మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి హైదరాబాద్ రెవెన్యూ అధికారులు షాకిచ్చారు. ఈ చిత్ర నిర్మాత మెగాస్టార్ తనయుడు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ బ్లాక్‌బస్టర్ ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్ జరిగిన సెట్స్‌లోనే ప్రస్తుతం సైరా షూటింగ్ జరుగుతోంది. శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ సెట్స్‌లో రంగస్థలం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే ఇది ప్రభుత్వ భూమి కావడంతో ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా ఇప్పుడు సైరా చిత్రం కోసం అక్కడ సెట్స్ నిర్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రెవెన్యూ అధికారులు సైరాలో కథానాయకుడి ఇంటి సెట్‌ని కూల్చివేశారు.