ఉయ్యాలవాడ నరసింహారెడ్డి.. కొద్ది రోజలు క్రితం వరకు చరిత్ర మీద అవగాహన ఉన్నవారికి తప్ప పెద్దగా ఎవరికీ తెలియని స్వాతంత్ర్య సమరయోధుడు. కానీ ఇప్పుడు ఈ పేరు తెలుగు ప్రజలకు సుపరిచితం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమాను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతోనే రూపొందిస్తున్నారు.తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. ఆయన ముని మనుమరాలు సంజన రెడ్డి వివాహం చెన్నైకి చెందిన ప్రతాప్ రెడ్డితో ఇటీవల ఘనంగా జరిగింది. హైదరాబాద్ జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి కుటుబ సభ్యులు పాల్గొన్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.