సింగపూర్: భారత మహిళా స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను (55 కేజీలు) సింగపూర్ అంతర్జాతీయ టోర్నీలో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. మీరాబాయి మొత్తం 191 కేజీలు (స్నాచ్‌లో 86+క్లీన్ అండ్ జెర్క్‌లో 105) బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో బర్మింగ్‌హమ్ వేదికగా జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు సింగపూర్ టోర్నీకి క్వాలిఫయింగ్ ఈవెంట్‌గా గుర్తింపు ఉంది.
ఈ నేపథ్యంలో మీరాబాయి స్వర్ణపతక ప్రదర్శనతో కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించింది. భారత్‌కే చెందిన సంకేత్ సాగర్ (పురుషుల 55 కేజీలు–స్వర్ణం), రిషికాంత సింగ్ (55 కేజీలు–రజతం), బింద్యారాణి దేవి (మహిళల 59 కేజీలు–స్వర్ణం) కూడా కామన్వెల్త్ గేమ్స్ బెర్త్‌లను సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment