రాజుగాడు వెనక్కి తగ్గాడు..! | Raj Taruns Rajugadu Release Postponed | Sakshi
Sakshi News home page

Published Sun, May 6 2018 11:34 AM | Last Updated on Mon, Apr 8 2019 7:50 PM

Raj Taruns Rajugadu Release Postponed - Sakshi

యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజుగాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను మే 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేశారు. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా వాయిదా పడింది. జూన్‌ 1న రాజుగాడు సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టుగాచిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించారు. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ తో ఆకట్టుకుంటున్న రాజ్‌ తరుణ్ ఈ సినిమాలో క్లెప్టోమేనియాతో ఇబ్బంది పడే కుర్రాడిగా నటిస్తున్నాడు. 

తనకు అవసరం లేకపోయినా.. తన ప్రమేయం లేకుండానే దొంగతనం చేసే వింత వ్యాధితో బాధపడే కుర్రాడిగా కనిపిస్తున్నాడు రాజ్‌ తరుణ్‌. అమైరా దస్తూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో సంజనా రెడ్డి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఏకె ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్‌ సంగీతమందిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్‌, 30 ఇయర్స్‌ పృథ్వీ, సితారలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement