కాలితో తన్నాడంటూ శేఖర్‌ భాషాపై ఫిర్యాదు చేసిన లావణ్య | Lavanya Case Filed Against To Shekhar Bhasa In Jubilee Hills | Sakshi
Sakshi News home page

కాలితో తన్నాడంటూ శేఖర్‌ భాషాపై ఫిర్యాదు చేసిన లావణ్య

Aug 8 2024 12:10 PM | Updated on Aug 8 2024 1:57 PM

Lavanya Case Filed Against  To Shekhar Bhasa In Jubilee Hills

రాజ్‌ తరుణ్‌-లావణ్య వివాదంలో మధ్యలో ఎంట్రీ ఇచ్చిన ఆర్జే శేఖర్‌ భాషాపై కేసు నమోదైంది. తన స్నేహితుడు రాజ్‌ తరుణ్‌పై లావణ్య చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన పలు మీడియా వేదకల మీద కామెంట్లు చేశాడు. లావణ్య వల్లే రాజ్‌ తరుణ్‌ చాలా నష్టపోయాడని ఆయన పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో డిబేట్‌లో పాల్గొన్న లావణ్యపై శేఖర్‌ దురుసుగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు శేఖర్‌ భాషాపై కేసు నమోదు చేశారు.

రాజ్‌ తరుణ్‌-లావణ్య వివాదం దారి మళ్లీ ఇప్పుడు శేఖర్‌ భాషా, లావణ్య గొడవ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఒక యూట్యూబ్‌ ఛానల్‌లో ఇంటర్వ్యూ ఇస్తున్న లావణ్యపై శేఖర్‌ భాషా దాడి చేశాడని తెలుస్తోంది. తన కడుపు మీద బలంగా శేఖర్‌ భాషా తన్నాడని లావణ్య ఫిర్యాదులో పేర్కొంది. శేఖర్ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆమె చెప్పారు.శేఖర్‌పై కేసు సెక్షన్ 74, 115(2) బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు.

శేఖర్‌ భాషా- లావణ్య మధ్య గొడవకు ప్రధాన కారణం ఆయన చేసిన ఆరోపణలే అని చెప్పవచ్చు. మస్తాన్ సాయి అనే వ్యక్తితో లావణ్యకు శారీరక సంబంధం ఉందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. దీంతో ఒక్కసారిగా రాజ్‌ తరుణ్‌కు మద్ధతుగా చాలామంది కామెంట్లు చేశారు. ఆపై ఆమెకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండటంతో పాటు చాలామంది అమ్మాయిలకు డ్రగ్స్‌ అందించినట్లు ఆయన చెప్పారు. దీంతో లావణ్య, శేఖర్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒక మీడియా వేదికపైనే శేఖర్‌ భాషాను  లావణ్య చెప్పుతో కొట్టింది. అందుకు సంబంధించిన విజువల్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement