Karanam Malleswari
-
మణికట్టు గాయం బాధిస్తున్నా..‘రజతం’తో మెరిసి! మీరాబాయి అరుదైన ఘనత
World Weightlifting Championship- 2022- బొగోటా (కొలంబియా): మణికట్టు గాయం బాధిస్తున్నా... భారత స్టార్ మహిళా వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వెనక్కి తగ్గలేదు. ప్రయత్నిస్తే పతకం రాకపోదా అని ఆశాభావంతో మొండి పట్టుదలగా బరిలోకి దిగిన ఈ మణిపూర్ తార అనుకున్నది సాధించింది. ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన 49 కేజీల విభాగం పోటీల్లో మీరాబాయి రెండో స్థానంలో నిలిచింది. 28 ఏళ్ల మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 113 కేజీలు కలిపి మొత్తం 200 కేజీలు బరువెత్తింది. జియాంగ్ హుయ్‌హువా (చైనా; 206 కేజీలు) స్వర్ణం సాధించగా... జిహువా (చైనా; 198 కేజీలు) కాంస్యం దక్కించుకుంది. రెండో పతకం ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో మీరాబాయికిది రెండో పతకం. 2017లో ఆమె 48 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. ‘మణికట్టు గాయం వేధిస్తున్నా దేశానికి పతకం అందించాలనే పట్టుదలతో ప్రయత్నించి సఫలమయ్యాను. వచ్చే ఏడాది ఆసియా క్రీడల్లో, ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లోనూ పతకాలు సాధించాలనే లక్ష్యంతో సాధన చేస్తా’ అని మీరాబాయి తెలిపింది. మీరాబాయి అరుదైన ఘనత ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు అంతకంటే ఎక్కువ పతకాలు సాధించిన నాలుగో భారత మహిళా లిఫ్టర్‌గా మీరాబాయి గుర్తింపు పొందింది. గతంలో కుంజరాణి దేవి (7 రజత పతకాలు), కరణం మల్లీశ్వరి (2 స్వర్ణాలు, 2 కాంస్యాలు), నీలంశెట్టి లక్ష్మీ (1 రజతం, 1 కాంస్యం) ఈ ఘనత సాధించారు. ఈ నేపథ్యంలో మీరాబాయిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. చదవండి: Rohit Sharma: సగం సగం ఫిట్నెస్! ఓటమికి ప్రధాన కారణం వాళ్లే! ఇప్పటికైనా... BAN vs IND: బంగ్లాదేశ్‌తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్‌తో పాటు View this post on Instagram A post shared by Vijay Sharma (@sharma1970vijay) Despite her wrist injury, she still won a silver medal at the WC with a total lift of 200kg Congratulations @mirabai_chanu on winning silver in women's 49kg at the WWC. She beats Olympic champ Hou Zhihua 198kg from China. 2017 WC🥇 2020 Olympics🥈 2022 WC🥈 Proud of you 👍 pic.twitter.com/cK8hq1W0Go — Anurag Thakur (@ianuragthakur) December 7, 2022 -
సీఎం వైఎస్ జగన్ చొరవతో పూజరి శైలజకు న్యాయం
కరణం మల్లీశ్వరి వెయిట్ లిఫ్టింగ్‌లో సిక్కోలుకు ఓ మైలురాయి చూపించారు. మళ్లీ ఆ గమ్యాన్ని అందుకోగల వారి కోసం ఎదురు చూస్తుంటే.. అందరికీ కనిపించిన ఆశా కిరణం పూజారి శైలజ. అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకాలతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ ప్రతిభావంతురాలి ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగలేదు. ఫామ్ కోల్పోవడం, డోపింగ్ ఆరోపణలు ఎదుర్కోవడం, నిషేధం పూర్తయ్యాక ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆమె సాధించిన విజయాలు మరుగున పడిపోయాయి. ఎట్టకేలకు ఆమెకు వైఎస్ జగన్ సర్కారు న్యాయం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు వారి కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగుర వేసిన శైలజకు శాప్‌లో కోచ్‌గా ఉద్యోగం ఇచ్చింది. శ్రీకాకుళం న్యూకాలనీ: పదేళ్ల కిందటి వరకు పూజారి శైలజ అంటే ఓ పాపులర్ వెయిట్ లిఫ్టర్. ఒలింపిక్స్‌లో కాంస్య పత కం సాధించిన కరణం మల్లేశ్వరికి సరితూగే క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు. కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్, జూనియర్ ఏషియన్ గేమ్స్ వంటి పోటీల్లో బంగారు పతకాలతో మోత మోగించారు. ఆ తర్వా త ఎందుకో ఆటలో ఆమె వెనుకబడిపోయారు. దీనికి తోడు అనూహ్యంగా డోపింగ్ ఆరోపణలతో జీవితం తల్లకిందులైపోయింది. శైలజపై ఉన్న బ్యాన్ (నిõÙధం) ఎత్తేసినా ఆమె పరిస్థితి మాత్రం మారలేదు. అంతకుముందు ఉన్న గుర్తింపు మొత్తం తుడి చిపెట్టుకుపోయింది. గత ప్రభుత్వ పెద్దల ముందు కన్నీళ్లు పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా కరుణించలేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెకు న్యాయం చేశారు. శాప్‌లో గ్రేడ్–3 కోచ్‌గా నియమించారు. దీంతో తన నిరీక్షణ ఫలించిందని ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నెత్తిపై డోపింగ్ బరువు.. 2006 కామన్ వెల్త్ అనంతరం క్రీడాకారులకు జరిపిన డోపింగ్ పరీక్షల్లో పూజారి శైలజ పాజిటివ్ అని తేలడంలో ఆమె ఆట తలకిందులైంది. అయితే తా ను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె ఫెడరేషన్ ముందు మొత్తుకున్నా ఫలితం లేకపోయింది. జీవితకాలంలో నిషేధం విధించారు. వాస్తవానికి గేమ్‌లో జీవితకాల నిషేధమంటే ఏడేళ్లే. ఆ తర్వాత ఆట ప్రారంభిద్దామని శైలజ భావించినా కుటుంబ నేపథ్యం, చిన్నపిల్లల పోషణ, ఆర్థిక కష్టాల వల్ల ఈ బరువును ఎత్తలేకపోయారు. చిన్నప్పుడే తండ్రి మృతి చెందడం, వివాహం తర్వాత తల్లి చనిపోవడం, అనంతరం కోవిడ్‌తో భర్త దూరం కావడంతో ఒంట రిగా పిల్లలతో కాలం గడుపుతున్న శైలజకు ఇన్నాళ్లకు సరైన న్యాయం జరిగింది. గత ప్రభుత్వాల పె ద్దలు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కలిసినా ప్ర యోజనం లేకపోయిందని శైలజ ఇప్పటికే పలు మార్లు వాపోయారు. ఆమె నిరీక్షణకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెరదించారు. శాప్ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. విశాఖపట్నంలోని డీఎస్‌ఏలో గ్రేడ్–3 కోచ్ పోస్టులో నియమించారు. వంజంగి నుంచి కామన్వెల్త్కు.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని వంజంగి గ్రామానికి చెందిన పూజారి సీతారాం, అమ్మాజమ్మ దంపతులకు జని్మంచింది పూజారి శైలజ. 1996లో వెయిట్‌లిఫ్టింగ్ గేమ్ మొదలుపెట్టిన శైలజ జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి ఇండోర్ స్టేడియంలో ఓనమాలు నేర్చుకున్నారు. అలాగే ఊసవానిపేట వ్యా యామ శాలలో శిక్షణ పొందారు. ఏలూరు సాయ్ అకాడమీలో శిక్షణ పొందారు. డిగ్రీ వరకు చదువుకున్నారు. పోటీల్లో దిగితే బంగారు పతకాన్ని ముద్దాడే శైలజ ప్రతిభను గుర్తించిన నాటి వెయిట్‌లిఫ్టింగ్ అకాడమీ, అసోసియేషన్ ప్రతినిధులు మరింత ఉన్నతంగా శిక్షణను అందించడం మొదలుపెట్టారు. - 1996–97లలో మధురైలో జరిగిన దక్షిణ భారత పోటీల్లో పాల్గొని నాల్గో స్థానంలో నిలిచారు. అక్కడ నుంచి వెనుదిరిగి చూడలేదు. - 1998లో హైదరాబాద్‌లో జరిగిన ఇండిపెండెంట్ గోల్డ్ కప్‌లో తొలి బంగారు పతకాన్ని సాధించారు. - అదే ఏడాది కోల్‌కతాలో జరిగిన జూనియర్ నేషనల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించారు. - అదే ఏడాది బెంగళూరులో జరిగిన సీనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచారు. - 1999లో కర్ణాటక ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో నిర్వహించిన సదరన్ స్టేట్ గేమ్స్‌లో పసిడి పతకాన్ని సాధించారు. - 2000లో మైసూరులో జరిగిన దక్షిణ భారత క్రీడా పోటీల్లో స్వర్ణపతకాన్ని సాధించారు. - 2002లో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో మూడు బంగారు పతకాలను సాధించారు. - 2005లో ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని సత్తాచాటారు. - 2006 వరకు అంతర్జాతీయ స్థాయిలో 18 బంగారు, ఒక రజత పతకం, జాతీయస్థాయిలో 26 బంగారు పతకాలు గెలిచారు. తర్వాత అనేక రాజకీయాల నడుమ ఒలింపిక్స్‌లో పాల్గొనే బర్త్ ను కోల్పోయారు. అయితే ఒలింపిక్స్ రికార్డుల ను జాతీయస్థాయిలోనే బద్దలుగొట్టి ‘ఇండియన్ స్ట్రాంగెస్ట్ ఉమెన్‘గా శైలజ పేరు సంపాదించారు. జగనన్నను కలిశాక.. ఈ ఏడాది ఫిబ్రవరి 7న సీఎం జగనన్నను కలిశాను. నేను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే ఉద్యోగంలో నియమించి, కోచ్‌గా అవకాశం కల్పించారు. విశాఖపట్నం డీఎస్‌ఏలో గ్రేడ్–3 కోచ్ పోస్టును కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. జగనన్నకు రుణపడి ఉంటాను. దశాబ్దంన్నర పాటు నేను పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. – పూజారి శైలజ, అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టర్, శ్రీకాకుళం -
శభాష్ ! సాయి అలంకృత.. వెయిట్ లిఫ్టింగ్‌లో వరల్డ్ రికార్డ్
హైదరాబాద్ : చెంగిచర్లలో నివాసముంటున్న సందీప్, స్నిగ్థ బసు దంపతుల కూతురు సాయి అలంకృత అరుదైన ఫీట్ చేసింది. ప్రపంచ రికార్డును సొంతం చేసుకుని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. పిన్న వయసులోనే అదిక బరువులను అవలీలగా ఎత్తేస్తూ ఔరా అనిపిస్తోంది. చదవండి: మోడరన్ మామ్స్.. బేబీ ఫుడ్ కుకర్ గురించి మీకు తెలుసా? -
వారెవ్వా ! అలంకృత... ఇదే వరల్డ్ రికార్డ్
-
వారెవ్వా ! అలంకృత... ఇదే వరల్డ్ రికార్డ్
సాక్షి, వెబ్‌డెస్క్: సిడ్నీ ఒలింపిక్స్‌లో భారత్‌కి ఏకైక పతకాన్ని అందించిన ఘనత కరణం మల్లేశ్వరీ సొంతం. ఆ తర్వాత దాదాపు ఇరవై ఏళ్లకు మీరాచాను ఈ ఫీట్ సాధించింది. ఇప్పుడు వాళ్లకీ వారసురాలు మన భాగ్యనగరంలో రెడీ అవుతోంది. బుడిబుడి అడుగులు వేసే వయసులోనే భారీ బరువులు సునాయాసంగా లేపుతోంది. పాలబుగ్గల వయసులోనే వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. వరల్డ్ రికార్డ్ హైదరాబాద్ నగరానికి చెందిన సందీప్, సాయి స్నిగ్ధబసు దంపతుల ముద్దు బిడ్డ సాయి అలంకృత కేవలం 20 నెలల వయసులోనే సంచలనాలు సృష్టిస్తోంది. తోటి పిల్లలెవరికీ సాధ్యం కాని రీతిలో బరువులను ఎత్తుతోంది. పాపలోని టాలెంట్‌ని గమనించిన తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆమెలోని ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నారు. దీంతో అతి చిన్న వయసులో ఎక్కువ బరువు ఎత్తిన బేబీగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరును నమోదు చేసుకుంది. ఏడాది వయస్సులోనే ఏడాది వయస్స ఉన్నప్పుడే ఇంట్లో ఉన్న టూ లీటర్స్ వాటర్ బాటిల్‌ని సాయి అలంకృత అవలీలగా ఎత్తుకుని నడిచింది. అప్పటి నుంచి పాపలోని స్పెషల్ ట్యాలెంట్‌ని తల్లిదండ్రులు గమనిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్లో 4.2 కేజీల బరువు ఉన్న వాటర్ మిలాన్‌ని పదిహేడు నెలల వయస్సులో ఎత్తింది, ఇప్పుడు 20 నెలల వయస్సులో 5 కేజీల బరువును ఎత్తడంతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. 6 కేజీలు ఎత్తగలదు - సందీప్ (తండ్రి) బరువులు ఎత్తడంలో పాపకు ఉన్న ప్రత్యేక నైపుణ్యాన్ని గుర్తించి, ఆమెకు స్పెషల్ డైట్ అందిస్తున్నాం. పాపకు ఇప్పుడు 20 నెలలు, ఈ వయసు పిల్లలు కేజీ వరకు బరువులే అతి కష్టంగా ఎత్తగలరు. ఇప్పటి వరకు 4 ఏళ్ల బాబు 3 కేజీలు ఎత్తడమే వరల్డ్ రికార్డ్. అలంకృత ఇప్పుడు 6 కేజీల వరకు బరువును ఎత్తగలుగుతోంది. మేము 5 కేజీల బరువు ఎత్తిన వీడియోనే రికార్డు పరిశీలనకు పంపించాం. సంతోషంగా ఉంది - సాయి స్నిగ్ధబసు (తల్లి) ఏడాది వయసులో పాపలోని స్పెషల్ టాలెంట్‌ని గుర్తించి గమనిస్తూ వచ్చాం. ఈ రోజు మా పాప టాలెంట్‌ని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డు వారు గుర్తించడంతో సంతోషంగా ఉంది. స్పెషల్ టాలెంట్ ఉన్న పిల్లలను ప్రోత్సహించాలి. -
జయహో చాను.. ఆమె తొలి కోచ్ ఎవరంటే?
సాక్షి, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రకంపనల మధ్య అసలు ఒలింపిక్ ఉత్సాహం ఉంటుందో లేదో అన్న సందేహాల నడుమ ఎట్టకేలకు జపాన్ రాజధాని టోక్యో నగరం సిద్దమై పోయింది. సంబరం అలా మొదలైందో లేదో ఇలా ఒక పతకం భారత సిగలో మెరవడం విశేషమే మరి. అయితే ఈ సందర్భంగా వెయిట్ లిఫ్టింగ్‌లో పతకాలతో మెరిసి మురిపించిన లెజెండరీ భారతీయ మహిళల గురించి తెలుసుకుందాం. రంగం ఏదైనా పురుషులతో సమానంగా అనే మాటను మన అమ్మాయిలు అధిగమించి తమకుతామే సాటి అంటూ దూసుకుపోతున్నారు. అన్నింటా మేమే ఫస్ట్ అంటున్నారు. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్... టెన్నిస్..బ్యాడ్మింటన్..క్రికెట్ ఇలా క్రీడ ఏదైనా ఆకాశమే హద్దుగా రాణిస్తున్నారు. టోక్యో ఒలింపిక్ క్రీడా సంగ్రామం వేదికగా ఇది మరోసారి నిరూపితమైంది. Chanu Saikhom Mirabai టోక్యో ఒలంపిక్స్‌లో తొలి పతకంతో శుభారంభం చేసి ప్రపంచం దృష్టిని తన వైపుతిప్పుకుని భారత కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప జేశారు మన మణిపూర్ మణిపూస. మణిపూర్‌కు చెందిన క్రీడాకారిణి మీరాబాయి చాను వెయింట్ లిప్టింగ్ పోటీల్లో 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత మన దేశానికి వన్నె తెచ్చిన పతకమిది. ‘‘బంగారం పతకం కోసం చాలా ప్రయత్నించా.. కానీ సాధ్యం కాలేదు. కానీ సెకండ్ లిఫ్ట్ తరువాత పతకం ఖాయమని అర్థమైపోయిందంటూ’’ ఆమె సంబరపడిపోయారు. అంతేకాదు ‘‘ముందు ఒక పిజ్జా తినాలి..పిజ్జా తిని ఎన్ని రోజులైందో’’ అంటూ అక్కడున్న వారందరిలో నవ్వులు పూయించారు. మరోవైపు తన విద్యార్థి మొత్తం దేశం మోముపై చిరునవ్వులు పూయస్తోందంటూ మీరా బాయి గురువు , మరో ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ కుంజారాణీ దేవి సంతోషం వ్యక్తం చేశారు. మణిపూర్ మణిపూస కుంజరాణీ దేవి వివిధ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాన్ని సైతం అందుకుని భారతీయ వెయిట్ లిఫ్టింగులో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మహిళ మణిపూర్‌కే చెందిన కుంజారాణీ దేవి. మీరా బాయికి తొలి అడుగులు నేర్పిన గురువు కుంజారాణి కావడం ఇక్కడ మరో విశేషం. ఆమె కరీర్‌ను రూపొందించడంలో ఆమెది కీలక పాత్ర. 2015 వరకు తనకు గురువుగా వున్న ఆమె స్టయిల్‌ను ఫాలో అవుతానని, ఆమెను చూసే వెయిట్ లిఫ్టింగ్‌ను కరియర్‌గా ఎంచుకున్నానని స్వయంగా మీరా బాయే చెప్పుకున్నారు. 1985 సంవత్సరం మొదలుకొని జాతీయ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో 44, 46, 48 కిలోల విభాగాల్లో పతకాలు సాధించారామె. 1989లో మాంచెస్టర్‌లో జరిగిన ప్రపంచ మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీలో మొదటిసారి పాల్గొని మూడు వెండి పతకాలు సాదించారు. 1990లో బీజింగ్, 1994లో హిరోషిమాలో జరిగిన ఆసియా క్రీడలలో రజత పతకాన్నితన ఖాతాలో వేసుకున్నారు. 1989 షాంఘైలో జరిగిన పోటీలలో ఒక రజత, రెండు కాంస్య పతకాలు 1991లో ఇండోనేషియాలో జరిగిన పోటీలో 44 కిలోల విభాగంలో మూడు వెండిపతకాలతో తన విజయ పరంపర కొనసాగించారు. ఇక ఆ తరువాత 1992లో థాయిలాండ్ లోను, 1993లో చైనా పోటీల్లోనూ తన రెండవ స్థానాన్ని సాధించారు. 1995లో దక్షిణకొరియాలో జరిగిన పోటీల్లో 46 కిలోల విభాగంలో రెండు బంగారు పతకాలు, ఒక రజతపతకాన్ని సొంతం చేసుకున్నారు. యాబైకి పైగా అంతర్జాతీయ అవార్డులు ఆమె సొంతం. 2006 మెల్బోర్న్లో జరిగిన కామన్వెల్త్ క్రీడలలో 48 కిలోల విభాగంలో బంగారుపతకాన్ని గెలవడమేకాక 72 కిలోలు, 94 కిలోల ఉమ్మడి విభాగంలో రికార్డు నెలకొల్పారు. తెలుగు తేజం కరణం మల్లీశ్వరి 1990వ దశకంలో ఒలింపిక్ వేదికగా మువ్వన్నెల పతాకానికి వన్నె తెచ్చిన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి. శ్రీకాకుళానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి 2000 సిడ్నీ ఒలింపిక్ పతకం కాంస్య పతకం సాధించారు. ఈ సమయంలో భారత్‌కు ఏకైక పతకాన్ని సాధించి, దేశ ప్రతిష్టను సమున్నతంగా నిలబెట్టిన ఆ క్షణాలను సగటు భారతీయుడు ఎలా మర్చిపోగలడు. 1994 అర్జున, 1999లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మశ్రీ పురస్కారాలతోపాటు, 11 స్వర్ణాలతో సహా మొత్తం 29 అంతర్జాతీయ పతకాలు సాధించిన రికార్డు మల్లీశ్వరి సొంతం. అందుకే దేశ రాజధాని ఢిల్లీలోని క్రీడా విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్ పదవి ఆమెను వచ్చి వరించింది. పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా నియమిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నియమించింది. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరగాల్సిన కరోనా కారణంగా ఒక సంవత్సరం ఆలస్యంగా జరుగుతోంది. ఆగస్టు నెల 8వ తేదీవరకు క్రీడా సంగ్రామం హోరా హోరీగా జరగనుంది. మన దేశం నుంచి 119మంది పాల్గొంటున్న ఈ ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలు, రికార్డులు మన సొంతం కావాలని కోరుకుందాం. ముఖ్యంగా బాక్సింగ్ మేరీ కోమ్ ఈ ఒలంపిక్‌లో ఎలాగైనా గోల్డ్ కొట్టాలి. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, సీడబ్ల్యుజీ బంగారు పతక విజేత, ఆసియా గేమ్స్ బంగారు పతక విజేత, ఆసియా ఛాంపియన్షిప్ బంగారు పతక విజేత, ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని గెల్చుకున్నప్పటికీ .. ఇపుడు బంగారు పతకం సాధించాలనేది ఆశ. ఇందుకు 2020 టోక్యో గేమ్స్ ఆఖరి అవకాశం. వివిధ క్రీడల్లో దేశానికి అంతర్జాతీయఖ్యాతి తెచ్చిన మహిళామణుల గురించి రాయాలంటే చాలా పెద్దలిస్టే.. భారత తొలి మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జి మొదలు పరుగుల రాణి పీటీ ఉష, బాక్సింగ్‌కు మారుపేరు మేరీ కోమ్...కుస్తీ వస్తాదు సాక్షీ మాలిక్, టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా, బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, సైనా.. చదరంగంలో తొలి మహిళా గ్రాండ్ మాస్టర్ భాగ్యశ్రీ థిప్సే, కోనేరు హంపీ, హారిక.. ఇక క్రికెట్లో మిథాలీరాజ్.. సఫాలీ వర్మ ఇలా ఎందరో.. మరెందరో.. అందరికీ మరోసారి జయహో...! -
కరణం మల్లీశ్వరి ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ
-
ఒలింపిక్స్ పతకాలే లక్ష్యం: వీసీ కరణం మల్లీశ్వరి
సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్ పతకాల సాధనే లక్ష్యంగా ఢిల్లీ క్రీడా యూనివర్సిటీ పనిచేస్తుందని వైస్ చాన్సలర్(ప్రకటిత) కరణం మల్లీశ్వరి చెప్పారు. దేశంలో ప్రస్తుతం క్రీడలకు కావాల్సిన వనరులున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే అంతర్జాతీయ స్థాయిలో పతకాల సాధన సులభమేనన్నారు. ఢిల్లీ క్రీడా వర్సిటీ వీసీగా నియమితులైన క్రమంలో బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. చిన్నతనం నుంచే క్రీడలపై మనసు లగ్నం చేస్తే.. యుక్త వయసు నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవడం, పతకాలు సాధించడం వీలవుతుందని అభిప్రాయపడ్డారు. ఢిల్లీ క్రీడా యూనివర్సిటీలో ఆరో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ వరకు కోర్సులుంటాయన్నారు. ‘ఆరో తరగతి నుంచే క్రీడల్లో శిక్షణ ఇస్తే ఈ రంగంలో మరింత దూసుకెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అకాడమీల్లో ఏదో ఒక క్రీడ మాత్రమే నేర్చుకునే వీలుంది. యూనివర్సిటీలో పలు క్రీడల పట్ల అవగాహన పెంచుకుని తగిన క్రీడను ఎంచుకునేందుకు అనేక అవకాశాలుంటాయి. క్రీడలను కెరియర్‌గా ఎంచుకుని ఎదగగలమన్న విశ్వాసాన్ని కల్పించేలా ఈ వర్సిటీ ఉంటుంది. క్రీడలను ప్రోత్సహించడంలో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. తెలుగు రాష్ట్రాలకే కాదు.. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఇది ఒక వరం లాంటింది. త్వరలోనే బాధ్యతలు చేపడతా. అధికారులు, ప్రభుత్వంతో చర్చించి ప్రవేశాలు, అర్హతలు, ఇతరత్రా అంశాలపై నిర్ణయం తీసుకుంటాం’ అని కరణం మల్లీశ్వరి వివరించారు. చదవండి: ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి -
కరణం మల్లేశ్వరి పాత్రలో రకుల్
ప్రస్తుతం బయోపిక్ ట్రెండు నడుస్తోంది. పలువురు ప్రముఖుల బయోపిక్‌లతో పొందిన చిత్రాలు ప్రజాదరణ పొందుతున్నాయి. జయలలిత జీవిత చరిత్రతో తలైవీ, ది ఐరన్ లేడీ చిత్రాలు నిర్మాణాల్లో ఉన్నాయి. త్వరలో మరో ప్రముఖ క్రీడాకారిణి జీవిత చరిత్ర సినిమాగా రూపొందబోతోంది. వెయిట్ లిఫ్ట్‌లో ప్రపంచ స్థాయిలో కాంస్యం పథకాన్ని సాధించిన తొలి భారతీయ మహిళ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇది తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందనుందని సమాచారం. (నటి జ్యోతిక రూ. 25 లక్షల విరాళం) కాగా ఈ చిత్రంలో కరణం మల్లేశ్వరి పాత్రలో అందాల నటి రకుల్ ప్రీత్‌సింగ్ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం రకుల్ ప్రీత్‌సింగ్ ఇండియన్– 2 చిత్రంలో కమల్ హాసన్‌తో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం మినహా ఈ అమ్మడికి మరో అవకాశం లేదు. ఇలాంటి సమయంలో కరణం మల్లేశ్వరి బయోపిక్‌లో ఎంపిక అయితే ఈ అమ్మడు కంటే అదృష్టవంతురాలు ఎవరు ఉండరని చెప్పవచ్చు. కాగా ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
కరణం మల్లీశ్వరిగా?
ఒలింపిక్స్‌లో మనకు పతకాన్ని తీసుకొచ్చిన తెలుగు తేజం కరణం మల్లీశ్వరి జీవితం ఆధారంగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘రాజుగాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన సంజనా రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. ఇందులో మల్లీశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని ప్రకటించలేదు. తాప్సీ కనిపిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు తెరమీదకొచ్చింది. మల్లీశ్వరి, రకుల్ ప్రీత్‌ల బాడీలాంగ్వేజ్ చాలా భిన్నంగా ఉంటుంది. మరి రకుల్‌ని ఫైనలైజ్ చేస్తే ప్రోస్థెటిక్ మేకప్‌తో లుక్స్‌ని మ్యాచ్ చేస్తారేమో చూడాలి. -
మల్లేశ్వరి బయోపిక్ షురూ
ఒలింపిక్స్ క్రీడల్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళ కరణం మల్లేశ్వరి బయోపిక్ తెరకెక్కనుంది. 2000 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించారు మల్లేశ్వరి. ఆమె జీవితం ఆధారంగా సంజనా రెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై ఎం.వి.వి సత్యనారాయణ, కోన వెంకట్ ఈ సినిమాను నిర్మించనున్నారు. కరణం మల్లేశ్వరి జన్మ దినం (జూన్ 1) సందర్భంగా సోమవారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ఈ బయోపిక్కు కోన వెంకట్ ఒక నిర్మాతగా ఉండటంతో పాటు రచయిత కూడా. ‘‘ఎంతోమంది మహిళలకు స్ఫూర్తినిచ్చిన కరణం మల్లేశ్వరి బయోపిక్‌ను ప్యాన్ ఇండియా మూవీగా రూపొందించనున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
కరణం మల్లేశ్వరి బయోపిక్
క్రీడాకారుల జీవితాన్ని కథగా స్క్రీన్ మీద చూపించే ట్రెండ్ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో కనిపిస్తోంది. తాజాగా ఓ బయోపిక్ రెడీ అవుతోంది. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మన దేశానికి తొలి మెడల్ తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరిపై ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ నిర్మించనున్నారు. శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామం నుంచి దేశానికి తొలి ఒలింపిక్ పతాకాన్ని తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరి కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చిత్రబృందం భావించిందట. సుమారు 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో మల్లేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. -
వెండితెరపై మల్లీశ్వరీ, కలాం జీవిత కథలు
ప్రస్తుతం బాలీవుడ్లో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. క్రీడాకారులు, ఫిలిం స్టార్స్, పొలిటికల్ లీడర్స్ ఇలా తమదైన ముద్ర వేసిన ప్రతీ ఒక్కరి జీవితాన్ని వెండితెర మీద చూపించేందుకు దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి మరో ఇద్దరు ప్రముఖుల జీవితాలు చేరేందుకు రెడీ అవుతున్నాయి. ఆ ఇద్దరు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దక్షిణాది ప్రముఖులు కావటం మరో విశేషం. ఇప్పటికే ఒలింపిక్ విజేత మేరీకొమ్ బయోపిక్ తెరకెక్కించిన బాలీవుడ్ ప్రముఖులు, వెయిట్ లిఫ్టర్‌గా ఒలింపిక్ పతకం సాధించిన కరణం మల్లీశ్వరీ జీవిత కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగమ్మాయి సంజన ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తెలుగు నిర్మాత అనీల్ సుంకర కూడా బయోపిక్ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేసిన ప్రముఖ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితకథకు దృశ్యరూపం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్ అబ్దుల్ కలాం అనే టైటిల్‌ను రిజిస్టర్ చేసిన నిర్మాతలు ఈ సినిమాను పలు భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.