నా వద్ద సాక్ష్యాలు ఉన్నాయి.. లావణ్య అబార్షన్‌పై రాజ్‌ తరుణ్‌ రియాక్షన్‌ | Raj Tarun And Malvi Malhotra Comments On Lavanya | Sakshi
Sakshi News home page

లావణ్య అబార్షన్‌పై రాజ్‌ తరుణ్‌ రియాక్షన్‌

Published Wed, Jul 31 2024 5:29 PM | Last Updated on Wed, Jul 31 2024 5:55 PM

Raj Tarun And Malvi Malhotra Comments On Lavanya

కొద్దిరోజులుగా రాజ్‌ తరుణ్‌పై లావణ్య చేస్తున్న ఆరోపణలకు తాజాగా తిరగబడరసామీ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో కొన్నింటికి సమాధానాలు దొరికాయి.  రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా జోడీగా నటించిన చిత్రం తిరగబడరసామీ.. ఇందులో మన్నారా చోప్రా కీలకపాత్రలో నటించింది. ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్‌ నిర్మించారు.  ఆగష్టు 2న విడుదల కానున్న ఈ చిత్ర యూనిట్‌ తాజాగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో లావణ్య వివిదాం గురించి రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా స్పందించారు.

లావణ్య అబార్షన్‌ గురించి రాజ్‌ తరుణ్‌ కామెంట్‌
లావణ్య నాపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. అందుకే ప్రతిసారీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది.  నేను లావణ్యకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం లేదు. ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టే ఈ విషయంలో లీగల్‌గా వెళ్తున్నాను. నా వద్ద పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆమెను చేస్తున్న ఆరోపణలకు సంభంధించి ఇప్పటి వరకు ఎవరూ ఆధారాలు అడగలేదు. లావణ్య పెట్టిన ఎఫ్‌ఐఆర్‌ కాపీలో ఆబార్షన్‌ గురించి లేదు. నిజమే అయితే, అందుకు సంబంధించిన మెడికల్‌ అధారాలు బయటపెట్టాలి.

ఇక పెళ్లి గురించి మాట్లాడితే నాకు చాలా భయంగా ఉంటుంది. జీవితం లో పెళ్లి గోల వద్దు అనుకుంటున్నాను. కొన్ని కారణాల వల్ల నేను నటించిన పురుషోత్తముడు సినిమా ప్రమోషన్‌కు రాలేకపోయాను. నేను కూడా మనిషినే.. నాపై కావాలనే నిందలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో నేను ఎక్కడికీ వెళ్లలేకపోయాను.  నా 32 ఏళ్ల జీవితంలో  ఎలాంటి తప్పు చేయలేదు. వారం , పది రోజులుగా ఇంటికే పరిమితం అయ్యాను.. నాతో పాటు నా తల్లిదండ్రుల కూడా   భాదపడుతున్నారు. ' అని రాజ్‌ తరుణ్‌ తెలిపారు. 

ఈ వివాదం గురంచి కాస్త పక్కన పెడితే అంటూ తిరగబడరసామీ సినిమా గురించి రాజ్‌ తరుణ్‌ మాట్లాడారు.  ఈ సినిమా కోసం దర్శకుడు చాలా కష్టపడి పనిచేశారు. నిర్మాత కూడా ప్రాణం పెట్టి నిర్మించారు. మాల్వీ మల్హోత్ర చాలా గొప్ప నటి. టాలీవుడ్‌లో ఆమె ఇదే మొదటి సినిమా. కాబట్టి ఈ వివాదాలన్నీ కాస్త పక్కనపెట్టేసి ఆమెను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు రాజ్‌ తరుణ్‌ కోరాడు.

నాపై దాడి చేసిన వారితో లావణ్య టచ్‌లో ఉంది: మాల్వీ మల్హోత్ర
లావణ్య చేస్తున్న ఆరోపణలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆమె నాతోపాటు నా సోదరుడిపై చేసిన కామెంట్లకు ఇ‍ప్పటికే పోలీసులకు వివరణ ఇచ్చాను. జులై 24న కూడా లావణ్య మెసేజ్‌ చేసింది.. అదీ కూడా పోలీసులకు పంపాను. నా ఫ్యామిలీ కానీ, నేను కానీ ఆమెని ఎప్పుడూ కలవలేదు. మాపై ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తుందో తెలియదు. 2020లో నాపై దాడి చేసిన కొంతమంది క్రిమినల్స్‌తో ఆమె ఇప్పుడు టచ్‌లో ఉన్నారు. వారితో టచ్‌లో ఉండకూడదని ఆమెకు సలహా కూడా ఇచ్చాను. నా దృష్టిలో ఆమె కూడా ఒక క్రిమినల్‌ అని అభిప్రాయపడుతున్నాను. లావణ్య గురించి ఇంతకు మించి ఏమీ మాట్లడలేను. లీగల్‌గా ఆమెపై చర్యలు తీసుకుంటాను.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement