World Weightlifting Championship- 2022- బొగోటా (కొలంబియా): మణికట్టు గాయం బాధిస్తున్నా... భారత స్టార్ మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వెనక్కి తగ్గలేదు. ప్రయత్నిస్తే పతకం రాకపోదా అని ఆశాభావంతో మొండి పట్టుదలగా బరిలోకి దిగిన ఈ మణిపూర్ తార అనుకున్నది సాధించింది. ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సొంతం చేసుకుంది.
బుధవారం జరిగిన 49 కేజీల విభాగం పోటీల్లో మీరాబాయి రెండో స్థానంలో నిలిచింది. 28 ఏళ్ల మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కేజీలు కలిపి మొత్తం 200 కేజీలు బరువెత్తింది. జియాంగ్ హుయ్‌హువా (చైనా; 206 కేజీలు) స్వర్ణం సాధించగా... జిహువా (చైనా; 198 కేజీలు) కాంస్యం దక్కించుకుంది.
రెండో పతకం
ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో మీరాబాయికిది రెండో పతకం. 2017లో ఆమె 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. ‘మణికట్టు గాయం వేధిస్తున్నా దేశానికి పతకం అందించాలనే పట్టుదలతో ప్రయత్నించి సఫలమయ్యాను. వచ్చే ఏడాది ఆసియా క్రీడల్లో, ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తా’ అని మీరాబాయి తెలిపింది.
మీరాబాయి అరుదైన ఘనత
ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు అంతకంటే ఎక్కువ పతకాలు సాధించిన నాలుగో భారత మహిళా లిఫ్టర్‌గా మీరాబాయి గుర్తింపు పొందింది. గతంలో కుంజరాణి దేవి (7 రజత పతకాలు), కరణం మల్లీశ్వరి (2 స్వర్ణాలు, 2 కాంస్యాలు), నీలంశెట్టి లక్ష్మీ (1 రజతం, 1 కాంస్యం) ఈ ఘనత సాధించారు. ఈ నేపథ్యంలో మీరాబాయిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
చదవండి: Rohit Sharma: సగం సగం ఫిట్‌నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా...
BAN vs IND: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్‌తో పాటు
Despite her wrist injury, she still won a silver medal at the WC with a total lift of 200kg
— Anurag Thakur (@ianuragthakur) December 7, 2022
Congratulations @mirabai_chanu on winning silver in women's 49kg at the WWC.
She beats Olympic champ Hou Zhihua 198kg from China.
2017 WC🥇
2020 Olympics🥈
2022 WC🥈
Proud of you 👍 pic.twitter.com/cK8hq1W0Go
Comments
Please login to add a commentAdd a comment