ఇందు రెబెక్కా వర్గీస్‌గా... | Sai Pallavi First Look As Indhu From Mukund Varadarajan Biopic Amaran Revealed | Sakshi
Sakshi News home page

ఇందు రెబెక్కా వర్గీస్‌గా...

Published Sat, Sep 28 2024 4:00 AM | Last Updated on Sat, Sep 28 2024 4:00 AM

Sai Pallavi First Look As Indhu From Mukund Varadarajan Biopic Amaran Revealed

ఇందు రెబెక్కా వర్గీస్‌గా తనను తాను పరిచయం చేసుకున్నారు హీరోయిన్‌ సాయిపల్లవి. అమరవీరుడు మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ జీవితం ఆధారంగా రూపొందిన బయోగ్రాఫికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘అమరన్‌’. శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన ఈ బహు బాషా చిత్రానికి రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని హీరోయిన్‌ ఇందు రెబెక్కా వర్గీస్‌ పాత్రను సాయిపల్లవి పోషిస్తున్నారు. శుక్రవారం సాయిపల్లవి పాత్రకు సంబంధించిన ఇంట్రో వీడియోను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

శివ్‌ అరూర్, రాహుల్‌ సింగ్‌ రాసిన ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌’ అనే పుస్తకంలోని మేజర్‌ వరదరాజన్‌ చాప్టర్‌ ఆధారంగా ‘అమరన్‌’ సినిమాను తెరకెక్కించారు. సోనీ పిక్చర్స్‌ ఇంటర్నేషనల్‌ప్రోడక్షన్స్, గాడ్‌ బ్లెస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి కమల్‌హాసన్, ఆర్‌. మహేంద్రన్‌ నిర్మించిన ‘అమరన్‌’ అక్టోబరు 31న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాను శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement