Sanjana reddy
-
సాచి హిట్ కావాలి
‘‘సాచి’ సినిమా ట్రైలర్ బాగుంది. మహిళా సాధికారతకు సంబంధించిన చిత్రం ఇది. ఇలాంటి మంచి సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను’’ అని హీరో ప్రభాస్ అన్నారు. సంజన రెడ్డి, గీతిక రధన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సాచి’. సత్యానంద్ సమర్పణలో వివేక్ పోతగోని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా మార్చి 3న విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ని ప్రభాస్ విడుదల చేశారు. వివేక్ పోతగోని మాట్లాడుతూ– ‘‘బిందు అనే ఒక నాయీబ్రాహ్మణ అమ్మాయి నిజ జీవిత గాథ ఇది. తెలంగాణ నాయీబ్రాహ్మణ అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్‌గారు మా చిత్రం ప్రివ్యూ చూసి, బాగుందని అభినందించారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారికి నచ్చుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కేవీ భరద్వాజ్, నిర్మాణ సారధ్యం: ఉపేన్ నడిపల్లి, వివేక్ పోతగోని. -
పాతపంటల జాతర షురూ
జహీరాబాద్: చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే పాత పంటల జాతర ఉత్సాహంగా ప్రారంభమైంది. శనివారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని జాంగార్‌బౌలి తండాలో జాతరను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ పి.సంజనారెడ్డి జ్యోతి వెలిగించి ఎడ్లబండ్ల ఊరేగింపును మహిళా రైతులతో కలసి ప్రారంభించారు. ఊరేగింపులో మహిళా రైతులు చిరు ధాన్యాలతో ముందుకు సాగారు. ఆరు ఎడ్ల బండ్లలో చిరుధాన్యాలను తీసుకువచ్చారు. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) డైరెక్టర్ పీవీ సతీశ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 28 రోజుల పాటు 23 గ్రామాల్లో ఎడ్లబండ్ల ఊరేగింపు, ఉత్సవాలు జరుగుతాయి. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. జాతర సందర్భంగా జీవవైవిద్య సంరక్షకులను సత్కరించి అభినందించారు. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న చిరుధాన్యాల సాగుపై రూపొందించిన 9 నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీని ఈ సందర్భంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాశెట్టి చౌహాన్, డీడీఎస్ కోడైరెక్టర్ చెరుకూరి జయశ్రీ, సంస్థ సభ్యులు, మహిళా రైతులు పాల్గొన్నారు. -
కరణం మల్లేశ్వరి బయోపిక్
క్రీడాకారుల జీవితాన్ని కథగా స్క్రీన్ మీద చూపించే ట్రెండ్ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల్లో కనిపిస్తోంది. తాజాగా ఓ బయోపిక్ రెడీ అవుతోంది. వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మన దేశానికి తొలి మెడల్ తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరిపై ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. కోన వెంకట్, యంవీవీ సత్యనారాయణ నిర్మించనున్నారు. శ్రీకాకుళంలోని ఓ మారుమూల గ్రామం నుంచి దేశానికి తొలి ఒలింపిక్ పతాకాన్ని తీసుకొచ్చిన కరణం మల్లేశ్వరి కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చిత్రబృందం భావించిందట. సుమారు 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. ఈ సినిమాలో మల్లేశ్వరి పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. -
