కరణం మల్లేశ్వరి బయోపిక్‌ | Sanjana Reddy to direct Karnam Malleswari biopic | Sakshi
Sakshi News home page

కరణం మల్లేశ్వరి బయోపిక్‌

Published Mon, Mar 2 2020 5:03 AM | Last Updated on Mon, Mar 2 2020 5:03 AM

Sanjana Reddy to direct Karnam Malleswari biopic - Sakshi

కరణం మల్లేశ్వరి, సంజనా రెడ్డి

క్రీడాకారుల జీవితాన్ని కథగా స్క్రీన్‌ మీద చూపించే ట్రెండ్‌ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో కనిపిస్తోంది. తాజాగా ఓ బయోపిక్‌ రెడీ అవుతోంది. వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మన దేశానికి తొలి మెడల్‌ తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరిపై ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ నిర్మించనున్నారు. శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామం నుంచి దేశానికి తొలి ఒలింపిక్‌ పతాకాన్ని తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరి కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చిత్రబృందం భావించిందట. సుమారు 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో మల్లేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement