Raju gadu
-
ఖుషీ సినిమా నా ప్రపంచాన్నే మార్చేసింది!
లెక్చరర్.. ఇంజినీర్.. ఓ డైరెక్టర్ ఆమె విద్యార్థులకు దిశా నిర్దేశం చేసిన లెక్చరర్.. కంప్యూటర్‌తో దోస్తీ చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్.. వార్తలతో మమేకమైన జర్నలిస్ట్.. మరిప్పుడు ఓ డైరెక్టర్. విభిన్న వృత్తుల్లో తనదైన ప్రతిభ చూపిన సంజనారెడ్డి మెగా ఫోన్ పట్టారు. ‘రాజుగాడు’ సినిమాతో వెండి తెరపై నవ్వులు పూయించేందుకు సిద్ధమయ్యారు. నేడు ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా ఆమె ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ... హైదరాబాద్ (శ్రీనగర్ కాలనీ) : మా స్వస్థలం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని వమరవల్లి గ్రామం. డిగ్రీ వరకు అక్కడే చదివాను. మాది వ్యవసాయ కుటుంబం. మేము ఇద్దరం అమ్మాయిలం. చిన్నప్పుడు ఇంట్లో న్యూస్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. సినిమాలు కూడా చూడలేదు. డిగ్రీ తర్వాత ఎమ్మెస్సీ మ్యాథమేటిక్స్ ఆంధ్రా యూనివర్సిటీలో చేశాను. ‘ఖుషీ’ ఎఫెక్ట్... వేసవి సెలవుల కోసం వైజాగ్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాం. అప్పుడే ‘ఖుషీ’ సినిమా విడుదలైంది. నాకు సినీ ప్రపంచాన్ని పరిచయం చేసింది ‘ఖుషీ’ సినిమానే. నెల రోజులు వైజాగ్‌లో ఉంటే సంగం–శరత్ థియేటర్లో 27సార్లు ఈ సినిమా చూశాను. ఆ సమయంలో విడుదలైన ‘ప్రియమైన నీకు’ ఏడుసార్లు చూశారు. ఖుషీ చిత్రంలో ప్రతి సీన్ నన్ను ప్రభావితం చేసింది. అప్పట్లో ఎక్కడ చూసినా పవన్‌కల్యాణ్ యాటిట్యూడ్‌తో ఉండేవాళ్లం. సినిమాలపై అమితమైన ఇష్టం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ముచ్చటగా మూడు వృత్తుల్లో... ఎమ్మెస్సీ పూర్తయిన తర్వాత ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు పాఠాలు బోధించాను. ఆరు నెలలు లెక్చరర్‌గా పని చేశాక, హైదరాబాద్ వచ్చేశాను. సిటీలో మైక్రోసాఫ్ట్‌లో 8 నెలలు పని చేశాను. సాఫ్ట్వేర్ సాఫ్ట్‌గా ఉండడంతో.. సినిమాల మీద ఆసిక్తితో న్యూస్ రీడర్ అవుదామని ఎలక్ట్రానిక్ మీడియాలో చేరాను. కానీ జర్నలిస్ట్‌గా ప్రయాణం ప్రారంభిచాను. రెండేళ్లు మీడియాలో చేశాను. ఎంతోమంది బాలీవుడ్, టాలీవుడ్ నటులను ఇంటర్వ్యూ చేయడంతో భయం పోయింది. టాప్ హీరోలు, డైరెక్టర్లతో సరదాగా మాట్లాడేదాన్ని. అప్పుడు పూరి జగన్నాథ్ ఇండస్ట్రీకి రావచ్చుగా... అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని నెలలకు డైరెక్టర్ రామ్‌గోపాల్‌వర్మ ‘రౌడీ’ సినిమాకు ఓ 10 రోజులు అసిస్టెంట్‌గా పనిచేశాను. ఆ తర్వాత నటి అమల అక్కినేనితో యాడ్ ఫిలిం చేశాను. అది సక్సెస్ అవడంతో దర్శకత్వంపై అడుగులు వేసి కథ రాసుకున్నాను. ‘రాజుగాడు’ షూటింగ్లో... ఇదీ ‘రాజుగాడు’... కొద్దిపాటి అనుభవంతో కథలు రాసుకుంటున్న సమయంలో ఓ ఫ్రెండ్ ద్వారా రాజ్‌తరుణ్ పరిచయమయ్యారు. ‘క్లెప్టోమేనియా’ కాన్సెప్ట్‌తో రాసుకున్న కామెడీ కథ రాజ్‌తరుణ్‌కు నచ్చడంతో నిర్మాత అనిల్ సుంకరను కలిశాం. ఆయన మా కథను నమ్మి, సినిమా నిర్మించేందుకు ముందుకొచ్చారు. యూనిట్ సభ్యుల సహకారంతో పూర్తిస్థాయి కామెడీతో సినిమాను రూపొందించాం. ఇది తప్పకుండా అందరినీ మెప్పిస్తుందని ఆశిస్తున్నాను. ‘కరణం’ బయోపిక్ తీస్తా... నాకు కామెడీ, యాక్షన్ సినిమాలు చాలా ఇష్టం. యాక్షన్, పైట్స్ ఉంటేనే సినిమా మరింత ఇష్టంగా చూస్తాను. కరణం మల్లేశ్వరి బయోపిక్ తీయాలని ఉంది. కథ కూడా సిద్ధం చేసుకున్నాను. కథానాయిక కోసం ఎదురుచూస్తున్నాను. ఆమె స్వర్ణం ఎలా చేజార్చుకుంది? ఆమె కష్టాలు–ఇష్టాలు ప్రజలకు తెలియజేయాలి. హిందీ, తెలుగుతో పాటు మరిన్ని భాషల్లో ఈ సినిమాను నిర్మించాలని ఉంది. ఇక నటుల్లో పవన్‌కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సిటీలో ట్యాంక్‌బండ్ ఇష్టం. జర్నలిస్ట్‌గా చేసినప్పుడు హైదరాబాద్ మొత్తం చుట్టేశాను. మహిళా దర్శకులు రావాలి... మహిళల్లో చాలా ప్రతిభ ఉంది. కానీ దర్శకత్వం వైపు అడుగులు వేయడం లేదు. డైరెక్షన్లో స్త్రీ–పురుష భేదం అనేది ఉండదు. సరికొత్త ఆలోచనలతో ఇష్టంగా పనిచేస్తే చాలు. మహిళలు భయాన్ని వదిలి, కష్టపడితే కచ్చితంగా ఇందులో రాణించొచ్చు. ముందుగా ఇండస్ట్రీ అనే భయాన్ని వదిలిపెట్టాలి. మేం చేస్తామని ముందుకు రావాలి. నేను ఒంటరిగా ఐదు దేశాలు చుట్టేశాను. దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్న సమయంలో దాచుకున్న డబ్బుతో కారు కొనాలా? ట్రావెల్‌కి వెళ్లాలా? అనే సందిగ్ధంలో ట్రావెలింగ్‌కి వెళ్లాను. సింగపూర్, చైనా, మలేసియా, బ్యాంకాక్‌లను చుట్టేశాను. -
‘రాజుగాడు’ ప్రీ రిలీజ్ వేడుక
-
వాయిదా పడ్డ సినిమాలన్నీ ఒకే రోజు
కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమాలన్నీ ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. భారీ చిత్రాలేవి బరిలో లేకపోవటంతో జూన్ 1న వాయిదా పడిన సినిమాలను ఒకేసారి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సీనియర్ హీరో నాగార్జున కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆఫీసర్ సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా మే 25నే రిలీజ్ కావాల్సి ఉండగా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి కాకపోవటంతో జూన్ 1కి వాయిదా వేశారు. అదే రోజు రిలీజ్ కు రెడీ అవుతున్న మరో ఆసక్తికరమైన చిత్రం నా నువ్వే. కల్యాణ్ రామ్, తమన్నా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కూడా మే 25నే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను కూడా జూన్ 1కి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కిన రాజుగాడు సినిమా కూడా ఎన్నో వాయిదాల తరువాత జూన్ 1న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మహిళా దర్శకురాలు సంజన రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ వింతవ్యాధితో బాధపడుతున్న యువకుడిగా కనిపించనున్నాడు. జూన్ 1న రిలీజ్ అవుతున్న మరో ఆసక్తికర చిత్రం అభిమన్యుడు. విశాల్, అర్జున్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే తమిళ్లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. అయితే తమిళ వర్షన్‌తో పాటు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేయాల్సి ఉన్నా తెలుగులో స్టార్ హీరోల సినిమాలు బరిలో ఉండటంతో వాయిదా వేశారు. తమిళ నాట మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. -
రాజుగాడు వెనక్కి తగ్గాడు..!
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజుగాడు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమాను మే 11న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజాగా మరోసారి ఈ సినిమా వాయిదా పడింది. జూన్ 1న రాజుగాడు సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగాచిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్ ఈ సినిమాలో క్లెప్టోమేనియాతో ఇబ్బంది పడే కుర్రాడిగా నటిస్తున్నాడు. తనకు అవసరం లేకపోయినా.. తన ప్రమేయం లేకుండానే దొంగతనం చేసే వింత వ్యాధితో బాధపడే కుర్రాడిగా కనిపిస్తున్నాడు రాజ్ తరుణ్. అమైరా దస్తూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో సంజనా రెడ్డి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతమందిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ, సితారలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. -
వినోదాల రాజుగాడు
రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రాజుగాడు’. సంజనారెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా మే 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ –‘‘రాజ్ తరుణ్ మా బ్యానర్లో చేస్తున్న నాలుగో చిత్రమిది. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. హీరో క్యారెక్టరైజేషన్, రాజేంద్రప్రసాద్‌గారి కామెడీ ప్రత్యేక ఆకర్షణలు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి విశేషమైన స్పందన రావడంతో పాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది.ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 11న రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం. మా బ్యానర్లో ‘రాజుగాడు‘ మరో హిట్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నాగినీడు, రావురమేష్, పృథ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, సహ నిర్మాత: అజయ్ సుంకర–డా.లక్ష్మారెడ్డి. -
క్లెప్టోమేనియా అని అదేదో కొత్త జబ్బంట!
-
క్లెప్టోమేనియా అని అదేదో కొత్త జబ్బంట!
యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజుగాడు. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆకట్టుకుంటున్న రాజ్ తరుణ్ ఈసినిమాలో క్లెప్టోమేనియాతో ఇబ్బంది పడే కుర్రాడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తనకు అవసరం లేకపోయినా.. తన ప్రమేయం లేకుండానే దొంగతనం చేసే వింత వ్యాధితో బాధపడే కుర్రాడి కనిపిస్తున్నాడు రాజ్ తరుణ్. అమైరా దస్తూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో సంజనా రెడ్డి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతమందిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్, 30 ఇయర్స్ పృథ్వీ, సితారలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. రాజ్ తరుణ్ మరోసారి ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోగా రాజేంద్ర ప్రసాద్ తండ్రిపాత్రలో తన మార్క్ చూపించారు. -
చోరీ చేశారా? లేదా?
గళ్ల లుంగీ... మెడలో టవల్... చేతిలో ఇనుప గరిటె... కాళ్లకి సాదాసీదా చెప్పులు... రాజేంద్రప్రసాద్ అసలు సిసలైన వంటోడిలా ఉన్నారు. ఉండడం కాదు... నిజమే! ఈ ఫొటో తీసినప్పుడు రాజేంద్ర ప్రసాద్ సెట్లో జనాలకి వంట చేస్తున్నారు. ‘‘రాజేంద్రప్రసాద్ గారు సెట్లో ఉంటే నవ్వులకు మాత్రమే కాదు, ఫుడ్‌కీ లోటుండదు. ఆయన వండుతుంటే... చోరీ ఎలా చేయాలా? అని రాజ్‌తరుణ్ ఎదురు చూస్తున్నాడు’’ అని నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. రాజ్ తరుణ్ హీరోగా, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రధారిగా అనిల్ సుంకర నిర్మిస్తున్న ‘రాజుగాడు’ సెట్లో చోటు చేసుకుందీ సీన్! ‘ఈడో రకం ఆడో రకం, అంధగాడు’ సిన్మాల తర్వాత వీళ్ల ముగ్గురి కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రమిది. ఎన్ని ప్లానులు వేసినా... చివరికి, చోరీ చేయలేకపోయారు. ఎందుకంటే... చోరీ చేయాలని ప్రయత్నించేలోపే వడ్డించేశారు. ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో నటించడం వెరీ హ్యాపీ. ఆయన వండిన ఫుడ్ చాలా టేస్టీగా ఉంది’’ అన్నారు రాజ్ తరుణ్. -
'రాజు గాడు'తో రాజుగారు
టాలీవుడ్ చాలా రోజులుగా వినిపిస్తున్న ఓ ప్రాజెక్ట్ ఫైనల్ గా సెట్స్ మీదకు రానుంది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్ లో యువ నటుడు రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. శతమానంభవతి సినిమాలో కూడా రాజ్ తరుణే హీరోగా నటించాల్సి ఉన్నా అప్పట్లో డేట్స్ కుదరకపోవటంతో శర్వానంద్ చేతికి వెళ్లింది. ఆ తరువాత కూడా రెండు మూడు సార్లు ఈ కాంబినేషన్ పై వార్తలు వినిపించాయి. ఫైనల్ గా దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా ప్రారంభమవుతోంది. అక్టోబర్ 24 మంగళవారం రోజున ఈ సినిమాను లాంచనంగా ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు అనీష్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల కిట్టూ ఉన్నాడు జాగ్రత్త, అంధగాడు సినిమాలతో ఆకట్టుకున్న రాజ్ తరుణ్, త్వరలో సంజనా రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన రాజుగాడు సినిమాతో మరోసారి అలరించేందుకు రెడీ అవుతున్నాడు. -
'రాజు గాడు'కి వింత జబ్బు
రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజుగాడు. సంజనా రెడ్డి అనే కొత్త దర్శకురాలు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరో ఓ వింత జబ్బుతో బాధపడుతుంటాడట. ఇటీవల భలే భలే మొగాడివోయ్, మహానుభావుడు చిత్రాలు ఇదే తరహా కథా కథనాలతో తెరకెక్కి మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా అదే బాటలో సక్సెస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. రాజు గాడు సినిమాలో హీరో బుద్ధి అని ఆదీనంలో ఉండదు. తనకు తెలియకుండానే తాను దొంగతనం చేసేస్తుంటాడు. ఇలాంటి వింత వ్యాధి కారణంగా హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నదే సినిమా కథ. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాను 2018 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో అమైరా దస్తర్ హీరోయిన్ గా నటిస్తోంది. -
నితిన్ డైరెక్టర్‌తో రాజ్ తరుణ్..!
గుండెజారి గల్లంతయ్యిందే లాంటి సక్సెస్ ఫుల్ సినిమాతో పరిచయం అయిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించిన ఈ యువ దర్శకుడు రెండో సినిమాతో నిరాశపరిచారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో విజయ్ కుమార్ కెరీర్ లో గ్యాప్ వచ్చింది. తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందించేందుకు రెడీ అవుతున్నారు విజయ్ కుమార్ కొండా. ప్రస్తుతం రాజుగాడు సినిమాతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్మిస్తున్న మరో సినిమాతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్, ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన తరువాత విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుందన్న టాక్ వినిపిస్తోంది.