భార్యాబాధితుల కథ
భార్యాబాధితులైన నలుగురు స్నేహితులు బ్యాచిలర్ జీవితమే బావుంటుందనుకుంటారు. ఆ క్రమంలో ఆ నలుగురు ఒకరికి తెలియకుండా ఒకరు సంజన (రాయ్‌లక్ష్మి)ని ప్రేమిస్తారు. ఓ డాన్‌లా సంజన వారికి ఎలాంటి గుణపాఠం చెబుతుంది? అనే కథాంశంతో తెరకెక్కిన తమిళ చిత్రం ‘ఒంబదులే గురు’. రాయ్‌లక్ష్మి లీడ్రోల్లో పి.టి. సెల్వకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వాణీ వెంకటరమణ సినిమాస్‌పై నిర్మాత రవీంద్ర కల్యాణ్ తెలుగులో ‘సంజనరెడ్డి’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ నెల 5న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం చాంబర్ కార్యదర్శి సాయివెంకట్ టీజర్‌ను రిలీజ్ చేశారు. రవీంద్ర కల్యాణ్ మాట్లాడుతూ– ‘‘రొమాంటిక్ కామెడీ, యాక్షన్ అంశాలతో సాగే చిత్రమిది. 120 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇదే బేనర్లో నా స్వీయ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రూపొందించనున్నా’’ అన్నారు. ‘‘రవీంద్ర కల్యాణ్‌లో మంచి దర్శకుడున్నారు. చెన్నైలో దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు’’ అన్నారు రామసత్యనారాయణ. సహ నిర్మాత బాదినేని వెంకయ్య, మాటల రచయిత శ్రీసాయి, కె.కస్తూరి, నూనె రంగనాయకులు, వాయాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
‘ఉయ్యాలవాడ’ ముని మనుమరాలి పెళ్లి వేడుక
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. కొద్ది రోజలు క్రితం వరకు చరిత్ర మీద అవగాహన ఉన్నవారికి తప్ప పెద్దగా ఎవరికీ తెలియని స్వాతంత్ర్య సమరయోధుడు. కానీ ఇప్పుడు ఈ పేరు తెలుగు ప్రజలకు సుపరిచితం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతోనే రూపొందిస్తున్నారు. తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన ముని మనుమరాలు సంజన రెడ్డి వివాహం చెన్నైకి చెందిన ప్రతాప్ రెడ్డితో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకి విచ్చేసిన ప్రముఖులకు సంజనరెడ్డి తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి, సుచరిత స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు తెలుగు యువ శక్తి అధ్యక్షుడు, దక్షిణ భారత ఉయ్యాలవాడ సేవ సేన కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సినీ నటుడు సుమన్, మంత్రి అఖిల ప్రియ, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు విశ్వేశ్వరెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉయ్యాలవాడ వారసులు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను గతంలో మేమే చలనచిత్రంగా నిర్మించాలనుకున్నాము. అప్పట్లో ఈ విషయమై నటులు సుమన్, సాయికుమార్‌లను కూడా సంప్రదించాం. కానీ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ జీవితాన్ని సినిమాగా తియ్యటం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. -
‘నరసింహారెడ్డి’ ముని మనుమరాలి పెళ్లి వేడుక
-
ఖుషీ సినిమా నా ప్రపంచాన్నే మార్చేసింది!
లెక్చరర్.. ఇంజినీర్.. ఓ డైరెక్టర్ ఆమె విద్యార్థులకు దిశా నిర్దేశం చేసిన లెక్చరర్.. కంప్యూటర్‌తో దోస్తీ చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్.. వార్తలతో మమేకమైన జర్నలిస్ట్.. మరిప్పుడు ఓ డైరెక్టర్. విభిన్న వృత్తుల్లో తనదైన ప్రతిభ చూపిన సంజనారెడ్డి మెగా ఫోన్ పట్టారు. ‘రాజుగాడు’ సినిమాతో వెండి తెరపై నవ్వులు పూయించేందుకు సిద్ధమయ్యారు. నేడు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ... హైదరాబాద్ (శ్రీనగర్ కాలనీ) : మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని వమరవల్లి గ్రామం. డిగ్రీ వరకు అక్కడే చదివాను. మాది వ్యవసాయ కుటుంబం. మేము ఇద్దరం అమ్మాయిలం. చిన్నప్పుడు ఇంట్లో న్యూస్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. సినిమాలు కూడా చూడలేదు. డిగ్రీ తర్వాత ఎమ్మెస్సీ మ్యాథమేటిక్స్ ఆంధ్రా యూనివర్సిటీలో చేశాను. ‘ఖుషీ’ ఎఫెక్ట్... వేసవి సెలవుల కోసం వైజాగ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాం. అప్పుడే ‘ఖుషీ’ సినిమా విడుదలైంది. నాకు సినీ ప్రపంచాన్ని పరిచయం చేసింది ‘ఖుషీ’ సినిమానే. నెల రోజులు వైజాగ్‌లో ఉంటే సంగం–శరత్ థియేటర్లో 27సార్లు ఈ సినిమా చూశాను. ఆ సమయంలో విడుదలైన ‘ప్రియమైన నీకు’ ఏడుసార్లు చూశారు. ఖుషీ చిత్రంలో ప్రతి సీన్ నన్ను ప్రభావితం చేసింది. అప్పట్లో ఎక్కడ చూసినా పవన్‌కల్యాణ్ యాటిట్యూడ్‌తో ఉండేవాళ్లం. సినిమాలపై అమితమైన ఇష్టం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ముచ్చటగా మూడు వృత్తుల్లో... ఎమ్మెస్సీ పూర్తయిన తర్వాత ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు పాఠాలు బోధించాను. ఆరు నెలలు లెక్చరర్‌గా పని చేశాక, హైదరాబాద్ వచ్చేశాను. సిటీలో మైక్రోసాఫ్ట్‌లో 8 నెలలు పని చేశాను. సాఫ్ట్వేర్ సాఫ్ట్‌గా ఉండడంతో.. సినిమాల మీద ఆసిక్తితో న్యూస్ రీడర్ అవుదామని ఎలక్ట్రానిక్ మీడియాలో చేరాను. కానీ జర్నలిస్ట్‌గా ప్రయాణం ప్రారంభిచాను. రెండేళ్లు మీడియాలో చేశాను. ఎంతోమంది బాలీవుడ్, టాలీవుడ్ నటులను ఇంటర్వ్యూ చేయడంతో భయం పోయింది. టాప్ హీరోలు, డైరెక్టర్లతో సరదాగా మాట్లాడేదాన్ని. అప్పుడు పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి రావచ్చుగా... అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని నెలలకు డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ ‘రౌడీ’ సినిమాకు ఓ 10 రోజులు అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ తర్వాత నటి అమల అక్కినేనితో యాడ్ ఫిలిం చేశాను. అది సక్సెస్ అవడంతో దర్శకత్వంపై అడుగులు వేసి కథ రాసుకున్నాను. ‘రాజుగాడు’ షూటింగ్లో... ఇదీ ‘రాజుగాడు’... కొద్దిపాటి అనుభవంతో కథలు రాసుకుంటున్న సమయంలో ఓ ఫ్రెండ్ ద్వారా రాజ్‌తరుణ్ పరిచయమయ్యారు. ‘క్లెప్టోమేనియా’ కాన్సెప్ట్‌తో రాసుకున్న కామెడీ కథ రాజ్‌తరుణ్‌కు నచ్చడంతో నిర్మాత అనిల్ సుంకరను కలిశాం. ఆయన మా కథను నమ్మి, సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. యూనిట్ సభ్యుల సహకారంతో పూర్తిస్థాయి కామెడీతో సినిమాను రూపొందించాం. ఇది తప్పకుండా అందరినీ మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. ‘కరణం’ బయోపిక్ తీస్తా... నాకు కామెడీ, యాక్షన్ సినిమాలు చాలా ఇష్టం. యాక్షన్, పైట్స్ ఉంటేనే సినిమా మరింత ఇష్టంగా చూస్తాను. కరణం మల్లేశ్వరి బయోపిక్ తీయాలని ఉంది. కథ కూడా సిద్ధం చేసుకున్నాను. కథానాయిక కోసం ఎదురుచూస్తున్నాను. ఆమె స్వర్ణం ఎలా చేజార్చుకుంది? ఆమె కష్టాలు–ఇష్టాలు ప్రజలకు తెలియజేయాలి. హిందీ, తెలుగుతో పాటు మరిన్ని భాషల్లో ఈ సినిమాను నిర్మించాలని ఉంది. ఇక నటుల్లో పవన్‌కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సిటీలో ట్యాంక్‌బండ్ ఇష్టం. జర్నలిస్ట్‌గా చేసినప్పుడు హైదరాబాద్ మొత్తం చుట్టేశాను. మహిళా దర్శకులు రావాలి... మహిళల్లో చాలా ప్రతిభ ఉంది. కానీ దర్శకత్వం వైపు అడుగులు వేయడం లేదు. డైరెక్షన్లో స్త్రీ–పురుష భేదం అనేది ఉండదు. సరికొత్త ఆలోచనలతో ఇష్టంగా పనిచేస్తే చాలు. మహిళలు భయాన్ని వదిలి, కష్టపడితే కచ్చితంగా ఇందులో రాణించొచ్చు. ముందుగా ఇండస్ట్రీ అనే భయాన్ని వదిలిపెట్టాలి. మేం చేస్తామని ముందుకు రావాలి. నేను ఒంటరిగా ఐదు దేశాలు చుట్టేశాను. దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న సమయంలో దాచుకున్న డబ్బుతో కారు కొనాలా? ట్రావెల్‌కి వెళ్లాలా? అనే సందిగ్ధంలో ట్రావెలింగ్‌కి వెళ్లాను. సింగపూర్, చైనా, మలేసియా, బ్యాంకాక్‌లను చుట్టేశాను. -
అదే నా విజయంగా భావిస్తున్నా
‘‘ఇప్పటి పరిస్థితుల్లో డైరెక్షన్ చాన్స్ రావడం చాలా అరుదు. నన్ను నమ్మి అవకాశమిచ్చిన నిర్మాత అనిల్ సుంకరగారికి ఎప్పటికీ రుణపడి ఉంటా. మా నాన్నగారు సినిమాలు చూసి 25 ఏళ్లవుతోంది. ‘రాజుగాడు’ సినిమాలోని రెండు సన్నివేశాలు ఆయనకి చూపించడంతో తెగ నవ్వుకున్నారు. అదే నా విజయంగా భావిస్తున్నా’’ అని సంజనారెడ్డి అన్నారు. రాజ్‌తరుణ్, అమైరా దస్తూర్ జంటగా సంజనారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మించిన ‘రాజుగాడు’ జూన్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘భలే భలే మగాడివోయ్’ చూసి మారుతీగారిని మంచి కథ అడగ్గా ‘రాజుగాడు’ కథ ఇచ్చారు. ఆ కథను సంజనారెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. జూన్ 1 ఆమె జీవితంలో బిగ్గెస్ట్ డేగా నిలుస్తుంది. రాజ్ తరుణ్‌తో మళ్లీ మరో సినిమా ఎప్పుడు తీయాలా? అని ఆలోచిస్తున్నాను. మా సినిమా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది’’ అన్నారు. ‘‘ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నేను నటించిన 5వ సినిమా ఇది. ఈ బ్యానర్లో ఇంకా చాలా సినిమాలు చేయాలి. సంజనా ప్రతి ఆర్టిస్ట్ నుంచి మంచి కామెడీ రాబట్టుకున్నారు’’ అన్నారు రాజ్ తరుణ్. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది’’ అన్నారు అమైరా దస్తూర్. -
స్క్రీన్‌ప్లే.. డైరెక్షన్..సంజనారెడ్డి
టెక్కలి : ఆమె చదివిన చదువుకు, ఎంచుకున్న రంగానికి ఎటువంటి సంబంధం లేదు.. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం ఇజ్జువరం స్వగ్రామం.. అక్కడి నుంచి సమీప పట్టణమైన టెక్కలిలో స్థిర నివాసం.. డిగ్రీ వరకు అక్కడే కొనసాగిన చదువు.. తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో పీజీ కోర్సు పూర్తి చేసుకుని.. హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంతో మొదలైన ఆమె ప్రస్థానం చివరకు వెండితెర వరకు వెళ్లింది. కొంతకాలం టీవీ చానెళ్లలో జర్నలిస్టుగా పనిచేస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ చివరకు మహిళా దర్శకుల జాబితాలో తనదైన స్థానం సంపాదించుకుని కళామతల్లి సాక్షిగా సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేశారామె.. ఆమె మరెవరో కాదు దుక్క సంజనా రెడ్డి. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ రాజ్ తరుణ్, పూజిత, అమైరా దస్తూర్ నటీనటులుగా, రాజేంద్రప్రసాద్, సితార ప్రధాన పాత్రధారులుగా సంజనారెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించి తెరకెక్కిన రాజుగాడు సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆమె గురించి మరికొన్ని విశేషాలు.. రామ్‌గోపాల్‌వర్మ స్ఫూర్తితో.. సినిమా రంగంలో రామ్‌గోపాల్‌వర్మ స్ఫూర్తితో సంజనారెడ్డి దర్శకత్వం వైపు దృష్టి సారించింది. నటి అక్కినేని అమల ప్రోత్సాహంతో ఓ యాడ్ ఫిల్మ్‌కు డైరెక్టర్‌గా పని చేశారు. అనతి కాలంలోనే రాజ్‌తరుణ్ హీరోగా తెరకెక్కిన రాజుగాడు సినిమాకు స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహించే చాన్స్ దక్కించుకున్నారు. కేవలం 42 రోజుల్లో సినిమాను పూర్తి చేసి చిత్ర పరిశ్రమలో ప్రముఖులతో శభాష్ అనిపించుకున్నారు. జూన్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టార్ ఫిల్మ్ మేకర్ కావాలనే ఆశయం.. భవిష్యత్‌లో పురుషులతో సమానంగా సినిమాలకు దర్శకత్వం వహించి స్టార్ ఫిల్మ్ మేకర్ కావాలనే ఆశయం ఉందని సంజనారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఎంచుకున్న సినిమా రంగంపై తనను తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారని పేర్కొన్నారు. సందేశాత్మక, కమర్షియల్ సినిమాలు తీయడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరిక ఉందని చెప్పారు. కష్టపడే స్వభావంతో చేసే పనిపై పూర్తి నమ్మకంతో ముందుకు సాగితే విజయం సాధించవచ్చునని సంజనారెడ్డి తెలిపారు. కుటుంబ నేపథ్యం.. ఇజ్జువరం గ్రామానికి చెందిన దుక్క తులసీరెడ్డి, అరవిందాక్షి దంపతుల పెద్ద కుమార్తె సంజనారెడ్డి పదో తరగతి వరకు టెక్కలి బాలి కోన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆ తర్వాత బీఎస్ అండ్ జేఆర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. అక్కడి నుంచి ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ పూర్తి చేసి కొంతకాలం టెక్కలి పరి సర ప్రాంతాల్లో ప్రైవేట్ కళాశాలల్లో లెక్చరర్‌గా పనిచేశారు. జీవి తంలో ఏదో సాధించాలనే తపనతో కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులను అభ్యసించి హైదరాబాద్‌లో ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యో గం సాధించారు. అక్కడితో తృప్తి చెందక ఎలక్ట్రానిక్ మీడి యా వైపు దృష్టి సారించారు. ఓవైపు చానెళ్లలో పనిచేస్తూ కొన్ని ఇంగ్లీష్ పత్రికలకు కవర్ స్టోరీలు రాసే అలవాటు చేసుకున్నారు. ఈ కోవలో సినీ పరిశ్రమలో ప్రముఖులను కలిసే అవకాశం లభించింది. ఇదే సమయంలో నటుడు మోహన్‌బాబు కుటుంబంతో సంజనారెడ్డికు పరిచయం ఏర్పడింది. రామ్‌గోపాలవర్మ దర్శకత్వంలో మోహన్‌బాబు, జయసుధ, మంచు విష్ణు ప్రధాన పాత్రదారులుగా నిర్మించిన ‘రౌడీ’ సినిమా సెట్స్‌కు సంజనారెడ్డి అప్పుడప్పుడు వెళ్తుండేవారు. అప్పుడే ఫిల్మ్‌మేకింగ్ చేయాలనే ఆలోచన కలిగిం ది. ముంబై వెళ్లి కొద్ది రోజులు వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నెల రోజుల పాటు ఇతర దేశాల్లో సినిమా నిపుణులను కలిసి ఫిల్మ్ మేకింగ్‌లో మెలకువలు తెలుసుకున్నారు. -
‘రాజుగాడు’ ప్రీ రిలీజ్ వేడుక
-
వర్మగారే నాకు స్ఫూర్తి
‘‘మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి. ఐటీ కంపెనీలో కొన్ని రోజులు పని చేశా. జర్నలిస్ట్‌గా కూడా వర్క్ చేశాను. సినిమా రంగంపై ఆసక్తితో ఓ స్నేహితుడి ద్వారా రామ్‌గోపాల్ వర్మగారి వద్ద ‘రౌడీ’ సినిమాకి సహాయ దర్శకురాలిగా చేశా. నేను డైరెక్టర్ కావడానికి ఆయనే స్ఫూర్తి’’ అని సంజనారెడ్డి అన్నారు. రాజ్ తరుణ్ హీరోగా, అమైరా దస్తూర్, పూజిత హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘రాజుగాడు’. సంజనారెడ్డి దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా జూన్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంజనారెడ్డి మాట్లాడుతూ– ‘‘శివ’ సినిమా 25 వసంతాల సమయంలో అమలగారిని కలిశాను. ఆమె నన్ను ఓ యాడ్‌ను డైరెక్ట్ చేయమన్నారు. నేను చేసిన యాడ్ అందరికీ నచ్చడంతో నాలో నమ్మకం పెరిగింది. అలా సినిమా ప్రయత్నాలు చేస్తున్న టైమ్‌లో రాజ్‌తరుణ్ పరిచయం అయ్యారు. ‘రాజుగాడు’ నిర్మాతల్ని ఆయనే పరిచయం చేశారు. ఈ చిత్రంలో హీరోకి క్లిప్టోమేనియా అనే డిజార్డర్ ఉంటుంది. ఈ వ్యాధి ఉన్నవారు వాళ్లకు తెలియకుండానే దొంగతనం చేస్తుంటారు. ఈ వ్యాధి వల్ల హీరో ఉద్యోగాలన్నీ కోల్పోతాడు. కొడుకు కోసం తండ్రి రాజేంద్ర ప్రసాద్ సూపర్‌మార్కెట్ నడుపుతుంటాడు. ఇద్దరి మధ్య కామెడీ చక్కగా ఉంటుంది. ఇంటర్వెల్, క్లయిమాక్స్ సినిమాటిక్‌గా ఉంటాయి. మిగతాదంతా పక్కింటి కథను తెరపై చూస్తున్నట్లు ఉంటుంది. సినిమా విడుదల తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
రాజుగాడు వెనక్కి తగ్గాడు..!
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజుగాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను మే 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా వాయిదా పడింది. జూన్ 1న రాజుగాడు సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగాచిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్ ఈ సినిమాలో క్లెప్టోమేనియాతో ఇబ్బంది పడే కుర్రాడిగా నటిస్తున్నాడు. తనకు అవసరం లేకపోయినా.. తన ప్రమేయం లేకుండానే దొంగతనం చేసే వింత వ్యాధితో బాధపడే కుర్రాడిగా కనిపిస్తున్నాడు రాజ్ తరుణ్. అమైరా దస్తూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో సంజనా రెడ్డి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతమందిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ, సితారలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. -
క్లెప్టోమేనియా అని అదేదో కొత్త జబ్బంట!
-
క్లెప్టోమేనియా అని అదేదో కొత్త జబ్బంట!
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజుగాడు. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్ ఈసినిమాలో క్లెప్టోమేనియాతో ఇబ్బంది పడే కుర్రాడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తనకు అవసరం లేకపోయినా.. తన ప్రమేయం లేకుండానే దొంగతనం చేసే వింత వ్యాధితో బాధపడే కుర్రాడి కనిపిస్తున్నాడు రాజ్ తరుణ్. అమైరా దస్తూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో సంజనా రెడ్డి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతమందిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ, సితారలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రాజ్ తరుణ్ మరోసారి ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోగా రాజేంద్ర ప్రసాద్ తండ్రిపాత్రలో తన మార్క్ చూపించారు. -
నవతరం ‘డైరెక్షన్’
సవాళ్లతో కూడుకున్న సినిమా రంగంలో తెరపైనే కాదు తెర వెనుక కూడా మహిళలు సత్తా చాటుతున్నారు. కథానాయికలు, సహాయక పాత్రల్లో తెరపై కనిపించడానికి పరిమితం కాకుండా సినిమా నిర్మాణంలో తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. 24 క్రాప్టుల్లోనూ భాగస్వాములవుతున్న మహిళల సంఖ్య పెరుగుతుండటం ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు సినిమాల్లో నటనకు, పాటలు పాడటానికి, నర్తించడానికే మాత్రమే పరిమితమైన మహిళలు ఇప్పుడు అన్నిరంగాల్లోకి ప్రవేశిస్తున్నారు. ముఖ్యంగా ఎంతో సంక్లిష్టమైన దర్శకత్వ విభాగంలోకి నవతరం నారీమణుల రాక పెరుగుతుండటం శుభపరిణామం. ఛాన్స్ వచ్చింది కదా అని మూస సినిమాలు చుట్టేయడం లేదు. నవ్యపంథాలో ముందుకు సాగుతూ తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదివరకటి రోజుల్లో అమ్మాయిలు సినిమా రంగంలోకి అడుగుపెడతామంటే కుటుంబ సభ్యులతో పాటు సమాజం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యేది. ఇప్పుడా పరిస్థితిలో చాలావరకు మార్పు రావడంతో చిత్రసీమలోకి అడుగుపెట్టే యువతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తమకు ఇష్టమైన విభాగాల్లో ప్రవేశించిన అమ్మాయిలు అందివచ్చిన అవకాశాలతో తామేంటో నిరూపించుకుంటున్నారు. మగాళ్లకు ఏమాత్రం తీసిపోమని ఢంకా బజాయిస్తున్నారు. సినిమా రంగంలో నిలదొక్కుకున్న కుటుంబాలకు చెందిన మహిళలు కూడా మెగాఫోన్ పట్టడం తాజా పరిణామం. నాగార్జునను పడేసింది! 'పడేశావే' సినిమాతో దర్శకురాలిగా వెండితెరకు పరిచయమైంది చునియా. మా టీవీలో ప్రసారమైన యువ సీరియల్ ద్వారా ఆమె దర్శక జీవితం మొదలైంది. అక్కినేని కుటుంబం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన మనం సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది. చునియా ప్రతిభను గుర్తించిన హీరో నాగార్జున ఆమెకు దర్శకురాలిగా అవకాశం ఇచ్చారు. ఆమె చెప్పిన స్టోరీలైన్ నచ్చడంతో 'పడేశావే' సినిమాను స్వయంగా నిర్మించారు. ఈ సినిమాకు విజయం సాధించనప్పటికీ డైరెక్టర్‌గా చునియాకు మంచి మార్కులు పడ్డాయి. డైరెక్టర్‌గా మారిన జర్నలిస్ట్ చిత్రసీమపై ఎనలేని అభిమానం సంజనారెడ్డిని దర్శకురాలిని చేసింది. రాజ్ తరుణ్, అమైరా దస్తర్ జంటగా నటిస్తున్న 'రాజుగాడు' సినిమాతో దర్శకురాలిగా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్‌గా పనిచేసిన ఆమె తన కలను సాకారం చేసుకునేందుకు ఉద్యోగాన్ని వదులుకుంది. కథలు రాయం, వాటిని ఆకట్టుకునేలా చెప్పడం లాంటి అంశాల్లో తన ప్రతిభకు పదుకుపెట్టుకుంది. సినిమా పరిశ్రమలో సాంకేతిక నిపుణులుగా పనిచేస్తున్న వారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుంది. ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దగ్గర 'రౌడీ' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది. ఘట్టమనేని వారసురాలు సీనియర్ నటుడు సూపర్ కృష్ణ తనయ, హీరో మహేశ్ బాబు సోదరి ఘట్టమనేని మంజుల కూడా 'మనసుకు నచ్చిన'పని మొదలు పెట్టింది. దర్శకురాలిగా మారి 'మనసుకు నచ్చింది' అనే సినిమా తీసింది. స్వీయ రచనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'షో' సినిమాతో నటిగా పరిచయమైన మంజుల పలు సినిమాలకు నిర్మాత కూడా వ్యవహరించారు. ఆమె తండ్రి కృష్ణ కూడా నటుడిగా నిరూపించకున్న తర్వాత నిర్మాత, దర్శకుడిగా మారారు. ఇప్పుడు ఆయన కుమార్తె మంజుల కూడా అదే దారిలో ముందుకు సాగుతున్నారు. సాహో శశికిరణ్ తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న సినీ రచయిత, హాస్యనటుడు ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్ కూడా మెగాఫోన్ పట్టింది. తండ్రి పేరు వాడకుండా స్వయం ప్రతిభతో ఛాన్స్ దక్కించుకుంది. సాహెబా సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్లోకి దూసుకొచ్చింది. వాణిజ్యపరంగా ఈ సినిమా విజయం సాధించకున్నా ఆమె దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. మహిళలు దర్శకత్వం చేయలేరేమోనన్న భయం క్రమంగా టాలీవుడ్లో తగ్గుతోందని చెబుతున్న శశికిరణ్.. మున్ముందు మరింత మంది యువతులను డైరెక్టర్లుగా చూడొచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. - పోడూరి నాగ శ్రీనివాసరావు, సాక్షి వెబ్ -
'రాజు గాడు'కి వింత జబ్బు
రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజుగాడు. సంజనా రెడ్డి అనే కొత్త దర్శకురాలు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరో ఓ వింత జబ్బుతో బాధపడుతుంటాడట. ఇటీవల భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు చిత్రాలు ఇదే తరహా కథా కథనాలతో తెరకెక్కి మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా అదే బాటలో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. రాజు గాడు సినిమాలో హీరో బుద్ధి అని ఆదీనంలో ఉండదు. తనకు తెలియకుండానే తాను దొంగతనం చేసేస్తుంటాడు. ఇలాంటి వింత వ్యాధి కారణంగా హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నదే సినిమా కథ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను 2018 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో అమైరా దస్తర్ హీరోయిన్ గా నటిస్తోంది. -
ఆగిపోయిన సినిమా మళ్లీ మొదలైంది..!
చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్, కొద్ది రోజులు కిందట ఆగిపోయిన ఓ సినిమాను తిరిగి పట్టాలెక్కిస్తున్నాడు. మారుతి అందించిన కథతో లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి దర్శకత్వంలో రాజుగాడు సినిమాను ప్రారంభించాడు రాజ్ తరుణ్. అయితే అప్పటికే ఏకె ఎంటర్టైన్మెంట్స్ ఉన్న కమిట్మెంట్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న అంధగాడు షూటింగ్ పూర్తి కావస్తుండటంతో రాజ్ తరుణ్ కు కాస్త ఫ్రీ టైం దొరికింది. దీంతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న సినిమాతో పాటు సంజనా రెడ్డి సినిమాకు కూడా డేట్స్ అడ్జస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడట. త్వరలోనే సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు.