రాజ్ తరుణ్, అమైరా దస్తూర్
రాజ్ తరుణ్, అమైరా దస్తూర్ జంటగా రూపొందుతోన్న చిత్రం ‘రాజుగాడు’. సంజనారెడ్డిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా మే 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ –‘‘రాజ్ తరుణ్ మా బ్యానర్‌లో చేస్తున్న నాలుగో చిత్రమిది. హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. హీరో క్యారెక్టరైజేషన్, రాజేంద్రప్రసాద్‌గారి కామెడీ ప్రత్యేక ఆకర్షణలు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కి విశేషమైన స్పందన రావడంతో పాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ అయింది.ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 11న రిలీజ్ చేస్తున్నాం. త్వరలోనే ఆడియో విడుదల చేస్తాం. మా బ్యానర్‌లో ‘రాజుగాడు‘ మరో హిట్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నాగినీడు, రావురమేష్, పృథ్వీ, కృష్ణ భగవాన్, సుబ్బరాజు, రాజా రవీంద్ర, సితార, మీనాకుమారి, ప్రమోదిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ కిషోర్ గరికపాటి, సహ నిర్మాత: అజయ్ సుంకర–డా.లక్ష్మారెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment