మట్టి కుండల్లో చిరుధాన్యాలతో జాతరకు వచ్చిన మహిళా రైతులు
జహీరాబాద్: చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే పాత పంటల జాతర ఉత్సాహంగా ప్రారంభమైంది. శనివారం సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలంలోని జాంగార్‌బౌలి తండాలో జాతరను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ పి.సంజనారెడ్డి జ్యోతి వెలిగించి ఎడ్లబండ్ల ఊరేగింపును మహిళా రైతులతో కలసి ప్రారంభించారు. ఊరేగింపులో మహిళా రైతులు చిరు ధాన్యాలతో ముందుకు సాగారు.
ఆరు ఎడ్ల బండ్లలో చిరుధాన్యాలను తీసుకువచ్చారు. డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ (డీడీఎస్) డైరెక్టర్ పీవీ సతీశ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. 28 రోజుల పాటు 23 గ్రామాల్లో ఎడ్లబండ్ల ఊరేగింపు, ఉత్సవాలు జరుగుతాయి. జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లో ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. జాతర సందర్భంగా జీవవైవిద్య సంరక్షకులను సత్కరించి అభినందించారు. రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న చిరుధాన్యాల సాగుపై రూపొందించిన 9 నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీని ఈ సందర్భంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో సర్పంచ్ రాశెట్టి చౌహాన్, డీడీఎస్ కోడైరెక్టర్ చెరుకూరి జయశ్రీ, సంస్థ సభ్యులు, మహిళా రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment