నితిన్ డైరెక్టర్తో రాజ్ తరుణ్..! | Vijay Kumar Konda Next with Raj Tarun | Sakshi
Sakshi News home page

నితిన్ డైరెక్టర్తో రాజ్ తరుణ్..!

Published Mon, Sep 11 2017 11:37 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

నితిన్ డైరెక్టర్తో రాజ్ తరుణ్..!

నితిన్ డైరెక్టర్తో రాజ్ తరుణ్..!

గుండెజారి గల్లంతయ్యిందే లాంటి సక్సెస్ ఫుల్ సినిమాతో పరిచయం అయిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా. తొలి సినిమాతోనే మంచి విజయం సాధించిన ఈ యువ దర్శకుడు రెండో సినిమాతో నిరాశపరిచారు. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఒక లైలా కోసం.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో విజయ్ కుమార్ కెరీర్ లో గ్యాప్ వచ్చింది.

తాజాగా యంగ్ హీరో రాజ్ తరుణ్ తో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందించేందుకు రెడీ అవుతున్నారు విజయ్ కుమార్ కొండా. ప్రస్తుతం రాజుగాడు సినిమాతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నిర్మిస్తున్న మరో సినిమాతో బిజీగా ఉన్న రాజ్ తరుణ్, ఈ రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన తరువాత విజయ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement