నాచ్, 109 క్లీన్ అండ్ జెర్క్) ఎత్తి కాంస్యం చేజెక్కించుకుంది. ఇక మ్యాచ్ అనంతరం బింద్యారాణి దేవి మాట్లాడుతూ.. ‘నా సక్సెస్‌లో మీరా దీ పాత్ర చాలా ఉంది. నా టెక్నిక్, ట్రైయినింగ్‌లో మీరా ఎంతగానో సాయం చేసింది. క్యాంప్‌లోకి కొత్తగా వచ్చినప్పుడు ఎంతో అప్యాయంగా పలకరించి, మాట్లాడింది. నా దగ్గర బూట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవని తెలిసి, తన షూస్ నాకు ఇ్చింది. ఆమె నాకు ఆదర్శం... నేను తనకి పెద్ద అభిమానిని అయిపోయా...’ అంటూ చెప్పుకొచ్చింది. -
మన 'బంగారు' మీరాబాయి
బర్మింగ్హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఖాతాలో తొలి పసిడి పతకం వచ్చి చేరింది. టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో రజత పతకం సాధించిన మీరాబాయి చానూ కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం ఒడిసి పట్టింది. శనివారం 49 కేజీల విభాగంలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ ఫైనల్లో మీరాబాయి చాను స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీలు (మొత్తం 201 కేజీలు) ఎత్తి పసిడి ఖాయం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తొలి భారత వెయిట్‌లిఫ్టర్‌గా చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను తన ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు సరికొత్తగా మార్చుకుంటూ వచ్చింది. అలసటను దరి చేరనీయలేదు.. ఏకాగ్రతను దూరం చేసుకోలేదు. వాస్తవానికి మీరాబాయి చానూ ఈసారి 55 కేజీల విభాగంలో పోటీ పడాల్సింది. ఈ సారి ఎక్కువ పతకాలు రావాలనే ఉద్దేశంతో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య ఆమెను 55 కేజీల విభాగానికి మారాలని సూచించింది. దీంతో మీరాబాయి తన బరువును పెంచుకుంటూనే ఎంతోగానో శ్రమించింది. కానీ ఆఖరి క్షణంలో ఒక్క విభాగం నుంచి ఒక్కరే ఎంపికవుతారనే నిబంధన కారణంగా చాను తిరిగి 49 కేజీల విభాగానికి మారాల్సి వచ్చింది. అలా తనకు అచ్చొచ్చిన విభాగంలో పోటీ పడిన ఆమె స్నాచ్ విభాగంలో 90 కేజీల బరువు ఎత్తాలని టార్గెట్‌గా పెట్టుకుంది. కానీ స్నాచ్ మొదటి, రెండో ప్రయత్నంలో 84, 88 కేజీలు ఎత్తిన చాను మూడో ప్రయత్నంలో 90 కేజీలకు ప్రయత్నించి విఫలమైంది. క్లీన్ అండ్ జర్క్‌లో కూడా 109, 113 కేజీల తర్వాత 115 కేజీలకు ప్రయత్నించి ఎత్తలేకపోయింది. అయితే ఓవరాల్‌గా ఆమెకు, తర్వాతి స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు మధ్య ఉన్న అంతరం (29 కేజీలు) చూస్తే ఈ పోటీల్లో చాను స్థాయి ఏమిటో అర్థమవుతుంది. ఇక 2014 గ్లాస్కో గేమ్స్ రజతం.. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్‌లో స్వర్ణం.. తాజాగా మరోసారి స్వర్ణంతో మెరిసి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. మరి వచ్చే పారిస్ ఒలింపిక్స్(2024)లో టోక్యోలో వచ్చిన రజతాన్ని స్వర్ణంగా మారుస్తుందేమో చూడాలి. Lifting 201kg never felt easy but thanks to the love and wishes of billions back home, every challenge is just an attempt away. 🇮🇳#WeAreTeamIndia #TeamIndia pic.twitter.com/GnyaftZkpv — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 30, 2022 -
స్వర్ణంతో కామన్వెల్త్ గేమ్స్‌కు మీరాబాయి చాను అర్హత
సింగపూర్: భారత మహిళా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను (55 కేజీలు) సింగపూర్ అంతర్జాతీయ టోర్నీలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్‌లో 86+క్లీన్ అండ్ జెర్క్‌లో 105) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో బర్మింగ్హమ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు సింగపూర్ టోర్నీకి క్వాలిఫయింగ్ ఈవెంట్‌గా గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో మీరాబాయి స్వర్ణపతక ప్రదర్శనతో కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించింది. భారత్‌కే చెందిన సంకేత్ సాగర్ (పురుషుల 55 కేజీలు–స్వర్ణం), రిషికాంత సింగ్ (55 కేజీలు–రజతం), బింద్యారాణి దేవి (మహిళల 59 కేజీలు–స్వర్ణం) కూడా కామన్వెల్త్ గేమ్స్ బెర్త్‌లను సాధించారు. -
ఒలింపిక్స్ నుంచి బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ ఔట్!
లాసానే (స్విట్జర్లాండ్): ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు అందించిన బాక్సింగ్, రెండు పతకాలు అందించిన వెయిట్లిఫ్టింగ్లకు విశ్వ క్రీడల్లో భవిష్యత్తు సందేహాత్మకంగా మారింది. 2028లో లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్ నుంచి ఈ క్రీడలను తప్పించే అవకాశం ఉంది. దీంతో పాటు ఐదు క్రీడాంశాల సమాహారమైన మోడ్రన్ పెంటాథ్లాన్‌ను (రన్నింగ్, ఈక్వెస్ట్రియన్, స్విమ్మింగ్, షూటింగ్, ఫెన్సింగ్) కూడా తొలగించాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) భావిస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా... మూడు కొత్త క్రీడాంశాల ప్రకటనను బట్టి చూస్తే పై మూడింటిని తప్పించాలని ఐఓసీ అంతర్గత సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వీటి స్థానాల్లో కొత్తగా స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్‌లను చేర్చనున్నారు. యువత ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్న ఈ క్రీడలను ఒలింపిక్స్‌లో రెగ్యులర్ క్రీడాంశంగా మార్చేందుకు ఐఓసీ సిద్ధమైంది. 1912 ఒలింపిక్స్ నుంచి ఉన్న మోడ్రన్ పెంటాథ్లాన్‌కు చారిత్రక ప్రాధాన్యమే తప్ప వాణిజ్యపరంగా కానీ అభిమానులపరంగా పెద్దగా ఆసక్తి గానీ ఉండటం లేదని ఐఓసీ చెబుతోంది. ఇక బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ క్రీడలను సుదీర్ఘ కాలంగా పలు సమస్యలు వెంటాడుతున్నాయి. ఆర్థిక పరమైన అంశాలు, నైతికత లోపించడం, డోపింగ్, పరిపాలన సరిగా లేకపోవడంతో ఈ క్రీడల ప్రక్షాళన అవసరమని భావిస్తూ వీటిని తప్పించాలని ఐఓసీ ప్రతిపాదించింది. మరోవైపు 2028 నుంచి క్రికెట్ కూడా ఒలింపిక్స్‌లోకి రావచ్చంటూ వినిపించగా, తాజా పరిణామాలతో ఆ అవకాశం లేదని తేలిపో యింది. లాస్ ఏంజెలిస్ ఈవెంట్ కోసం నిర్వాహకులు ప్రతిపాదించిన 28 క్రీడాంశాల్లో క్రికెట్ పేరు లేకపోవడంతో దీనిపై స్పష్టత వచ్చేసింది. -
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న చాను, ఫ్యాన్స్ ఫిదా
సాక్షి,న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి భారత్ పతకాల ఖాతా తెరిచిన కోట్లాది భారతీయుల మనసుదోచుకున్న మణిపూర్ మణిపూస మీరాబాయి చాను సంప్రదాయ దుస్తుల్లో మెరిసి పోతోంది. ట్రెడిషనల్ దుస్తులంటేనేఎప్పటికీ ఇష్టపడతానంటూ ఒక ఫోటోను ఆమె ట్విటర్లో అభిమానులతో పంచుకున్నారు. దీంతో అద్భుతంగా ఉన్నారంటూ ఫ్యాన్స్ కితాబిచ్చారు. మోడ్రన్ దుస్తులకంటే సాంప్రదాయక దుస్తులు మరింత మెరుగ్గా, అందంగా ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ముంబైలో తన ఫ్యావరెట్ హీరో, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను మీరాబాయి చాను బుధవారం కలిశారు. ఈ ఫోటోలను కూడా ఆమె ట్వీట్ చేశారు. ఒలింపిక్ మెడల్ విజేతను కలవడం ఆనందంగా ఉందంటూ సల్మాన్ ఖాన్ కూడా ట్వీట్ చేశారు. మీరాబాయ్ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్‌ను కూడా కలిసింది. మహిళల వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకుని సగ్వంగా సొంత గ్రామానికి చేరుకున్న చాను, అప్పుడే ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేసింది. మణిపూర్ ప్రభుత్వం చానుకు కోటి రూపాయల రివార్డుతోపాటు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (స్పోర్ట్స్)గా నియమించనున్న సంగతి తెలిసిందే. (Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్ షురూ, ఫోటో వైరల్) బాలీవుడ్ స్టార్ హీరోతో మీరాబాయి క్రికెట్ స్టార్‌తో ఒలింపిక్ స్టార్ మీరాబాయి మీరాబాయి బర్త్‌డే వేడుకలు Always happy to be in my traditional outfits. pic.twitter.com/iY0bI69Yh5 — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 12, 2021 -
అభిమానులకు షాక్.. వచ్చే ఒలింపిక్స్‌లో ఆ క్రీడ డౌటే
స్విట్జర్లాండ్: వెయిట్ లిఫ్టింగ్ అభిమానులకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) షాక్ ఇవ్వనుంది. 2024 పారిస్ ఒలింపిక్స్ నుంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడను ఎత్తివేసేందుకు ప్రణాళికను సిద్దం చేస్తుంది. దీనిపై ఇప్పటికే చర్చలు జరిపినట్లు.. త్వరలోనే దీనికి ఆమోదముద్ర వేయనున్నట్లు ఐవోసీ ఒక ప్రకటనలో తెలిపింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పాల్గొంటున్న అథ్లెట్లలో చాలామంది డోపింగ్‌కు పాల్పడినట్లు తెలిసిందంటూ ఐవోసీ పేర్కొంది. ముఖ్యంగా కొంతమంది ఆటగాళ్లు బరువులు ఎత్తడానికి నిషేదిత డ్రగ్స్ వాడుతున్నట్లు వాదనలు వినిపించాయి. అంతేగాక డ్రగ్స్ వాడుతూ తమ కెరీర్‌ను కొనసాగిస్తున్నారని తేలింది. దీనిపై గతంలోనే ఇంటర్నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఫెడరేషన్ (ఐడబ్ల్యూఎఫ్)కు ఐవోసీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. వెయిట్ లిఫ్టింగ్‌లో పెద్ద ఎత్తున డోపీలు పట్టుబడుతుండడంతో ఐవోసీ కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే వచ్చే పారిస్ ఒలింపిక్స్ నుంచి వెయిట్ లిఫ్టింగ్‌ను సస్పెండ్ చేయడంపై నిర్ణయం తీసుకోనుంది. అయితే తాము పేర్కొన్న సంస్కరణల అమలుపై ఐడబ్ల్యూఎఫ్ చర్యలు తీసుకుంటే.. 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్‌ను తిరిగి చేర్చే అంశాన్ని పరిశీలిస్తామని ఐవోసీ వెల్లడించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారత అథ్లెట్ మీరాబాయి చాను రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో పోటీపడింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. కాగా ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే దేశానికి పతకం అందించి చరిత్ర సృష్టించింది. ఇక వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కరణం మల్లీశ్వరీ(కాంస్యం, 2000 సిడ్నీ ఒలింపిక్స్) తర్వాత దేశానికి రెండో పతకం అందించిన మహిళగా మీరాబాయి నిలిచింది. -
Tokyo Olympics: ఏడు పతకాల కథ
ఎవరేమనుకున్నా... మధ్యలో మహమ్మారి దూరినా... కేంద్ర క్రీడా శాఖ ముందు నుంచీ ఒకే మాట చెప్పింది. ఈసారి మనం 2012 లండన్ గేమ్స్ ఆరు పతకాల సంఖ్యను దాటేస్తాం... డబుల్ డిజిట్ (పది పతకాలైనా) కూడా సాధిస్తాం! మాజీ క్రీడల మంత్రి, ప్రస్తుత న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఎక్కడికెళ్లినా ఇదేమాట అన్నారు. ఆయన అన్నట్లే ‘టోక్యో డ్రీమ్స్’ సగం నెరవేరాయి. ఏడు పతకాలతో భారత్ ‘లండన్’ను దాటేసింది. పతకాల పరంగా పట్టికలో 48వ స్థానంలో నిలిచింది. షూటర్ల గురి కుదిరి ఉంటే... బాక్సర్ల ‘పంచ్’ కూడా అదిరిపోయుంటే... గోల్ఫ్‌లో కాస్త అదృష్టం కలిసొచ్చి ఉంటే... రెజ్లింగ్‌లో దీపక్ పూనియా, వినేశ్ తడబడకపోతే... ఆర్చరీలో బాణం మెరిసుంటే... ఆయన అన్నట్లే పతకాల ‘సంఖ్య’ రెండంకెలు కచ్చితంగా దాటేది. నాలుగు దశాబ్దాల తర్వాత భారత హాకీ అదిరిపోయిందనుకుంటే... అంతకుమించిపోయే అబ్బుర ఫలితం అథ్లెటిక్స్‌లో వచ్చింది. మొత్తానికి టోక్యో ఒలింపిక్స్ భారత్‌కు తీపి జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ స్ఫూర్తితో 2024 పారిస్‌లో మనం మరింత పైకి ఎదగాలని... స్వర్ణ కాంతులు మరిన్ని విరజిమ్మాలని కోరుకుందాం. ‘రియో’ గాయాన్ని ‘టోక్యో’ మాపింది. ఏడు పతకాలతో క్రీడాభారతిని ఆనందడోలికల్లో ముంచేసింది. పతకాలు సాధించిన వారు ముమ్మాటికి విజేయులే! అలాగే పతకాల్ని త్రుటిలో కోల్పోయిన పోరాట యోధులు కూడా ఇక్కడ విజేతలే! ఎందుకంటే ఇక్కడ ఫలితమే తేడా. కానీ పోరాటంలో విజేతకి పరాజితకి తేడా లేదంటే అతిశయోక్తి కాదు. మహిళల హాకీ జట్టు కాంస్యానికి దూరమైనా ప్రదర్శనతో మన గుండెల్లో నిలిచింది. రెజ్లర్ దీపక్ పూనియా, గోల్ఫర్ అదితి పతకాలకు చేరువై చివరకు దూరమయ్యారు. మొత్తానికి టోక్యోలో మన క్రీడాకారుల శ్రమకు మంచి ఫలితాలే వచ్చాయి. మీరా రజత ధీర... ఈ ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను శుభారంభమే నీరజ్ బంగారానికి నాంది అయ్యిందేమో! ఆరంభ వేడుకలు ముగిసి పోటీలు మొదలైన తొలి రోజే ఆమె రజతంతో బోణీ కొట్టింది. ‘లండన్’ దాటేందుకు ఈ వెయిట్‌లిఫ్టరే జేగంట మోగించింది. 26 ఏళ్ల చాను పోయిన చోటే వెతుక్కోవాలనుకుంది. ‘రియో’ ఒలింపిక్స్ చేదు అనుభవాన్ని టోక్యో ఒలింపిక్స్ రజతంతో చెరిపేసింది. 49 కేజీల కేటగిరీలో తలపడిన మణిపూర్ మహిళామణి 202 కేజీల (87 కేజీలు+115 కేజీలు) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. సింధు పతకాల విందు... ‘రియో’లో భారత ఆశల పల్లకిని ఫైనల్‌దాకా మోసిన ఏకైక క్రీడాకారిణి పీవీ సింధు. బ్యాడ్మింటన్‌లో రన్నరప్ అయిన సింధు పతకం రంగుమార్చాలని, స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగింది. తనకెదురైన జపాన్ స్టార్ అకానె యామగుచిని క్వార్టర్స్‌లో మట్టికరిపించిన తెలుగు తేజం దురదృష్టవశాత్తు సెమీస్‌లో తడబడింది. వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్‌కు తలవంచిన 26 ఏళ్ల సింధు కాంస్య పతక పోరులో మాత్రం పట్టువీడని పోరాటం చేసింది. వరుసగా రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పతకాలు (రజతం, కాంస్యం) గెలిచిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది. నీరజ్ ‘మిషన్ పాజిబుల్’... భారత్ ‘టోక్యో డ్రీమ్స్’లో అథ్లెటిక్స్ పతకం ఉంది. కానీ పసిడి మాత్రం లేదు. నీరజ్ చోప్రా ఆ టోక్యో డ్రీమ్స్ ఊహకే అందని విధంగా జావెలిన్ విసిరేశాడు. 23 ఏళ్ల ఈ ఆర్మీ నాయక్ సుబేదార్ విశ్వక్రీడల్లో (అథ్లెటిక్స్) బంగారు కల ఇక కల కాదని తన ‘మిషన్ పాజిబుల్’తో సాకారం చేశాడు. ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి ఈ ఒలింపిక్స్ పతకాల పట్టికను స్వర్ణంతో భర్తీ చేశాడు. హరియాణా రైతు బిడ్డ ఇప్పుడు భరతమాత ముద్దుబిడ్డ అయ్యాడు. రెజ్లింగ్‌లో హరియాణా బాహుబలి రవి దహియా. తన శారీరక సామర్థ్యానికి సాంకేతిక నైపుణ్యాన్ని జోడించిన రవి మల్లయుద్ధంలో మహాబలుడు. ఛత్రశాల్ స్టేడియం చెక్కిన మరో చాంపియన్ రెజ్లర్. పసిడి వేటలో కాకలు తిరిగిన సింహబలుడితో చివరకు పోరాడి ఓడాడు. 57 కేజీల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో రజతం సాధించి భారత వెండికొండగా మారాడు. పురుషుల హాకీ కంచు... మన తాత, తండ్రులకు తెలిసిన ఒలింపిక్స్ హకీ ఘన చరిత్రను మనకూ తెలియజేసిన ఘనత కచ్చితంగా మన్‌ప్రీత్‌సింగ్ సేనదే. విశ్వక్రీడల్లో నాలుగు దశాబ్దాల నిరాశకు టోక్యోలో చుక్కెదురైంది. పతకం కోసం 41 ఏళ్ల నిరీక్షణకు కాంస్యంతో తెరపడింది. సెమీస్‌లో బెల్జియం చేతిలో పరాజయం ఎదురైనా... పతకం ఆశ మిగిలుండటంతో ప్లేఆఫ్‌లో జర్మనీపై సర్వశక్తులు ఒడ్డి గెలిచిన తీరు అసాధారణం. మన్‌ప్రీత్ జట్టును నడిపిస్తే... గోల్‌కీపర్ శ్రీజేశ్ అడ్డుగోడ, స్ట్రయికర్ సిమ్రన్‌జీత్ సింగ్ ప్రదర్శన పోడియంలో నిలబెట్టాయి. లవ్లీనా పంచ్... పాల్గొన్న తొలి ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్. భారత తురుపుముక్క, దిగ్గజం మేరీకోమ్ తదితర మేటి బాక్సర్లు ఓడిన చోట కాంస్యంతో నిలిచిన ఘనత లవ్లీనాది. ఒలింపిక్స్‌కు ఆఖరి కసరత్తుగా యూరోప్ వెళ్లేందుకు సిద్ధమైన 23 ఏళ్ల లవ్లీనాను కోవిడ్ అడ్డుకుంది. కానీ ఆమె టోక్యోలో పతకం గెలవకుండా ఏ శక్తి అడ్డుకోలేకపోయింది. అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్లీనా ఒలింపిక్స్‌లో విజేందర్, మేరీకోమ్‌ల తర్వాత పతకం నెగ్గిన మూడో భారత బాక్సర్‌గా నిలిచింది. బజరంగ్ పట్టు... ఫేవరెట్‌గా టోక్యోకు వెళ్లిన గోల్డెన్ రెజ్లర్ బజరంగ్ పూనియా కాంస్యంతో మురిపించాడు. గంపెడాశలు పెట్టుకున్న షూటర్లతో పోల్చితే బజరంగ్ ముమ్మాటికి నయం. బాల్యం నుంచే కుస్తీ పట్లు పట్టిన ఈ హరియాణా రెజ్లర్ టోక్యో వేదికపై కంచు పట్టు పట్టాడు. ఇతన్నీ ఛత్రశాల్ స్టేడియమే చాంపియన్ రెజ్లర్‌గా తీర్చిదిద్దింది. అంతర్జాతీయ స్థాయిల్లో ఎన్నో పతకాలు నెగ్గిన ఇతని ఖాతాలో తాజాగా ఒలింపిక్ పతకం కూడా భర్తీ అయ్యింది. టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆదివారం తన పుట్టిన రోజును ఘనంగా జరుపుకుంది. ‘ఎన్నో రోజుల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుక చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒలింపిక్స్‌లో సాధించిన పతకంతో ఈ వేడుక మరింత ప్రత్యేకంగా మారింది’ అని మీరాబాయి ట్వీట్ చేసింది. -
టోక్యోలో మెరిసిన భారత్.. ఒలింపిక్ చరిత్రలో అత్యధిక పతకాలు
సాక్షి, వెబ్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మెరిసి మురిసింది. ఒలింపిక్స్ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రాణించి యావత్ భారతావనిని ఆకర్షించింది. ఆరంభంలోనే రజతం సాధించి సత్తాచాటిన భారత్.. ముగింపులో స్వర్ణాన్ని సాధించి శభాష్ అనిపించింది. తద్వారా ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక పతకాలు దక్కించుకున్న భారత్ ఏడు పతకాలను ఖాతాలో వేసుకుంది. అందులో ఒక స్వర్ణం, రెండు రజతాలు నాలుగు కాంస్యాలు ఉన్నాయి. ఇంతకముందు 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు పతకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. అయితే దీనిని పక్కకు తోస్తూ టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ మరింత అద్బుతంగా ఆడింది. ఓవరాల్‌గా ఏడు పతకాలు సాధించి చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఏ విభాగాల్లో పతకాలు సాధించిదనేది ఒకసారి పరిశీలిద్దాం.. నీరజ్ చోప్రా- స్వర్ణం(జావెలిన్ త్రో) భారత్ అథ్లెట్ నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతం చేసి చూపించాడు. స్వర్ణం గెలిచి అంతర్జాతీయ వేదికపై భారత్ త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించాడు. జావెలిన్ త్రో ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్ చోప్రా ఏకంగా స్వర్ణం కొల్లగొట్టాడు. ఫైనల్లో నీరజ్ రెండో రౌండ్లో 87.58 మీటర్లు విసిరి సీజన్ బెస్ట్ నమోదు చేసి స్వర్ణం గెలిచి భారత్‌కు గోల్డెన్ ముగింపు ఇచ్చాడు. మీరాబాయి చాను- రజతం(వెయిట్ లిఫ్టింగ్) ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే రజతం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించింది మీరాబాయి చాను. వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో పోటీపడింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. అయితేనేం రజతం ద్వారా భారత్ పతకాల బోణీని తెరిచిన తొలి వ్యక్తిగా నిలిచింది. రవికుమార్ దహియా- రజతం( రెజ్లింగ్) ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రవికుమార్ దహియా అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే అదరగొట్టాడు. 57 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ అర్హత, క్వార్టర్స్, సెమీస్ బౌట్లలో దుమ్మురేపి ఫైనల్లో అడుగుపెట్టాడు. కాగా ఫైనల్లో రష్యాకు చెందిన రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడి 7-4 తేడాతో ఓడిపోయాడు. తద్వారా సుశీల్ కుమార్ తర్వాత రెజ్లింగ్‌లో రజతం సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. పీవీ సింధు- కాంస్యం( బాడ్మింటన్) రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన పీవీ సింధుపై ఈ ఒలింపిక్స్‌లో మంచి అంచనాలు ఉండేవి. ఆ అంచనాలు నిజం చేస్తూ లీగ్, ప్రీ క్వార్టర్స్, క్వార్టర్స్‌లో దుమ్మురేపిన ఆమె ఒక్క గేమ్ కోల్పోకుండా సెమీస్‌కు చేరుకుంది. అయితే సెమీస్‌లో చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్చేతిలో పరాజయం పాలైన సింధు.. కాంస్య పతక పోరులో సత్తాచాటింది. సింధు 21–13, 21–15తో చైనా క్రీడాకారిణి బింగ్ జియావోను చిత్తు చేసి కాంస్యం గెలిచింది. ఫలితంగా రెండు ఒలింపిక్ పతకాలతో భారత క్రీడా చరిత్రలో ఎవరినీ అందనంత ఎత్తులో నిలిచింది. భారత మెన్స్ హాకీ టీమ్- కాంస్యం టోక్యో ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కాంస్యంతో చరిత్ర సృష్టించింది. లీగ్ దశలో ఒక్క ఆస్ట్రేలియా మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లో విజయాలతో దుమ్మురేపింది. క్వార్టర్స్‌లో గ్రేట్ బ్రిటన్‌పై ఘన విజయం సాధించి సెమీస్‌లో ప్రవేశించింది. అయితే సెమీస్‌లో బెల్జియం చేతిలో పరాజయం పాలైంది. ఆ తర్వాత జర్మనీతో జరిగిన కాంస్య పతక పోరులో 5-4తో విజయం సాధించి ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ పతకం సాధించి హాకీకి పూర్వ వైభవం తీసుకొచ్చింది. లవ్లీనా బొర్గోహెయిన్- కాంస్యం( బాక్సింగ్) బాక్సింగ్ మహిళల 69 కిలోల విభాగం సెమీ ఫైనల్లో లవ్లీనా.. టర్కీ బాక్సర్ బుసేనాజ్ చేతిలో 0-5 తేడాతో లవ్లీనా పరాజయం పాలైంది. అయితే, గత నెల 30న జరిగిన క్వార్టర్స్‌లో చిన్ చైన్‌పై విజయం సాధించినందుకు గానూ లవ్లీనాకు కాంస్య పతకం దక్కింది. ఇక ఇప్పటి వరకు భారత బాక్సింగ్‌లో విజేందర్ సింగ్(2008), మేరీ కోమ్(2012) తర్వాత పతకం సాధించిన మూడో బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. భజరంగ్ పూనియా- కాంస్యం(రెజ్లింగ్) ఇక భజరంగ్ పూనియా టోక్యో ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే కాంస్యంతో అదరగొట్టాడు. రెజ్లింగ్ 65 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీస్‌లో ఓడినప్పటికి కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ దౌలత్ నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించాడు. ఉడుం పట్టు అంటే ఏంటో ప్రత్యర్థికి రుచి చూపించాడు. ► వీరు మాత్రమే గాక ఈసారి ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు, గోల్ప్‌లో అదితి అశోక్, రెజ్లింగ్‌లో దీపక్ పూనియాలు కూడా మంచి ప్రదర్శన చేశారు. ముందుగా భారత మహిళల హాకీ జట్టు ప్రదర్శన గురించి చెప్పుకోవాలి. 41 ఏళ్ల తర్వాత సెమీస్‌కు చేరుకున్న భారత మహిళల జట్టు అర్జెంటీనా చేతిలో ఓటమి పాలైంది. అయితే కాంస్య పతక పోరు కోసం భారత అమ్మాయిల జట్టు 3–4తో బ్రిటన్ చేతిలో పోరాడి ఓడింది. కాగా ఒలింపిక్స్‌లో మూడో ప్రయత్నంలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానం సంపాదించిన భారత మహిళల జట్టు ప్రదర్శన కాంస్య పతకంలాంటిదేనని దేశం వారిని పొగడ్తలతో ముంచెత్తింది. ► ఆటల్లో రిచ్చెస్ట్ గేమ్‌గా గోల్ఫ్‌కు ఓ పేరుంది. అలాంటి ఆటలో.. అదీ ఒలింపిక్స్‌లో మొట్టమొదటిసారి ఫైనల్‌దాకా చేరుకుని భారత్‌కు పతక ఆశలు చిగురింపజేసింది 23 ఏళ్ల అదితి. టోక్యో ఒలింపిక్స్‌కి ముందు.. ప్రారంభమైన తర్వాతా పతకాన్ని తెస్తారనే ఆశలు ఉన్న పేర్ల లిస్ట్‌లో అదితి పేరు కనీసం ఏదో ఒక మూలన కూడా లేదు. కారణం.. మహిళా గోల్ఫ్ ర్యాకింగ్స్లో ఆమెది 200వ ర్యాంక్. అలా ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. పతాక పోరు దాకా అదితి చేరుకోవడం, ఆ పోరాటంలో ఓడి కోట్ల మంది హృదయాలను గెల్చుకోవడం ప్రత్యేకంగా నిలిచిపోయింది. -
మీరాబాయి గొప్ప మనసు, నెటిజన్లు ఫిదా, వైరల్ ఫోటో
సాక్షి, న్యూఢిల్లీ: ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నైజం విజేతలకు పెట్టని అభరణం. దీన్ని 2020 టోక్యో ఒలింపిక్స్ ఇండియాకు తొలి పతకాన్ని అందించిన ఘనతను చాటుకున్న వెయిల్ లిఫ్టర్ మీరాబాయి చాను ఈ మాటను మరోసారి నిరూపించారు. మహిళల విభాగంలో రజత పతకం సాధించిన తర్వాత, మీరాబాయి తన కల నెరవేరడానికి సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అరుదైన బహుమతిని అందించింది. అకాడమీకి వెళ్లేటపుడు సహకరించిన ప్రతి ఒక్కరినీ గౌరవించాలని భావించారు. అలా మరోసారి మీరాబాయి నెటిజన్లు హృదయాలను దోచుకుంది. ఆమె గెల్చుకున్నది వెండి పతకం అయినా ఆమె మనకు మాత్రం 24 క్యారెట్ బంగారం. జీవితంలో సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు అంటూ నెటిజనులు ఫిదా అవుతున్నారు. తాజాగా మళ్లీ ప్రాక్టీస్ షురూ చేసిన ఫోటోను ట్వీట్ చేశారు. దీంతో 2024 పారిస్ ఒలింపిక్స్‌కి బెస్ట్ ఆఫ్ లక్ అంటూ అభిమానులు ట్వీట్ చేశారు. 2022 ఆసియా గేమ్స్, 2024 ఒలింపిక్స్ మీకోసం ఎదురు చూస్తున్నాయంటూ ఇంకొకరు వ్యాఖ్యానించడం విశేషం. ఉచితంగా లిప్ట్ ఇచ్చి కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ట్రక్ డ్రైవర్లకు గిఫ్ట్ ఇచ్చి పెద్దమనసు చాటుకుంది మీరాబాయి చాను. దాదాపు150 మంది డ్రైవర్లను ఇంటికి పిలిచి భోజనం పెట్టింది. అంతేకాదు వారికి ఒక షర్ట్, మణిపురి కండువాను బహుమానంగా ఇచ్చి సత్కరించింది. శిక్షణా కేంద్రానికి వెళ్లేందుకు రెగ్యులర్‌గా లిఫ్ట్ అందించిన ట్రక్కర్లను కలిసి, వారి ఆశీర్వాదం పొందాలని కోరుకున్నానని మీరాబాయి ఈసందర్భంగా ప్రకటించింది. కష్ట సమయంలో వారంతా ఆదుకున్నారు. అందుకే భవిష్యత్తులో వారికి ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి ప్రయత్నిస్తానని వెల్లడించింది. ఈ సందర్భంగా వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఫిల్మ్ మేకర్ నౌరెం మోహెన్ ట్విటర్ వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. కాగా మణిపూర్‌లోని తూర్పు ఇంఫాల్‌లోని మారుమూల గ్రామానికి చెందిన మీరాబాయి తన ఇంటి నుండి శిక్షణా అకాడమీకి 30 కి.మీ దూరం ప్రయాణించాల్సి వచ్చింది. అటు ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం, ఇటు ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకొనే స్థోమత లేని మీరాబాయి ఇంపాల్‌కు ఇసుకను తీసుకెళ్తున్న ట్రక్కుల ద్వారానే లిఫ్ట్ తీసుకునేది. అలా కఠోర సాధనతో టోక్యో ఒలింపిక్స్‌లో తన కలను సాకారం చేసుకోవడమే కాదు, యావత్ దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. pic.twitter.com/mrYZRXHtlK — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 6, 2021 Olympiad @mirabai_chanu home was more than 25 km from the Sport Academy. No means of transport during those days, except trucks which carried river sands to the City. These truck drivers gave her lift everyday. Today she rewarded these truck drivers. pic.twitter.com/9WegUkwjkz — Naorem Mohen (@laimacha) August 5, 2021 -
దేశం నొసటన సిందూరం
దేశం ఉప్పొంగిన క్షణాలివి. తెలుగు జాతి తేజరిల్లిన సందర్భమిది. విశ్వ క్రీడా సంరంభంలో త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా మన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు సృష్టించిన చరిత్ర ఓ చిరస్మరణీయ ఘట్టం. ఏళ్ళ తరబడి చేసిన నిరంతర శ్రమ, కరోనా కష్టకాలంలోనూ ఆగని సాధన, కొత్తగా వచ్చిన కొరియన్ కోచ్ పార్క్ ఇచ్చిన శిక్షణ, స్వయంగా క్రీడాకారులైన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, ట్రైనర్ల మొదలు తెలుగు ప్రభుత్వాల దాకా ప్రతి ఒక్కరూ అండగా నిలబడిన తీరు – ఇలా సింధు విజయం వెనుక ఎన్నెన్నో స్ఫూర్తిగాథలు. ఆదివారం నాడు చైనా క్రీడాకారిణి బింగ్జి యావోపై ఆమె చూపిన అసాధారణమైన ఆట తీరు ఆకలిగొన్న బెబ్బులి వేటను తలపించింది. నాన్న మాటలతో ముందురోజు ఓటమి నుంచి బయటకొచ్చి, తండ్రికి బహుమతిగా పతకాన్ని అందిం చడం కళ్ళు చెమర్చే ఓ కమనీయ ఘట్టం. నిరుడు రజతం సాధించి, ఈసారి కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చినా, మరో మూడేళ్ళలో వచ్చే 2024 పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణానికి సిద్ధమన్న ఈ బ్యాడ్మింటన్ స్టార్ మాట నవతరం భారత నారీశక్తి చేస్తున్న అచంచల ఆత్మవిశ్వాస ప్రకటనకు సంకేతం. ఒకప్పుడు ఒలింపిక్స్‌లో తొలిసారి పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన వెయిట్ లిఫ్టర్ కరణం మల్లేశ్వరి (2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్యం) కూడా తెలుగు తేజమే. పాతికేళ్ళ వయసులో ఆమె ఆ రికార్డు సాధిస్తే, 26 ఏళ్ళకు ఇప్పుడు సింధు వరుస రెండు ఒలింపిక్స్ పతకాల కొత్త చరిత్ర రచించడం మనందరికీ గర్వకారణం. గమనిస్తే – తాజా ఒలింపిక్స్‌లో మనదేశం తరఫున నారీలోకానిదే పైచేయి. తొలి రోజు మణిపురీ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి ఛాను (రజతం) నుంచి ఇప్పటి దాకా గత పది రోజుల్లో భరతమాత నొసట పతకాల సిందూరం దిద్దింది మహిళా అథ్లెట్లే! రానున్న పతకాల్లో కూడా కనీసం మరో ఒకట్రెండు – అస్సామీ బాక్సింగ్ క్రీడాకారిణి లొవ్లీనా తదితర స్త్రీమూర్తులు తీసుకు రానున్న గౌర వమే అని ఆటల సరళిని బట్టి అర్థమవుతోంది. 2016 రియో ఒలింపిక్స్‌లో మనకొచ్చిన 2 మెడల్స్ (పీవీ సింధు – రజతం, రెజ్లర్ సాక్షీ మాలిక్ కాంస్యం) సహా, గడచిన 4 ఒలింపిక్ పతకాలూ మహి ళలు మన దేశానికి సాధించి పెట్టినవే! అలాగే, మూడోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగిన భారత మహిళా హాకీజట్టు ఈసారి ఇప్పటికే సెమీ ఫైనల్స్‌కు చేరడం మరో శుభవార్త. ఆ జట్టు కెప్టెన్ రాణీ రామ్‌పాల్ మొదలు డిస్కస్ త్రోలో ఆశలు రేపిన పంజాబీ కమల్‌ప్రీత్ కౌర్ దాకా ఎంతోమంది రైతుబిడ్డలు, చిన్నస్థాయి నుంచి శ్రమించి పైకొచ్చినవారు కావడం గమనార్హం. ఆ మాటకొస్తే, నూతన సహస్రాబ్ది ఆరంభం నుంచి మన మహిళా అథ్లెట్లు విశ్వవేదికపై జోరు పెంచారు. మేరీ కోమ్‌లు, సైనా నెహ్వాల్‌లు, సానియా మీర్జాలు, అంజూ బాబీ జార్జ్‌లు అవతరిం చారు. అంతకు ముందు పరుగుల రాణి పీటీ ఉష లాంటి వారు (1984 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్) కేవలం 0.01 సెకన్ల తేడాతో ఒలింపిక్స్ పతకాన్ని చేజార్చుకున్న ఘట్టం నుంచి మన అథ్లెట్లు ఇప్పుడు చాలా ముందుకు ఉరికారు. గణాంకాలు చూస్తే – 2000 మొదలు ఇప్పటి దాకా ఒలింపిక్స్‌లో మన దేశానికి వచ్చిన 14 వ్యక్తిగత పతకాలలో 6 పతకాలు ఆడవాళ్ళ ఘనతే. పురుషులతో పోలిస్తే, మహిళా అథ్లెట్ల సంఖ్య మన దేశంలో మొదటి నుంచి తక్కువే. కానీ, ఇప్పుడు అదీ మారుతోంది. వివిధ క్రీడల్లో ఆడవాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒలింపిక్స్‌లోనూ 2000 నాటికి భారత్ నుంచి 21 మంది మహిళలే వెళితే, ఈసారి మొత్తం 128 మంది అథ్లెట్లలో 57 మంది మహిళలే. అందుకే, ‘వివాహాల మొదలు ఒలింపిక్స్ దాకా... అన్నిచోట్లా మహిళలే భారత్‌కు బంగారం తేవాలి’ అంటూ సోషల్ మీడియా పోస్టులు చక్కర్లు కొట్టడం ఆశ్చర్యం అనిపించదు. ఇప్పుడు కళ్ళు తెరిస్తే కనిపించే నిజం ఒకటే – ఆడవాళ్ళకు ఆటలేమిటి అన్న సమాజానికి ఇప్పుడు ఆ మహిళలే మెడల్స్ తెచ్చే దిక్కయ్యారు. క్రికెట్‌ను తప్ప మరో ఆటను పెద్దగా పట్టించుకోని దేశానికి ఆడవాళ్ళే అంతర్జాతీయంగా పరువు నిలిపేవారయ్యారు. పాఠశాలల్లో ఆడుకోవడానికి ఖాళీ స్థలం మొదలు కనీస సౌకర్యాలు కూడా కష్టమైన దేశంలో, మార్కులు తప్ప ఆటలెందుకని ఆలో చించే పెంపకంలో, వంటింట్లో తప్ప మైదానంలో ఆడవాళ్ళకేం పని అనే మారని మానసిక స్థితిలో, ఎంత ప్రతిభ ఉన్నా ఆర్థిక – హార్దిక ప్రోత్సాహం కరవైన పరిస్థితుల్లో, ఆటల్లోనూ అధికారుల రాజకీ యాలున్న సందర్భాల్లో... మన దేశంలో ఈ మాత్రమైనా క్రీడాకారులు, అందులోనూ మహిళలు పైకి రావడం విశేషం. సహాయ సహకారాల మాటెలా ఉన్నా, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిసారీ దేశ ప్రతిష్ఠను నిలబెట్టే బాధ్యతను భుజాన వేసుకొంటున్నందుకు ఈ స్త్రీమూర్తులను అభినందించాలి. పతకం చేజారిన ప్రతిసారీ పెల్లుబికే ప్రజాగ్రహాన్ని పళ్ళ బిగువున భరిస్తున్న ఆ సహనమూర్తులకు చేతులెత్తి మొక్కాలి. ఇకనైనా, ఇంటా బయటా తగినంత ప్రోత్సాహం, శిక్షణ అందిస్తే మన ఇంట్లోనే మరో సిందూరపూవు పూస్తుందని గ్రహించాలి. నారీశక్తి సాధించిన ఈ చిరస్మరణీయ విజయాలు సింధు చెప్పినట్టు ‘‘నవ తరానికి స్ఫూర్తిదాయకాలు.’’ తరతరాలుగా సమాజంలో అణచివేతకు గురైన స్త్రీమూర్తులు స్వశక్తిని గుర్తుచేసే శక్తిమంత్రాలు. ఆడవాళ్ళూ... మీకు జోహార్లు! -
మీరాబాయి చానును అచ్చంగా దింపేసిన చిన్నారి; వీడియో వైరల్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో భారత్‌కు చెందిన మీరాబాయి చాను రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. వెయిట్‌లిఫ్టింగ్ మహిళల విభాగంలో కరణం మల్లీశ్వరీ తర్వాత పతకం సాధించిన రెండో మహిళగా మీరాబాయి రికార్డులకెక్కారు. ఒలింపిక్స్ ప్రారంభమైన రెండో రోజే దేశానికి పతకాన్ని సాధించిపెట్టిన ఆమెపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. తాజాగా స్వదేశానికి చేరుకున్న మీరాబాయికి ఘన స్వాగతం లభించింది. ఈ నేపథ్యంలో మీరాబాయి చానును అనుకరిస్తూ వెయిట్‌లిఫ్టర్ సతీష్ శివలింగం కూతురు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 49 కేజీల విభాగంలో రజతం గెలిచిన మీరాబాయిని టీవీలో చూస్తూ అచ్చం ఆమెను దింపేసింది. మీరాబాయి వెయిట్ లిఫ్ట్ చేసిన వీడియోనూ చూస్తూ ఆ చిన్నారి కూడా తన ముందు ఒక వెయిట్ లిఫ్టింగ్‌ను సిద్దం చేసుకుంది. ఆ తర్వాత అచ్చం ఆమెలానే వెయిట్ ఎత్తిన చిన్నారి తన హావభావాలతో మెప్పించింది. అనంతరం మెడల్ ప్రెజంటేషన్లో భాగంగా చాను మెడల్ ధరించినట్టుగానే చిన్నారి కూడా తన మెడలో ఒక మెడల్ వేసుకొని ముసిముసిగా నవ్వింది. ఈ వీడియోను వెయిట్‌లిఫ్టర్ సతీష్ శివలింగమ్ స్వయంగా తన ట్విటర్లో షేర్ చేయగా.. మీరాబాయి చాను స్పందించడం విశేషం. ''ఈ చిన్నారి భలేగా చేసింది... సో క్యూట్.. జస్ట్ లవ్ దిస్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. '' నువ్వు సూపర్ రా చిన్నారి.. మాకు మరో మీరాబాయ్ చాను దొరికేసింది.. బుల్లి మీరాబాయి అదరగొట్టేసింది..'' అంటూ కామెంట్లు చేశారు. So cute. Just love this. https://t.co/IGBHIfDrEk — Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 26, 2021 -
భారత్ చేరిన చాను: మరో అపురూప కానుక ఇచ్చిన మణిపూర్
న్యూఢిల్లీ: రజత పతకం గెలుపొంది విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మీరాబాయి చానుకు సొంత రాష్ట్రం మణిపూర్ ప్రభుత్వం కానుకల వర్షం కురిపించింది. పతకం గెలిచిన రోజే రూ.కోటి నగదు బహుమతి ప్రకటించగా తాజాగా సోమవారం ఆమెకు అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదనపు ఎస్పీగా చానును నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ తెలిపారు. అయితే టోక్యో నుంచి స్వదేశానికి చాను సోమవారం చేరుకుంది. ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మణిపూర్‌కు చెందిన చాను ఒలింపిక్స్ పోటీల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచి సత్తా చాటింది. ఆమె గెలుపుపై దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్ ప్రభుత్వం ఆమెకు రూ.కోటి నగదు బహుమతితో పాటు ఆ ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. మీరాబాయి టోక్యో ఒలింపిక్స్‌లో ఏకంగా రజత పతకం హస్తగతం చేసుకొని మరో చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా... స్టార్ షట్లర్ పీవీ సింధు తర్వాత విశ్వ క్రీడల్లో రజతం సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణిగా 26 ఏళ్ల మీరాబాయి ఘనత వహించింది. 8 మంది వెయిట్‌లిఫ్టర్లు పాల్గొన్న 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను మొత్తం 202 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు.. క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు బరువెత్తింది. -
భారత్ చేరుకున్న మీరాబాయి చాను
-
జయహో చాను.. ఆమె తొలి కోచ్ ఎవరంటే?
-
మీరాబాయి చానుకు డొమినోస్ పిజ్జా బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో రజతం గెలిచిన మీరాబాయి చాను ఒక్కసారిగా హీరో అయిపోంది. ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరీ తర్వాత మహిళల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో పతకం సాధించిన రెండో మహిళగా మీరాబాయి రికార్డు సృష్టించింది. దేశానికి సిల్వర్ అందించిన ఆమెపై ప్రశంసలతోపాటు అవార్డులు, రివార్డులు కూడా కురుస్తున్నాయి. తాజాగా డొమినోస్ పిజ్జా కూడా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మీరాబాయికి పిజ్జా అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని పతకం గెలిచిన తర్వాత మీరాబాయి ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ''నేను పతకం సాధించినందుకు సంతోషంగా ఉంది. ఈ విజయానికి గుర్తుగా ముందు నేను పిజ్జా తింటాను. దానిని తిని చాలా రోజులైంది'' అని ఆమె చెప్పింది. మీరాబాయి చెప్పిన మాట విన్న డొమినోస్ పిజ్జా వెంటనే ఓ ట్వీట్ చేసింది. '' మెడల్‌ను తీసుకొస్తున్నందుకు కంగ్రాట్స్. వంద కోట్లకుపైగా భారతీయుల కలలను సాకారం చేశావు. అందుకే నీకు జీవితకాలం ఉచితంగా పిజ్జా ఇవ్వడం కంటే సంతోషం మాకు మరొకటి ఉండదు అని డొమినోస్ ట్వీట్ చేసింది. #NDTVExclusive | “First of all, I will go and have a pizza. It has been a long time since I ate it. I will eat a lot today”: Mirabai Chanu (@mirabai_chanu), Olympic athlete, on winning India’s first silver medal in #TokyoOlympics pic.twitter.com/kmuW1zDb5J — NDTV (@ndtv) July 24, 2021 -
Mirabai Chanu: ‘మణి’పూస చానుకు భారీ నజారానా
ఇంఫాల్: టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొంది త్రివర్ణ పతాకం రెపరెపలాడించిన మీరాబాయి చానుకు సొంత రాష్ట్రం మణిపూర్ భారీ నజారానా ప్రకటించింది. ఆమెకు రూ.కోటి నగదు బహుమతిని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ శనివారం ప్రకటించారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చానుకు 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించి చరిత్ర సృష్టించింది. స్నాచ్‌లో 87 కేజీలు ఎత్తిన మీరాబాయి, క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్ ఎత్తింది. మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. చివరకు రజత పతకం సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆమె విజయంతో భారతదేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా ఆమె సొంత రాష్ట్రం మణిపూర్ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ చానును అభినందించారు. అంతకుముందు బిరేన్ సింగ్ విజేతగా నిలిచిన మీరాబాయి చానుతో వీడియో కాల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు అద్భుతంగా పేర్కొన్నారు. So good to speak to our Champion @mirabai_chanu today.@narendramodi @AmitShah @ianuragthakur @JPNadda @blsanthosh pic.twitter.com/1phL16ibh3 — N.Biren Singh (@NBirenSingh) July 24, 2021 -
జయహో చాను.. ఆమె తొలి కోచ్ ఎవరంటే?
సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రకంపనల మధ్య అసలు ఒలింపిక్ ఉత్సాహం ఉంటుందో లేదో అన్న సందేహాల నడుమ ఎట్టకేలకు జపాన్ రాజధాని టోక్యో నగరం సిద్దమై పోయింది. సంబరం అలా మొదలైందో లేదో ఇలా ఒక పతకం భారత సిగలో మెరవడం విశేషమే మరి. అయితే ఈ సందర్భంగా వెయిట్ లిఫ్టింగ్‌లో పతకాలతో మెరిసి మురిపించిన లెజెండరీ భారతీయ మహిళల గురించి తెలుసుకుందాం. రంగం ఏదైనా పురుషులతో సమానంగా అనే మాటను మన అమ్మాయిలు అధిగమించి తమకుతామే సాటి అంటూ దూసుకుపోతున్నారు. అన్నింటా మేమే ఫస్ట్ అంటున్నారు. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్... టెన్నిస్..బ్యాడ్మింటన్..క్రికెట్ ఇలా క్రీడ ఏదైనా ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు. టోక్యో ఒలింపిక్ క్రీడా సంగ్రామం వేదికగా ఇది మరోసారి నిరూపితమైంది. Chanu Saikhom Mirabai టోక్యో ఒలంపిక్స్‌లో తొలి పతకంతో శుభారంభం చేసి ప్రపంచం దృష్టిని తన వైపుతిప్పుకుని భారత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప జేశారు మన మణిపూర్ మణిపూస. మణిపూర్‌కు చెందిన క్రీడాకారిణి మీరాబాయి చాను వెయింట్ లిప్టింగ్ పోటీల్లో 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత మన దేశానికి వన్నె తెచ్చిన పతకమిది. ‘‘బంగారం పతకం కోసం చాలా ప్రయత్నించా.. కానీ సాధ్యం కాలేదు. కానీ సెకండ్ లిఫ్ట్ తరువాత పతకం ఖాయమని అర్థమైపోయిందంటూ’’ ఆమె సంబరపడిపోయారు. అంతేకాదు ‘‘ముందు ఒక పిజ్జా తినాలి..పిజ్జా తిని ఎన్ని రోజులైందో’’ అంటూ అక్కడున్న వారందరిలో నవ్వులు పూయించారు. మరోవైపు తన విద్యార్థి మొత్తం దేశం మోముపై చిరునవ్వులు పూయస్తోందంటూ మీరా బాయి గురువు , మరో ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ కుంజారాణీ దేవి సంతోషం వ్యక్తం చేశారు. మణిపూర్ మణిపూస కుంజరాణీ దేవి వివిధ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని సైతం అందుకుని భారతీయ వెయిట్ లిఫ్టింగులో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మహిళ మణిపూర్‌కే చెందిన కుంజారాణీ దేవి. మీరా బాయికి తొలి అడుగులు నేర్పిన గురువు కుంజారాణి కావడం ఇక్కడ మరో విశేషం. ఆమె కరీర్‌ను రూపొందించడంలో ఆమెది కీలక పాత్ర. 2015 వరకు తనకు గురువుగా వున్న ఆమె స్టయిల్‌ను ఫాలో అవుతానని, ఆమెను చూసే వెయిట్ లిఫ్టింగ్‌ను కరియర్‌గా ఎంచుకున్నానని స్వయంగా మీరా బాయే చెప్పుకున్నారు. 1985 సంవత్సరం మొదలుకొని జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 44, 46, 48 కిలోల విభాగాల్లో పతకాలు సాధించారామె. 1989లో మాంచెస్టర్‌లో జరిగిన ప్రపంచ మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మొదటిసారి పాల్గొని మూడు వెండి పతకాలు సాదించారు. 1990లో బీజింగ్, 1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో రజత పతకాన్నితన ఖాతాలో వేసుకున్నారు. 1989 షాంఘైలో జరిగిన పోటీలలో ఒక రజత, రెండు కాంస్య పతకాలు 1991లో ఇండోనేషియాలో జరిగిన పోటీలో 44 కిలోల విభాగంలో మూడు వెండిపతకాలతో తన విజయ పరంపర కొనసాగించారు. ఇక ఆ తరువాత 1992లో థాయిలాండ్ లోను, 1993లో చైనా పోటీల్లోనూ తన రెండవ స్థానాన్ని సాధించారు. 1995లో దక్షిణకొరియాలో జరిగిన పోటీల్లో 46 కిలోల విభాగంలో రెండు బంగారు పతకాలు, ఒక రజతపతకాన్ని సొంతం చేసుకున్నారు. యాబైకి పైగా అంతర్జాతీయ అవార్డులు ఆమె సొంతం. 2006 మెల్బోర్న్లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో 48 కిలోల విభాగంలో బంగారుపతకాన్ని గెలవడమేకాక 72 కిలోలు, 94 కిలోల ఉమ్మడి విభాగంలో రికార్డు నెలకొల్పారు. తెలుగు తేజం కరణం మల్లీశ్వరి 1990వ దశకంలో ఒలింపిక్ వేదికగా మువ్వన్నెల పతాకానికి వన్నె తెచ్చిన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి. శ్రీకాకుళానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్ పతకం కాంస్య పతకం సాధించారు. ఈ సమయంలో భారత్‌కు ఏకైక పతకాన్ని సాధించి, దేశ ప్రతిష్టను సమున్నతంగా నిలబెట్టిన ఆ క్షణాలను సగటు భారతీయుడు ఎలా మర్చిపోగలడు. 1994 అర్జున, 1999లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మశ్రీ పురస్కారాలతోపాటు, 11 స్వర్ణాలతో సహా మొత్తం 29 అంతర్జాతీయ పతకాలు సాధించిన రికార్డు మల్లీశ్వరి సొంతం. అందుకే దేశ రాజధాని ఢిల్లీలోని క్రీడా విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్ పదవి ఆమెను వచ్చి వరించింది. పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా నియమిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నియమించింది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరగాల్సిన కరోనా కారణంగా ఒక సంవత్సరం ఆలస్యంగా జరుగుతోంది. ఆగస్టు నెల 8వ తేదీవరకు క్రీడా సంగ్రామం హోరా హోరీగా జరగనుంది. మన దేశం నుంచి 119మంది పాల్గొంటున్న ఈ ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు, రికార్డులు మన సొంతం కావాలని కోరుకుందాం. ముఖ్యంగా బాక్సింగ్ మేరీ కోమ్ ఈ ఒలంపిక్‌లో ఎలాగైనా గోల్డ్ కొట్టాలి. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, సీడబ్ల్యుజీ బంగారు పతక విజేత, ఆసియా గేమ్స్ బంగారు పతక విజేత, ఆసియా ఛాంపియన్షిప్ బంగారు పతక విజేత, ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్నప్పటికీ .. ఇపుడు బంగారు పతకం సాధించాలనేది ఆశ. ఇందుకు 2020 టోక్యో గేమ్స్ ఆఖరి అవకాశం. వివిధ క్రీడల్లో దేశానికి అంతర్జాతీయఖ్యాతి తెచ్చిన మహిళామణుల గురించి రాయాలంటే చాలా పెద్దలిస్టే.. భారత తొలి మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జి మొదలు పరుగుల రాణి పీటీ ఉష, బాక్సింగ్‌కు మారుపేరు మేరీ కోమ్...కుస్తీ వస్తాదు సాక్షీ మాలిక్, టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, సైనా.. చదరంగంలో తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ భాగ్యశ్రీ థిప్సే, కోనేరు హంపీ, హారిక.. ఇక క్రికెట్లో మిథాలీరాజ్.. సఫాలీ వర్మ ఇలా ఎందరో.. మరెందరో.. అందరికీ మరోసారి జయహో...! -
కరణం మల్లీశ్వరి ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ
-
మీరాబాయి చానుపై ప్రశంసల జల్లు
-
టోక్యో ఒలింపిక్స్: మీరాబాయి 'రజతం'; ఇంట్లో సంబురాలు... వీడియో వైరల్
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజతం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ సందర్భంగా మీరాబాయి స్వస్థలం మణిపూర్‌లోని ఆమె నివాసంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె వెయిట్‌లిఫ్టింగ్‌లో జెర్క్ అండ్ క్లీన్ కేటగిరీలో మూడో రౌండ్లో 117 కేజీలు ఎత్తే క్రమంలో విఫలమైనప్పటికి అప్పటికే ఆమెకు పతకం ఖాయమైంది. దీంతో మీరాబాయి చాను కుటుంబసభ్యులు సంతోషంలో మునిగి తేలుతున్నారు. కాగా 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి క్యాంస్య పతకం తర్వాత ఆ విభాగంలో పతకం రావడం మళ్లీ ఇదే కావడం విశేషం. 2016 రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం పడినప్పటికి ఆమె ఫెయిల్ అయ్యింది. అయితే తన ప్రదర్శనతో నిరాశ చెందని మీరాబాయి 2017లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి.. రెండు దశాబ్దాల తర్వాత ఆ ఫీట్‌ను సాధించిన ఇండియన్ వెయిట్‌లిఫ్టర్‌గా నిలిచింది. ఇది ఆమె కెరీర్లో ఓ మైలురాయి అనుకోవచ్చు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, 2019లో ఏషియన్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యంతో మెప్పించింది. ఆపై 2020లో సీనియర్ నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో తన రికార్డును తానే బద్ధలు కొట్టి స్వర్ణంతో మెరుగైన ఫలితంలో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది మీరాబాయి చాను స్నాచ్‌లో 87 కేజీలు , క్లీన్ అండ్ జెర్క్‌లో 115 కేజీలు వెయిట్ ఎత్తింది.మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. దాంతో రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.210 కేజీలు ఎత్తి చైనా లిఫ్టర్ జిజోయ్ పసిడిని దక్కించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #WATCH | Manipur: Family and neighbours of weightlifter Mirabai Chanu burst into celebrations as they watch her win the #Silver medal for India in Women's 49kg category. #OlympicGames pic.twitter.com/F2CjdwpPDc — ANI (@ANI) July 24, 2021 -
మీరాబాయి చాను: స్వర్ణం గెలవకున్నా ‘బంగారు’ కొండే!
టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత పతకాల వేట మొదలైంది. తక్కువ అంచనాల నడుమే బరిలోకి దిగినప్పటికీ.. సైఖోమ్ మీరాబాయి చాను(26) సిల్వర్ మెడల్‌తో మెరిసింది. యావత్ దేశంతో ‘శెభాష్’ అనిపించుకుంటోంది. సాక్షి, వెబ్‌డెస్క్: 1994, ఆగష్టు 8న మణిపూర్ రాజధాని ఇంపాల్ దగ్గర్లోకి నాంగ్‌పోక్ కక్చింగ్‌లో పుట్టింది Saikhom Mirabai Chanu. ఆమెది మధ్యతరగతి కుటుంబం. వంట కలప కోసం వెళ్లిన టైంలో తన అన్న కంటే ఎక్కువ బరువుల్ని మోసి అందరినీ ఆశ్చర్యపరిచింది మీరాబాయి. అలా చిన్న వయసులోనే ఆమెలోని సామర్థ్యాన్ని గుర్తించింది కుటుంబం. అటుపై కష్టమైనా సరే శిక్షణ ఇప్పించింది. ఎలాగైనా తమ ఊరి పేరును ప్రపంచం మొత్తం మారుమోగేలా చేయాలన్నది ఆమె తల్లిదండ్రుల. అందుకు తగ్గట్లుగా రాణిస్తూ.. పేరెంట్స్ కలలను సాకారం చేస్తూ వస్తోందామె. కామెన్వెల్త్ గేమ్స్ నుంచి.. పదకొండేళ్ల ప్రాయం నుంచే లోకల్ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడం ప్రారంభించిందామె. చానుకి ఫస్ట్ బ్రేక్ మొదలైంది 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ నుంచి. ఆ గేమ్స్‌లో సిల్వర్ మెడల్ సాధించిందామె. 2016లో రియో ఒలింపిక్స్ పోటీల కోసం నేషనల్ ట్రయల్స్‌లో సత్తా చాటి మీరాబాయి చాను అరుదైన ఘనత సాధించింది. ఏడుసార్లు ఛాంపియన్, తాను ఆరాధ్య గురువుగా భావించే కుంజారాణి దేవి రికార్డును చెరిపేసింది మీరాబాయి. అప్ అండ్ డౌన్స్ 2016లో రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం పోటీ పడినప్పటికీ.. ఫెయిల్ అయ్యింది. తిరిగి పుంజుకుని 2017లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి.. రెండు దశాబ్దాల తర్వాత ఆ ఫీట్‌ను సాధించిన ఇండియన్ వెయిట్‌లిఫ్టర్‌గా నిలిచింది. ఇది ఆమె కెరీర్లో ఓ మైలురాయి అనుకోవచ్చు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, 2019లో ఏషియన్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యంతో మెప్పించిన ఆమె.. అయితే 2019 వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో మాత్రం నాలుగో పొజిషన్‌తో సరిపెట్టుకుంది. ఆపై 2020లో సీనియర్ నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో తన రికార్డును తానే బద్ధలు కొట్టి స్వర్ణంతో మెరుగైన ఫలితంలో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టింది మీరాబాయి చాను. తల్లితో మీరాబాయి చాను.. ఫస్ట్ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చానునే. అంతేకాదు ఏకైక మహిళా వెయిట్ లిఫ్టర్ పార్టిసిపెంట్ కూడా?!. అంతేకాదు అనుకుంటే సాధించి తీరతానని పట్టుబట్టి బరిలోకి దిగింది. ఒలింపిక్స్ 49 కేజీల విభాగంలో మొత్తమ్మీద 202 కేజీలు ఎత్తిన మీరాబాయి.. స్వర్ణం కోసం జరిగిన మూడో అటెంప్ట్‌లో మాత్రం విఫలమైంది. క్లీన్ అండ్ జెర్క్‌లో 117 కేజీలు ఎత్తే క్రమంలో తడబడింది. అయితేనేం రజతం ద్వారా భారత్ పతకాల బోణీని తెరిచిన తొలి వ్యక్తిగా నిలిచిందామె. గౌరవాలు 26 ఏళ్ల మీరాబాయి ఛానుకు గతంలో పలు గౌరవాలు దక్కాయి. కేంద్రం నుంచి పద్మశ్రీతో ఆటు రాజీవ్ ఖేల్‌రత్న పురస్కారాలను అందుకుందామె. ప్రస్తుత ఒలింపిక్స్ పతక సాధనతో ఆమెకు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తున్నాయి. ఆమెను బంగారు కొండగా అభివర్ణిస్తూ నాంగ్‌పోక్ కక్చింగ్ సంబురాలు చేసుకుంటోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)